ధీరవనిత ఝాల్కారీ భాయ్!

షేర్ చెయ్యండి

విజేతలకు చరిత్ర ఉంటుంది అన్నారు? పరాజితులకు చరిత్ర లేదా? పరాజితులది చరిత్ర కాకుండా పోతుందా? శతాబ్దాల భారత దేశ చరిత్రలో విజేతలు ఎవరు? పరాజితులు ఎవరు? అందుకే “సింహాల నుండి చరిత్రకారుడు వచ్చేంత వరకూ వేట, వేటగాని పిట్టకధ  చరిత్రే కీర్తింపబడుతుంది” అన్నారు పెద్దలు. భారత దేశంలో దళితులకు కూడా చరిత్ర లేకుండా తుడిచివేసే ప్రయత్నం చేసేరు. ఉద్దేశ్యపూర్వకంగా నే దళితుల చరిత్ర నమోదుచేయలేదు అగ్రవర్ణం అని చెప్పుకునే చరిత్రకారులు. దళితుల వాస్తవ చరిత్ర రాయకుండా వారి ప్రతిభను కీర్తించకుండా వారి ఉనికిని , అస్థిత్వాన్ని అడ్డుకోవాలి అని చూసేరు. నిచ్చనమెట్ల కుల వ్యవస్థ లో క్రింద వున్నవాడు పరాజితుడు కాదు, విజేత కూడా!

హిందూ ధర్మం పేరిట దళితులను శతాబ్దాల నుండి చదువుకు దూరం చేసేరు. వారికి రాసే హక్కు లేదు , చదివే హక్కులేదు.ఎవరో చెప్పిన గాధలే వారు చరిత్రగా తెలుసుకున్నారు, వారిది కాని చరిత్ర వారు బలవంతంగా నేర్చుకున్నారు. ప్రభుత్వాలు మారే ప్రతిసారి వారికీ నచ్చిన చరిత్ర, వారి వర్గాల చరిత్ర, వారి దేవుళ్ళ చరిత్రను మాత్రమే పుస్తకాల్లో రాసుకున్నారు. వ్యవస్థ విస్మరించిన అసలైన దేశవాసుల , విజేతల చరిత్ర మనం తెలుసుకోవాలి. వ్యవస్థ విస్మరించిన అలాంటి విజేత – ఝల్కారీ భాయ్

భారత స్వతంత్ర సంగ్రామం అంటే మనం మొదట గుర్తు తెచ్చుకునేది 1857 సిపాయిల తిరుగుబాటు. అలాంటి సిపాయిల తిరుగుబాటు లో పాల్గొన వీరోచిత నారి దళిత మహిళ “ఝల్కారీ భాయ్”  ఝాన్సీ రాణి లక్ష్మీ భాయ్ సైన్యం కి నాయకత్వం వహించిన మహిళ ఝల్కారీ భాయ్. సిపాయిల తిరుగుబాటు లో ఆంగ్లేయులతో పోరాడిన మహిళ ఝల్కారికి భాయ్. ఒక సామాన్య దళిత కులం లో పుట్టి ఝాన్సీ రాణి సైన్యం లో సైనికురాలు గా చేరి అనతికాలంలోనే ఆమె మెప్పు పొంది ఆమెకి సలహాదారురాలుగా , సైనిక రక్షణ ఇస్తూ సిపాయిల తిరుగుబాటు లో ఆమె తరుపున పోరాడి ఝాన్సీ లక్ష్మి భాయ్ సురక్షితంగా కోట నుండి తప్పించుకు పోవటానికి సహాయపడిన మహిళ. ఝల్కారీ భాయ్.

Also read  How a group of six Dalit women in Andhra empowered with journalism

ఝల్కారీ భాయ్ – సదోబా సింగ్ మరియు జమున దేవి ల ఏకైక పుత్రిక. నవంబరు 22, 1830 లో ఝాన్సీ కి దగ్గర లోని భోజ గ్రామంలో కోరి అనే కులం లో  జన్మించేరు ఆమే తల్లి చనిపోవడంతో తండ్రి సదోబా సింగ్ సంరక్షణలో పెరిగేరు. చిన్నతనం నుండే ఝల్కారీ కత్తి తిప్పటం లోనూ, గుర్రం స్వారీ చెయ్యటంలోనూ ప్రతిభ కనిబరిచేవారు. ఆమే నైపుణ్యం ఒక పోరాట యోధురాలుగా ఉండేది. అడవికి వేటకు వెళ్లి చిరుత పులులను కర్ర మొన్నతో పొడిచి చంపేవారు. ఆమే ధైర్యసాహసాలు చూసి ప్రజలు ఆమెను చిరుత పులి అని పిలిచేవారు.ఝల్కారీ ధైర్య సాహసాలు కథలు గా విన్న పూరన్ నాంపూర్ గ్రామస్తుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి అని నిచ్ఛయించుకున్నారు. పురాన్ గొప్ప విలువిద్య కారుడు అంతేకాక బాణాలు, సైనిక పరికరాలు  తయారు చెయ్యటంలో నేర్పరి కూడా. ఝల్కారీ తండ్రి వారి ఇద్దరి వివాహంకు అంగీకారం తెలపడంతో 1843లో వారి వివాహం జరిగింది.

గొప్ప సాహసకురాలు అయిన ఝల్కారీ భాయ్ కీర్తి  బుందేల్ఖండ్ లో కధలు , పాటలు రూపంలో నేటికీ పడుతూ , చెప్పుకుంటూ ఉంటారు. ఆమే ధైర్య సాహసాల గురించి చాల జానపదలు గా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉత్తర భారత దేశంలో ఝల్కారీ ధైర్యం , కోరి కులం మహిళగా గుర్తిపు దళితుల సంస్కృతి, చరిత్ర గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది.

1857 సిపాయిల తిరుగుబాటు భారత దేశంలో దళితుల ప్రాముఖ్యతను వారి చరిత్రను తెలియపరుస్తుంది. అలాగే ఝల్కారీ భాయ్ యొక్క విశిష్టత తెలియపరుస్తుంది. సిపాయిల తిరుగుబాటు భారత దేశంలో ఒక ప్రాధాన్యత సంతరించుకున్నది. బ్రిటీష్ ప్రభుత్వం మీద మొదటసారి తిరుగుబాటు చేసిన సంఘటన, అందులో కోరి కులం మహిళ యొక్క ప్రాముఖ్యత ఈ దేశ కుల సాంఘిక చరిత్రకారులు ఉద్దేశ్యపూర్వకంగా కనుమరుగు చేసే ప్రయత్నం చేసేరు. ఝల్కారీ పాత్ర దళితుల యొక్క సంస్కృతి , చరిత్ర లో ప్రధాన భూమిక అవుతుంది , కేంద్రం అవుతుంది. దళితులు ఈ దేశంలో పరాజితులు కాదు, విజేతలు అనికూడా చెప్పబడుతుంది. ఆమె చరిత్ర ఈ దేశ అగ్రవర్ణ చరిత్రకారులను ప్రశ్నిస్తుంది.

ఝల్కారీ భాయ్ చరిత్ర చెబుతుంది 1857 లో దళితుల గొప్పతనం. దళిత స్త్రీల ప్రతిభాపాటవాలు. ఆమె చరిత్ర చెబుతుంది సైనికులుగా దళితుల యొక్క ప్రాధాన్యత. ఆమె కధ చెబుతుంది ఈ దేశంలో ఆనాటి దళితుల సాంఘిక , రాజకీయ ప్రాధాన్యత. ఎంత గొప్పదో తెలియజేస్తుంది.

కొందరు రచయితలు అంటారు కోరి కులంలో జన్మించిన  1857 సిపాయిల తిరుగుబాటు మృత్యంజయరాలు అని, మరి కొందరు అంటారు ఆమె చాల సాంప్రదాయాల గల గృహిణి ఆమె తన కుల వృత్తి అయిన నేత పనిలో భర్తకు చేదోడువాదోడుగా ఉండేవారు , భర్త తో పాటు అప్పుడు అప్పుడు కోటలోకి వెళ్లి వస్తూ ఉండేవారు. ఝల్కారీ చిన్నతనంలోనే ధైర్య సాహసం గల స్త్రీ కావడంతో యుద్ద విద్యలలో ప్రావీణ్యత సంపాదించుకున్నది. ఆమె చూడటానికి రాణి లక్ష్మీ భాయ్ లా ఉండటంతో ఆనతి కాలంలోనే రాణి కి దగ్గర అయ్యింది. ఝల్కారీ భాయ్ ప్రతిభకు ‘దుర్గ దళ్ ‘ అనే మహిళా సైనిక కూటమికి నాయకత్వం వహించేరు. మొదట 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభం అయ్యింది పాలకులు తమ సింహాసనాన్ని కాపాడుకోవటం కోసమే, దళితులు ఆ తిరుగుబాటును స్వతంత్ర పోరాటంగా మార్చివేసేరు. బ్రిటీష్ వారు ఝాన్సీ కోటను ముట్టడించినప్పుడు ఝల్కారీ భాయ్ వీరోచితంగా పోరాటం చేసింది.ఝల్కారీ రాణీ లక్ష్మీ భాయ్ లాగ ఉండటంతో లక్ష్మి భాయ్లా వేషధారణ చేసుకుని రాణీ  లక్ష్మీ భాయ్ కోట నుండి సురక్షితంగా తప్పించుకోవటానికి అవకాశం కల్పించింది. ఈ తిరుగుబాటులో ఝల్కారీ భర్తను బ్రిటీష్ సైనికులు కాల్చి చంపిన వార్త ఆమెకు తెలియటంతో ఇంకాస్త రెచ్చిపోయి చాల మంది బ్రిటీష్ సైనికులను చంపి వారి బుల్లెట్ గాయాలకు చివరకు తుది శ్వాస విడిచేరు. కొందరు రచయితలు ఆమెను బ్రిటీష్ వారు చంపకుండా వదిలివేసేరు అని 1890 వరకూ తను బ్రతికింది అని చెప్పేరు. కొందరు రచయితలు ఏప్రిల్ 5, 1857 ఆమె యుద్ధంలో తుది శ్వాసవిడిచినట్లుగా పేర్కొన్నారు.

Also read  ఎన్కౌంటర్ లో చనిపోయిన 40 మంది లో ఏడుగురు చిన్నపిల్లలు!

నేటికీ బుందేల్ ఖండ్ ప్రజలు ఆమే ధైర్య సాహసాలు పద్యాలు గా పాడుకుంటూ ఉంటారు.

” Macha Jhansi mein ghamasan, chahun aur machee kilkari thee,

Angrezon se loha lenein, ran mein kudee Jhalkari thee” 

ఝల్కారి భాయ్ జీవిత చరిత్ర ,1857 సిపాయిల తిరుగుబాటు లో ఆమె పాత్రని విస్మరించిన సాంఘిక చరిత్రకారులు  బ్రాహ్మణిజం యొక్క ప్రతినిధులుగానే చరిత్రను రాసురుగానీ దళితుల చరిత్రను , దళిత సైనికుల పాత్రను ను యెక్కడా పేర్కొనకపోవడం మనువాద తత్వానికి అద్దంపడుతుంది.

ఝల్కారీ భాయ్ చరిత్ర రాణీ లక్ష్మీ భాయ్ కి చరిత్ర లేకుండా చేస్తుంది. యుద్ధ సమయంలో ఝల్కారీ సహాయంతో కోట నుండి నేపాల్ అడవులకు పారిపోయిన లక్ష్మీ భాయ్ 80 ఏండ్ల వరకూ బ్రతికింది అని చెబుతారు, కానీ లక్ష్మీ భాయ్ లా యుద్ధం చేసిన ఝల్కారీ భాయ్ వలన లక్ష్మీ భాయ్ చరిత్ర సిపాయిల తిరుగుబాటులో  బంగారు అక్షరాలతో లిక్కించబడింది. లక్ష్మీ భాయ్ సిపాయిల తిరుగుబాటులో మరణించినట్లు కీర్తికెక్కింది.

రాణీలా యుద్ధం చేసి , సాహసోపేతమైన తమ పరాక్రమం చూపిన, రాజ్యాలు , కోట లు లేని దళిత మహిళ ఝల్కారీ భాయ్ ని విస్మరించేరు.

పైన పేర్కొన్నట్లు సింహాల నుండి చరిత్రకారులు వచ్చేంతవరకూ వేట , వేటగాని పిట్టకథ లు కీర్తింపబడుతూనే ఉంటాయి. అందుకే బాబాసాహెబ్ డా , బి ర్ అంబెడ్కర్ గారు “చరిత్ర తెలియనివారు చరిత్రను నిర్మించలేరు” అన్నారు.

Also read  సంబవ కులం: వెలుగులోకి వస్తున్న ప్రాచీనమైన దళితుల బాష!

వర్ణవ్యవస్థ విస్మరించిన నిజమైన చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. విజేతలు ఎవరో , పరాజితులు ఎవరో చరిత్ర సాక్ష్యం ఇంకా సజీవంగా ఉంది.

కోరి కులం మహిళ విజేత ఝల్కారీ భాయ్ ఈ దేశ చరిత్ర, కోట్లాది మూలవాసులు చరిత్ర. 

(Visited 46 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!