ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకాలను ఢిల్లీ విశ్వవిద్యాలయం సిలబస్ నుండి  ఎందుకు తొలగించాలనుకుంటున్నారు?

షేర్ చెయ్యండి
  • 50
    Shares
 
  • ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకాలను ఢిల్లీ విశ్వవిద్యాలయం సిలబస్ నుండి  ఎందుకు తొలగించాలనుకుంటున్నారు? దళిత బహుజన వాదాన్ని నిర్ములించాలని ప్రయత్నిస్తున్న బిజెపి ప్రభుత్వం.
  • ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకాలను ఢిల్లీ విశ్వ విద్యాలయం  ఎంఏ రాజనీతి శాస్త్రం సిలబస్ నుండి 2019-20 విద్యాసంవత్సరం నుండి తొలగించాలనుకుంటుంది. 
 
ఇటీవలే పదవీ విరమణ పొందిన ప్రో. కంచ ఐలయ్య దళిత- బహుజన సిద్ధాంతం తో, హిందూ మతోన్మాదం కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వ్యక్తి. 
 
తాను రాసిన , వై ఐ యాం నాట్ ఆ హిందూ , పోస్ట్ హిందూ ఇండియా, గాడ్ యాజ్ పొలిటికల్ ఫిలాసఫర్-బుద్ధా ఛాలెంజ్ టు బ్రాహ్మణిజం, తదితర పుస్తకాలు సరైన రీతిలో అధ్యయనం చెయ్యకుండా రాసినట్లు గా ఉందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
హిందూ మతాన్ని కించపరుస్తూ రాసినట్లుగా వుందని, వేరే మతాల మీద ఎక్కడా విమర్శ లు లేకుండా కేవలం హిందూ మతం మీద తన భావాన్ని వ్యక్తం చెయ్యడం సమాజంలో విభజన రేఖలు గీస్తున్నట్లు గా పేర్కొన్నారు. 
 
ప్రో. కంచ ఐలయ్య తన రచనలలో ఎక్కడా డా. అంబేడ్కర్ బావజాలం ఉపయోగించలేదని, డా. అంబేడ్కర్ మొదట దేశం గురించి ఆలోచన చేసేడని కమిటీ గుర్తు చేసింది. 
 
తన రచనల లో దళిత పదం వాడటం కూడా కమిటీ తప్పు పట్టింది. దళిత పదం కాకుండా వేరే ఏదైనా పదం వాడాలని లేదా ఎస్సి ( షెడ్యూల్ క్యాస్ట్ ) ఉపయోగించాలని అన్నారు. 
 
విద్యార్థులు కూడా ప్రో. కంచ ఐలయ్య పుస్తకాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసారని కాబట్టి ప్రో. కంచ ఐలయ్య పుస్తకాలు తొలగించాలని అభిప్రాయం వ్యక్తం చేసేరు. 
 
స్టాండింగ్ కమిటీ ఆలోచన ప్రో. కంచ ఐలయ్య తీవ్రంగా తప్పుబట్టేరు. బి బి సి తెలుగు ప్రతినిధి తో మాట్లాడుతూ  ఆర్ ఎస్ ఎస్ – బిజెపి సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తుండటం వలన ఢిల్లీ విశ్వవిద్యాలయం ఈ చర్య తీసుకుంటుదని చెప్పేరు. 
 
నా పుస్తకాలు ఒక్క ఢిల్లీ యూనివర్సిటీ నే కాదు, జేఎన్యూ ఢిల్లీ, విదేశీ విశ్వ విద్యాలయాలు భోధిస్తున్నాయని చెప్పేరు. 
 
ప్రో. ఐలయ్య చేసిన కామెంట్ ను ఢిల్లీ విశ్వ విద్యాలయం స్టాండింగ్ కమిటీ ఖండించింది. స్టాండింగ్ కమిటీ సభ్యుడు హన్స్ రాజ్ సుమన్ మాట్లాడుతూ మా మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని ఇది కేవలం స్టాండింగ్ కమిటీ నిర్ణయం గా చెప్పేరు. 
 
దళిత-బహుజన వాదాన్ని విశ్వవిద్యాలయాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
ప్రోఫెసర్ కంచ ఐలయ్య తన పుస్తకాల ద్వారా ఎంతటి వివాదస్పదం అయ్యేరో అందరికీ తెలిసిందే. దళిత- బహుజన సంస్కృతి పేరిట పెద్ద కూర పండగ చేసిన లేదా సామాజిక స్మగ్లర్లు అంటూ పోస్ట్ హిందూ ఇండియా లోని ఒక సామజిక వర్గం గురించి రాసినా ఆయన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిచేడు. 
 
నేను హిందూ నెట్లైయితా ( వై ఐ యాం నాట్ హిందూ) పుస్తకం పెద్ద సంచలనమే కలిగించింది. ఒక విధంగా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా ఐలయ్య కి ఈ పుస్తకం ద్వారానే గుర్తింపు ఇచ్చింది. 
 
ప్రో. కంచ ఐలయ్య వివాదాస్పదుడు అనే కంటే బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఆలోచనా  పరుడుగా, దళిత-బహుజన ఆలోచనా పరుడుగా  దళితుల – బహుజన సిద్ధాంతం మీద తన బావజాలాన్ని వ్యక్తం చేసే క్రమంలో ప్రో. ఐలయ్య వివాదాస్పదుడు అవుతున్నాడు. 
 
బారతీయ జనతా పార్టీ 2014 లో అధికారం చేపట్టిన తర్వాత, విశ్వ విద్యాలయాల్లో బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ అధ్యయన కేంద్రాలను మూసివేసే పక్రియ చేపట్టేడు. 
 
మద్రాస్ యూనివర్సిటీ లో డా. అంబేడ్కర్-పెరియార్ అధ్యయన కేంద్రాన్ని మూసివేసే ప్రతిపాదన చెయ్యడం ద్వారా  బీజేపీ ప్రభుత్వం బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఆలోచనా విధానం ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం’ అనేది దళిత – బహుజనుల్లో చైతన్యం కలిగించకుండా అడ్డుకునే ఎత్తుగడ లో బీజేపీ ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంది. 
 
బాబాసాహెబ్ డా. అంబేడ్కర్, మహాత్మా పూలే, పెరియార్ రామస్వామి లాంటి సామజిక ఉద్యమకారుల ఆలోచనా విధానం బిజెపి వ్యతిరేకించటానికి కారణం ఏమిటి? 
 
హిందూ మతత్వ వాదులుగా ఉన్న సంఘ్ పరివార్ వారి రాజకీయ అనుబంధ సంస్థ  బిజెపి తమ బావజాలాన్ని వ్యాప్తిజేసుకునే క్రమంలో వారికి అడ్డు వచ్చే వారిని నిర్ములిస్తూ వస్తుంది. 
 
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చీ రాగానే తమ పధకం అమలుపరచడం జరిగింది. ప్రముఖ హేతువాదులను కాల్చి చంపడం ద్వారా  నిరూపించడం జరిగింది. 
 
అంతకు పూర్వం వాజపాయ్ అధికారంలో ఉన్నప్పుడు విశ్వ విద్యాలయాల్లో జ్యోతిష్యం, న్యూమరాలజీ లాంటి మతపరమైన అంశాలను సిలబస్ గా చేర్చి చాప క్రింద నీరులా మతాన్ని వ్యాప్తి చేసే పక్రియ చేసేరు. 
 
వేద పాఠశాల కు డిగ్రీ సర్టిఫికెట్ లు ఇస్తూ యు జి సి గుర్తింపు కూడా కల్పించి ఫండ్స్ ఇవ్వడం ద్వారా హిందూ బాజాలం వ్యాప్తికి పూనుకున్నారు. 
 
మోడీ  అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ వ్యవస్థకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న అంబేద్కరిజం ను అడ్డుకోవాలి, నాస్తికులను అడ్డుకోవాలి, అలాగే వారి రచనలు అడ్డు కోవాలనే దుందుడుగు ఆలోచనే ప్రో కంచ ఐలయ్య పుస్తకాలను సిలబస్ నుండి తొలగించడం అనే ప్రక్రియకు మూల కారణం. 
 
ఢిల్లీ విశ్వవిద్యాలయం చర్య హిందూ మతత్వం లో భాగమా? 
ఢిల్లీ విశ్వవిద్యాలయం స్టాండింగ్ కమిటీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకాలను ఏం ఏ పొలిటికల్ సైన్స్ నుండి తొలిగించాలని అభిప్రాయానికి రావడం బ్రాహ్మణిజం యొక్క చర్యగా భావించాలి. 
 
బ్రాహ్మణిజాన్ని ఉత్పత్తి కులాలు ప్రశ్నిస్తూ వారి మనుగడనే ప్రశ్నించే స్థాయికి రావడం తో వారి ఉనికికి ప్రమాదంగా బావించి ఐలయ్య ప్రో. పుస్తకాలను నిషేధించే ఆలోచన చేస్తున్నారు. 
 
ఈ దేశంలో హిందూ మత తత్వాన్ని తూర్పారబట్టిన బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ బావజాలాన్ని విద్యార్థులు నేర్చుకోవడం ద్వారా కులాలకు అతీతంగా హిందూ మతంలోని లోపాలను అందులోని అనాగరిక ఆచారాలను ప్రశ్నించే స్థాయికి యూనివర్సిటీల నుండే తయారవడం బిజెపి కి ఏ మాత్రం ఇష్టం లేదు. 
 
విశ్వ విద్యాలయాల్లో మహాత్మా పూలే – బాబాసాహెబ్ డా. అంబేడ్కర్, పెరియార్ రామస్వామి ల స్టడీ సెంటర్ లకు యుజిసి నిధులు నిలుపుదల చెయ్యడం బిజెపి తీసుకున్న మరొక చర్య. 
 
యుజిసి చేత పురాణాల లో శాస్త్రీయ దృక్పధం పేరిట పరిశోధనలు , సెమినార్ లు పెట్టించడం ద్వారా విశ్వవిద్యాలయాలను మరియు ప్రొఫెసర్లను హిందూ ధార్మిక వ్యవస్థలో బాగం చేస్తున్నారు. 
 
లౌకిక బావజాలాన్ని అంతమొందించి హిందూ మత రాజ్యాన్ని స్థాపించాలనే ఆశయంతో పనిచేస్తున్న సంఘ్ పరివార్ మానవ వనరులను అభివృద్ధి పరిచే యూనివర్సిటీలనే టార్గెట్ చేసేయి. 
 
కులాధిపత్యం కోసం మతాన్ని అడ్డం పెట్టుకుని యూనివర్సిటీలలో దళిత, బహుజనుల తో పోటీ పడలేక / ఓర్వలేక విద్యావంతులు సైతం మత తత్వాన్ని మోస్తూ సమాజన్ని అస్థిరపరిచే పక్రియ లో బాగం అవుతున్నారు. 
 
ఢిల్లీ విశ్వవిద్యాలయం వెబ్సైట్ ప్రకారం ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకాలను 2010 -12 నుండి సిలబస్ లో పొందుపరిచారు. 2019 అకడమిక్ కోసం 30 మంది గల సభ్యుల బృందం కంచ ఐలయ్య పుస్తకాల మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 
 
అయితే ఈ చర్యలను యూనివర్సిటీ లోని సావిత్రి, డా అంబేడ్కర్ పెరియార్ ఫెమినిస్ట్  చైర్ విద్యార్థులు తప్పుబడుతున్నారు. 
 
విద్యార్థి జీవితం సమాజంలోని అన్నీ సిద్ధాంతాల మీద చర్చ చెయ్యడం ద్వారా వారిలో నైపుణ్యం , మానవ అభివృద్ధి అంశాల పట్ల సరైన దృక్పధంతో ఉంటారని , ఇలా ఏకపక్షంగా తమకి నచ్చని వాటిని తొలగించడం సరికాదు. 
 
అయితే స్టాండింగ్ కమిటీ చేసిన చూచనలు 20 మంది సభ్యులు గల జ్యురీ ఆమోదించాల్సి ఉంది. 
 
దళిత -బహుజన తత్వాన్ని బిజెపి ప్రభుత్వం నిర్ములించాలని చేసే ప్రయత్నం మానుకోవాలి. ఆలా చెయ్యడం అంటే అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని అడ్డుకోవడం లాంటిదే!
 
 
 
 
  
 
(Visited 90 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!