పూనా మహా సభలు – జాత్ పాత్ తొడక్ మండలి !

షేర్ చెయ్యండి

పూనా  మహా సభలు 

బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ హిందూ మతం వీడుతాను అన్నతర్వాత నిమ్నజాతీయుల్లో పెద్ద సందేహం, ఉద్వేగం తో  బాబాసాహెబ్ డా.బి.ర్  అంబెడ్కర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. 1935 జనవరి 12, 13 తేదీలలో పూనా లో దళితుల సమావేశాలు జరిగాయి. మొదటి రోజు ప్రొఫెసర్ శివరాజ్ సభకు అధ్యక్ష వహించేరు. హిందూ మతంనుండి బయటపడాలి అన్నబాబాసాహెబ్ డా.బి.ర్   అంబెడ్కర్ నిర్ణయాన్ని నిమ్నజాతీయులు సమర్థిస్తూ వేరే మతం లోకి వెళ్ళేకంటే కొత్త మతం స్థాపించటమో లేదా ఆది ద్రావిడల మతాన్ని తీసుకురావడం చేస్తే బాగుంటుంది అని ఆయినకు చూచించేరు. నిమ్నజాతీయులందరూ  హిందూ మతం నుండి బయటకు తీసుకురావటమే బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ లక్ధ్యం అంటూ సోలాంకి సమావేశం లో మాట్లాడటం విశేషం.

మతం మార్పువల్ల జీవనస్థాయి లో ఏమీ మార్పు రాదు అని బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ చెప్పేరు. ఏమతం లోనైనా తారతమ్యాలు ఉంటాయి. నిమ్నజాతీయులు మహ్మదీయ మతం తీసుకున్నంత మాత్రాన నవాబ్ కాలేరు అంటాడు బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్. ఏమతం తీసుకున్న ఘర్షణ తప్పదు అని హెచ్చరించారు.

నత్తనడకన సాగుతున్న అస్పృశ్యత నివారణ ఉద్యమం బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ నిర్ణయం తో వేగం పెంచుకుంది. ఎట్టి పరిస్థితులలో బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ హిందూ మతం వీడటం ఆగదు అని గ్రహించిన సవర్ణ హిందువులు, సంస్కరణ వాదులు. ప్రమాదకరం లో వున్న రోగికి షాక్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారో  బాబాసాహెబ్ డా.బి.ర్  అంబెడ్కర్ హిందూ మతం మారటం కూడా అలాంటిదే. 

కొందరు మేధావులు, అభ్యుదయవాదులు అందరూ “దళితులకు మరో శంకరాచార్యడు గాని, భగవద్గీతగాని, వేద సంచయంగానీ అవసరం లేదు బాబాసాహెబ్ డా.బి.ర్  అంబెడ్కర్ ఒక్కరు చాలు” అని నిర్ణయానికి వచ్చేరు.

బాబాసాహెబ్ డా.బి.ర్  అంబెడ్కర్ ఏ నిర్ణయం చేసినా లక్షలాది మంది నిమ్నజాతీయులు అనుసరించటానికి దేశవ్యాప్తంగా సిద్దంగా ఉన్నారు.

Also read  ఉద్యమాల ప్రస్థానాన్ని మొదటి అడుగు.

జాత్ పాత్ తొడక్ మండలి.

1922 ,లాహోర్ లో కుల నిర్ములన అనే అంశం మీద జాత్ పాత్ తొడక్ మండలి ప్రారంభం అయ్యింది. ఇది ఆర్య సమాజం లో అంతర్భాగంగా ఉంటూ వస్తుంది. వీరి ముక్య ఉద్దేశ్యం కులాంతర వివాహాలు, యువతీ యువకులను కులాంతర వివాహాల వైపు చైతన్య పరచడం.

ఈ మండలి సభ్యులు 1935 లాహోర్ వార్షిక సమావేశానికి బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ ని సభ అధ్యక్షులు గా ఉండమని ఆహ్వానించారు. జాత్ పాత్ తొడక్ మండలి సవర్ణ హిందువుల సంఘ సంస్కర్తల సంఘం. అనీ, హిందూ సమాజం నుండి కుల వ్యవస్థ ను నిర్ములించటమే దాని ఏకైక లక్ష్యం అని బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ కి తెలియ చేసేరు. కాని బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ కి సవర్ణ హిందువుల సంస్థ అంటే ఎలా ఉంటుందో తెలుసు, సంఘ సంస్కరణ విషయం లో బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ దృక్పధం వేరు, సవర్ణ హిందువుల దృక్పధం వేరు కాబట్టి బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ ఎపుడూ సవర్ణ వర్గాలతో కలసి పనిచేయటానికి ఇష్టపడలేదు. మండలి కార్యదర్శి బొంబాయి వచ్చి బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ ని కలిసి వత్తిడి చెయ్యడం తో సభ కు అధ్యక్షుడు గా ఉండటానికి ఒప్పుకున్నారు. బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ ని జాత్ పాత్ తొడక మండలి వార్షిక సభకు అధ్యక్షుడు గా ఉండటం మిగతా హిందూ సభ్యులకు ఇష్టం లేదు. వారు తీవ్రంగా వెతిరేకించేరు. చాలామంది నాయకులు మండలి తో తెగతెంపులు చేసుకున్నారు. ఏమైనా బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ ని ఆ సభను నడిపించటానికి ఆహ్వానించటానికి శాంత రామ్ పట్టుబట్టి ఉన్నారు. బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ తన అధ్యక్ష ఉపన్యాసాన్ని లాహోర్ లో ముద్రించటానికి ఇష్టపడలేదు.

బాబాసాహెబ్ డా.బి.ర్  అంబెడ్కర్ ఏప్రిల్ 13, 14 తేదీలలో అమృతసర్ లో జరిగిన సిక్కు మహా సభకు వెళ్ళేరు. కేరళ లోని తియ్యా కులానికి చెందిన ఐదుగురు ప్రముఖ నాయకులు సిక్కు మతం లోకి మారేరు. డా. కుట్టియర్ మొదలైన వారు ఇందులో ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్య పరగణాలకు సంబంధించిన సుమారు 80 మంది సిక్కు మతం స్వీకరించేరు.

Also read  అంటరాని కులాల మొదటి విజయం!

బాబాసాహెబ్ డా.బి.ర్  అంబెడ్కర్ సిక్కు మత సభకు వెళ్ళడం జాత్ పాత్ తొడక్ మండలి సభ్యులకు మరింత అనుమానాలు రేకెత్తించింది. ఏప్రిల్ 9 న హర్ భగవాన్ బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ ని కలసి ఉపన్యాస ప్రతి ని లాహోర్ తీసుకు వెళ్ళేరు. లాహోర్ నుండి బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ కి ఉత్తరం రాస్తూ మీ ఉపన్యాసం సంత్ రామ్ కి బాగా నచ్చింది అని , హిందువులను నిద్ర నుండి మేల్కొల్పుతుంది అని అభిప్రాయ పడ్డారు అని ఉత్తరం లో పేర్కొన్నారు. హర్ భగవాన్ అదే ఉత్తరం లో ఉపన్యాసంలోని కొన్ని భాగాలు ఇక్కడ హిందువులకు ఆదోళన కల్గిస్తున్నాయి అని వారు కలత చెందేరు. మండలి మహా సభ ఎలాంటి పరిస్థితులలో అవాంతరాలు జరగకుండా సజావుగా జరగటానికి సహకరించాలి అని , కనీసం ” వేద ” అనే పదం తొలగించాలి అని బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ ను కోరుతూ మండలి సమావేశాన్ని తుదపరి తేదీలు ప్రకటించకుండా వాయిదా వేసేరు. వారు తొలగించమన్న భాగాలు హిందూ మతగ్రందాలకు, వేదాలకు సంబంధించినది. ఒక హిందువుగా తాను పాల్గొనబోయే ఆఖరి సమావేశం అదే అవుతుంది అని చెబుతూ , అందులో ఒక పదం కాదు కదా , ఒక విరామ చిహ్నం కూడా మార్పు చెయ్యను అను అని బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ పేర్కొంటాడు.

Also read  మనుస్మృతి దహనం!

ఆ వ్యాసమే Annihilation of caste ( కుల నిర్ములాణ ) అనే పుస్తకం గా ముద్రించేరు.

బాబాసాహెబ్ డా.బి.ర్  అంబెడ్కర్ నిరంతర పఠనం, పారిశీలన, ఆలోచన, అనుభవం మిళితమైన అద్భుత వ్యాసం. స్వాతంత్రం, సమానత్వం, సౌబ్రాత్రత ప్రాతిపదికగా హిందూ మతానికి ఒక కొత్త గ్రంధాన్ని రచించి ప్రజాతంత్ర సిద్ధాంతాలకు అనుగుణంగా రూపొందించాలి అని బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ తన వ్యాసంలో పేర్కొన్నారు.

హిందూ సమాజం రోగ గ్రస్తమైంది. అది కులరహితమైన నాడు ఐక్యమత్యంతో శక్తివంతమై తనను తాను రక్షించుకోగలదు. కాని నాడు, ఈ దేశానికి స్వతంత్రం బానిసత్వానికే దారితీస్తుంది. అని బాబాసాహెబ్ డా.బి.ర్ అంబెడ్కర్ హెచ్చరించారు.

(Visited 43 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!