బాబు వస్తే జాబు స్వాహః నిరుద్యోగ భృతి స్వాాహః !

షేర్ చెయ్యండి

బారత దేశంలో వర్ష కాలం లో వాన పడుతుందో లేదో చెప్పలేము కానీ ఎన్నికల కాలంలో ” ఉచిత వాగ్దానాల “వర్షం మాత్రం వరదలై పారుతుంది.

మన పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రన్ని తీసుకుంటే అక్కడ అధికార, ప్రతి పక్ష పార్టీలు పోటీ పడి ఉచిత కలర్ టి వి, సెల్ ఫోన్, ల్యాప్ టాప్, సైకిల్, మిక్షీ, గ్రైండర్ , బంగారు తాళి, పెళ్లికి రూ 50 వేల డబ్బు ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో లెక్కలేని వాగ్దానాలు. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూడా దాదాపుగా 1000 కి పైగా వాగ్దానాలు చేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా కొన్ని వాగ్దానాలు పొందుపరచడం జరిగింది. అందులో రెండు ప్రధాన వాగ్దానాలు ‘బాబు వస్తే జాబు వస్తాది’ ఒకవేళ జాబు ఇవ్వక పోతే ‘నిరుద్యోగ భృతి’ ఇప్పటి కి తే దే పా ప్రభుత్వం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ నేటికీ ఒక్క రూపాయి ఒక నిరుద్యోగి ఇచ్చిన దాఖలాలు లేవు. నిన్న జరిగిన మహానాడు ప్రారంభ ఉపన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ నిరుద్యోగ భృతి దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు పరుస్తాం అని చెప్పటం అంతో గింతో రాజకీయ, సామాజిక పరిస్థితి లు అవగాహన ఉన్నవారిని ఆలోచనలో పడేసాడు.

ఈ సందర్భంగా మనం ప్రస్తుతం ఆంధ్రలోని వాస్తవ పరిస్థితిల గురించి మాట్లాడుకుందాం. తెలుగుదేశం ప్రభుత్వం 2014 లో ధికారంలోకి వచ్చిన రోజు నుండి 2017 రాబోయే విధ్యా సంవత్సరం మొదలకు దాదాపుగా 9000 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసేరు. ఇక్కడ ఇంకొకటి కూడా మనం ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉద్యోగుల పదవీ విరమణ కాలం అదనంగా రెండు సంవత్సరాలు పెంచేడు. ఇప్పుడు ఎన్నికలకు ముందు చంద్రబాబు చేప్పిన , యువత ను ఆకర్శించిన రెండు ప్రధాన వాగ్దానాల స్థితి, అందులో నిజాయితీ పరిశీలన చేస్తే మనకి అందులో ఉన్న డొల్ల తనం ఆర్థం అవుతుంది. ఉద్యోగస్తుల పదవీ విరమణ కాలం పెంచటం వలన ప్రభుత్వ శాఖలో కాలీలు రావు, తొమ్మిది వేల పాఠశాలలు ముసి వేస్తుంటే ఇక ఉద్యోగాలు ఎక్కడ నుండి ఇస్తారు. ప్రభుత్వ శాఖ లో తాత్కాలిక ఉపాధి క్రింద ప్రభుత్వ గుత్తేదారుడు తో కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్న ఉద్యోగం ఎలా ప్రభుత్వ విద్యోగం అవుతుంది. ప్రైవేట్ కర్మాగారలో జాబ్ మేళా అని చెప్పె లేబర్ నియామకాలను ఎలా ఉద్యోగం గా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి బాబు వస్తే – జాబు వస్తుంది అనేది అబూత కల్పన.

Also read  ప్రమాదంలో కుల పార్టీల రాజకీయ భవిషత్తు?

ఇక రెండో వాగ్దానం నిరుద్యోగ భృతి. జాబు ఇచ్చే వాడైతే నిరుద్యోగ భృతి అనే మాట రాదు. సంవత్సరానికి కనీసం వేయి మంది పదవీ విరమణ చేసినా కనీసం ఐదు సంవత్సరాల లో ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వొచ్చు. కానీ ఉద్యోగుల పదవీ విరమణ. కాలం పెంచి నిరుద్యోగల ఆశల మీద నీళ్లు చల్లేడు. అదే విధంగా తొమ్మిది వేల పాఠశాలలు రద్దు చేసి B.Ed చేసి ఉద్యోగ ప్రకటన చేస్తారు అని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల పొట్టకొట్టేడు. అదే విధంగా నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారో ఆదికారాక లెక్కలు లేవు గత మూడు సంవత్సరాలు గా బడ్జెట్ లో కేటాయింపు లు లేవు. కాబట్టి నిరుద్యోగ భృతి అనేది కూడా అబూత కల్పనే . బవిషత్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చే సంవత్సరం ఏమైనా తూతూ మంత్రంగా నిరుద్యోగ భృతి కల్పిస్తాడు ఏమో చుద్దాం. ఇప్పటికే చంద్రబాబు కి ఓటు వేసి మోసపోయెము అని యువత కసిగా ఎప్పుడు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.

Also read  ఏపీ రాజధాని మారుతుందా!
 బారత దేశంలో పాలకులు విఫలం అయ్యేరు అనే కంటే రాజ్యాంగ ప్రకారం పనిచేయ్యల్సిన సంస్తలు, వాటికీ ప్రత్యెక అధికారాలు కట్టబెట్టినా వ్యక్తుల స్వర్దల కోసం రాజకీయ నాయకులతో ములాఖత్ అవుతూ, పైరవీలు కోసం రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండటం వలన ‘ఎన్నికల కమీషన్’ లాంటి సంస్తలు కుడా విఫలం అవుతున్నాయి అని చెప్పాలి. పార్టీల మ్యానిఫెస్టో అమలు పరచటంలో పూర్తిగా విఫలం చెందటం , అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి దారుల కు కొమ్ము కాయటం తో ఓట్లు వేసిన ప్రజలు మోసపోతున్నారు అని చెప్పక తప్పదు. 
 
బాబు వస్తే జాబు వస్తుంది అనే నినాదం ఆంధ్ర ప్రదేశ్ లోని లక్షలాది యువతను అసల పల్లకిలో వురేగించింది అని చెప్పటం లో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళు అవుతున్నా ఇప్పటి వరకూ అధికారకంగా ఒక్క వుద్యోగం ఇవ్వలేదు, ఒక్క నిరుద్యోగి కి నిరుద్యోగ బృతి ఇవ్వలేదు. 
 
ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ఐదేళ్ళ వరకూ ప్రజలతో పని లేదు కాబట్టి ప్రజలను పజలకు ఇచ్చిన వాగ్దానాలు పక్కనపెట్టి పెట్టుబడి దారుల ప్రబుత్వంగా నడుచుకుంటున్నారు. 
 
రాజకీయ పార్టీలు ఎన్నికల కమీషన్ కు జవాబుదారిగా లేక పొతే అబద్దాల పునాదులపై ప్రబుత్వం నిర్మిస్తూ పోతారు. అది ప్రజాస్వామ్యానికి మరింత ప్రమాదం చేస్తుంది. ఎన్నికల కమీషన్ తనకు ఉన్న సర్వ అధికారాలు నిర్మోహటంగా అమలు పరిస్తే బారత దేశ ప్రజాస్వామ్యం విరాజిల్లుతుంది. ది పోర్త్ ఎస్టేట్ అని గర్వంగా చెప్పుకునే ఏ ఒక్క రంగం అయినా విఫలం చెందితే ప్రజాస్వామ్యం కూలి పోతుంది. దేశం చిన్నాభిన్నం అవుతుంది. 
(Visited 23 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!