పెదపూడి విజయ్ కుమార్: వెలివాడ నుండి రాజ్యాధికారం వైపు!

షేర్ చెయ్యండి
  • 152
    Shares

వెలివాడ ఈ పేరు అందరికీ బాగా గుర్తు వుండే ఉంటుంది. ప్రస్తుత తరానికి ఈ మాటను పరిచయం చేసింది రోహిత్ వేముల. 

File Image: Pedapudi Vijay Kumar leading agitation for Rohit Vemula


రోహిత్ వేముల మరణం వెలివాడ ను పతాక స్థాయికి తీసుకు వెళ్ళింది. రోహిత్ వేముల  వెలివాడ సహచరులు, సుంకన్న వేల్పుల, దొంతా ప్రశాంత్,
చిముడుగుంట శేషు, మరియు పెదపూడి విజయ్ కుమార్. 


యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కాలర్స్ అయిన వీరు కుల రక్కసికి బాధితులు. 
ఎవరైతే హాస్టల్ గదుల నుండి బయటకు గెంటి వేయబడ్డారో , ఎవరైతే వెలివాడ లో ఉన్నారో వారిలో ఒక స్కాలర్ నేడు రాజ్యాంధికారం దిశ గా ముందడుగు వేసాడు. 


ప్రస్తుతం అంబేడ్కర్ విద్యార్థి సంఘం ( ASA ) రాష్ట్ర అధ్యక్షుడు గా  పెదపూడి విజయ్ కుమార్ బహుజన సమాజ్ పార్టి నుండి ఏప్రిల్ 11 న జరిగే ఎన్నికల్లో పోటీ చెయ్యడం ఒక శుభచూచిక. 


మూడు సంవత్సరాల క్రితం రోహిత్ వేముల కి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నప్పుడు విజయ్ కుమార్ రాజకీయాల పవర్ చూసాడు. 


బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ వారసుడిగా రాజ్యాధికారం యొక్క అవశ్యకత మరోసారి జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఆనాడే రాజకీయాలలో చేరాలనుకున్నాడు. 

File Image: Fighting for justice @ UOH


రాజనీతి శాస్త్రంలో స్కాలర్  అయిన విజయ్, డా.అంబేడ్కర్ వారసుడిగా బహుజన సమాజ్ పార్టి తరుపున ప్రకాశం జిల్లా పరుచూరు అసెంబ్లీ  జనరల్ స్తానం నుండి పోటీ చేస్తున్నాడు. 

Also read  ముందే హెచ్చరించిన డా.అంబేడ్కర్!


దళితులు జనరల్ స్తానం లో పోటీ చెయ్యడం చాలా అరుదు. ప్రధాన రాజకీయ పార్టీలు ఎస్సి / ఎస్టి లకు గత డెబ్భై ఏండ్ల గా రిజర్వుడ్ నియోజక వర్గాలలోనే పోటీ చేస్తున్నారు. 


ఎస్సి లను, ఎస్టి లను రిజర్వుడ్ నియోజకవర్గాల కే పరిమితి చెయ్యడం కుల వివక్షనే అంటాడు పెదపూడి విజయ్. దళిత నాయకులు ఎంత గొప్ప పేరు, పరపతి సాధించినా  సవర్ణ కులాల పార్టీలు కేవలం రిజర్వుడ్ స్థానాలకే పరిమితం చేశారు.

 
ది న్యూస్ మినిట్ అనే ఇంగ్లిష్ న్యూస్ వెబ్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్యూ లో విజయ్ మాట్లాడుతూ దళితులు, ఆదివాసీలు జనరల్ స్థానాలలో పోటీ చెయ్యాలని కోరారు. 


ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన పెదపూడి విజయ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో రాజనీతి శాస్త్రం లో పి హెచ్ డి చేస్తున్నాడు. 


ఒక దళితుడిగా తను పుట్టిన కులం గురించి చెప్పుకోవడం తాను ఎలాంటి భేషజాలకు పోననీ, గర్వంగా చెప్పుకుంటానని తెలియజేశాడు. 

File Image: Pedapudi Vijay @ Velivada in UOH


హైదరాబాద్ యూనివర్సిటీ లో బిజెపి విద్యార్థి విభాగం అయిన ABVP యొక్క హిందుత్వ పోకడలను సమర్ధవంతంగా తిప్పి కొట్టాడు విజయ్. 


1942వ సంవత్సరం జులై 18,19 తేదీలలో నాగపూర్ లో జరిగిన  అఖిలభారత నిమ్న జాతుల సభలో ముఖ్యఅతిథి గా పాల్గొని ప్రసంగిస్తూ బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఈ విధంగా అంటాడు. 

Also read  కాన్షిరామ్: దళితుల  రాజ్యాధికారం ద్వారా కుల నిర్ములన సాధించగలమా?  


హిందూ, ఛాందస ఆచార వ్యవహారాల పైన, వారు మనపై తరాల తరబడి సాగిస్తూ వచ్చిన దౌర్జన్యాల పైన తిరగబడటంతో మన పోరాటం మొదలైంది అని డా. అంబేడ్కర్ అంటాడు. 


పెదపూడి విజయ్ కుమార్ యూనివర్సిటీ లో హిందూ ఛాందస వాద విద్యార్థులు, , విద్యార్థి సంఘం యొక్క అరాచకాలను ప్రశ్నిస్తూ , పోరాటం చేశాడు . 


ఆర్ధిక రూపమైన ప్రయోజనాల కంటే ఆత్మ గౌరవమే మానవుడికి ముఖ్యం అంటాడు బాబాసాహెబ్ డా. అంబేడ్కర్. 


విజయ్ నేడు ఎన్నికల్లో పోటీ చేస్తుంది ఆత్మగౌరవం కోసమే. 


స్వతంత్ర భారత దేశంలో దళితులు స్వతంత్రం పౌరులుగా పాలకులు గా జీవిస్తారేగాని  పాలితులుగా ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండటానికి ఇష్టపడరు: బాబాసాహెబ్ డా అంబేడ్కర్ 

File Image: Vijay kumar contesting UOH student union president


బాబాసాహెబ్ మరియు  పెదపూడి విజయ్ కుమార్  ఆశయం నెరవేరాలని కోరుకుందాం. 

విద్యార్థి దశ నుండే పోరాట పఠిమ కల్గిన వ్యక్తిత్వం విజయ్ కుమార్ ది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా  విజయ్ తన నాయకత్వ లక్షణాలను ఋజువు చేసుకున్న వ్యక్తి. 


నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకూ పోరాటం చెయ్యడం, ప్రలోభాలకు లొంగకుండా పోరాడటం అబేడ్కరిస్టు ల లక్షణం. ఆ లక్షణం పెదపూడి విజయ్ కుమార్ రోహిత్ వేముల కోసం చేసిన పోరాటం లో నిరూపించాడు. 

Also read  దళితుల ఐక్యత రాజ్యాధికారం ఎండమావేనా!

నేడు ఎన్నికలు అంటేనే పెట్టుబడి, పెట్టుబడి దారుల ఎన్నికల చట్రంలో విజయ్ లాంటి సామాన్యుడు పోటీలో ఉండటం సామాన్యమైన నిర్ణయం కాదు. అందుకు తెగింపు ఉండాలి. ధైర్యం ఉండాలి. 

పెదపూడి విజయ్ కుమార్ లాంటి వారిని చూసి దళిత యువత ప్రత్యక్ష రాజకీయాలలో కి వస్తే  బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గారు తొమ్మిది దశాబ్దాల ముందు చెప్పిన ‘మీ గోడల మీద రాసుకోండి మనం పాలకులం కాబోతున్నాం’ అన్న మాట నెరవేరుతుంది   

మరిన్ని వివరాలకు 
https://www.facebook.com/pedapudi007/


(Visited 189 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!