నరకాసురుడు ; దీపావళి పండగను దళిత, బహుజనులు ఎందుకు చెయ్యకూడదు!

షేర్ చెయ్యండి
  • 30
    Shares
చరిత్ర మరచిన వారు, చరిత్రను నిర్మించలేరు అన్న బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఆ మాట ఎందుకనాల్సి  వచ్చిందో అంటరానివారిగా, షెడ్యూలు కులాలుగా, జాతులుగా ఏ హక్కులు లేకుండా అత్యంత దుర్భరంగా, బానిసలు కంటే ఘోరంగా జీవించిన , జీవిస్తున్న వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 
 
 శూద్రుడు గా లేక అంటరాని వారిగా పుట్టడం పూర్వ జన్మ ఖర్మ ఫలం అని చెప్పి శ్రమను దోచుకున్న ఆర్యుల చరిత్ర తెలుసుకోవాలంటే చరిత్ర తెలుసుకోవాల్సిందే. 
 
ప్రాచీన కాలంలో బారత భూభాగం మీద జీవించిన అనేక జాతుల గురించి పరిశోధనలు జరిగేయి. అయితే అవి మనకి ఎక్కువగా లభ్యంకావు. చరిత్ర చెప్పిన సత్యాలను నాశనం చేసి ఆర్యులు చెప్పిన వాజ్మయం లోని కధలే నేడు సమాజంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. 
 
పురాణాల కధల లో నాగులు, యక్షులు, రాక్షసులు, అసురులు, దేవగణాలు ప్రధానంగా కనిపించే జాతులు. రామాయణంలో ప్రత్యేకంగా వానరులు కనిపిస్తారు. వీరేగాక దైత్య, దానవ, గంధర్వ, ఉరగ, పతగ, కిన్నర, గరుడ, మతంగ, సుర జాతుల ప్రసక్తీ కనిపిస్తుంది. 
 
ఈ జాతులు ఎలా పుట్టేయో వివరాలు ఉన్నాయి. వీరందరూ భూమి మీద నివసించిన జాతులే. ఆర్య వాజ్మయం వీరి పేర్లు సంస్కృతీకరించేరు. ఆర్య వాజ్మయం స్థానిక జాతులను వారి గణ చిహ్నాలతో గుర్తించింది. కొన్ని సందర్భాలలో గణ చిహ్నాలనే వారి రూపాలుగా చిత్రీకరించేరు. 
 
ఆర్య జాతులు బారత దేశం మీద దండయాత్రకు వచ్చినప్పుడు వారిని స్థానిక జాతులు లేదా మూల వాసులు తీవ్రంగా ప్రతిఘటించేరు. మూలవాసుల ప్రతిఘటన, వారి యొక్క రణ కౌస్యలము , వేగము గమనించిన ఆర్య జాతులు మూలవాసులను వారి భాషలో , సంకేతాలతో గుర్తించుకున్నారు. 
 
యుద్ధం సమయంలో వేగంగా ప్రాకుతూ, పాములాగా నెలకు జారిపోతూ అతివేంగా పాకుతూ తప్పించుకునే వారిని నాగులుగా ఆర్యులు గురించుకున్నారు. లాఘవంగా ఎగురుతూ చెట్లమీదకు ఎగబాకే వారిని గరుడ, పతగ, జాతులుగాను, కొండచరియల్లో దాక్కుని అదృశ్యంగా పోరాడేవారిని యక్ష జాతులు గా వారికీ తోచినట్లు చెప్పుకున్నారు. 
 
ఈ విధంగా బారత భూభాగం మీద కు వచ్చిన ఆర్య గణాలు స్థానిక జాతులను అసురులు/ రాక్షసులు గా మరియు వానరులుగా చిత్రీకరించేరు. అసురులలో బలమైన చక్రవర్తి ని చంపి వేడుక చేసుకోవడం ఆర్యగణాల నుండి వారసత్వం గా నేడు బ్రాహ్మణుల వరకూ వచ్చింది. 
 

దైత్యులు, లేదా అసురులు లేదా రాక్షసులు ఈ భూమిని పాలించిన రాజులు. ఈ సత్యాన్ని మనం ఆర్యుల గ్రంధాలోను లేదా దళిత బహుజనుల కధల్లో మనకి స్పష్టంగా తెలుస్తూంది.  దీపావళి బారత దేశంమంతటా వివిధ రూపాల్లో పండగ చేసుకుంటారు. జైనులు తమ 24 వ తీర్ధాంకరుడు మహావీరుడు నిర్యాణం చెందిన రోజు కనుక దీపాలు వెలిగిస్తారు. 

 
 
అస్సోమ్ లో బిహు పండగ గా దక్షణాదిన ఓనం గా ఉత్తరాదిన బలిప్రతిపాద గా దీపావళి ని జరుపుకుంటారు. బారత దేశంలో అసురులకు లేదా దైత్యులకు మరియు ఆర్యుల మధ్య యుద్ధం పూర్వకాలం నుండే కాదు నేటికీ జరుగుతూనే ఉంది. అనాదిగా ఆర్యులకు , అసురులకు మధ్య జరిగిన పోరాటాలను బహుజనులు తమ కుల కధ ల్లో , పురాణాల్లో రాసుకునే ఉన్నారు. 
 
ఆనాడు మూలవాసులుగా ఉన్న దళిత – బహుజనులను నేడు కులాలుగా ఆర్యులు వర్గీకరించేరు. అసురులను కుల వ్యవస్థ రూపంలో ఉంచి వారి చరిత్రను తెలుసుకోనీయకుండా జాగ్రత్త పడ్డారు. అణిచివేతకు గురికాబడిన వర్గాలు కలిసి ఒక సమూహంగా జీవిస్తాయి, బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వలన భారత దేశంలో అలా జరగలేదు. 
 
అసురుల చరిత్ర సిందూ నాగరికతో ముడిపడి ఉంది. అసురులు ఋగ్వేదానికంటే ముందు ఉన్న ప్రజలు. పురాణాల ప్రకారం నరకాసురుడు లేదా నరకుడు కశ్యపునికీ, దక్షుడు కుమార్తె కాళిక కు పుట్టినవాడు. నరకుడు ఆర్యు గణాలకు బలమైన ప్రత్యర్థి. 
 
 ఆర్యులు మూలవాసులైన చక్రవరులను చంపి పండగ చేసుకోవడం అదే  వారి సంస్కృతి. ఆనాటి నుండి రావణాసురుడు పేరుతొ దసరా పండగ, నరకాసురుడు పేరుతొ దీపావళి పండగ చేస్తున్నారంటే అసురులు అంటే వారికి ఎంత భయమో అర్ధం అవుతుంది. 
 
నరకాసురుడు -నరకుడు ఎవరు? 
 
 
నరకాసురుని వృతాంతం వరాహావతార కధ నుంచి కృష్ణావతారం వరకు నడిచింది అంటే ఈ మధ్య కాలంలో నరకాసుర పెరుగలవారు చాలామంది ఉన్నారా?  లేక ఒక్కడే అన్ని యుగాలుగా చిరంజీవిగా ఉన్నారని అనుమానం కలుగుతుంది. 
 
నరకాసురుని పుట్టుక వరాహావతారం కాలం నాటిది.భూమి దైత్య రాజైన హిరణ్యాక్ష్యుడుది. 
 వరాహం   హిరణ్యాక్ష్యుడు తో యుద్ధం చేసి అతనిని చంపేసి భూమిని పట్టుకొచ్చింది.
 
భూమిని స్త్రీ గా పోల్చి వరహంతో పెళ్లి చేస్తారు. వారికి ఒక పిల్లవాడు పుడతాడు, అతడే నరకుడు. నరుకుడికి వరాహ రూపం రాలేదు. భిన్న జాతుల స్త్రీ, పురుషుల కలియకతో పుట్టెడు కనుక అసురుడయ్యాడు అని పురాణాలలో రాసుకున్నారు. 
 
నరకాసురుడిని చంపటానికి కారణాలు ఏమిటి? 
 
అనాదిగా దళితులను శిక్షించాలంటే వారిమీద నేరారోపణ చెయ్యాలి. పురాణాల్లో కూడా మనకి ఇదే తంతు జరుతుంది. నరకాసురుడిని ఆర్య గణం చంపటానికి నేర ప్రవృత్తి గల ఆరోపణలే చేసేరు. 
 
నరకాసురుడి మీద మోపబడ్డ అభియోగాలు. దేవ మాత అతిథి చెవిపోగులు దొంగిలించడం,వరుణుడి గొడుగు ఎత్తుకు పోవడం, ఇంద్రుని ఐరావతం తనకి కావాలనుకోవడం మొదలైనవి. 
 
అంతేకాకుండా దేవగణం మరియు అసురులు సముద్రమధనం చెయ్యగా వచ్చిన అమృతం ఎక్కువ శాతం దేవగణం తీసుకున్నారు. సముద్ర మధనం ఇద్దరి కృషి చెరి సమానం. కానీ దేవతలు అసురులను మోసం చేసేరు. ఇది అడిగినందుకు కృష్ణుడు నరకాసురుడుని చంపేసేడు. 
 
దళితులు తెలుసుకోవాల్సిన చరిత్ర? 
 
భూమి పుట్టినప్పటి నుండి నేటి వరకూ దేవగణం-అసురులు, బ్రాహ్మణిజం- దళితులు కు మధ్య జరుగుచున్నది ఒక్కటే. పైన చెప్పబడిన పురాణం లోని కధ లేదా స్థానిక జాతులను విదేశీ ఆర్యులు వలస వచ్చి వారి రాజ్యాలు ఆక్రమించుకున్నప్పటి నుండి, ఒక విధంగా చెప్పాలంటే దోపిడీ వ్యవస్థను అడ్డుకున్న ఆనాటి స్థానిక జాతులను నేడు వారి వారసులుగా చెప్పబడుతున్న దళితుల మీద దాడి లక్ష్యం ఒక్కటే!
 
బలమైన దళితులను , మెజారిటీ పరంగా అత్యధికంగా ఉన్న దళిత బహుజనులను దోచుకోవడం అభివృద్ధి పేరుతొ వారి భూములు లాక్కోవడం, గ్రామాల్లో దళిత యువకుల మీద నేరారోపణ చెయ్యడం తెలిసిందే. 
 
విష్ణు అవతారం అయినా వరాహుడు హిరణ్యక్ష్యుడు భూమిని లాక్కునట్లు గ్రామాల్లో పెత్తందారులు బడుగు బలహీన వర్గాల భూములను బలవంతంగా ఆక్రమించుకోవడం తెలిసిందే. 
 
నేడు బ్రాహ్మణ మతం అయిన హిందూ మతం ఆచార వ్యవహారాలు పండగలు దళిత బహుజనులు వేడుకగా చేసుకోవడం అంటే పూర్వీకుల త్యాగాలను మర్చిపోయినట్లే. దళిత బహుజనుల చావును వారి చేతనే చేయించడం బ్రాహ్మణ వ్యవస్థ యొక్క ఎత్తుగడ గా బావించండి. 
 
నరకాసురుడు వధను పండగ గా చేసుకోవడం దళిత బహుజనులు తక్షణమే వదులు కోవాలి. ఆనాడు స్థానిక జాతులను చంపి రాజ్యాలను పాలిస్తే నేడు దళిత – బహుజనుల ఓటు ద్వారా ఆర్య గణాల వారసులు అయిన బ్రాహ్మణులు అధికారంలోకి వచ్చేరు. 
 
గుజరాత్ లో జరిగిన గోధ్రా అల్లర్లు దగ్గర నుంచి, దేశంలో ఏ మతకలహాలు అయినా ఉదాహరణ గా తీసుకుని పరిశీలిస్తే దళిత – బహుజన ప్రజలనే ముందు పెట్టి బ్రాహ్మణులు పబ్బం గడుపుకుంటున్నారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
(Visited 427 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!