భారతీయట్రైబల్ పార్టి: అస్తిత్వ ఉద్యమం నుండి రాజ్యాధికారం వైపు!

షేర్ చెయ్యండి


భారతీయ ట్రైబల్ పార్టి అనగానే ఆ పార్టి యొక్క విధి విధానాలు దాదాపుగా తెలిసిపోతుంది. రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ పార్టి స్వతంత్రంగా నిలబడుతుంది. ఆదివాసీల కోసం, ఆదివాసీలే ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సొంత పార్టి స్థాపించుకున్నారు. 


గిజనులు ఎక్కువగా ఉన్న స్థానాలు అయిన ఉదయపూర్, జోధాపూర్, బంశ్వర, రాజసమండ్, జలోర్ లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇస్తుంది భారతీయ ట్రైబల్ పార్టి.

 
నడి నెత్తిన సూర్యుడు భగ భగా 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత లో కూడా ఎలాంటి అలసట లేకుండా తమ నాయకుడు అయిన కాంతిలాల్ రావత్ అలియాస్ కాంతి భాయ్ ఆదివాసీ కోసం ఆదివాసీలు వేచిచూస్తున్నారు.

 
నాలుగు పదులు కూడా నిండా నిండని కాంతి భాయ్ భారతీయ ట్రైబల్ పార్టి కి నాయకత్వం వహిస్తున్నాడు. అతనిని చూడగానే ప్రజలు ‘Eik Hi Teer, Eik Kamaan, Adivasi Eik Samaan’ (ఒక విల్లు, ఒక బాణం, ఆదివాసీలందరూ ఒక్కటే ) అనే నినాదంతో  సభా స్థలం తో మారుమ్రోగే విధంగా నినదిస్తారు. వారికి ప్రతిగా జై జోహార్ ( Jai Johar ) అంటూ ప్రజలకు నమస్కరిస్తాడు.


భారతీయ ట్రైబల్ పార్టి నేపథ్యం:

 
గుజరాత్ కేంద్రంగా భారతీయ ట్రైబల్ పార్టి ని 2017 లో చొటుభాయ్ వాసవ స్థాపించాడు.  2017, ఆగస్టు 9 వ తేదీన ఎన్నికల కమీషన్ ఈ పార్టి కి ఆటో రిక్షా గుర్తును కేటాయించింది. 


పార్టి స్థాపించిన నెల తిరగక ముందే 2017 గుజరాత్ ఎన్నికల్లో  పోటీ చేసి రెండు స్థానాలలో విజయం సాధించింది. గుజరాత్ లో చోటుభాయ్ ప్రముఖ ఆదివాసీ నాయకుడుగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మరియు మాజీ జనతాదళ్(యు) నాయకుడు.

 
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దత్తు తో రెండు శాసన సభ స్థానాలను కైవసం చేసుకున్నారు. అలాగే రాజస్థాన్ లో మొత్తం 14 శాసన సభ స్థానాలలో పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు.

Also read  ఎన్కౌంటర్ లో చనిపోయిన 40 మంది లో ఏడుగురు చిన్నపిల్లలు!

 
రాజస్థాన్ అసెంబ్లీకి పోటి చేసిన 14 స్థానాలలో భారతీయ ట్రైబల్ పార్టి రెండు స్థానాలలో అతి తక్కువ ఓట్ల తో ఓడిపోయి రెండో స్తానం లో ఉండగా మరో మూడు స్థానాల్లో మూడో స్తానం లో నిలబడింది.

 
ఆదివాసి విద్యార్థి సంఘం బిల్ విద్యార్థి మోర్చా భారతీయ ట్రైబల్ పార్టి కి మద్దత్తు ప్రకటించింది.

 
సరళీకృత ఆర్ధిక విధానాలు, పెట్టుబడిదారీ విధానం వలన ప్రధాన రాజకీయ పార్టిలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టి (బిజెపి) గత కొన్ని సంవత్సరాలుగా ఆదివాసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 
భారత రాజ్యాంగం కల్పించిన అటవీ హక్కుల చట్టాలను యథేచ్ఛగా ఉల్లంగిస్తూ గిరిజనుల ఉనికి కి ప్రమాదంగా తయారవుతున్న నేపథ్యంలో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ గిరిజన ప్రజలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో భారతీయ ట్రైబల్ పార్టి ఆవిర్భానికి పునాది అయ్యింది.

 
అభివృద్ధి, హక్కుల రక్షణ నే లక్ష్యం:

 
ప్రజాస్వామ్యంలో ఓటు కు ఉన్న విలువతో ఆదివాసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకే ఉపయోగించుముంటున్నారు. అస్తిత్వ ఉద్యమాల నుండి రాజకీయ చైతన్యం దిశగా అణగారిన వర్గాలు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ స్పూర్తితో అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపి ల ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమ గీతం పాడుతూ భారతీయ ట్రైబల్ పార్టి ఆవిర్భవించింది.

 
భారత రాజ్యాంగం ఆర్టికల్ 244(1) లో పొందుపరిచిన హక్కులను కాపాడటంలో ప్రధాన పార్టీలు విఫలం అవుతున్నాయి. అంతేగాక ఈ పార్టీలే అభివృద్ధి పేరుతొ షెడ్యూల్ ప్రాంతాల్లో కి గిరిజనేతరుల కు హక్కులు కల్పిస్తున్నాయి. 


జల్, జంగిల్, జమీన్ ( Water, Forest, Land ) నీరు, అడవి, భూమి మావి, గిరిజనలు / ఆదివాసీలు కాని ప్రజలు వాటిని దోచుకోవడం మేము చూస్తూ ఊరుకోము అంటూ స్వతంత్ర రాజకీయ పార్టి భారతీయ ట్రైబల్ పార్టి ని స్థాపించారు.

Also read  నెల్లూరు జిల్లాలో మరోసారి దళితుల మీద దాడి!

 
ఆదివాసి ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. ప్రజలు తమ సొంత పార్టీని ఇప్పుడు, ఇప్పుడే నమ్మడం ప్రారంభిస్తున్నారు. మన హక్కుల కోసం మనమే రాజకీయం చెయ్యాలని విశ్వసిస్తున్నారు.

 
ఏ రాజకీయ పార్టి కూడా గిరిజన చట్టాలను తూచా పాటించవని 1950 నుండి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో మద్యపానం అమ్మకం చెయ్యకూడదు. పాలకులు దొడ్డిదారిన మద్యం అమ్ముతూ గిరిజనులను సంపదను, ఆరోగ్యాన్ని దోపిడీ చేస్తున్నారు. 


2011 లో మొదలైన పరిశుబ్రమైన మంచినీరు, పరిసరాల శుభ్రత తో ప్రారంభమై ప్రత్యేక భిల్ రాష్ట్రం దిశగా ఆదివాసీలు లోక్ సభ ఎన్నికలు 2019  లో డిమాండ్ చేస్తున్నారు. 


భారతీయ ట్రైబల్ పార్టి భవిషత్తు రాజకీయం 

 
ఎస్సి / ఎస్టి వర్గాలు ఏదైనా స్వతంత్ర రాజకీయ దిశగా కార్యాచరణ ప్రకటిస్తే ప్రధాన భూస్వామ్య కులాల పార్టి ల నుండి , మేధావుల నుండి లుకలుకలు వినపడటం సహజమే. అయితే భారతీయ ట్రైబల్ పార్టి  అతి కొద్ది సమయంలోనే ఆ అడ్డంకులు అదిగిమించి ఆదివాసిల హృదయాలను గెలుచుకుంది. 


పూనా ఒప్పందం ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలను అడ్డుకుని, రిజర్వుడు స్థానాల్లో ఇన్ని సంవత్సరాలు వారి కీలుబొమ్మలనే ప్రధాన పార్టీలు ఎస్సి / ఎస్టి ల రాజకీయ రిప్రజెంటేటివ్స్ గా నిలబెట్టాయి.

ఈ ప్రమాదాన్ని డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎర్రవాడ జైలు లో గాంధీ తో ప్రత్యేక నియోజకవర్గాల మీద ఒప్పందం జరిగిన వెంటనే ప్రకటించారు. 


ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అస్తిత్వ ఉద్యమాల ప్రభావం కానీ లేదా డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ పరంగా కల్పించిన ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యంలో మెజారిటి ప్రజలదే రాజ్యాధికారం అనే స్ఫూర్తి తో దళిత , గిరిజనులు రాజ్యధికారం కోసం ఇప్పుడు ప్రధాన పార్టీ లకు , భూస్వామ్య కులాలతో పోటీ పడుతున్నారు. 

Also read  అట్రాసిటీ చట్టం:నిర్వీర్యం చేసిన సుప్రీం కోర్టు!


ఎస్సి / ఎస్టి లను ఏకీకరణ జరగకుండా ప్రధాన కుల వ్యవస్త ఎప్పటికప్పుడు కొత్త దారులు వేస్తూనే ఉంటాయి. రాజస్థాన్ లో భారతీయ ట్రైబల్ పార్టి ని నిలువరించడానికి బిజెపి – సంఘ్ పరివార్ శక్తులు హిందూ మతాన్ని రంగంలోకి దింపారు. 


మేము హిందువులం కాదు, మాకంటూ ప్రత్యేక సంస్కృతి, పద్ధతులు ఉన్నాయంటూ భారతీయ ట్రైబల్ పార్టి నాయకత్వం సున్నితంగా బిజెపి – సంఘ్ పరివార్ ఎత్తుగడలను తిప్పికోట్టింది.


 కొందరు విమర్శకులు భారతీయ ట్రైబల్ పార్టి కాంగ్రెస్ పార్టి ని అడ్డుకోవడానికి బిజెపి వేసిన ఎత్తుగడ అంటుంటే మరికొందరు కాంగ్రెస్ పార్టి ఎత్తుగడలో భాగం అంటున్నారు. ఏది ఏమైనా మూలవాసులు నల్లదొరల పాలన నుండి విముక్తి కోసం రాజకీయ పోరాటం చెయ్యడం హర్షించదగ్గ పరిణామం. 


డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పిన ” మీ గోడల మీద రాసుకోండి మనం పాలకులం కాబోతున్నాం ” అన్న మాట నెరవేరే రోజు త్వరలోనే వస్తుందని ఈ దేశ మూలవాసులు దళితులు , ఆదివాసీలు నమ్ముతున్నారు. 

(Visited 64 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!