పూనా ఒప్పందం దళితుల రాజకీయ హక్కులను అడ్డుకున్న రోజు!

షేర్ చెయ్యండి
  • 33
    Shares
 

 వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలో నిమ్నజాతీయులకు జరుగుతున్న మోసాలు అంతాఇంతా కాదు. దేవుడు పేరు చెప్పి, మతం పునాదుల మీద సమాజాన్ని కులాలుగా విభజించి కొందరు ఉపరితలం లో ఉండి, మరి కొందరిని క్రిందకు నెట్టి సంపదను , అధికారాన్ని దోచుకున్నారు. ఈ అసమానతలను నిరసిస్తూ బారత రాజ్యంగంలో మాకు సమాన అవకాశాలు కావాలి అని బ్రిటీష్ ఇండియా లో ఆనాటి పాలకులు అయిన బ్రిటీష్ చక్రవర్తులతో పోరాడి సాధించుకున్న కమ్యూనల్ అవార్డ్ ని గాంధీ ఆమరణ నిరాహరదీక్షతో అడ్డుకుని బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ గారి తో ఒప్పందం చేసిన ఒప్పందమే పూనా ఒప్పందం. 

చారిత్రిక పూనా ఒప్పందం జరిగిన జరిగిన రోజు. బాబాసాహెబ్ డా బి ర్ అంబెడ్కర్, గాంధీ ల మధ్య పూనా లోని ఎర్రవాడ జైలు 1932 , సెప్టెంబర్ 24 న జరిగిన ఒప్పందం.

నిమ్నజాతులకు ప్రత్యేక నియోజకవర్గలు కావలి అని బాబాసాహెబ్ డా బి ర్ అంబెడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పుడు గాంధీ మరియు హిందూ మహా సభ ప్రతినిదులు గగ్గోలు పెట్టేరు. చివరకు గాంధీ నిమ్మన జాతులను బెదిరిస్తూ ప్రాణాత్యగానికి సిద్దం అంటూ ఎర్రవాడ జైలు లో నిరాహార దీక్ష చేపడతారు. అంటే నిమ్న జాతులకు వెతిరేకంగా , వారి స్వయం ప్రతిపత్తికి , రాజకీయ అభివృద్ధి ని అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ డా. బి ర్ అంబెడ్కర్ గారి మీద యావత్ సమాజం ఒత్తిడి తీసుకు వచ్చింది. కొందరు అయితే బెదిరింపులకు దిగేరు. చంపుతాం అన్నారు. గ్రామాల్లో నిమ్న జాతుల మీద దాడులు చేస్తాం అని బెదిరించేరు. అయినా సరే బాబాసాహెబ్ డా అంబెడ్కర్ గారు గాంధీ ప్రాణం కంటే నాకు నా నిమ్న జాతుల ప్రయోజనాలు ముఖ్యం అని వెల్లడించేరు.

Also read  ఎన్కౌంటర్ లో చనిపోయిన 40 మంది లో ఏడుగురు చిన్నపిల్లలు!

ఇదే సందర్భంలో ఇద్దరు నిమ్న జాతుల ద్రోహులు ఈ భూమి మీద మనకి అవిర్భవించేరు. ఒకరు బాబు జగజీవన్ రామ్ రెండవ వారు యం . సి రాజా. వీరే చెంచాలకు ఆది పురుషులు అని చెప్పాలి. 

నిమ్న జాతుల ప్రయోజనాలు కంటే గాంధీ ప్రయోజనాలు ముఖ్యం అని బాబాసాహెబ్ అంబెడ్కర్ మీద ఒత్తిడి తెచ్చేరు.

నానాటికీ గాంధీ ఆరోగ్యం క్షీణించటం తో బాబాసాహెబ్ మీద తీవ్ర ఒత్తిడి పెరిగింది. నిమ్న జాతులకు అత్యంత ప్రయోజనం కలిగించే ఒక మహత్తరమైన రాజ్యాంగ చట్టం వచ్చే సమయంలో సవర్ణ జాతులు వేతిరేకించటం బాబాసాహెబ్ తట్టుకోలేక పోయేరు. బహుసా ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి మీద ఏ సందర్భంలో అయిన అంతటి ఒత్తిడి వచ్చి ఉండదు అని ఘంటాపదంగా చెప్పవచ్చు.

ఈ పరిణామ క్రమంలో బాబాసాహెబ్ డా బి ర్ అంబెడ్కర్ గారి కి నిమ్న జాతుల నుండి మదత్తు లభించింది. కాని మద్రాస్ లో యాం. సి రాజ డా. అంబేడ్కర్ నిమ్న జాతుల కు నష్టం కలిగించె చర్యలు , వారిని ప్రమాదంలో కి తీసుకు వెళ్ళే చర్యలు తీసుకుంటున్నారు అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. జగజీవన్ రామ్ ఉత్తర భారత దేశం నుండి డా. అంబెడ్కర్ కి వేతిరేకంగా మద్దతు కూడా గడుతున్నారు.

Also read  ఆత్మగౌరవానికి తోలి మెట్టు పెత్తందార్లను బహిష్కరించడం!

ఈ స్సందర్బంగా బెంగాల్ హిందూ మహా సభ ప్రతినిధులు కొన్ని షరతుల మీద గాంధీ – డా. అంబెడ్కర్ సమావేశానికి బాబాసాహెబ్ ని ఒప్పించి గాంధీ తో సమావేశం ఏర్పాటు చేసేరు. ఆ తర్వాత జరిగిన చర్చల్లో,తీవ్ర ఒత్తిడి నేపధ్యంలో , బాబాసాహెబ్ డా. బి ర్ అంబెడ్కర్ – గాంధీ మధ్య ఒప్పందం జరిగింది. దీనినే చారిత్రిక పూనా ఒప్పందం అంటున్నాం.

ఆనాటి నుండే గాంధీ నిమ్న జాతుల ద్రోహి గా ముద్ర పడ్డారు.

ఆ తర్వాత బాబాసాహెబ్ డా. బి ర్ అంబెడ్కర్ బి బి సి కి ఇచ్చిన ఇంటర్యు లో గాంధీ ని ఉద్దేశించి ఇలా అంటారు. గాంధీ చొక్కా లేకుండా పైకి కనిపించినంత స్వచ్ఛమైన మనిషి కాదు, అయిన అతర్గతంగా వర్ణ ధర్మాలను పాటించే వ్యక్తీ. రెండు నాలుకల వ్యక్తివం కలవాడు అంటాడు. అందుకు ఉదాహరణ అయిన తన పత్రికలో యంగ్ ఇండియా ఇంగ్లీషు లో ప్రపంచానికి కుల నిర్ములన కావలి అంటాడు, గుజరాతీ బాషలో హరిజన్, దీన బందు పత్రికలో వర్ణ ధర్మం / మను ధర్మం కి మద్దతు ప్రకటిస్తారు.

బాబు జగజీవన్ రామ్,యం.సి రాజా లు చెంచాలు గా అవిర్భవించేరు. వీరు నిమ్న జాతుల ద్రోహులే అని చెప్పాలి. ఇప్పుడు అదే చెంచాలకు విగ్రహాలు లేస్తున్నాయి అది వేరే విషయం.

ఈ సందర్బంగా బాబాసాహెబ్ డా బి ర్ అంబెడ్కర్ గారి మాట ఇక్కడ గుర్తు చేస్తాను.” Life should be great rather than long “

చివరిగా,

Also read  దళితులు అల్టర్నెట్ కల్చర్ని ఏర్పాటు చేసుకోవడం లో విఫం అయ్యేరా!

మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకు దేవుడు మీద కానీ, మహానుభావుల మీద కానీ ఆదరపడవద్దు.

(Visited 155 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!