ప్రమాదంలో కుల పార్టీల రాజకీయ భవిషత్తు?

షేర్ చెయ్యండి
ప్రమాదంలో కుల పార్టీల రాజకీయ భవిషత్తు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ప్రస్తుతం రాజకీయ రేసులో ముందు ఉన్న కుల రాజకీయాలు, వారి భవిషత్ మనువాద ఫాసిజం వలన  ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 
 
భారతదేశంలో దక్షణాది రాష్ట్రాల కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సామాజికంగా ఆది ఆంధ్ర , ఆది ద్రావిడ అలాగే అటు కర్ణాటక లో బసవేశ్వరుడు, ఇటు కేరళ లో నంగినేళి, అయ్యంకాళి లాంటి వారి ఉద్యమాల ప్రభావం నేటికీ బలంగా ఉంది. 
 
అదే విధంగా దక్షణాది రాష్ట్రాలు రాజకీయంగా దేశానికి వెన్నుముక లాంటివి. దక్షణాది నుండే మొదటిసారి కాంగ్రెస్ పార్టి కి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించింది. 
 
ఉత్తరాది వారి ప్రభావాన్ని దక్షణాది మీద సామాజికంగా, సాంస్కృతికంగా పడకుండా దక్షణాది భాషలు, సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చారు. 
 
దక్షణాది రాష్ట్రాలలో కుల చైతన్యం రాజకీయ చైతన్యంగా మారి జస్టిస్ పార్టి, తెలుగు దేశం పార్టి, అలాగే సామాజిక తిరుగుబాటు గా డిఎంకె పార్టీ లు కాంగ్రెస్ లోని బ్రాహ్మణ – బనియా  ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టిలు ఆవిర్భవించాయి. 
 
భారత కమ్యూనిస్ట్ పార్టి ని ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ బ్రాహ్మణ కూటమికి వ్యతిరేకంగా కమ్మ సామాజిక వర్గం అలాగే రెడ్డి సామజిక వర్గం సొంతం చేసుకున్నారు. 
 
ఇదే సందర్భంలో త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వారు బ్రాహ్మణ వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. అటు రెడ్డి సామజిక వర్గంలో సురవరం ప్రతాప్ రెడ్డి, లాంటి వారు నాయకత్వం వహించారు.
 

కుల రాజకీయాలు – రాజకీయ పార్టి:

 
ఎన్టీర్ తెలుగు దేశం పార్టి 1983 స్థాపించి ఆంధ్ర ప్రదేశ్ లో కుల రాజకీయాలు కు నాంది పలికాడు. సమాజంలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తగ్గించడానికి కర్ణం గిరి పద్దతిని రద్దు చేసాడు. 
 
ఆంధ్ర – తెలంగాణ  లో  కమ్మ, వెలమ , రెడ్డి మరియు కాపు సామజిక వర్గాలు రాజకీయ ఆధిపత్యం కోసం పోటీపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా వెలమ సామజిక వర్గం రాజ్యాంధికారం మొదటిసారిగా కెసిర్ నేతృత్వంలో చేపట్టింది. 
 
కాంగ్రెస్ పార్టి లో అపూర్వమైన ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుని పాపులర్ సి.యం గా పేరుతెచ్చుకున్న వై యెస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టి స్థాపించి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం లోకి వచ్చాడు. 
 
సుదీర్ఘ కాలం గా అధికారం లో ఉన్న తెలుగుదేశం అధికారం కోల్పోయి నేడు ప్రభావాన్ని కోల్పోయింది. అయితే సమీప భవిషత్ లో కెసిర్ , జగన్ రెడ్డి, కెసిర్ ల రాజకీయం ప్రమాదం లో పడే చూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. 
 
అధికారమే పరమావధిగా “హిందు” నినాదం తో బ్రాహ్మణ – బనియా రాజకీయ పార్టి బిజెపి ఈ మూడు అధికార కులాల రాజకీయ భవిషత్ ను ప్రమాదంలోకి నెట్టింది. 
 
ప్రాంతీయ పార్టీలకు వెన్ను దన్నుగా వున్న బిసి ఓటు బ్యాంకు నేడు హిందు నినాదం తో బిజెపి వైపు ఆకర్షితులు అవుతున్నారు. 
 

మనువాద ఫాసిజం – కుల రాజకీయాలు:

 
 
2014 నుండి బిజెపి నయానో భయానో ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకునే ప్రయత్నం లో ఉంది. లొంగనివారి మీద హిందుత్వ ఎజెండా అమలు పరిచి ఆ రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా చేస్తుంది. మతాన్ని రెచ్చగొట్టి కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ సమాజాన్ని నిట్టనిలువునా విభజిస్తున్నారు. 
 
2014 లో బిజెపి తో పోత్తు పెట్టుకుని తప్పు చేసాను ఏమో అని  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కి బహుసా ఇప్పుడు అర్ధం అయివుంటుంది. 
 
బిజెపి దూకుడు చూస్తుంటే ఏ ప్రాంతీయ పార్టీని బ్రతకనిచ్చే అవకాశం లేదు. అదీకాకుండా బిజెపి జాతీయ స్థాయిలో కేవలం రెండు పార్టి విధానానికి మొగ్గు చూపిస్తుంది. 
 
బిజెపి కి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇప్పటివరకు మద్దత్తు పలికిన కమ్మ , రెడ్డి , వెలమ కులాల అధిపత్యానికి బహుశా 2024 తర్వాత బ్రేక్ పడే అవకాసం ఉంది. 
 
మనువాద బిజెపి పార్టి సామాజికంగా దళితులను , ముస్లిం లను , క్రైస్తవులను టార్గెట్ చేస్తూ వారి మీద సాంస్కృతిక దాడి చేస్తుంటే, రాజకీయంగా కమ్మ, రెడ్డి , వెలమ ఆధిపత్యాన్ని తుంగలో తొక్కే చర్యలు చేపట్టింది. 
 
కేంద్రంలో మొదటి సారి బనియా ల నాయకత్వాన్ని బ్రాహ్మణ వర్గాలు మద్దత్తు ఇచ్చి కొత్త శకానికి నాంది పలికింది. ఇదే కూటమి దేశ వ్యాప్తంగా ప్రాంతీయ భూస్వామ్య వర్గాలను తమ చెప్పుచేతుల్లో ఉంచుకుని రాజ్యాన్ని పాలించాలని ప్రణాళికలు , ఎత్తుగడలు వేస్తున్నారు. 
 
2014 నుండి నేటి వరకు మనువాదులను ఎదుర్కొంటుంది దళిత , ముస్లిం , క్రైస్తవ వర్గాలే. ఎస్సి , ఎస్టి, బిసి ల సామజిక ఉద్యమాలు, హేతువాద , ప్రజాస్వామ్య పౌర సమాజం, సంఘ్ పరివార్ మనువాద ఫాసిజం తో పోరాడుతుంటే భూస్వామ్య వర్గాలైన కమ్మ , రెడ్డి , వెలమ కులాలు అధికారాన్ని చలాయిస్తున్నాయి. 
 

ప్రాంతీయ పార్టీలు – కుల రాజకీయాలు:

ప్రాంతీయ పార్టీలకు ఆయువు పట్టు కులం. అర్ధ బలం మెండుగా వున్న కులాలు 1980 దశకం నుండి రాజకీయ పార్టీ లు స్థాపించి వారి కుల సామాజిక, ఆర్ధిక, రాజకీయ అభివృద్ధికి దోహదపడ్డారు. 
 
తెలుగు దేశం పార్టి ఆవిర్భావం తర్వాత కమ్మ సామజిక వర్గం ఆర్ధికంగా ఎలా అభివృద్ధి చెందారో విదేశీయులు రీసెర్చ్ చేసి పి హెచ్ డి లు పొందిన విషయం మనకు తెలిసిందే. 
 
ఇన్నిరోజులు కాంగ్రెస్ పార్టీ లో బలంగా ఉన్న రెడ్డి సామజిక వర్గం సొంత కుంపటి పెట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ లో నేడు అధికారం చేపట్టింది. అలాగే తెలంగాణ లో వెలమ సామజిక వర్గం ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం వలన అధికారం లోకి వచ్చారు. 
 
ఈ కుల ప్రాంతీయ పార్టీ లు అభివృద్ధి నీడలో కుల రాజకీయాలు చేశారు చేసినట్లు గా మనకి ఎన్నో డేటా లు ఋజువులు కనపడుతున్నాయి. 
 
ఈ సందర్భంలో, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో శూద్ర కులాలుగా ఉన్న కమ్మ, రెడ్డి, వెలమ సామజిక వర్గాలు మనువాద ఫాసిజం యొక్క రాజకీయం కు బలి గాబోతున్నారు 
 
అవినీతి ఊబిలో కూరుకు పోయి కేంద్రంలోని బిజెపి పార్టీ ని కనీసం విమర్శ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇదే అదునుగా బిజెపి తన హిందూ పంజా విసిరి అందరినీ కబళిస్తుంది. 
 
దళితులు, ముస్లిం లు మరియు బిసి లు ఒకవైపు మనువాద ఫాసిజ రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎదిరిస్తుంటే అధికారంలో ఉన్న భూస్వామ్య శూద్ర కులాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ వారి గోతిని వారే తొవ్వుకుంటున్నారు. 
 
2016 లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో రోహిత్ వేముల  మనువాద ఫాసిజం కు బలైతే, రోహిత్ వేముల ఎస్సి ( షెడ్యూల్ క్యాస్ట్ ) కాదంటూ చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం తప్పుడు కుల ధృవీకరణ పత్రం ఇచ్చింది. 
 
బిజెపి ఎత్తుగడలు పసికట్టలేని చంద్రబాబు అధికారమే పరమావధిగా బిజెపి అడుగులకు, మడుగులు వొత్తడం వలన నేడు తెలుగు దేశం పార్టి భవిషత్ కే ప్రమాదకరం గా మారింది. 
 
ఇటీవల జరిగిన సార్వత్ర ఎన్నికలు తర్వాత తెలంగాణ ని టార్గెట్ చేస్తూ బిజెపి కేంద్ర నాయకత్వం చేసిన ప్రకటనలు కెసిర్ & కో గ్రహించే ఉంటారు. 
 
బిజెపి కి దగ్గరగా ఉన్న జగన్ రెడ్డి పార్టి 2024 తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి వేసే ప్రతి అడుగుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.   
 
ఈ పరిణామంలో కెసిర్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి లు కలసి మనువాద ఫాసిజాన్ని ఎదుర్కొంటారో లేక విడి విడిగా ఎదుర్కొంటారో వాళ్ళే నిర్ణయించుకోవాలి లేదా పర్మినెంట్ గా రాజకీయ సన్యాసం తీసుకుని బిజెపి రాజకీయ శిభిరం లో శరణార్థులుగా చేరాల్సి ఉంటుంది.
(Visited 363 times, 1 visits today)
Also read  నయా సూత మహర్షులు-దళిత రాజకీయ నాయకులు!

One thought on “ప్రమాదంలో కుల పార్టీల రాజకీయ భవిషత్తు?

  • 29/07/2019 at 11:38 PM
    Permalink

    లోతైన పరిశీలన.. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ భవిష్యత్తును అంచనా వేస్తుంటే.. మీ అనాలసిస్ నూరుశాతం వాస్తవం. శూద్ర రాజకీయ పార్టీలు అధికారం కోసం వెంపర్లాడుతుంటే.. అణగారిన కులాలు తమ ఉనికిని (ప్రాణాలు) కాపాడుకోవడానికి బలమైన బిజెపి తో పోరాడుతున్నాయి. ఇప్పటికైనా ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార ప్రతిపక్ష శూద్ర నాయకులు తమ వైఖరి మార్చుకుని బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా ఉంటే లాభం ఖచ్చితంగా వీరికే. లేకుంటే భవిష్యత్తు చరిత్రలో వారు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!