బలవంతపు దళిత గోవిందాలు ఆపండి!

షేర్ చెయ్యండి

బ్రాహ్మణత్వం హిందూమతం బారిన పాయిజన్. మీరు బ్రాహ్మణవాదాన్ని చంపేస్తే హిందూ మతాన్ని రక్షించడంలో మీరు విజయవంతం అవుతారు.  బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, కుల నిర్మూలన

2018 ఏప్రిల్ 17 న హైదరాబాదులోని ఒక పూజారి ఒక దళిత వ్యక్తిని అతని భుజాలపై ఒక ఆలయంలోకి తీసుకువచ్చాడు మరియు అతనిని కౌగలించుకున్నాడు. బ్రాహ్మణిక హిందూ  ప్రసార మాధ్యమాలు భారీ వార్తలను చేశాయి, కానీ దళితులు నిజంగా దేవాలయాలకు వెళ్ళాలనుకుంటున్నారా? బ్రాహ్మణ దేవాలయాలను సందర్శించడానికి దళితులు ఏమైనా చేస్తారా? టెంపుల్ ఎంట్రీ మాకు సమానం కాదు, బాబాసాహెబ్  డాక్టర్ అంబేడ్కర్ అన్నారు.

దళితులు మేల్కొని, ఆలయాలకు వెళ్లడం మానుకుని, బ్రాహ్మణులకు విరాళం నిలిపివేసినప్పుడు, ఈ బ్రాహ్మణులు బలవంతంగా దళితులను ఆలయ ప్రవేశం కల్పిస్తారు. తమ భుజాలపై మోయటానికి కుడా సిద్దపడతారు. దళిత గోవిందం నిర్వహిస్తారు. అయితే ఇటువంటి చౌకైన వ్యూహాలు ఇకపై పనిచేయవు, దళితులు ఇప్పటికే చాల నష్ట పోయేరు. దళితులు బాబాసాహెబ్ యొక్క మార్గంలో ఉన్నారు.

దళితులు హిందూ  దేవాలయాలకు వెళ్లడం వలన దళితుల సమస్యలు  ఏమాత్రం పరిష్కరించబడవు , బిజెపి, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, వివిధ ఇతర హిందూత్వ సంస్థలు మనపై తమ కార్యకలాపాలకు నిధులను సమకూర్చేందుకు మనమే వారికి  డబ్బును దక్షిణ రూపంలో, హుండీ లలో వేస్తున్నాం. ఇది ఏ మాత్రం హర్షణీయమైన చర్య కాదు.

నాసిక్ లోని  కలారం దేవాలయంలోనికి  ఆలయ ప్రవేశం కోసం డాక్టర్ అంబేద్కర్ నిర్వహించిన సత్యాగ్రహ ఉద్యమం దళితులను హిందూ మతంలో బాగం చెయ్యడం కోసం కాదు. అది ఒక మానవ హక్కుల ఉద్యమం గా చూడాలి.

దళితులు ఏ పబ్లిక్ ప్రదేశంకి అయినా స్వేచ్చగా వెళ్ళే హక్కు ఉండాలి అని బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ ఉద్యమం చేసేరు అంతే కానీ గుడుల్లోకి వెళ్లి అక్కడ వారి సంపాదన చందాలు, దక్షిణ రూపంలో ఇవ్వడానికి ఏమాత్రం కాదు.

Also read  ధర్మో రక్షిత; రక్షతః - ఒక అనైతికం

సంవత్సరానికి ఒక్కసారి దళిత గోవిందాలు నిర్వహిస్తునో లేదా ఒక దళితుడిని ఆలయ పూజారిగా నియమిస్తేనో లేదా బుజాల మీద మోస్తేనో హిందూ మతం వివక్ష నుండి దళితులకు విముక్తి లభించదు. గార్భ నృత్యం చుసేడనో, గుర్రం మీద తిరిగేడనో , మీసం పెంచుకున్నాడనో దళితులను కులం పేరు చెప్పి చంపుతున్నారు. ఏడాది పొడవునా కుల పరంగా వివక్ష పాటిస్తూ అమావాస్య, పౌర్ణమి కి దళితుడు గుర్తు వస్తే సమాజంలో ఎలాంటి మార్పు రాదు.  

హిందువులు కానీ లేదా ఫ్యూడల్ కులాలు కానీ  సమాజంలో కుల నిర్మూలన, అంటారనితనం లేదా సమ సమాజం స్తాపించాలి అనుకుంటే  లేదా మార్పును చూడాలనుకుంటే వారు తమ స్వంత వర్గాల్లో కుల నిర్మూలన దిశగా  పనిచేయాలి, కుల వాస్తవాల గురించి వారికి అవగాహన కల్పించాలి మరియు కుల వ్యవస్థను పాటించకుండా వారిని ఎడ్యుకేట్ చెయ్యాలి.కులాంతర వివాహాలు ప్రోస్తహించాలి.  

బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ అన్నట్లు, దళితుల్లో వెలుగులను ప్రసరింప చెయ్యాలి అంటే బ్రాహ్మణత్వాన్ని వారి యొక్క మనుస్మృతి ని సో కాల్డ్ అగ్రవర్ణాలు విడనాడాలి.

Also read  దళితులు ఆగమ శాస్త్రానికి అంటరానివారా!

బ్రాహ్మణులు ఆలయ పూజారులు గా 100% రిజర్వేషన్లు అనుబవిస్తున్నారు, విద్యార్హత తో పని లేదు, నిరాక్షరస్యుడు అయినా, అతని కుమారుడు అయినా ఎలాంటి విద్యార్హతలు లేకుండా అయినా ఆలయ పూజారులు గా ఉండవచ్చు. దళితులు కానీ ఇతర కులాలు కానీ ఉన్నత విద్యను చదివినా, సంస్కృతం నేర్చుకున్నా ఆలయ పూజారి గా ఉండటానికి అనర్హుడు. కారణం కులం. బ్రాహ్మణులు వారసత్వంగా తర తరాల నుండి ఒకే ఆలయంలో పూజారులు గా ఉంటారు. అది వారికి వారసత్వ సంపద.  అందుకే బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ అంటారు. “మతాచార్యుడు అర్హతలను బట్టి ఉండాలి కానీ వారసత్వం బట్టి ఉండకూడదు”

హిందూ మతం లో సంస్కరణలు జరగకుండా దళితులను తమ బుజాల మీద తెసుకేల్లడం ఒక అసహజ క్రియగా మాత్రమే దళితులు బావిస్తారు. అది కంటితుడుపు చర్యగా బావిస్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దైవ దర్శనం కి వెళ్లి వచ్చిన తర్వాత ఆ ఆలయం శుద్ధి చేసిన సంఘటన మనం బీహార్ లో చూసేము. ఈ ఆటవీక చర్యను హిందువులు –బ్రాహ్మణులు ముక్త ఖంటం తో ఖండించ లేకపోయేరు. హిందూ మత పెద్దలు అయిన పీటాది పతులు, మటాది పతుల నుండి ఎలాంటి సంస్కరణ లు లేకుండా కుల వ్యవస్తను కాపాడు కుంటూ దళితులను హిందూ మతంలో బాగస్వామ్యం చెయ్యాలనుకోవడం ఎండమావులు లాంటిదే!

Also read  మతత్వం: రాజకీయ ప్రేరేపిత మతత్వం మత ఉగ్రవాదానికి కారణమా !

దళితులు చేయగల అత్యుత్తమమైన పని ఏంటంటే హిందూ మతం ఏ రూపాన ఉన్నా దానిని విసర్జించడం.  గుడులు, గోపురాలకు పోరోహిత్య వర్గాలకు డబ్బులు ఇవ్వడం మానుకోవాలి.

అదే డబ్బు దళితులు మరియు మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా ఉపయోగించినప్పుడు బ్రాహ్మణిక దేవాలయాలలో దానం చేస్తున్నవారికి నేను కోపంగా ఉన్నాను.

(Visited 136 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!