నెల్లూరు జిల్లాలో మరోసారి దళితుల మీద దాడి!

షేర్ చెయ్యండి
  • 38
    Shares
నెల్లూరు : నెల్లూరు జిల్లా కావలి తాలూకా, జలదంకి మండలం, అన్నవరం పంచాయితీ పరిధి లోని దాసరి అగ్రహారం గ్రామానికి చెందిన దళితుల మీద దాడిచేసిన కమ్మ సామాజిక వర్గం వ్యక్తులు  ఈరోజు 10 గ॥లకు దాడి చేసేరు  పోతురాజుగోపికి తీవ్ర గాయాలు, కొప్పోలు క్రిష్ణమ్మ,ఆండ్ర చిన్న అంజయ్య ,పోతురాజు చిన వెంకటేశ్వర్లకు దెబ్బలు తగిలాయి.  కావలి గవర్నమెంట్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు.
 
వివరాల్లోకి వెళ్తే  దళిత వర్గానికి చెందిన మాల కులస్తుల వ్యవసాయ భూమి కమ్మ కులానికి చెందిన వ్యక్తి భూమి పక్క పక్కనే ఉండటం వివాదానికి మూల కారణం. పేద వర్గాల వ్యవసాయ భూమిని నయానో , భయానో తనది గా చేసుకోవాలనే ప్రయత్నం లో దళితుల భూమి ని ఆక్రమించుకున్నాడు. 
 
Nelluru_dalits
 
ఈ సంఘటన మీద నేడు విచారణకు వచ్చిన అధికారులతో కుమ్మక్కు అయిన సదరు కమ్మ కుల వ్యక్తి పట్టా దళితుల మీద ఉన్నా అధికారులతో తన భూమి గా రాయించుకోవడం అడ్డగించిన దళితుల మీద దాడి చేసి గాయపరిచేరు. 
 
ఇటీవల కాలం లో నెల్లూరు జిల్లా లో దళిత వర్గాల మీద ముక్యంగా మాల కులస్తుల  పెత్తందారీ కులస్తులు దాడి చెయ్యటం పరిపాటిగా మారింది. 
 
నెల్లూరు జిల్లా లో గత మూడు నెలలు నుండి వివిధ గ్రామాల్లో దళితుల మీద దాడి చేసిన వారి మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తో పాలక కులాలు ఇదే అదునుగా దళితుల మీద దాడి చేస్తున్నారు. 
 
దాసరి అగ్రహారం లో జరిగిన దాడి కి అధికారులు కూడా బాద్యులను చెయ్యాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పట్టా భూమిని కమ్మ వర్గానికి చెందిన వ్యక్తి గా విచారణ రిపోర్ట్ లో రాసే ప్రయత్నం చెయ్యడం అధికారులు పేద దళితులను మోసం చేస్తున్నారు. 
 
నెల్లూరు జిల్లా లో ఇప్పటి వరకూ రాపూరు , కొండాపురం ప్రాంతాల్లో దళితుల మీద దాడి జరిగింది. అధికార తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో దళిత సామజిక వర్గం మీద వివిధ ప్రాంతాల్లో దాడులు అధికం అయ్యేయి. పచ్చమ గోదావరి జిల్లా గరగపర్రు నుండి నేటి దాసరి అగ్రహారం వరకూ వివిధ సంఘటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని దళితులు తెలియజేస్తున్నారు. 
 
దళితుల మీద దాడి జరిగిన సందర్భంలో రాజకీయ పార్టీల నాయకుల స్పందన చాల దారుణంగా ఉంది. అసలు మాకేమి పట్టనట్టు గా ఇది కేవలం దళితుల సమస్య వారి సమస్యను వారే పరిష్కిరించుకోవాలి, వారే పోరాడాలి అన్నట్టు గా ఉంది. 
 
సంఘటన జరిగిన వెంటనే మొక్కు బడిగా నాయకులు వస్తున్నారు తప్పా విషయం మీద సరైన స్పందన లేదు. ఎస్సి / ఎస్టీ ల మీద జరిగే దాడులు వెనకాల ఉండే ఆర్ధిక , సామాజిక అంశాలు ప్రభుత్వం పరిశీలన చెయ్యకుండా బాధితులకు నష్టపరిహారం ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇదే అదునుగా పెత్తందారులు దళితుల మీద దాడులు చేస్తున్నారు. 
 
రాష్ట్రం లోని ఎస్సి / ఎస్టీ కమీషన్ ఈ విషయం మీద తక్షణం స్పందించి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని, దళిత రైతు కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని నెల్లూరు జిల్లా దళిత వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
ఈ సంఘటన మీద వెంటనే స్థానిక అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేదంటే అధికార తెలుగు దేశం ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం గా ముద్రపడిపోతుందని దళితులు హెచ్చరిస్తున్నారు  
(Visited 139 times, 1 visits today)
Also read  ఎస్సి సామాజికవర్గం: దిశ దశ లేని ఎస్సి సామాజికవర్గం!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!