ఆధిపత్యం కోసమే బారత రాజ్యాంగం ను తగలబడుతున్న హిందూ సంఘాలు!

షేర్ చెయ్యండి
  • 41
    Shares

బారత రాజ్యాంగం చట్ట నిర్మాణంలో మన ప్రాచీన హైందవ సాంప్రదాయాల నేమాత్రము అనుకరించలేదన్న విమర్శకుడా ఎక్కువగా వినిపిస్తుంది. ఈ విధంగా వినిపించే వాళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు కూడా ఇష్టం లేదు. వాటి స్థానంలో ప్రాచీన హైందవ సాంప్రదాయ పద్ధతిలో గ్రామ పంచాయితీలు, జిల్లా పంచాయితీలు ఏర్పాటు చేయాలని వీరు వాదిస్తున్నారు. ఒక హద్దంటూ లేని వీరి సనాతన మనస్తత్వం చాలా విచారకరమైనది అని మాత్రమే నేను చెప్పదలచుకున్నాను” బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్

1948, నవంబర్ 4 వ తేదీన రాజ్యాంగ సభలో డా బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన ఈ ఉపన్యాసం తో పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టుగా ఉన్న బ్రాహ్మణులు ఆనాటి నుండి అదుముకోసం చూస్తూనే ఉన్నారు.

రాజ్యాంగం అంటే సమాజం మీద వ్యక్తుల లేదా కులాల లేదా మతాల ఆధిపత్యం తగ్గించడమే. రాజ్యాంగం అమలు లోకి వచ్చిన నాటి నుండి ఈ సమాజం మీద అప్పటి వరకూ ఉన్న బ్రాహ్మణ మత ఆధిపత్యం ఒక్కసారిగా దిక్కులేకుండా పోయింది. కాబట్టి ఘోరీకాడ నక్కలా కాచుకు కూర్చున్న బ్రాహ్మణులు , బనియా , పార్సీ తదితర ఆధిపత్య కులాలు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చెయ్యాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.

ఆర్ ఎస్ ఎస్ బారత రాజ్యాంగం కు వ్యతిరేకమా? 
ABVP
Credits: Google source. Hindutva outfits burning constitution

బారత రాజ్యాంగానికి మొదటి నుండి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాజ్యాధికారంతోనే భీంస్మృతి (బాబాసాహెబ్ రాసిన బారత రాజ్యాంగం) ని నిర్ములించగలం అని తలచి జన సంఘ్ గా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ గా ఆవిర్భవించి పార్లమెంట్ సాక్షిగా భీం స్మృతిని తగలబెడతాం అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. సుదీర్ఘ ప్రయత్నం లో చాప క్రింద నీరులా సమాజంలో ప్రవేశించిన సంఘ్ మొదట వాజిపాయ్ ద్వారా రాజ్యాంగాన్ని సమీక్షించాలని ప్రయత్నం చేసేరు.

Also read  న్నికల కమీషన్: హద్దు దాటిన ప్రచారం మీద ఎన్నికల కమీషన్ కొరడా!

వివిధ సామాజిక పరిణామాల క్రమంలో లౌకిక శక్తులు జాతీయ పార్టీల నుండి బయటకు వచ్చి కులాధారిత ప్రాంతీయ పార్టీలకు జీవం పోసి బారత దేశంలో రాజకీయ అస్థిరత్వానికి కారణం అయ్యేరు. కుల ప్రాంతీయ పార్టీలు వివిధ స్కాముల్లో ఇరుక్కుని తమని తాము కాపాడుకునే క్రమంలో అధికార పార్టీ అడుగులకు మడుగులు వత్తుతూ ఉన్నారు. ఘోరీ కాడ నక్కలా ఉన్న బీజేపీ కి అవకాశాలు కల్పించేరు. ఇదే అదునుగా బ్రాహ్మణులు సమాజం మీద తమ పట్టు సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో బాగమే ‘రాజ్యాంగాన్ని తగల బెట్టడం’

కేంద్రంలో బిజెపి ఇచ్చిన అండ దండలతో హిందూ సాధువులు పీఠాధిపతులు మరియు వివిధ సంఘాలు , వారి తాబేదారులు సమాజం మీద పడి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ హిందూ యేతరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

బారత రాజ్యాంగం ను కాల్చి పడేయాల్సిన అవసరం ఏమిటి?
 
బారత రాజ్యాంగం ప్రపంచంలో కెల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రతి మనిషికీ స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతత్వం కల్పించిన రాజ్యాంగం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పౌరుడికీ జబాబుదారీగా ఉండాలి. అలాంటి రాజ్యాంగాని కొన్ని అతివాద హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. 
 
ఒక వైపు రాజ్యాంగం కలిపిస్తున్న మత స్వేచ్ఛను అనుభవిస్తూ అదే రాజ్యాంగాన్ని తగలబెడతాం మనుస్మృతి ని ప్రవేశపెడతాము అంటున్నారు. అంటే సమాజాన్ని కులాలుగా విడదీసి మిగతా కులాల మీద పెత్తనం చెలాయించటానికే లేదా దోపిడీ చెయ్యటానికి మాత్రమే అని బావించాలి. వర్ణ వ్యవస్థను మళ్ళీ ప్రవేశ పెట్టాలని వీరు రాజ్యాంగాన్ని తగల బెడతాం అంటున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూలదోసి మత రాజ్యాంగాన్ని ప్రవేశ పెట్టి లౌకిక బారత దేశాన్ని మత దేశం గా చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నారు. 
 
సమాజంలో కులాల పేరిట ఏర్పడిన అసమానతలను తొలగించటానికి ఏర్పాటు చేసిన రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ వీరు చేస్తున్న దాష్టికం నీతి రాహిత్యమైనది. కులం పేరిట వేలాది సంవత్సరాల నుండి వీరు చేస్తున్న దగాని రాజ్యాంగం అడ్డుకుంటుందనే వీరు రాజ్యాంగ ప్రతిని తగలబెడుతున్నారా?
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ ఏమి చెప్పేరు?
 
మన రాజ్యాంగం ఆచరణ సాధ్యమైనది. మన రాజ్యాంగం చాలా సున్నితమైనది(flexible) గా కనిపించినా అవసరాన్నిబట్టి అది దుర్బేధ్యం (Rigid ) గా గూడా తయారు గాగలదు. యుద్ధ కాలంలోనూ, శాంతికాలంలోనూ మన రాజ్యాంగం మొక్కబోకుండా నిలిచి పాలిస్తుంది. ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏదైనా విషమ పరిణామాలు వాటిళ్లినట్లైతే దానికి మానవ లోపమేగాని రాజ్యాంగ లోపం కారణం గాజలదని గట్టిగా చెప్పగలను 
 
1950 జనవరి 26 వ తేదీ నుండి బారత దేశం సర్వ తంత్ర స్వతంత్ర ప్రజాస్వామిక రాజ్యంగా అవతరించింది. 
 
రాజకీయాల్లో మతాన్ని ప్రవేశ పెట్టి పాలకుల అసమర్ధతను రాజ్యాంగం మీద వేసి రాజ్యాంగాన్నే విఫలం చెందింది అని ప్రకటించాలనేది  మనువాదుల కుట్రలు. బారత రాజ్యాంగం ను తగలబెట్టడం అంటే ఉన్న ఇంటిని తగలబెట్టుకోవడమే. ఈ చర్యలను ప్రతి పౌరుడు ఖండించాలి, లేదంటే దేశం మరోసారి తన స్వాతంత్య్రాన్ని కోల్పోయే ప్రమాదంలో పడుతుంది. 

 

Also read  సమాజాన్ని విడదీస్తున్న మతోన్మాదం!
(Visited 140 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!