నల్లమల యురేనియం: నల్లమల లో ఏమి జరుగుతుంది!

షేర్ చెయ్యండి
 
  • నల్లమల యురేనియం మైనింగ్ ఇప్పుడు కేసీర్ ప్రభుత్వం మీద ఒక పెద్ద సమూహం ఉద్యమానికి సన్నద్ధం అవుతుంది. 
  • తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర రధ సారధి, ప్రత్యేక రాష్ట్రానికి రెండో దఫా ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకుడు ముఖ్యమంత్రి కెసిర్ కి ఇప్పటి వరకు ప్రజల నుండి సరైన నిరసన లేదు. 
  • సేవ్ నల్లమల ఫారెస్ట్ పేరుతొ సోషల్ మీడియా లో హ్యాష్ ట్యాగ్ ద్వారా నెటిజన్లు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు చేస్తున్నారు. 

 

తెలుగు రాష్ట్రాలలో యురేనియం మైనింగ్ కు వ్యతిరేకంగా రోజు రోజుకు ఉద్యమం ఉదృతం అవుతుంది. 
 
రాజకీయపార్టీలు, పర్యావరణ కార్యకర్తలు, పక్షి ప్రేమికులు, వన్యప్రాణి ప్రేమికులు, టాలీవుడ్ కు చెందిన నటీనటులు మరియు ఇతర ఔత్సాహికులతో సహా 63 సంస్థలు కలిసి యురేనియం మైనింగ్కు వ్యతిరేకంగా పోరాట కమిటిని ఏర్పాటు చేసారు. 
 
పెద్ద పులి నివసించే  రిజర్వుడ్ అడవిలో మైనింగ్ నిరోధించి అంతరించిపోతున్న పెద్ద పులిని కాపాడాలని ప్రచారం చేస్తున్నారు. 
 
తెలంగాణలోని మహబూబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న అమరాబాద్ అడవులలో నివసిస్తున్న చెంచు గిరిజనులు అమరాబాద్ టైగర్ రిజర్వ్‌లో యురేనియం తవ్వకానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడంతో సహజమైన నల్లామల అడవిలో ప్రతిపాదిత మైనింగ్‌కు వ్యతిరేకత తీవ్రమైంది.
 
గత గురువారం యురేనియం కాయార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) బృందాన్ని నల్లమల అడవిలోకి ప్రవేశించకుండా చెంచులు  అడ్డుకున్నారు.  
 
 పాద్రా, మారేడుపల్లి, దేవరకొండ మరియు కంబజపల్లి ప్రాంతాలలో UCIL  4,000 టెస్ట్ బోర్లను చేయాలని ప్రతిప్రదానాలు కోసం సర్వే చెయ్యడానికి వచ్చారు. శుక్రవారం ఉదయం మరో బృందం రాగా ఆదివాసీలు అడ్డుకున్నారు. 
 
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని 83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియంను పరిశీలించడానికి మరియు అన్వేషించడానికి మే 22 న కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అణు ఇంధన శాఖకు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది.
 
 అటామిక్ ఎనర్జీ విభాగం, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (AMD) రిజర్వ్ యొక్క నాలుగు బ్లాకులలో ఒక సర్వే మరియు బోర్‌హోల్స్‌ను చేసి ప్రతిపాదనను సమర్పించింది.
 
నాలుగు బ్లాకుల్లో మూడు రిజర్వులో రాజీవ్ గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం అని పిలువబడే కోర్ టైగర్ ప్రొటెక్షన్ ఏరియా లోపల ఉన్నాయి.
 
 నాగార్జున సాగర్‌లోని నిడ్గుల్ రిజర్వ్ ఫారెస్ట్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్ డివిజన్‌లోని 3 మరియు 4 చదరపు కిలోమీటర్ల రెండు బ్లాక్‌లలో 7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియంను సర్వే చేసి, అన్వేషించాలని డిఎఇ కోరుకుంటోంది. 
 
టైగర్ రిజర్వ్. హైదరాబాద్ లోని సౌత్ సెంట్రల్ రీజియన్, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఈ సర్వేను నిర్వహించనుంది.
 
ప్రయోగాత్మక డ్రిల్లింగ్ వల్ల నీరు మరియు భూమి కలుషితమవుతుందని చెంచులు  భయపడుతున్నారని స్ట్రగుల్ కమిటీ సభ్యుడు అంబన్నా అన్నారు. 
 
. అధికారులు డ్రిల్లింగ్ చేయడానికి ప్రతిపాదించిన ప్రాంతాలు నల్లవాగు మరియు దిండికి కృష్ణ నదికి ఉపనదులు. ఇవి కలుషితం అవడం ఖాయమని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
యురేనియం  అన్వేషణ కోసం కేటాయించిన కొన్ని ప్రదేశాలు నదుల నుండి 15-20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి.  ఇది కలుషితానికి దారితీస్తుందనే భయాలు ఉన్నాయి. 
 
నల్లమల యురేనియం మైనింగ్ కార్యకలాపాల వల్ల వన్యప్రాణి కి జీవన్మరణ సమస్య, సహజమైన పచ్చని అడవి యొక్క బయోడైవర్సిటి దెబ్బతింటుంది. 
 
పెద్ద పులి అభయారణ్యం, రిజర్వు ఫారెస్ట్ అధికారులు కొన్ని సంవత్సరాలుగా కృషి చెయ్యడం వలన పెద్ద పులులు రక్షించబడ్డాయి. 
 
ప్రతిపాదిత యురేనియం మైనింగ్ ప్రాంతంలోని 56 తండాల్లో  1200 మంది ఆదివాసీలు ( చెంచులు) నివసిస్తున్నారు. వీటిలో 28 గ్రామ పంచాయితీలు 28 తండాలు. 
 
నల్లమల యురేనియం మైనింగ్ ను 1200 మంది చెంచులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాలి నీరు కలుషితం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
చెంచులు నివసించే  ఉడిమిల్లా, పదారా, నారాయణపూర్ మరియు తంబాపూర్  నాలుగు బ్లాకులలో నివసిస్తున్నారు, వీటిని యురేనియం మైనింగ్  అన్వేషణ కోసం డ్రిల్లింగ్ కోసం కేటాయించారు. 
 
నల్లమల యురేనియం మైనింగ్ మీద వస్తున్న తీవ్ర ప్రజా వ్యతిరేక నిరసన గ్రహించిన తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి మంత్రి  కేటిర్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు.
 
ktr_nallamala_mining
It minster KTR tweet on Nallamala Uranium mining
 
“నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల వ్యవహారంలో అందరి ఆవేదనను తాను చూస్తున్నానని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి వ్యక్తిగతంగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు కేటీఆర్.”
 
 
 
నల్లమల అంటే దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, అభయారణ్యం, లెక్కలేనన్ని పక్షులు, జంతువులు, అరుదైన పెద్ద పులి, సహజ మూలికలు మరియు అత్యంత పురాతన చెంచు తెగ ఆదివాసీలు. 
 
నల్లమల అటవీ ప్రాంతం మహబూబ్ నగర్, గుంటూరు, ప్రకాశం, కర్నూల్, కడప ప్రాంతంలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం. 
 
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టు అయిన కృష్ణ నది నల్లమల అటవీ ప్రాంతం నుండి ప్రవహిస్తుంది. 
 
నల్లమల టార్గెట్ ఎందుకు అయ్యింది:
 
దేశ భవిషత్  విద్యుత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి 40 వేళా మెగా వాట్లు ఉత్పత్తి చెయ్యాలని అటామిక్ ఎనర్జీ శాఖ కు ఆదేశాలు ఇచ్చింది.  అలాగే యురేనియం నిక్షేపాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో వెతకాలని స్పష్టం చేసింది. 
 
దీనితో హైగ్రేడ్ మరియు దీర్ఘకాలిక లభ్యత ఎక్కడ ఉందొ పరిశోధన చేసిన అటామిక్ ఎనర్జీ నల్లమల ను ఎన్నుకుంది. 
 
నల్లమల యురేనియం నిక్షేపాలు గురించి  అటవీ శాఖ అడ్వైజరీ కమిటీకి తెలియజేయగా వారు అనుమతిని వ్యతిరేకకించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నల్లమల లో యురేనియం మైనింగ్ కు అనుమతి ఇచ్చింది. 
 
జనసేన పార్టి అధ్యక్షుడు నల్లమల యురేనియం మైనింగ్ మీద తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.
 
Nallama mining
 
భావి తరాలకి, బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్యం తెలంగాణ ఇస్తామా? అన్నది అన్ని ప్రజా సంఘాలు , రాజకీయ పక్షాలు ఆలోచించాలి?”
 
 
 
 
రేవంత్ రెడ్డి కి ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్:
 
నల్లమల యురేనియం తవ్వకాలకు వ్యతిరేకత రోజు రోజుకూ పెరుగుతూ ఉండటంతో ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి భారీ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ నెల 16 న సమాయత్వం అవుతున్నారు.
 
 
ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరు అవుతున్నారు. శనివారం పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి కి ఫోన్ చేసి రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించారు.
 
పవన్ కళ్యాణ్ అంతకు ముందు సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతు రావు ని కలిసి నల్లమల యురేనియం వ్యతిరేక పోరాయటానికి మద్దతు పలికాడు.
 

 


 
 
(Visited 30 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!