టెస్ట్ క్రికెట్ లో అరంగ్రేటంతోనే పృద్వీ షా ఖాతా లో రికార్డ్ 

షేర్ చెయ్యండి
 
 
ముంబై ఆటగాడు  పృద్వీ షా రాజ్ కోట్ లో వెస్టిండీస్ తో ఈరోజు ప్రారంభం అయిన మొదటి క్రికెట్ మ్యాచ్ తో శుభారంభం చేసేడు. అద్భుతమైన టెక్నీక్, అసాధారణ ఆటగాడు, కాస్త అదృష్టం కలసి రావడంతో అతి పిన్న వయసులోనే బారత టెస్ట్ క్రికెట్ లో అరంగ్రేటం చేసి తన ఖాతా లో రికార్డ్ సాధించేడు. 
 
పృద్వీ షా 18 సంవత్సరాల 329 రోజుల వయస్సు లో టెస్ట్ క్రికెట్ లో ప్రవేశించిన రెండో అతి పిన్ని వయస్సు గల క్రికెటర్ గా రికార్డ్ సాధించేడు. 1955 లో 17 సంవత్సరాల 265 రోజుల విజయ్ మెహ్రా న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అరంగ్రేటం చేసి రికార్డ్ సాధించేడు. 
 
టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ చేతులు మీదగా టెస్ట్ క్యాప్ అందుకున్న పృద్వీ షా బారత తరుపున 293 వ ఆటగాడు గుర్తింపు పొందేడు. 
 
రాజకోట్ లో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్  చేపట్టిన టీమిండియా కు ఎదురుదెబ్బ తగిలింది. తోలి ఓవర్లోనే కెల్ రాహుల్ డకౌట్ గా వెనుదిరిగాడు. 
 
పుజారా తో కలిసి క్రీజు లో ఉన్న పృద్వీ షామధ్యాహ్నం భోజన విరామ సమయానికి 166/1 పరుగుల తో క్రీజ్ లో వున్నారు. 
 
శతకం తో అరంగ్రేటం చేసిన పృద్వి షా
 
ఆడుతున్న తోలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లోనే శతకం సాధించిన చిన్న వయస్కుడిగా రికార్డ్ నెలకొల్పిన పృద్వి షా,  తండ్రి పై తనకున్న ప్రేమను  చాటుకున్నాడు. ఈ సందర్బంగా తన కోసం తన తండ్రి పడ్డ కష్టాన్ని పృద్వి షా గుర్తుచేసుకున్నాడు తన తోలి సెంచరీ ని నాన్నకు అంకితం ఇచ్చేడు. 
 
వెస్టిండీస్ తో జరుగుతున్న తోలి టెస్ట్ మ్యాచ్ తోలి ఇన్నింగ్స్ లో షా 154 బంతుల్లో 134 పరుగులు చేసి రికార్డులు సాధించేడు. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత పృద్వి మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేసేడు. మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చెయ్యడం ఆనందాన్ని ఇచ్చిందని షా పేర్కొన్నారు. మొదటిలో కొంత ఒత్తిడికి లోనైనప్పటికీ ఆ తర్వాత క్రీజ్ లో కుదురుకున్నానని తెలిపేడు. 
 

ఇండియా కి ఆడటం నాకు చాలా గొప్ప విషయం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాను. చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ఇష్టం అని స్కూల్ తరుపున ఏడాదికి 35 మ్యాచ్ లు ఆడేవాడిని , రంజీలో చాలా రోజులు ఆడాను , ఆ అనుభవం నాకు ఉపయోగపడిందని తెలిపేడు 

Also read  మేరీకోమ్ 6 బంగారు పతకాలతో చరిత్ర సృష్టించిన బాక్సర్!
(Visited 13 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!