నయా సూత మహర్షులు-దళిత రాజకీయ నాయకులు!

షేర్ చెయ్యండి
  • 19
    Shares
 
దళిత రాజకీయ నాయకులు, దళిత రాజకీయ నాయకులు , కమ్యూనల్ అవార్డు ను గాంధీ కుట్రలు ద్వారా అడ్డుకున్న తర్వాత పుట్టిన రాజకీయ నాయకులను కీలు బొమ్మలు లేదా చెంచాలు అన్నారు మాన్యశ్రీ కాన్షిరాం. ఈ కీలు బొమ్మలను ఈ దేశ చాతుర్వర్ణ వ్యవస్థ పురాణాల కాలం నుండే తయారు చేస్తూ వస్తుంది. రాచరిక వ్యవస్థ తయారు చేసిన ఒక క్యారెక్టర్ సూతపుత్రుడు.  
 
బారతీయ సమాజంలో ప్రతిజాతీ తన చరిత్రను తెలుపుకునే ప్రత్యేకమైన వర్ణనా విధానం కలిగి ఉంటుంది. బారతీయ చరిత్ర రచనలో చాలావరకు పురాణాలే సాధనాలుగా నిలిచేయి. వాటి ప్రభావం భూత, భవిషత్, వర్తమానాల పై బలంగపడింది.
పురాణాలు సృష్టించిన ఒక్క వినూత్నమైన పాత్ర సూతుడు. పురాణం బారతీయ సారస్వత స్వరూపమైతే సూతుడు ప్రప్రథమ ఏకపాత్ర ప్రదర్శనాకారుడు. 
 

ఎవరీ సూతుడు? 

 
సూతుడు వర్ణవ్యస్థకు ప్రతి రూపాం. సూతుడు సమాజ చరిత్రకు ఫలితం. సూతుడంటే శూద్రునికి పూర్వ రూపాం. బ్రాహ్మణ, క్షత్రియ పురుషులకు, దాసీకి  జన్మించిన సంతానం. మనువ్యవస్థ సృష్టించిన కుల అధర్మానికి, మిశ్రమ కులాల సంతానం. వర్ణ సంక్రమం జరిగింది కాబట్టి వీరికి సింహాసనార్హత లేదు. రధచోదకునిగా స్తానం ఇచ్చారు. దానితో పాటు రాజుల వంశగాన బాధ్యతను అప్పగించారు. చాతుర్వర్ణ వ్యవస్థ ఈ రెండు బాధ్యతలు సూతునికి ఇచ్చారు. ఈ విధంగా తనదైన స్వరాన్ని త్రొక్కిపెట్టుకుని పాలకుల స్వరపేటికను తనదిగా చేసుకుని విధులు నిర్వహించాడు. ఒక విధంగా చెప్పాలంటే కుల వ్యవస్థకు బలైన వ్యక్తి సూతుడు. రాజ్యానికి అనర్హుడు, పాడిత్యానికి అనర్హుడు, ఎదురుతిరిగి పోరాటం చెయ్యకూడదు. ఎదురుతిరగటానికి బదులు రాజీపడ్డాడు. 
 
ఆనాటి నుండి నేటి వరకూ కుల వ్యవస్థ ఎందరో సూత మహర్షులను తయారు చేసింది. మనుధర్మం కాలాలకు అనుగుణంగా తన రూపు రేఖలు మార్చుకుంటూ తన మూల సూత్రాన్ని సజీవంగా కాపాడుకుంటూ వస్తుంది. సామాజిక వాస్తవాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొత్త వాస్తవాలు సరికొత్త సవాళ్ళను విసురుతుంటాయి. బలహీనుల అణిచివేత ఎప్పటికప్పుడు నూతన రూపాలను సంతరించుకుంటుంది. పాలకవర్గాలు వారి గుణ గణాలను, వంశ చరిత్రల్ని, కీర్తిప్రతిష్టల్ని గానం చెయ్యడానికి ఎప్పటికప్పుడు “సూతుల్ని” తయారు చేసుకుంటారు.  
 

 దళిత రాజకీయ నాయకులు – నయా సూత మహర్షులు!

 
నయా సూతమహర్షులు ఎవరో ఇప్పటికే అర్ధం అయ్యివుంటుంది. రాచరికం, పరాయి పాలన పోయి రాజ్యాంగం అనే రక్షణ కవచంలో ప్రతి భారతీయుడు సమానం, ప్రతి బారతీయుడికి ఒకే గుర్తింపు కలిగించారు నవభారత నిర్మాత  బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్. ఇంకొన్ని గంటలో ఆ అపూర్వమైన రోజుని పండగలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. 
 
రాజ్యాంగం బానిసత్వాన్ని నిషేధించింది. ప్రజాస్వామ్య బద్దంగా ఎవరికి మెజారిటీ వారే పాలకులు అవుతారు. ఈ దేశంలో దాదాపుగా 25% ఉన్న ఎస్సి / ఎస్టీ లకు రాజ్యాధికారం చేపట్టే అవకాసం ఉంది. చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రులకు రాచరికం ఊసే ఎత్తడానికి వీలు లేదు అందుకే సూతపుత్రుడు  తన ఆత్మను చంపుకుని, రాజీ పడి పాలకుల వంశ, కుల కీర్తిని ప్రశంసించడానికే పరిమితం అయ్యేడు. బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో శూద్రులు రాజ్యాధికారం చేపట్టవచ్చు. సూత పుత్రులు రాజ్యధికారం గురించి కలలు కనవచ్చు. 
 
మీ గోడల మీద రాసుకోండి … మనం పాలకులం కాబోతున్నాం అని చెప్పిన బాబాసాహెబ్ మాట విస్మరించి నేటి సూత మహర్షులు పరాయి పార్టీలలో చేసిరి, వారి కుల పురుషుడిని , వంశ చరిత్రను రోజూ టివి ల ముందు పొగుడుతూ ఉన్నారు. రాజకీయ పార్టీ అధికార ప్రతినిధులుగా ఎమ్మెల్యే లు గా , ఏం పి లుగా వార్డు స్థాయి నుండి మంత్రి స్థాయి వరకూ ఎస్సి / ఎస్టీ ప్రతినిధులు  ప్రాంతీయ కుల పార్టీల అడుగులకు మడుగులు తొడుగుతూ, వారి పల్లకి మోస్తూ  ఉన్నారు. 
 
ఈ నయా సూత మహర్షుల వలెనే ఎస్సి / ఎస్టీ ప్రజలు ఇంకా దోపిడీకి గురవుతున్నారు. వారి వారి ఆస్తానాల కుల రాజకీయ నాయకులు ఎస్సీ / ఎస్టీ ప్రజల మీద దాడులు చేస్తున్నా మౌనంగా చూస్తూ ఉండి పోతున్నారు. 2014 నుండి తెలుగు రాష్ట్రాలలో ఎస్సి / ఎస్టీల మీద జరుగుతున్న దాడులను వుమ్మడి గా కూడా ఖండించే సాహసం చెయ్యడం లేదు ఈ నయా సూత పుత్రులు. 
 
స్వేచ్చ ,  సమానత్వం , సౌభ్రాతత్వం బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కల్పించిన వరాలు , హక్కులు. ఒక మనిషికి – ఒక ఓటు – ఒకే విలువ బారత రాజ్యాంగం ఇచ్చింది. మరి 25 శాతం ఉన్న ఎస్సి / ఎస్టీ ల నాయకులు ఎందుకు సూతపుత్రుడు లాగా ఫ్యూడల్ కులాల పల్లకి మోస్తున్నాడు? ఆలోచించండి? వర్ణవ్యవస్థ ఎలా పాతుకు పోయిందో అప్పుడు సూతుడు – నేడు వారి వారసులు. 
(Visited 145 times, 1 visits today)
Also read  కుల ప్రయోజనాలకే తెలుగు మీడియా!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!