ప్రాజెక్ట్ భూతం – తూత్తుకుడి స్టెరలైట్ కాపర్!

షేర్ చెయ్యండి
  • సాంఘిక, ఆర్ధిక, రాజకీయ విషయాల్లో మనలో మనకు తీవ్రమైన బేదాభిప్రాయాలున్నవని నే నెరుగదను. అయినప్పటికీ మనమంతా కలసి వివిధ ధోరణుల నన్నింటిని సమన్వయం  చేసుకొని “ఒక దేశం, ఒకే ప్రజా” అని పించే జాతీయ భావంతో మెలగ్గలిగే రోజులు రాగలవనే నేను విశ్వసిస్తున్నాను: బాబాసాహెబ్ డా. అంబేడ్కర్. 

తుత్తుకుడి, ఇటీవల వార్తలకెక్కిన ప్రాంతం. పోలీసుల కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన. తమ హక్కుల కోసమై పోరాడుతున్న ప్రజలపై  ప్రభుత్వం కాల్పులు జరిపి బలితీసుకుంది. 65 మంది ప్రజలు గాయాలకు గురి అయ్యేరు 

Police personnel baton charge at a protestor demanding the closure of Vedanta’s Sterlite Copper unit, in Thoothukudi. Credit: PTI
   
దున్నే వాడిదే భూమి ” ఒక్కప్పుడు ఈ నినాదం వాడ ,వాడల మార్మోగింది , లక్షలాది మంది ప్రజలు ప్రభావితం అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రదాన ఆదాయ వనరు అయిన ” భూమి ” . ఎలాంటి కుల వృత్తి లేనటువంటి ప్రజలకు భూమి ఒక్క ఆయువుపట్టు . సామాజికంగా , ఆర్ధికంగా వెనకబడిన వర్గాలను వివక్ష నుండి రక్షించాలి అంటే భూమి కావలి .
దశబ్దాలు గడిచేకొద్దీ మనువాదులు ఈ దేశాన్ని , సమాజాన్ని కులం వర్గాల వారిగా విడదీసినప్పుడు అనాదిగా భూమినే నమ్ముకున్న ‘ ఈ దేశపు ములవాసులు ‘ భూమి నుండి దూరంగా నేట్టవేయబడ్డారు . భూమి లేని ప్రజలు బానిసలుగా , కూలీలుగా మార్పు చెందేరు . ” పోరాడితే పోయేది ఏముంది – బానిస సంకెళ్ళు తప్పా ” ఈ నినాదం వాళ్ళ ఊపిరి అయ్యింది . అవును బానిస సంకెళ్ళ నుండి విముక్తి పొందటానికి ఇంటికొక మనిషి గుట్టల్లో , చెట్టులో తమ ప్రాణాన్ని పెట్టి పోరాడరు . బారతమాత  తమ పిల్లల కోసం తనే రాసుకున్న రాజ్యాంగాన్ని కాదు అని బానిసలుగా , వెట్టి చాకిరి చేయిస్తున్న పెత్తందారులను ఎదుర్కోవటానికి ఒక్కొకరు ఒక్క ” సూర్యుడి ” లా భగ ,భగ మండేరు.

Also read  VHP యొక్క రామ రాజ్య రధ యాత్ర విభజన మత రాజకీయం కోసమేనా!

కాలం మారింది , ప్రజల తిరుగుబాటు కు ప్రభుత్వాలు కదిలేయి , మీకోసం భూమి పంచుతాం అన్నారు , అడవి , గుట్ట , నీరు మీదే అన్నారు . రాళ్ళూ ,రప్పలు , తప్ప నీరులేని భూమి ఇచ్చేరు అయిన సరే తమ రక్తాన్నే నీరుగా పోసి బంగారాన్ని పండించేరు . బానిస – బంగారాన్ని పండించేడు . పెద్దోడి కన్ను బగారం మీద – కాదు బంగారం లాంటి భూమి మీద పడింది 

బారతమాత   మాట తప్పింది ! మీ కోసం ఈ భూమి అన్న నోరు ఇప్పుడు అదే నోటి తో అబద్దం ఆడుతుంది. మీకోసం అభివృద్ధి అంటూ అదే గుట్టలను , భూమిని భలవంతాన లాక్కుంటుంది. బ్రతిమిలాడి , దండం పెడితే తుపాకి ఎక్కుపెట్టింది. తిరగబడితే యుద్ధం ప్రకటించింది . బారతమాత తన బిడ్డలు మీద  యుద్ధం  ప్రకటించింది. 

71 సంత్సరాల స్వాత్రంత బారత దేశం ప్రజల మీద యుద్ధం ప్రకటించింది. భూమి అడిగిన పాపానికి యుద్ధం ప్రకటించింది. ఇన్ని సంత్సరాలు పాలకులు చూపిన అభివృద్ధి నీటి రాతలే . నేటికి కిలో బియ్యం కొనలేని స్తితిలో ఇదే పాలకులు ప్రజలను బిచ్చగాళ్ళుగా తమ దుకాణాల ముందు నిలబెట్టింది  . ఎవరికోసం ఈ కిలో ” రూపాయి ” బిక్ష . భూమి , నీరు మీరు తీసుకుని మాకు బిక్ష ఇస్తారా ! అని అడిగే శక్తి లేని ప్రజలను ఓట్ల రాజకీయాల కోసం బిక్షగాళ్ళను చేస్తుంది .అభివృద్దిని అరచేతిలో చూపించి , ఇంకొక చేతితో పీకలు నోక్కేస్తుంది.

police firing against Sterlite copper protesters. Credit PTI

Also read  Kerala floods 2018 - PM announces 500 crore relief help for Kerala floods

ప్రజా ప్రభుత్వాలు బంధుప్రీతి  , అవినీతి ఊబిలో పీకల్లోతుల్లో మునిగి సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రపంచీకరణ , గ్లోబలైజేషన్ లో ప్రజలను వలస వాదులు గా చేస్తున్నాయి . పెట్టుబడి దారుల గుప్పెట్లో ప్రజా ప్రభుత్వాలు అత్యంత క్రూరంగా ప్రజలను భూమి నుండి దూరం చేస్తున్నాయి. ఆర్ధిక అవసరాల కోసం ప్రపంచ దేశాలు ఒక్కటి అవుతున్నాయి , కానీ ఆ దేశం లోని ప్రజలను విడదీస్తున్నాయి . తర తరాలుగా వెనకబడి అభివృద్ధి కోసం , తమ స్తితి గతుల్లో మార్పు కోసం ఒక వర్గం గా , అభివృద్ధి పేరుతొ ప్రజలను దోచుకున్న ఇంకొక వర్గం ఇంకొక వైపు !

 

వేదాంత వారి స్టెరిలైట్ కాపర్ ఖర్మగారం వలన గాలి కలుషితం అవుతుంది దాని వలన ఊపిరి తిత్తుల వ్యాధులు మరియు శ్వాస కోసం వాధ్యుల వలన తూత్తుకుడి గ్రామస్తులు అనారోగ్యపాలు అవుతుండటం తో ప్రజలు ఆ ఖర్మగార విస్తరణ పనులను అడ్డుకునే క్రమంలో నిరసన తెలియజేస్తే రాజ్య వ్వవస్థ 13 ప్రజల మీద అత్యవసర స్థితిని ప్రకటించి కాల్పులు జరిపి 13 మందిని పొట్టనబెట్టుకుంది. 

Also read  పెరియార్ రామస్వామి బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఫై వెల్లూరు మునిసిపల్ కౌన్సిల్ లో చేసిన ప్రసంగం

అభివృద్ధి గాలి , నీరు , భూమిని కలుషితం చేసి మనుషులను చంపేస్తుంది. పెట్టుబడిదారీ విధానం కి జై కొడుతున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం పెట్టుబడిదారుడి కి  అండగా ప్రజలను చంపేస్తుంది. 

ఈ పరిస్థితిని చూస్తుంటే మధ్య యుగాల్లో ప్రపంచ దేశాల్లోని ఎన్నో ఘోరమైన సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. కంబోడియా లో ఖైమ్మర్ రూజ్ పాలన, ఉగాండాలో ఇదీ అమీన్ పాలన గుర్తుకు వస్తుంది. 21 వ శతాబ్దంలో జర్మనీ నాజీ ల దుచ్చర్యలు గుర్తుకు వస్తున్నాయి. 

సామాజిక ప్రగతికి ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి అని ఎవరైనా మద్దత్తు పలికితే చారిత్రాత్మక తప్పు చేసినట్లే. 

చరిత్ర ఎప్పుడు అబద్దం చెప్పదు. చరిత్ర మరల , మరల రిపీట్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా నిర్వాసితులకు కలిపించాల్సిన వసతులు , వాళ్ళ హక్కులను గౌరవించాల్సిన విషయం లో ప్రభుత్వాలు ధగకోరుతనం గా నే ప్రవర్తిస్తున్నాయి. ఎవరిని మోసం చేస్తుంది ఈ ప్రజా ప్రబుత్వాలు . ప్రజలనా లేక దేశాన్నా?

(Visited 39 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!