బహుజన రాజకీయం; నూతన వరవడిని సృష్టించబోతున్న బహుజనులు!

షేర్ చెయ్యండి
  • 239
    Shares

బహుజన రాజకీయం వలన  పరిణామం ఎలా ఉంటుందో తెలియదుగానీ తెలంగాణ ఎన్నికలు ఎస్సి / ఎస్టీ మరియు బిసి సామాజిక వర్గాలలో రాజకీయ ఆలోచనా విధానం లో వచ్చిన మార్పు ఈ వర్గాల భవిషత్ ని మలుపు తిప్పుతుందని అంచనా వేయవచ్చు.

 
దళిత వర్గాలకు బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ అందించిన “స్వేచ్ఛ” అనే నిప్పుకణం ఇంకా ఆరిపోలేదని నమ్మకం కుదిరింది. బహుజన వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. తలెత్తుకుని నడవగలిగే ప్రయత్నంలో ప్రాణం పోయినా పర్వాలేదు అనే తెగింపులో నేటి ఎస్సి లను చూస్తుంటే  ఎస్సి లకు కనీసం మట్టి గోడలు కూడా లేని రోజుల్లో ‘మీ గోడల మీద రాసుకోండి … మనం ఈ దేశ పాలకులం కాబోతున్నాం’ అని చెప్పిన బాబాసాహెబ్ డా. బి ర్ అంబెడ్కర్ కల లు నిజం కాబోతున్నాయి. 
 
తెలంగాణ ఎన్నికల బరిలో ఎస్సి సామాజిక వర్గానికి చెందిన కాకతీయ యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ సుజాత.సూరేపల్లి , కవి మరియు  రచయిత డా. జిలుకూరి శ్రీనివాస్, వ్యాపారవేత్త , సినీ నిర్మాత బొమ్మకు మురళి, డా . కదిరే కృష్ణ, డా . ఇమ్మడి కిరణ్  మరియు కుల సంఘాల నుండి పశుల  రామమూర్తి మరియు డా. రాజబాబు ఆడిదెల ( గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి )  లాంటి కొత్తతరం వ్యక్తులు స్వచ్ఛందంగా వచ్చి బహుజన పార్టీల లో నిలబడి భూర్జువా పార్టీల గెలుపును ఛాలెంజ్ చేయ్యడం హర్షించదగ్గ పరిణామం. 
 

బహుజన రాజకీయం డా . అంబేడ్కర్ వారసులు!

 
వందల సంవత్సరాల కులతత్వం నుండి స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ వారసులుగా కొత్తతరం యువ నాయకులు, ఉన్నత విద్య చదివిన యువతీ యువకులు ఫ్యూడల్ కులాల పెత్తందారీ తనాన్ని ప్రశ్నిస్తూ ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికల బరిలో ఉన్నారు. 
 
పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బే ప్రధాన ఆయుధం, ఎస్సి ల వద్ద ఖర్చు పెట్టడానికి  ఎన్నికల కమీషన్ అనుమతి ఇచ్చిన కనిష్ట డబ్బు  కూడా లేదు అనేది వాస్తవం. కానీ డబ్బు, మద్యం తోనే ఎన్నికలు గెలవచ్చు అనుకోవడం పొరపాటే అవుతుంది. వ్యక్తిత్వమే ఎస్సిల ప్రదాన ఎన్నికల వనరు. ఆంబేద్కరిజమే మేనిఫెస్టో గా ఎస్సి  అభ్యర్థులు ఎస్సి / ఎస్టీ ఓట్లు మావే అనుకునే ఫ్యూడల్ కుల పార్టీలకు గట్టి సమాధానం చెప్పబోతున్నారు. 
 
గ్రామాల్లో పెత్తందారుల మీద ఆదారపడి జీవించడం తగ్గిపోయింది, భయం పోయింది. స్వేచ్ఛను ఒక్కసారి అనుభవిస్తే అది పునర్జన్మ లాంటిదే. ఎస్సి ల లో కొత్త ఉత్సహం వచ్చింది. నడకలో , చూపుల్లో ఆత్మవిశ్వాసం, ధిక్కారం కనిపిస్తుంది. బ్రాహ్మణిజం యొక్క కుల వ్యవస్థ కుట్రల నుండి సార్వభౌమాధికారం కోసం నేడు ఎస్సి లు పోటీపడుతున్నారు. 
 

బహుజనుల ఓటింగ్ సరళి లో  మార్పు వస్తుందా?

 
ఎన్నికల బరిలోకి దిగిన బహుజన నాయకులు గెలుస్తారా? మనకెందుకొచ్చింది ఈ ఎన్నికలు అనుకుంటుంటే “చెంచాల కి పురుడు పోస్తుంది నువ్వే” అని తెలుసుకోవాలి. “గెలవడం సందేహమే కావొచ్చు … కానీ స్వేచ్ఛ మాత్రం అనివార్యం”  బహుజనులారా ఒక్కసారి స్వేచ్చ అనే గాలిని గట్టిగా పీల్చుకుని వదలండి, చావుకైనా సిద్ధపడతారు కానీ స్వేచ్ఛను వదులుకోరు. బహుజనులు స్వేచ్ఛగా జీవించాలంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం కావాలి. హక్కులు ఆడుకుంటే రావు, పోరాడాలి. అందుకే బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ “బోధించు, పోరాడు, సమీకరించు” అనే మూడు ఆయుధాల శక్తిని మనకి ఇచ్చివెళ్లేరు. 
 
చరిత్రను ఒక్కసారి గమనిస్తే మనువాదులు ఎప్పుడూ తమ ఎత్తుగడలను మారుస్తూ వస్తారు. అవసరం అయితే మన మధ్యలో , మనవాడి గా వస్తాడు, మనతో ఉంటాడు, మన అన్నం తింటాడు, మన బాష మాటాడతాడు, కానీ వాడి కర్తవ్యం మాత్రం మర్చిపోడు. 
 
మనువాదులు బహుజనుల వాడల్లోకి ఇప్పుడు మతం అనే ఎత్తుగడతో వస్తున్నారు. కుల వ్యవస్థ ద్వారా బ్రాహ్మణిజం ఎక్కువరోజులు మనుగడ సాధించలేదని అది చావుకు దగ్గరలో ఉందని గ్రహించి మతం ముసుగు లో చాప క్రింద నీరులా మన ఇంటిలోకి ప్రవేశిస్తున్నారు. 
 
బహుజనులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ‘మతమనేది నేరగాళ్లు తొడుక్కునే ముసుగు మాత్రమేనని నిర్వింధ్వంగా చెప్పవచ్చు. అమానుషత్వానికీ, పాశావితకు మారుపేరు మతం. మతం పేరుతొ ఎన్ని ఘోరాలైన చెయ్యవచ్చు, ఎన్ని పాపలు చేసినా క్షమిస్తుంది. అసలు అవి పాపాలే కావు , అన్యమతస్తులను  చంపే హక్కు మనకి మతం ఇస్తుందని చెబుతుంది.  మనువాదం మతం చాటున చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. హిందూ మతం అంటే కుల వ్యవస్థకు పుట్టుక. అలాంటి కుల వ్యవస్థకు మద్దతుగా బహుజనులు ఓటు వేస్తారా? బానిసలుగా ఉండాలని కోరుకుంటారా ! ఆలోచించండి. 
 
బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ ఏమంటారు అంటే ” మాట్లాడాల్సిన చోట మాట్లాడమన్నారు… మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉండమన్నారు” 
 
బహుజనులుగా ఇప్పుడు మాట్లాడే అవకాశం వచ్చింది. బహుజన రాజకీయం చెయ్యాలి. అంబేద్కరిస్టు లను గెలిపించాలి, దళిత – బహుజనులను గెలిపించాలి. మాట్లాడండి ప్రతి చోట. భూర్జువ కుల పార్టీలు, మతత్వ పార్టీల ఆగడాల వలన సమాజం ఎంత నష్టపోతుందో మాట్లాడండి, దేశం లో అవినీతి పరులు, దేశం ఎందుకు విడిచి పోతున్నారో మాట్లాడండి, లీటరు మంచి నీరు కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో ఇంటి ఇంటికి తిరిగి మాట్లాడండి. సామ్రాట్ అశోకుడి రాజ్యం గురించి చెప్పండి , అంబేడ్కర్ వారసులు సామ్రాట్ అశోకుడి పాలన తీసుకు వస్తారని చెప్పండి 
 
తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో  బహుజన నాయకులను గెలిపించండి 
 
ప్రొఫెసర్ సుజాత. సూరేపల్లి 
డా. కదిరే కృష్ణ 
డా. జిలుకూరి శ్రీనివాస్ 
బొమ్మకు మురళి 
దున్న. అంబేడ్కర్ 
పశుల రామమూర్తి 
డా. ఇమ్మడి. కిరణ్ 
 
మరియు ఆంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న డా. రాజబాబు అడిదెల కు మద్దత్తు తెలిపి గెలిపించండి. 
ఎంత చదువుకుంటే అంత చెంచా గిరి చేసే రోజులు పోయాయి. ఎంత ఆత్మగౌరవ పోరాటం చేస్తే అంత స్వేచ్ఛ లభిస్తుంది. అంత రాజ్యాధికారం వస్తుంది. 
 
 
     
 
 
     
(Visited 290 times, 1 visits today)
Also read  సెక్షన్ 49 పి; సర్కార్ సినిమా చెప్పిన ఓటు హక్కు గురించి మీకు తెలుసా!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!