భన్వరీదేవి: లైంగిక హక్కుల చట్టం స్ఫూర్తి ప్రదాత!

షేర్ చెయ్యండి
  • 69
    Shares

భన్వరీదేవి, తాను పెద్ద పెద్ద డిగ్రీలు చదవలేదు, ఉన్నత కుటుంబం లో పుట్టలేదు. ఉన్నత ఉద్యోగస్తురాలు కాదు.  ఒకసాదారణ బహుజన  మహిళ. గ్రామీణ వైద్య శాఖ లో ఆయా గా ఉద్యోగం చేస్తుంది. 


రెండు నెలలు క్రితం దేశంలో గొప్ప, గొప్ప మహిళలు, మహిళా జర్నలిస్ట్ లు , సినిమా నటీమణులు పెద్ద పెద్ద కులానికి చెందిన మహిళలు పనిచేసే చోట లింగ మరియు లైంగిక వివక్ష మీద సామజిక మాధ్యమాలలో మీటూ అంటూ ఉద్యమాలు చేశారు.


దేశ వ్యాప్తంగా మహిళలు చేపట్టిన ఈ మీటూ  ఉద్యమం వలన ఒక మంత్రి తన పదవికి రాజీనామా సమర్పించవల్సి వచ్చింది. 


అయితే ఈ క్రెడిట్ అంతా తాము చేసిన సామాజిక ఉద్యమం వలనే అని భ్రమల్లో ఉన్నారు ఎలైట్ మహిళలు. 27 సంవత్సరాల క్రితం రాజస్థాన్ రాష్ట్రము లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా  చట్టాలు చెయ్యబడ్డాయని బహుశా ఉద్దేశ్యపూర్వకంగా మరచిపోయి ఉంటారు. 


భన్వరీదేవి, ఈ దేశ మహిళలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య లైంగిక వేధింపుల మీద పోరాడిన ఒక సాధారణ  మహిళ. 


భన్వరీదేవి ఎవరు? 


సుప్రీం కోర్టు  పనిచేసే ప్రదేశంలో, ఆఫీస్ ల్లో  కర్మాగారాలలో మరియు మహిళలను లైంగికంగా వేధిస్తే తీసుకోవాల్సిన క్రిమినల్ చర్యలు చట్ట రూపం చేసింది భన్వరీదేవి కేసు ప్రేరణ. 


కానీ భన్వరీదేవి ని రేప్ చేసిన ముద్దాయిలు యథేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారు. ఆమె కేసు గత 27 సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే హైకోర్టు లో విచారణ కు వచ్చింది. 


భన్వరీదేవిని హత్యాచారం  చేసిన వారిలో ఇద్దరు ఈ సుదీర్ఘ విచారణ సమయంలో చనిపోయారు.బహుజన  మహిళ ల పట్ల ఈ దేశ న్యాయస్థానం వివక్ష కనపరుస్తుంది. 
నత్త కూడా సిగ్గుపడే విధంగా సుదీర్ఘ కాలం నుండి సాగుతున్న న్యాయ విచారణ.

సంఘటన జరిగింది 22 సెప్టెంబర్ 1992. ప్రస్తుతం ఆమె వయస్సు 58 సంవత్సరాలు.     జైపూర్ కి 50 కిలోమీటర్లు దూరాన ఉన్న భాతేరి గ్రామంలో భన్వరీదేవి తన భర్త తో కలిసి తమ వ్యవసాయ భూమి లో పని చేస్తూ ఉండగా ఐదుగురు వ్యక్తులు ఆమె భర్తను కర్రలతో కొట్టి భర్త ముందే హత్యాచారం చేశారు. 

Also read  మదుర మీనాక్షి ఆలయంలో దళితులు అడుగుపెట్టినప్పుడు ఏమైందంటే...?

రాజస్థాన్ రాష్టంలో కుమ్మర కులానికి చెందిన భన్వరీదేవిని ఆధిపత్య భూస్వామ్య పీడక కులమైన గుజ్జర్లు హత్యాచారం  చేశారు. 

గుజ్జర్లు తలపెట్టిన బాల్య వివాహాన్ని అడ్డుకున్నదని కక్ష కట్టి ఆమె మీద ఆబాలిక బంధువులు దాడి చేశారు. ఆమె భర్తను కొట్టి అతని ముందే ఆమెను రేప్ చేశారు. 

భన్వరీదేవి ప్రభుత్వ సాంఘిక కార్యక్రమాలను ప్రచారం చేసే ఉద్యోగి. తన గ్రామంలో బాల్య వివాహాలను, వరకట్నం, లింగ వివక్ష తదితర కార్యక్రమాలను ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం కల్పిస్తారు. 

తన మీద గుజ్జర్లు దాడి చేసే ప్రమాదం ఉందని తెలిసి తన పై అధికారులకు తెలియజేసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి వచ్చిన పోలీసు పెళ్లి భోజనం తిని వెళ్ళాడు. 

భన్వరీదేవి చర్యలు వలన తమ పరువు పోయిందని కక్ష గట్టి ఆమె మీద లైంగిక దాడి చేశారు. 

దాడి చేసిన 24 గంటల్లో బాధితురాలకు  వైద్య పరీక్ష చేయించాల్సి ఉండగా స్థానిక అధికారులు 56 గంటలు తర్వాత ఆమెను పరీక్షించారు. 

వార్త పత్రికల్లో ఈ సంఘటన తెలుసుకున్న బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమం చెయ్యడం తో ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. 

సంఘటన జరిగిన సంవత్సరం తరువాత సిబిఐ నిందితులను అరెస్ట్ చేశారు. 

1993 లో రాజస్థాన్  హైకోర్టు నిందితులకు బెయిల్ నిరాకరిస్తూ భన్వరీ దేవిని రేప్ చేసినట్లు కోర్టు నమ్ముతుందని పేర్కొన్నారు. 

అయితే భన్వరీదేవి సంతోషం ఎక్కువ కాలం లేదు. విచారణ సమయంలో ఐదుగురు జడ్జీలను మార్చారు. 

1995 లో నిందితులకు సాధారణ కేసులో శిక్ష విధించినట్లు 9 నెలలు కారాగార శిక్ష విధించింది. ఉద్దేశ్య పూర్వకంగానే కోర్టు రేప్ కేసునుండి తప్పించి కేవలం దాడి చేసినట్లు గా తీర్పు ఇచ్చారు. 

Also read  దళిత రాజకీయ పార్టీ సాధ్యమేనా? తెలంగాణా, ఆంధ్రాలో దళితులు రాజ్యాధికారం సాధించగలరా?

ఈ తీర్పును ఇస్తూ బాధితురాలిపై లైంగిక దాడి జరగలేదంటానికి ఇవే కారణాలు అంటూ కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. 

కోర్టు తీర్పు లోని ముఖ్యమైన అంశాలు. 

గ్రామ పెద్ద రేప్ చెయ్యడు 

వేరు వేరు కులాల వ్యక్తులు కలిసి రేప్ చెయ్యరు. 

60 -70 సంవత్సరాల పెద్ద వారు రేప్ చెయ్యరు. 

కుటుంబ సబ్యుల ముందు ఎవరూ రేప్ చెయ్యరు. 

తక్కువ కులానికి చెందిన మహిళను  అగ్ర వర్ణ  కులం వ్యక్తులు రేప్ చెయ్యరు. 

రేప్ జరుగుతుంటే ఆమె భర్త ఏమి చేస్తున్నట్టు అని కోర్టు వ్యాఖ్యానించింది. 

అసంబద్దంగా చేసిన ఈ వ్యాఖ్యలను ఆనాడు దేశ వ్యాప్తంగా ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సహజ న్యాయ సూత్రానికి వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు ఉన్నట్లు ఆందోళనకు చేశారు. 

మహిళా సంఘాలు, ప్రజా సంఘాల దేశ వ్యాప్త నిరసనకు తలొగ్గిన రాజస్థాన్ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్ళింది. ఆనాటి నుండి ఈ కేసు ఒక్కసారి మాత్రమే విచారణకు వచ్చింది. 

మహిళలపై లైంగిక వేధింపుల  చట్టానికి రూపకల్పన!

ఈ రెండున్నర దశాబ్దాల కాలం లో భన్వరీదేవి కి న్యాయం జరగలేదు కానీ పని చేసే ప్రదేశం లో , లేదా ఉద్యోగ నిర్వహణలో జరిగే లైంగిక వేధింపుల చట్టం కి 1997 లో రూపకల్పన చేశారు. 

భన్వరీదేవి లాంటి ఒక చిరు ఉద్యోగి తన విధి నిర్వహణలో గుజ్జర్ కులానికి చెందిన బాలిక వివాహాన్ని అడ్డుకున్నందుకు ఆమె మీద కక్ష గట్టి లైంగిక దాడి చేశారు. 

చదువురాని భన్వరీదేవి కి హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి సోషల్ మీడియా లో తనకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించలేదు. లేదా ప్రచారం చేసుకోలేదు. 

Also read  పేదరిక నిర్ములనా: కులం నీడలో అభివృద్ధి రాజకీయాలు!

కానీ భన్వరీదేవి తనకు జరిగిన అన్యాం గురించి ధైర్యంగా రోడ్డు మీదకు వచ్చింది. ప్రపంచానికి వివరించింది. 

గ్రామీణ ప్రాంతంలో జరిగే ఏ హత్యాచారం లేదా ఇంటిలో నాలుగు గోడల మధ్య తాతయ్య లు, మామయ్య లు , సోదరులు చేసే లైంగిక దాడిని హ్యాష్ ట్యాగ్ లు పెట్టి ప్రచారం చేసుకునే స్థితిలో ప్రజలు లేరు. 

దాదాపుగా మూడు దశాబ్దాలుగా ఒక మహిళ తన మీద జరిగిన హత్యాచారం కు న్యాయ పోరాటం చెయ్యాల్సి రావడం సిగ్గుచేటు. 

పీడక కులాలు అధికారం తమ చెప్పుచేతల్లో ఉంచుకుని దళిత , బహుజనులకు న్యాయం అందని ద్రాక్ష చేస్తున్నారు. 

ఎన్నికలప్పుడు అన్ని రాగాలు పలికే రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత వారి కులానికి రక్షణ కవచంలా నిలబడుతున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా నూతన ప్రజాస్వామ్య సూత్రాల ద్వారా సామాజిక అంశాలలో మార్పు సాధిస్తుంటే భారత్ లాంటి దేశాల్లో కుల వ్యవస్థ రోజు రోజుకీ వికృత రూపం దాలుస్తుంది. 

భన్వరీదేవి ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆమె రక్షణ కోసం ఊరు విడిచి వెళ్ళలేదు. అదే గ్రామంలో ఉంటూ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. 

ఆమె ఉద్యమ స్ఫూర్తికి, తెగువకు మెచ్చి ఈ మూడు దశాబ్దాల కాలం లో ఎన్నో అవార్డు లు ఇచ్చారు కానీ న్యాయాన్ని ఆమెకు అందించలేక పోయారు. 

ఈ దేశంలో న్యాయం కూడా కులాల ఆధారంగా అచ్చం మను ధర్మం లాగే ప్రవర్తిస్తుంది. 

బహుజన సమాజం హిందూ వ్యవస్థలో భాగం అయినంతకాలం ఈ దేశం లో న్యాయ మూర్తులు తమ లో ఉన్న మనువు ని బయటకు పంపలేరు. 

మనువు మన సమాజంలో ఉన్నంత కాలం బహుజనులకు న్యాయం జరగదు. అందుకే బాబాసాహెబ్ డా అంబేడ్కర్ మను ధర్మాన్ని తగలబెట్టారు. 

(Visited 7 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!