నాసిక్ కాలరాం దేవాలయం ప్రవేశ పోరాటం!

షేర్ చెయ్యండి

 

నేను హిందువుగా పుట్టెను కానీ, హిందువు గా మరణించ ను అన్నారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్. దీనికి ముందు హిందువులు గా పుట్టిన నిమ్న జాతి  ప్రజలను అదే హిందూ మతం లో మనుషులు గా గుర్తింపు లేక , హిందువులు గా ఆలయ ప్రవేశం నిరాకరిస్తున్నప్పుడు బాబాసాహెబ్ డా అంబెడ్కర్ ఎన్నో ప్రయత్నాలు చేసేరు. అందులో నాసిక్ ఉద్యమం ఒకటి.

నాసిక్ లోని కాలారాం దేవాలయం ప్రవేశానికి మర్చి 2, 1930 న ఉద్యమం ప్రారంభమైంది. ఉదయం సభ జరిపి మధ్యానం నుండి ఊరెగింపుగా ర్యాలీ బయలిదేరింది. ఊరేగింపు మిలటరీ.బ్యాండ్ మాదిరిగా గొప్ప మేళం. దాదాపుగా 500 మంది మహిళలు పాల్గొన్నారు.

ఆ ఊరేగింపు చూడగానే పూజారులు గుడి నాలుగు ద్వారాలు మూసివేసేరు. నిమ్నజాతీయ ప్రజలు నాలుగు వైపులా బారులు తీరి నుంచున్నారు. ఆలయం మూసి వేయటంతో సవర్ణ హిందువులకు కూడా దైవ దర్శనం జరగటం లేదు. జిల్లా అధికారులు, పోలీసులు ఎప్పుడు ఏమి జరుగుతుందో అని బందోబస్తు లో ఉన్నారు. దాదాపుగా 8 వేల మంది ప్రజలు పూజరులను, సవర్ణ హిందువులను ఎంత ప్రాధేయ పడినా దేవాలయం ప్రవేశం జరగలేదు. దైవ దర్శనం కాలేదు. దాదాపుగా నెల రోజులు సాగింది ఆ ఉద్యమం. సత్యాగ్ర దళాలు గ్రూప్ లు గ్రూప్ లు గా విడిపోయి దైవ దర్శనం కోసం వేచి ఉన్నారు. కాని ఒక్క క్షణం కూడా గుడి తలుపులు తెరవలేదు. ఏప్రిల్ 9, గుడి రధోత్సవం. సవర్ణ హిందువులు, అధికారులు నిమ్నజాతీయుల తో మంతనాలు జరిపేరు. చివరకు నిమ్నజాతీయుల్లో కొందరిని సవర్ణ హిందువులలో కొందరిని రధం లాగేదానికి అనుమతి ఇచ్చెరు.

రధోత్సవానికి అంతా సిద్దమైంది. బాబాసాహెబ్ డా అంబెడ్కర్ మిగిలిన సత్యాగ్రహులు నిమ్నజాతీయుల వంతు రధము లాగటానికి సిద్దంగా ఉన్నారు. అయితే పూజారులు రధాన్ని ఒక ఇరుకు మార్గం గుండా తీసుకు వెళ్ళేరు. రధం చుట్టూ సాయుధులు అయిన పోలీసులు, సవర్ణ హిందువులు. మోసాన్ని గ్రహించిన నిమ్నజాతీయులు సహించలేక పోయేరు.

చివరికి ఖంద్రేకర్ అనే బండారీ యువకుడు పోలీసులు చూస్తూ ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్లి రధాన్ని తాకేడు. అతనిని చూసి మిగతా నిమ్నజాతీయులు ఒక్కసారి గా రధాన్ని పట్టుకున్నారు. సవర్ణ హిందువులు రాళ్ల దాడి చేసేరు. కాండ్రేకర్ రక్తపు మడుగులో పడీ పోవటం, మిగతా నిమ్నజాతీయులకు తీవ్ర గాయాలు అవటం క్షణాలలో జరిగింది.బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ కి కూడా గాయాలు అయ్యాయి. నాసిక్ వీధులు సవర్ణ హిందువులకు నిమ్నజాతీయుల సత్యాగ్రాలకు మధ్య దాడులు జరిగెయి. దేవాలయ రధం నిమ్నజాతీయుల రక్తం తో తడిసిపోయింది.

Also read  దేవాలయ ప్రవేశం - నాసిక్ ఉద్యమం!

అలా ఒక సంవత్సరం పాటు సత్యాగ్రహులు ఉద్యమాలు చేస్తూనే వున్నారు. ఆ సంవత్సరం రోజులు నిమ్నజాతీయులు గుడి తలుపు తెరవనీయలేదు. 

1931 నుండి 1935 వరకూ ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది.

 నాసిక్ కాలారం దేవాలయ ప్రవేశ ఉద్యమం ఒక్క మహారాష్ట్ర కే పరిమితం కాలేదు, దేశం మొత్తం ఈ ఉద్యమం ప్రబావం చూపించింది. దక్షిణ బారత దేశంలో మద్రాసు, మదురై, తిరువాన్కూర్, గురువాయుర్,రామనాద్ ప్రాంతాల్లో ఈ ఉద్యమం తీవ్రంగా జరిగింది. 
 
తెలుగు ప్రాంతంలో రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నం, చిత్తూరు ప్రాంతాల్లో జరిగిన దేవాలయ ప్రవేశ పోరాటం హింసాత్మకంగా మారింది.  తిరుమల లో ఎతిరాజులు అనే నిమ్నజాతీయుడు ప్రవేసించినదుకు అతని మీద నేరం మోపి కోర్టుకి లాగేరు. సవర్ణ హిందువులు నిమ్నజాతీయుల పై ఇన్ని దురాగతాలు చేస్తున్నా గాంధీ పల్లెత్తి మాట అనలేదు.  
(Visited 335 times, 1 visits today)

3 thoughts on “నాసిక్ కాలరాం దేవాలయం ప్రవేశ పోరాటం!

 • 05/03/2018 at 7:40 AM
  Permalink

  We the people of India. We the rules of India.we are Dr. Baba saheb Ambedkar followers. Jai Bhim.

  Reply
 • 05/03/2018 at 7:47 AM
  Permalink

  We should educated our people about politics. What Baba said about the politics. What we have to do. why should we enter into the politics. each and every person should know about our people welfare.

  Reply
  • 07/03/2018 at 2:06 PM
   Permalink

   మీ స్పందనకు ధన్యవాదాలు

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!