ప్రాంతీయ రాజకీయ పార్టీలు కులాలను విభజించడం మానుకోవాలి.

షేర్ చెయ్యండి

బారతదేశంలో కొన్ని వర్గాల కు ప్రత్యేక గుర్తింపు ఉంది, ఒక లక్ష్యం తో ఆయా వర్గాలను ఆనాటి రాజకీయ, సామాజిక పెద్దలు ఒక్కటి చేసేరు.

ఉదాహరణకు: బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గారు అంటారానితనం అనుభవిస్తున్న వివిధ కులాలను “షెడ్యుల్ కులం” గా అలాగే ఆదివాసీలను “షెడ్యుల్ తెగలు” గా, కుల వృత్తులు కలవారిని, ఆర్ధికంగా వెనకబడిన వారిని ” వెనుక బడిన తెగలు” గా ఒక తాటి మీదకు తెచ్చేరు. దానికి కారణం ఆయా కులాల మధ్య ఐక్యత కోసం మరియు రాజకీయ, ఆర్థిక అభివృద్ధి కోసం. బారత దేశంలో మతం-కులం యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉటుందో, వాటి యొక్క పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటుందో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గారికి తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు. గ్రామాల్లో పెత్తందారితనం, భూస్వామ్య కులాల దౌర్జన్యం వీటిని ఎదుర్కొవాలి ఆంటే కులం చేత పీడింపబడిన కులాలు ఒక్కటిగా ఉంటే మెజారిటీ వస్తుంది, దాని ద్వారా రాజకీయ అధికారం చేపట్టవచ్చు. బారత దేశంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన కులాల ఆర్ధిక అభివృద్ధి మనకు తెలిసిందే. కాబట్టి ఒక లక్ష్యం తో ఏర్పాటు చేసిన షెఢ్యల్ కులం, తెగ మరియు వెనకబడిన తరగతుల మధ్య కొందరు అభివృద్ధి చెందేరు అని విభజన రేఖలు గీస్తూ ఐక్యత కు గండి కొడుతున్నారు భుర్జువా కులాల పాలక నాయకత్వం. ఇలా కపటి ప్రేమ చూపించేది వారి ఆధిపత్యం చేలాయింపు కోసమే తప్పా ఆ కులం ఆర్ధిక అభివృద్ధి , రాజకీయ అభివృద్ధి కాదు అని జరిగిన పరిణామాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also read  సంఘ దౌర్జన్యం!

1994 ఎస్సిలలో మాల కులం అభివృద్ధి చెందింది అని ఎస్సిల మధ్య పెట్టిన కారుచిచ్చు నేటికీ ఆరలేదు, బహుసా ఆరాదుకుడా! 1987 లో కారంచేడు సంఘటన తర్వాత జరిగిన పరిణామాలు, మండల్ కమీషన్ ఉద్యమం లో జరిగిన పరిణామాలు పాలక కులాలు అయిన కమ్మ, రెడ్డి ల ఉనికికే ప్రమాదం గా ఏర్పడింది. మూడు శాతం, నాలుగు శాతం ఉన్న కులాల ఆధిపత్యం మెజారిటీ కులాల చేతిలో , బహుజన సమాజ్ చేతిలో చావు దెబ్బ ఖచ్చితంగా తింటుంది అని గ్రహించి “వర్గీకరణ” పేరుతో మాల-మాదిగల మధ్య కుంపటిని రాజేసేరు. ఈ వర్గీకరణ ఇప్పుడు అన్ని కులాలలో అగ్గి రాజేస్తుంది. ఇదే దేశవ్యాప్తంగా రాజుకుంటుంది.

కారంచేడు సంఘటన దేశవ్యాప్తంగా పీడిత కులాలను ఏకం చేసి ప్రపంచానికి నిమ్నజాతుల సత్తా ఏంటో డర్బన్ వీధుల్లో చాటితే, కొందరు ఇంటి దొంగల వలన ఐక్యత కు బీటలు కొట్టేరు పాలక కులాల రాజకీయ ప్రతినిధులు.

రాజకీయ మరియు వివిధ కుల నాయకులు చెబుతున్నట్లు కేవలం రిజర్వేషన్ల వలనే షెడ్యుల్ కులం లోని మాదిగలు కానీ లేదా మిగతా 59 కులాలు విద్య, ఆర్ధిక, రాజకీయంగా వెనకపడ్డారా లేక ఇంకేదైనా. సామాజిక, రాజకీయ కోణం ఉందా? అని ఏదైనా శాస్త్రీయ పరిశోధన ఉందా? 1947 నుండి నేటి వరకూ దేశవ్యాప్తంగా జరిగిన సామాజిక మార్పుల్లో ఎస్సిల, ఎస్టీ ల పరిస్థితి మీద ప్రభుత్వ పరంగా జరిగిన పరిశోధన ఏదీ లేదు. ఎస్సి గ్రామాల్లో నేటికి సురక్షిత మంచినీరు , రోడ్లు , మురుగు నీటి సదుపాయం లేదు, ఇక ఆదివాసీల పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో వారి పిల్లలు సురక్షిత మంచినీరు లేక డయేరియా వ్యాధితో ఎంత మంది చనిపోతున్నారో అందరికీ తెలుసు. స్వతంత్రం వచ్చి 71 సంవత్సరాలు అయినా కనీస వసతులు కల్పించలేని భుర్జువా నాయకులు, పార్టీలు కొందరు అభివృద్ధి చెందేరు అని కులాల మధ్య చిచ్చు పెట్టి వారి పబ్బం గడుపుకుంటున్నారు. ఎస్సి , ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వేల కోట్లు పక్కదారి పట్టించి రాజన్న కానుక, చంద్రన్న కానుక అంటూ ముష్టి వేస్తూ అడుక్కుతినే వారిగా చేస్తున్నా చోద్యం చూస్తున్న వర్గీకరణ కుల నాయకులు. గరగపర్రు లాంటి సంఘటన లు జరిగినా , మంథని మధుకర్ లాంటి సంఘటన లు జరిగినా న్యాయం జరిపించుకోలేని స్తితి కి తీసుకు వెళ్ళేరు.

Also read  ఎస్సీల రాజ్యాధికారం ఎండమావేనా!

ఐక్యంగా ఉన్నా కులాలను విభజిస్తే లేదా రిజ్వేషన్లు వర్గీకరిస్తే ఆయా కులాలు ఎలా అభివృద్ధి చెందుతారు? రిజర్వేషన్లు ఆర్ధిక అభివృద్ధి కి సోపానం అయితే 71 సంవత్సరాల లో ఎస్సిలు కేవలం 4 శాతం మాత్రమే ఎందుకు అభివృద్ధి చెందేరు. రాజకీయంగా కేవలం 1 శాతం మాత్రమే ఎందుకు ఉన్నారు. కాబట్టి ఏ దైనా ఒక వర్గం అభివృద్ధి జరగాలి ఆంటే ఆ వర్గాలకు ఆర్ధిక తోడ్పాటు ప్రభుత్వాలు సమకూర్చాలి, ఆర్ధిక వసతులు కల్పించాలి. వ్యాపారస్తుల అభివృద్ధి కి , పెట్టుబడిదారులకు ప్రత్యేక ఆర్థిక మండళ్లు కల్పించినట్లు ఎస్సి / ఎస్టీ ల అభివృద్ధి కి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి.

ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎస్సి వర్గీకరణ బిల్లు ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు చేసిన కామెంట్ కులాల మధ్య చిచ్చు పెట్టే పాలక కులాలు ఎందుకు అమలు చెయ్యటం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధంగా షెడ్యుల్ కులాన్ని వర్గీకరించటం, ఉప వర్గీకరించటం లేదా ఏదైనా మార్పులు చెయ్యటం చట్ట సమ్మతం కాదు, ఒక వేళ ఏదైనా కులం వెనకబడింది అనుకుంటే ఆ వర్గాల ఆర్ధిక అభివృద్ధి కి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి అని సుప్రీం కోర్టు చేసిన చూచన నేటి పాలకులు ఎందుకు పెడచెవిన పెట్టెరు. ఎందుకు కులాలను వర్గీకరించాలి అని చూస్తున్నారు.

అభివృద్ధి పేరుతో రిజర్వేషన్ల వర్గీకరణ బూర్జువా వర్గాల ఓటు బ్యాంకు రాజకీయమే? అని స్పష్టంగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల కోసం మోడీ బి సి ల వర్గీకరణ ఆంటే చంద్రబాబు ఎస్టీల వర్గీకరణ అంటున్నాడు. అలాగే కాపుల రిజర్వేషన్ల, రజకులను ఎస్సీ లలో చేర్పు, బోయలను ఎస్టీ లలో చేర్పు అంతా ఓటు బ్యాంకు రాజకీయం.

కులాల మధ్య చిచ్చు పెట్టి ఆయా కులాలను శాస్వితంగా రాజ్యాధికారం కు దూరం చేస్తున్నారు.

Also read  దళిత రాజ్యాధికారం-బిఎస్పీ!

జరిగిన నష్టం గ్రహించి ఎస్సిలు, ఎస్టీలు ఆలాగే బి సి లు పాలక కులాల ఎత్తుగడలు తిప్పి కోట్టాలి లేదంటే బాబాసాహెబ్ డా. బి.ర్ అంబేడ్కర్ గారి స్ఫూర్తి కి వెన్నుపోటు పొడిచిన వారు అవుతారు. చరిత్ర లో స్తానం లేకుండా చేస్తారు.

(Visited 21 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!