నరేంద్ర మోడి: ఛాయ్ వాలా నుండి చౌకీదార్ గా మారిన మోడి!

షేర్ చెయ్యండి
  • 81
    Shares

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడి 2014 లో భారతీయ జనతా పార్టీ కి ప్రధాన మంత్రి అభ్యర్థి గా తెరమీదకు వచ్చారు.

గుజరాత్ మోడల్ అంటూ మీడియా లో ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుండి మోడి ని ప్రమోట్ చెయ్యటం మొదలుబెట్టారు. 


గుజరాత్ అల్లర్లు నేపథ్యంలో బాగా పాపులర్ అయిన నరేద్ర మోడి, 2014 ఎన్నికలకు వచ్చేసరికి ఛాయ్ వాలా మోడి గా రూపాంతరం చెందారు. 


ఏదైనా ఒక గుడికో / దేవుడికో గొప్ప పేరు రావాలంటే ఆ గుడి కి స్థల పురాణం అంటూ ప్రచారం చెయ్యడం హిందూ మతం లో చూసాము. 


అలాగే మోడి ప్రధానిగా కావడానికి తన చుట్టూ ఒక పురాణం అల్లేరు.

 
నరేంద్ర మోడి బి సి ( వెనకబడిన కులం ) కుల ప్రధాని అభ్యర్థిగా ప్రచారం కల్పించబడినా ఛాయ్ వాలా గా బాగా ప్రసిద్ధి పొందారు. 


పూర్వాశ్రమంలో మోడి ఛాయ్ అమ్మినట్లు ఒక ఫోటో ను చిత్రీకరించి బాగా ప్రచారం చేసింది బిజెపి. 


ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా ఐదు సంవత్సరాల తర్వాత మోడి చుట్టూ అల్లిన పురాణం పాతబడింది. 


అందుకే 2019 ఎన్నికలకు చౌకి ధార్ అవతారం సృష్టించి సరికొత్త పురాణం అల్లుతున్నారు. 

Also read  దళితులను వంచించిన BJP ప్రభుత్వం!

ఛాయ్ వాలా నుండి చౌకి ధార్! 


చౌకి ధార్ అనే అవతారం పాతదే అయినా ఆ అవతారం అవసరం ఇప్పుడు వచ్చింది. 


వేలకోట్ల బ్యాంకు ఋణాలు ఎగగొట్టి విదేశాలు వెళ్లిన విజయ్ మాల్యా , నీరవ్ మోడి నార్మన్ చౌస్కీ లాంటి సంఘటనల తర్వాత చౌ కి ధార్ పదం బాగా పాపులర్ అయింది. 


ఒక నిజాయితీ గల్గిన కాపలాదారుడు ( చౌకి ధార్ ) ఉండగా దొంగలు దేశం విడిచి ఎలా పారిపోయారని ప్రజలు చౌకి ధార్ రూపాన్ని ప్రశ్నిస్తున్నారు. 


రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు లో స్కామ్ బయటకు పొక్కడం మరియు రక్షణ శాఖ వద్ద ఉన్న రాఫెల్ కీలక పత్రాలు దొంగతనం జరగడం తో చౌకి ధార్ ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 


ప్రజలు చౌకి ధార్ ( కాపలాదారుడు ) అయిన నరేంద్ర మోడి ని ప్రశ్నించడం లో తప్పులేదు. 


ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  ఒకడుగు ముందుకు వేసి “చౌకి ధార్ చోర్” అని ప్రజలకు చెబుతున్నాడు. 

రాహుల్ గాంధీ తో కలసి దేశ వ్యాప్తంగా ప్రజలు “చౌకి ధార్ చోర్ హై ” అంటున్నారు. 
నోట్ల రద్దు, జీఎస్టీ తో దేశాన్ని గందరగోళ పరిచిన మోడి త్వరలో జరగబోయే ఎన్నికల కోసం ‘నేను కాపలాదారుడిని’ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

Also read  భారతీయట్రైబల్ పార్టి: అస్తిత్వ ఉద్యమం నుండి రాజ్యాధికారం వైపు!


పుల్వామా సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ మీద చీకట్లో జరిపిన సర్జికల్ స్ట్రైక్ చౌ కి ధార్ అనే పదాన్ని తెరపైకి తెచ్చారు. 


చౌకి ధార్ ని ప్రజలు నమ్ముతారా? 


త్వరలో జరిగే ఎన్నికల్లో తిరిగి నరేంద్ర మోడి ని ప్రజలు విశ్వసిస్తారా? 
చౌకీదార్ అని ట్విటర్ అకౌంట్ పేర్లు మార్చుకున్నా ప్రజలు ఆహ్వానం పలికే అవకాశం ఉందా?


2014 ఎన్నికల్లో నరేంద్ర మోడి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు దేశ ప్రజలు. 
గుజరాత్ అల్లర్లు కంటే గుజరాత్ అభివృద్ధి మీదే ప్రజల దృస్టి ఉంది. 


విదేశాల నుండి తెస్తాను అని చెప్పిన నల్లధనం దగ్గర నుండి గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ చేపట్టలేని సంస్కరణలు తెస్తానని ప్రజలను నమ్మబలికింది కాంగ్రెస్ ప్రభుత్వం. 


సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధి ని మరియు కాంగ్రెస్ పార్టి ని బాగా ట్రోల్ చేసి వ్యక్తిగత దాడి చేసి డ్యామేజ్ చేశారు. 


ఆ విధంగా 2014 లో ప్రధాని పదవి నరేంద్ర మోడి ని వరిస్తే 2019 కి తన అవతారం యొక్క రంగు వెలిసి ప్రశ్నర్ధాకంలో ఉన్నాడు?

Also read  ఎన్నికల మ్యానిఫెస్టో: సామాజిక అభివృద్ధికి అడుగులు వేయలేని ప్రాతీయ పార్టీలు!


భౌతిక వాదుల మీద దాడి / హత్య , గో రక్షణ పేరిట దళిత ముస్లిం యువకులను కొట్టడం మరియు  రోహిత్ వేముల హత్య , భీమా కోరేగాం అల్లర్లు. 


నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వెంటాడే ప్రశ్నలు. 


పై అంశాలే కాకుండా నోట్ల రద్దు చెయ్యడం మోడి కి ఒక మాయని మచ్చ.  


నోట్ల రద్దు వలన దాదాపుగా  5 కోట్ల మంది ఉద్యోగాలు ఊడి రోడ్డు మీద పడ్డారు. జి ఎస్టీ నేటికీ గందరగోళ పరుస్తూనే ఉంది.


విదేశాల్లో దాచుకున్న నల్ల ధనం తీసుకు వచ్చి తమ బ్యాంకు ఖాతాలో వేస్తారేమో అని ఈ దేశ ప్రజలు ఆశగా ఎదురు చూసారు.   

దేశంలో అతి పెద్ద కుంభకోణం రాఫెల్ బయట పడటంతో నరేంద్ర మోడి / బిజెపి ప్రభుత్వం కూడా అవినీతిని అరికట్టలేరని తేలిపోయింది. 


పాకిస్తాన్ తో యుద్ధం అంటూ చేసిన హడావిడి విఫలం అవడంతో మోడి కి ఎన్నికల్లో అంత సులువుగా గెలవలేము అనే భయం పట్టుకుంది. 

ఇప్పడు ఈ చౌకి దార్ నినాదం ఏ మాత్రం గట్టెక్కిస్తుందో చూడాలి.  

(Visited 62 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!