ఫైల్యూర్ ఆఫ్ ఇండియన్ మెరిట్!

షేర్ చెయ్యండి
  • 3
    Shares

ఇండియా కి స్వాతంత్రం  వచ్చి  ఏడు దశాబ్దాలు అయ్యింది. 1947 ఆగుస్ట్ 14 న బ్రిటీష్ వారు మన దేశాన్ని వదిలి వేల్లబోతున్నప్పుడు “అనేక సంవత్సరాల క్రితం మన లక్ష్యాన్ని గుర్తించుకున్నాం.మన వాగ్దనాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది” అని ప్రకటించారు జవహర్ లాల్ నెహ్రు. పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని, అసమానతలను అంతమొందించాల్సిన గురుతర బాద్యత మనముందున్నది అని ఆయన గుర్తు చేసేరు.

ఇండియా మొదటి ప్రదాని నెహ్రు ఉద్దేశించిన మహత్తర లక్ష్యం నెరవేరలేదని గుర్తించడం అంత పెద్ద కష్టం కాదు. అయితే నేటికీ 1947 నాటి స్తితినే ఉందని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. కాకపొతే ఆనాటి తో పోలిస్తే ఇప్పుడు కాస్త బెటర్. ఎందుకంటె మనకి బెంగాల్ కరువు లాంటివి స్వాతంత్ర్యం తరవాత కనిపించడం లేదు. ఆఫ్రికా దేశాలతో పోలిస్తే మనం చాల ముందు ఉన్నాం. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 70 సంవత్సరాల లో ఇండియా కంటే వెనకబడిన దేశాలు నేడు మనకంటే ఎన్నో రెట్లు అభివృద్ధి సాధించాయి.

మిగతా  దేశాల ఆర్ధిక అభివృద్దికి మన దేశం ఆర్ధిక అభివృద్దికి పెద్ద తేడా ఏంటంటే, ఆర్ధిక విధానాలు దాదాపుగా ఒకే విధంగా ఉన్నా , ఇండియా కి వచ్చేసరికి సాంఘిక విధానం లో అడ్డు గోడ ‘కులం’ ఉంది

ఇండియన్ మెరిట్ ఎవరు?

ప్రపంచంలో ఎక్కడా లేని ఒక విధానం ఇండియాలో మాత్రమే కనిపించే కులం ప్రజలను ఐదు బాగాలుగా వర్గీకరించి కొందరిని అంటరాని వారుగా చేసి, ఏ హక్కులు లేని అమెరికన్ బానిసలు కంటే ఘోరంగా చూసింది. వందల సంవత్సరాల చరిత్రలో ఒక సాంఘిక విప్లవకారుడు బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ పోరాటం వలన అంటారని ప్రజల అభివృద్ధి కోసం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టేరు. ఈ ప్రత్యెక కోటా వలన మాకు నష్టం కలుగుతుంది, మా ఉద్యోగాలు పోతున్నాయి, రిజర్వేషన్లు కాదు ప్రతిభ మీద దేశం అభివృద్ధి చెందాలని ఒక వర్గం ప్రజలు 1932 పూనా ఒప్పందం నుండి రిజర్వేషన్లు పొందుతున్న కులాలను విమర్శ చేస్తున్నారు. ఆ విమర్శ చేసే వారే మెరిట్ ప్రజలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇంకా అభివృద్ధి చెందిన శూద్ర కులాలు రెడ్డి , కమ్మ లాంటి వారు.

Also read  దళితుల అభివృద్ది బాద్యత ఎవరిది?

మెరిట్ ప్రజలు ఎలా విఫలం చెందేరు?

ఇండియా కి స్వాతంత్రం వచ్చిన తరువాత అత్యధిక శాతం దేశాన్ని పాలించింది బ్రాహ్మణులు, ఇండియా లో పనిచేస్తున్న బ్యురోకసీ, అడ్మిన్స్ట్రేషన్ నేటికీ బ్రాహ్మణులు. బారత దేశంలో వ్యాపారస్తులు అత్యధిక శాతం వైశ్య కులం. ఇక జుడిషియల్ మరియు మీడియా రంగంలో ఉంది కుడా బ్రహ్మణ మిగతా మెరిట్ క్లాస్ ప్రజలు.

ఈ మెరిట్ ఎక్కడ విఫలం చెందింది?

కాశ్మిర్ సమస్య: బారత దేశం అభివృద్ధి చెందక పోవడానికి కాశ్మీర్ సమస్య ఒక పెద్ద అడ్డంకిగా విశ్లేషకులు చెబుతారు. ఈ కాశ్మీర్ సమస్య కు మూల కారణం ఇండియన్ మెరిట్ ప్రజలే! అదే ఇండియన్ రిజర్వడ్ ప్రజలు బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ కాశ్మీర్ స్వయంప్రతిపత్తి ని తీవ్రంగా వ్యతిరేకించేడు. ఆర్టికల్ 370 అంటే దేశానికి ద్రోహం చెయ్యడం లాంటదని, ఆరోజు బాబాసాహెబ్ మద్దత్తు అడిగిన షేక్ అబ్దుల్లాతో చెబుతారు. కాశ్మీర్ సమస్య కోసం ఇండియా ప్రబుత్వం 2016-17 బడ్జెట్ లో రూ 4,762 కోట్లు ఖర్చు చేసేరు.

కాందహార్ హైజాక్: కాందహార్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 1999 డిసెంబర్ లో లష్కరే –తోయిబా టెర్రరిస్ట్ లు ఇండియన్ ఎరిలేన్స్ విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ కి తరలిస్తారు. 8 రోజులు చర్చలు చేసిన బారత ప్రబుత్వం ముగ్గురు కాశ్మీర్ టెర్రరిస్ట్ లను అప్పగించడానికి అంగీకరిస్తుంది. వీరిలో అత్యంత ప్రమాదికారి మౌలానా మసూద్ అజార్ కుడా ఉన్నాడు. సాక్షాత్ ఇండియా హోం మంత్రి ఆ ముగ్గురిని దగ్గర ఉండి కాందహార్ వెళ్లి క్షేంగా అప్పగిస్తారు. ఇది ఇప్పటి వరకూ అత్యంత ఘోరమైన సంఘటన గా పాలకులు చేసిన అతి పెద్ద శుద్ధ తప్పు. అనాటి హోం శాక మంత్రి, ప్రదాని ఇద్దరూ మెరిట్ ప్రజలే.

Also read  రాజ్యాంగం: భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ డా. అంబేడ్కర్!

స్కాం ఇండియా: తెల్ల దొరలు దేశాన్ని వదిలి వేల్లెరో లేదో బారత మెరిట్ ప్రజలు దేశాన్ని దోచు కోవడం మొదలు పెట్టేరు. 1947లోనే INA treasure chest disappearance. 1948 జీప్ స్కాం, 1951 లో సైకిల్ స్కాం, శవ పేటికల స్కాం, బ్యాంకుల కుంబకోణాలు, స్టాక్ మార్కెట్ స్కాం లు, చిట్ ఫండ్ స్కాం నిన్న మొన్నటి విజయ్ మాల్య, నీరవ్ మోడీ  తదితర స్కాం లలో దేశ ఆర్ధిక వ్యవస్తను దెబ్బతీసింది సో కాల్డ్ మెరిట్ ప్రజలే.

ప్రాంతీయ తత్త్వం: ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అయిన ఇండియా లో ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గటానికి బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ హైదరాబాద్ ని దేశానికి రెండో రాజధాని గా చెయ్యాలని 1950 లోనే  తన “Thoughts of Linguistic state”   అనే గ్రంధంలో పేర్కొన్నారు. ప్రస్తుతం బారత దేశం నిండా ప్రాంతాల మధ్య అసమానతలకి కారణం పాలకులే. ఈ మధ్య తరుచుగా దక్షణాది రాష్ట్రాల ప్రజలు ద్రవిడ నాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముక్య మంత్రి కుడా ఉత్తరాది పాలకులు దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు అని ప్రకటించేడు.

అవినీతి: దేశంలో అవినీతి పేరుకుపోయింది. అడుగడుగునా అవినీతి స్విస్ బ్యాంకుల్లో మన దేశస్తుల అకౌంట్లు ఎక్కువ? అవినీతి పేరు వాడుకుని పాలకులు అయిన అరవింద్ కేజ్రివాల్ , మోడీ ఒక్కశాతం కుడా అవినీతి ని అరికట్ట లేకపోయేరు. వీరు కుడా మెరిట్ కమ్యునిటీ కి సంభందించిన వారే అందుకే స్విస్ బ్యాంకుల్లో నల్లదనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతా లో రూ 15 లక్షలు వేస్తాను అన్న మోడీ ఈ నాలుగు సంవత్సరాల లో ఏమీ చెయ్యలేదు. ఎందుకంటె ఆ అవినీతి తిమింగలాలు మెరిట్ ప్రజలే. దేశ ఆర్ధిక వ్యవస్తను నాశనం చేస్తుంది ఆ అవినీతి మెరిట్ ప్రజలు.

Also read  పెట్రోలు ధర పెంపు : ముంబై లో పెట్రోలు లీటరు ధర 91 రూపాయిలు

విద్య: ఇండియా లో విద్య ఒక సామాజిక సేవ, లాభాపేక్ష లేకుండా విద్యను అందించాలి. అందుకే రాజ్యాంగం లో విద్య ను ప్రాధమిక హక్కుగా చేసేరు. కానీ మన మెరిట్ ప్రజలు కార్పోరేట్ విద్య అంటూ లక్షల్లో ఫీజులు వసూళ్ళు చేస్తూ అనైతిక వ్యాపారం చేస్తూ విద్య ని మరిచిపోతున్నారు.

ఇలా చెప్పుకుంటూ పొతే బారత దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం గా అక్కడే ఉండి పోవడానికి మెరిట్ పేరుతొ దేశ ద్రోహానికి పాల్పడుతున్న మెరిట్ ప్రజల చిట్టా పేజీ లు పేజీ లు రాసుకోవచ్చు.

వ్యాపారంలో సరళీకరణ పేరుతొ దేశాన్ని ప్రపంచ దేశాలకు అమ్ముకుంటూ అదే అభివ్రుద్దని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు నేటి మెరిట్ పాలకులు.

రిజర్వేషన్స్ మరియు మెరిట్ ఈ రెండిటికీ కారణం మెరిట్ ప్రజలే సమాజంలో కుల వ్యవస్తను నిర్మించి వేలాది సంవత్సరాలుగా దేశాన్ని దోచుకుంటుంది మెరిట్ ప్రజలు. ఆనాడు నెహ్రు ఊహాత్మకంగా చెప్పిన “అణిచివేత తొలగింపు” నేటికీ చేస్తున్న మెరిట్ ప్రజలు , పాలకుల ప్రదాన లోపం.

ఇన్ని అసమానతలకి కారణం అయిన మెరిట్ పాలన , ప్రజలు ఇకనైనా ఆ మెరిట్ బావాన్ని తొలగించుకుని ప్రజల మధ్య స్వేఛ్చ , సమానత్వం, సౌభ్రాతత్వం అలవరచు కోవాలని ఆశిద్దాం. అదే ఈ దేశానికి రక్షణ.      

(Visited 144 times, 1 visits today)

One thought on “ఫైల్యూర్ ఆఫ్ ఇండియన్ మెరిట్!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!