‘బారతరత్న’ బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్

షేర్ చెయ్యండి

జీవిత చరిత్ర-1

యుగానికి ఒక్కడు.ప్రతి యుగంలో ఒక యుగ పురుషుడు జన్మిస్తాడు ఈ యుగం లో కూడా అలాంటి ఒక మహోన్నత వ్యక్తి జన్మించేరు. భారత దేశం లో మూడువేల సంవత్సరాలు గా కులం పేరుతొ, అత్యంత హేయమైన జీవితం అనుభవిస్తున్న ప్రజలను రక్షించటానికి అవతరించిన అవతార పురుషుడు. విముక్తి ప్రదాత. తన ప్రజల చేత బాబాసాహెబ్ అని కీర్తించబడుతున్న డా. భీమ్ రావ్ అంబేడ్కర్.మధ్య ప్రదేశ్ లోని మావూ గ్రామంలో 1891 ఏప్రిల్ 14 న సుబేదార్ రాంజీ , భీమాబాయి దంపతుల కు 14 వ సంతానంగా జన్మించేరు.

విద్యా సంపన్నుడు – బాబాసాహెబ్ డా బి ర్ అంబెడ్కర్ గారు.

భారత దేశం లో సమాజాన్ని కులాల వారిగా విభజించేరు. కొందరిని అగ్రవర్ణాలు అని, మరి కొందరిని అంటరాని వారిగా విభజన చేసేరు. భీంరావ్ రాంజీ అంబెడ్కర్ మహర్ కులం లో జన్మించేరు. అంటారని కులం లో జన్మించిన భీంరావ్ పాఠశాల నుండే వివక్షను ఎదుర్కొన్నారు. తెలివిగల అంబెడ్కర్ గారు బాల్యం నుండే మనో దైర్యం తో సమస్యలను ఎదుర్కొంటూ అందరి అంచనాలు పటాపంచెలు చేసేవారు. 1897 లో బాబాసాహెబ్ కుటుంబము బొంబాయి కి మారటము చారిత్రిక ఘట్టానికి పునాదిగా పేర్కొనవచ్చు. బొంబాయి లోని ఎలిఫెంస్టోన్ హై స్కూల్ లో మొట్ట మొదట ఒక అంటరాని కులానికి చెందిన విద్యార్థికి ప్రవేశం కల్పించటం అదీ అంబేద్కర్ గారు కావటం ఒక చరిత్ర.

1907 లో మెట్రికులేషన్ పూర్తి చేసిన అంబెడ్కర్ 1908 లో ఎలిఫెంస్టోన్ కాలేజి లో డిగ్రీ లో చేరటం కూడా ఒక చరిత్ర. ఒక అంటారని కులస్తుడు విశ్వవిద్యాలయం స్థాయికి చేరటం అదే మొదటసారి. 1912 లో అంబెడ్కర్ గారు ఎకనామిక్స్ మరియు రాజనీతి శాస్త్రం లో పట్టబద్రులు అయ్యేరు.

డిగ్రీ తర్వాత బరోడా మహరాజ్ సంస్థానం లో ఉద్యోగం లో చేరిన అంబేడ్కర్ గారికి మహారాజ వారి స్కాలర్షిప్ లభించటం తో ఉన్నత విద్యకోసం 1913 సంవత్సరం అమెరికా లోని కొలంబియా విశ్వవిద్యాలయం లో పోస్ట్ గ్రాడ్యేట్ లో ప్రవేశించి 1915 లో ఎకనామిక్స్ ప్రధాన సబ్జెక్ట్ గా MA పూర్తి చేసేరు. ఆ తర్వాత రెండు సంవత్సరాల సమయం లో ఎకనామిక్స్ లో phd పూర్తి చేసేరు.

Also read  Annihilation of caste - A visionary document to build modern India!

1916 లో బార్ కౌన్సిల్ లో తన పేరు నమోదుచేసుకున్న అంబేడ్కర్ గారు బరోడా మహరాజ్ స్కాలర్షిప్ రద్దు అవటంతో భారత దేశానికి తిరిగి వచ్చేరు.

బాబాసాహెబ్ చదువులు – ప్రత్యేకతలు

మెట్రికులేషన్ -1908
B.A – (Politics and Economics) Bombay University in 1912 – అంటబడని కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్
M.A – (Economics – For his thesis ‘Ancient Indian Commerce’) in America in 1915.
Ph.d – (Economics – For his thesis ‘The evolution of provincial finance in British India’) in Columbia University, America in 1917. – ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్టమొదటి డాక్టరేట్.
D.Sc – (Thesis – ‘Problem of the Rupee – Its origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు
M.Sc – (Economics – For his thesis ‘Provincial Decentralisation of Imperial Finance in British India’) London. – ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్
Bar-At-Law – Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది
Political Economics – Germany.
LLD – (Honoris) Columbia University, New York, For his achievements of leadership and authoring the Constitution of India.
D.Litt – (Honoris) Osmania University, Hyderabad, For his achievements, Leadership and writing the constitution of India.
బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 20000 పుస్తకాలు సేకరించారు., అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6000 పుస్తకాలు పోగొట్టుకున్నారు., ఆ సమయంలో బాబాసాహెబ్ చాలా బాధ పడ్డారు.

Also read  దళితులు మాత్రమే ఎందుకు అణిచివేతకు గురిఅవుతున్నారు?

తెలిసిన బాషలు -9 భాషల్లో బాబాసాహబ్ పూర్తి ప్రావిన్యత కలిగి ఉన్నారు.

మరాఠీ,హిందీ,ఇంగ్లీషు,గుజరాతీ,పాళీ (- పాళీ వ్యాకరణం మరియు నిఘంటువు కూడా రాసారు ),సంస్కృతం,జర్మన్,పార్శీ,ఫ్రెంచ్.

బాబాసాహెబ్ స్థాపించిన ఉద్యమ సంస్థలు.

1. బహిషృిత హితకారిణి సభ :- జులై 20, 1924
2. సమత సైనిక్ దళ్ :- మార్చి 13, 1927

బాబాసాహెబ్ స్థాపించిన రాజకీయ సంస్థలు

1. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ILP)– ఆగస్టు 16, 1936
2. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (SCF)– జులై 19, 1942 ( ILP నే SCF గా మార్చారు)
3. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) – అక్టోబరు 3, 1957 (బాబాసాహెబ్ అనారోగ్యం కారణంగా ఆయన తదనంతరం నెలకొల్పబడింది)

బాబాసాహెబ్ స్థాపించిన విధ్యా సంస్థలు

1. డిప్రెస్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ — జూన్ 14, 1928
2. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ — జూలై 08, 1945
3. సిద్ధార్థ్ కాలేజి, ముంబై — జూన్ 20, 1946
4. మిళింద్ కాలేజీ, ఔరంగాబాద్ — జూన్ 01, 1950

బాబాసాహెబ్ స్థాపించిన ధార్మిక సంస్థ.

1. బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా — మే 4, 1955

బాబాసాహెబ్ నాయకత్వం వహించిన కొన్ని ముఖ్య ఉద్యమాలు 

మహద్ చెరువు ఉద్యమం -20/3/1927
మొహాళీ (ఘులేల)తిరుగుబాటు -12/2/1939
అంబాదేవీ మందిరం ఆందోళన -26/7/1927
పూణే కౌన్సిల్ ఉద్యమం – 4/6/1946
పర్వతీ ఆలయ ఉద్యమం -22/9/1929
నాగపూర్ ఆందోళన – 3/9/1946
కాలారామ్ ఆలయ ఆందోళన -2/3/1930
లక్నౌ ఉద్యమం – 2/3/1947
ముఖేడ్ ఉద్యమం -23/9/1931

Also read  మహిళా అబ్యుదయవాది బాబాసాహెబ్ డా. అంబేడ్కర్!

బాబాసాహెబ్ స్థాపించిన పత్రికలు.

మూక్ నాయక్ – జనవరి 31, 1920
బహిషృిత భారత్ – ఏప్రిల్ 3, 1927
సమత – జూన్ 29, 1928
జనత – నవంబరు 24, 1930
ప్రభుద్ధ భారత్ – ఫిబ్రవరి 4, 1956

 బాబాసాహెబ్ ప్రత్యేకతలు – దక్కిన గౌరవాలు.

బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు., ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే..
లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్
ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజా నాయకుడు బాబాసాహెబ్
ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు
లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ Phd ని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి
తన ప్రమేయం లేదు కాబట్టి హిందూమతంలో పుట్టాను గానీ హిందూమతంలో మాత్రం చావను అని ఆయన బౌద్ధం తీసుకుంటే, మరో ఆలోచన లేకుండా 5లక్షల మంది బౌద్ధం తీసుకున్నారు.. ఇంతటి అభిమానం ఇంకే నాయకుడు పొంది ఉండడు.

అరుదైన గౌరవాలు 
భారత రత్న – ఇంత ప్రపంచ మేధావికి స్వతంత్ర్యం వచ్చిన 43 ఏళ్ళకు గానీ గుర్తించలేకపోయింది కులం రోగంతో కొట్టుకుంటున్న భారత ప్రభుత్వం
కొలంబియా యూనివర్సిటీ ప్రకారం – ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన నాయకుడు
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం విశ్వంలోనే అతిగొప్ప ఉద్యమ నిర్మాత
CNN, IBN, History channel నిర్వహించిన సర్వే ప్రకారం THE GREATEST INDIAN.

బాబాసాహెబ్ డా బి ర్ అంబేద్కర్ డిసెంబెర్ 6,1956 లో మహా నిర్యాణం చెందేరు.

 

(Visited 33 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!