భారత రాజ్యాంగం: స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం …!

షేర్ చెయ్యండి
  • 272
    Shares

భారత రాజ్యాంగం మన దేశానికి పవిత్ర గ్రంథం. దేశభక్తి గురించి, నినాదాల గురించి, స్వేచ్ఛ గురించి ఎన్నిరకాల అభిప్రాయాలున్నా అన్నిoటికీ రాజ్యాంగమే ఆదర్శం.

భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది కాబట్టే రాజ్యాంగం అంటే అందరికీ అంత గౌరవం. అలాంటి రాజ్యాంగానికి కర్త, కర్మ అన్నీ బాబాసాహెబ్ డా అంబేడ్కర్.

స్వతంత్ర భారతదేశం భవిష్యత్ కు దిక్సూచిగా తన ఆత్మనే రాజ్యాంగ గ్రంథంగా రాసుకున్నారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్. భారతజాతికి ఆయన ఇచ్చిన ఈ బహుమతి మతాలు, కులాలు, వర్గాలన్నిటినీ ఏకంగా చేసింది.

ఏ తేడా లేకుండా ప్రతి పౌరుడికీ సమానమైన గుర్తింపు ఇచ్చింది. అందుకే బాసాహెబ్ డా అంబేడ్కర్ అందరివాడయ్యారు. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఆలోచనలే భారతీయులందరి ఆత్మగౌరవం.

అందుకే తరాలుగా అట్టడుగున ఉండిపోయిన ప్రజలకు ఆయన దేవుడు. ఆయన ఆలోచనలను కాదనేవాళ్లకు కూడా ఆయనే ఆదర్శం. అందరికీ కలిసి ఆయన శాశ్వత అవసరం.

ఆ అవసరం అనివార్యంగా మారడానికి కారణం, మన రాజ్యాంగం. ఏ భేదం లేకుండా భారత ప్రజలమైన మేము అంటూ మొదలవుతుంది మన రాజ్యాంగం.

ఈ ఒక్క మాటతో భారత నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పారు
బాబాసాహెబ్ డా అంబేడ్కర్. అప్పటికే కులాలుగా, మతాలుగా విడిపోయిన భారతీయులను ఒకే ఒక్క మాటతో ఒక్కటి చేశారు.

ఈ సమానత్వంతోనే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. స్వతంత్రం వచ్చిన సమయంలో పాలన వ్యవస్థ ఇంకా నిర్మాణం కాని క్లిష్టమైన వాతావరణంలో మన రాజ్యాంగ రచన జరిగింది.

దీనికి రచనా కమిటీ ఛైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంతకంటే ముందు ఆయన్ను అసలు రాజ్యాంగ సభకే వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాయి అప్పుడున్న కొన్ని పార్టీలు.

కానీ భారతజాతికి దిశను చూపించే రాజ్యాంగ రచనకు బాబాసాహెబ్ డా అంబేడ్కర్  మాత్రమే సరైనవ్యక్తి అని నాటి సభ్యులు  చెప్పడము జరిగింది. తర్వాత రాజ్యాంగ రచన మొదలుపెట్టారు.


మనదేశం కంటే ముందే చాలా దేశాలు రాజ్యాంగాలు రాసుకున్నాయి. అలా 130కి పైగా దేశాల రాజ్యాంగాలను చదివారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్  . అవన్నీ అధ్యయనం చేసి మనకు అవసరం అనుకున్నవి, మన దేశ పరిస్థితులకు తగినట్టుగా మార్పులు చేశారు. 

మనదేశంలోని రకరకాల సమాజాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో చాలా ముందుగానే అంచనా వేసి… వాటికి పరిష్కారాలు చూపించేలా రాజ్యాంగ రచన చేశారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్.


దేశంలో పటిష్ఠమైన వ్యవస్థల్ని నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్. ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేలా అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.

ఏ వర్గాన్నీ పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు. పాలకులు దారితప్పితే ప్రజలు ప్రశ్నించే హక్కు ఇచ్చారు. హక్కులతో పాటు ప్రభుత్వాలను గైడ్ చేసేలా ఆదేశిక సూత్రాలను ఇచ్చారు.

మనకంటే చాలా ముందుగా రాజ్యాంగం రాసుకున్న అమెరికా వ్యవస్థ కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించలేకపోయింది. కొన్ని పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించింది.

కానీ మన రాజ్యాంగం భవిష్యత్ ను చాలా ముందుగా ఊహించి పరిష్కారాలు చూపేలా రచించారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కొన్ని దేశాల్లో పన్ను కట్టేవాళ్లే ఓటర్లు. కొన్ని దేశాల్లో ఇంకొన్ని అర్హతలున్నవాళ్లకే ఓటు. వాటన్నిటికీ భిన్నంగా దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్.

Also read  దళిత రాజ్యాధికారం-బిఎస్పీ!

టాటా, బిర్లా అయినా రోజు కూలీ అయినా ఓటుకు ఒకటే విలువ. ఇదే బాబాసాహెబ్ డా అంబేడ్కర్  ప్రతిపాదించిన అసలైన ప్రజాస్వామిక సిద్ధాంతం.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్  న్యాయశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. మనదేశంలో సామాజిక వివక్ష ఎలా ఉంటుందో, ఎదగడానికి ఎన్ని కష్టాలుంటాయో ఆయనకు బాగా తెలుసు. అందుకే పౌరహక్కుల విలువను బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా వాటిని రాజ్యాంగంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చారు.

వాటిని ఎవరూ కాదనే అవకాశం లేకుండా తిరుగులేని రక్షణ కల్పించారు. ప్రజల చుట్టూనే వ్యవస్థ పనిచేసేలా చేశారుప్రతి పౌరుడూ తన ఆలోచనలు చెప్పుకోగలిగేలా భావప్రకటనా స్వేచ్ఛను ఇస్తూ ఆర్టికల్ 19 రూపొందించారు.

అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా చేశారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్. దేశంలో మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు బాబా సాహెబ్.

అర్టికల్స్ 14, 15, 16లలో సమానత్వ హక్కులు కల్పించారు. ఇవే దశాబ్దాలుగా దేశంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణకవచాలుగా నిలుస్తున్నాయి.


దేశంలోని ప్రజలకు తిండి, బట్ట, ఉద్యోగం ఇవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలపైనే పెట్టారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్. అందరికీ సమాన అవకాశాలుండాలని చెప్పారు.

మహిళలకు రాజకీయ స్వతంత్రం  ఉండాలని చెప్పిన అరుదైన నేత బాబాసాహెబ్ డా అంబేడ్కర్. దళితుల కోసం మాత్రమే కాదు దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన అసమాన నాయకుడు బాబాసాహెబ్ డా అంబేడ్కర్. 

బాబాసాహెబ్ డా అంబేడ్కర్  ను చదవకుండానే ఆయన్ను దళిత నాయకుడిగా ముద్రవేసిన చాలామందికి ఆయన చెప్పిన సమానత్వం ఎప్పటికీ అర్థం కుండానే ఉండిపోయింది.


దేశంలో ఎన్ని మతాలు, కులాలు, జాతులు, భాషలు ఉన్నా భారతజాతి సమైక్యతను,సమగ్రతను కోరుకున్నాడు బాబాసాహెబ్ డా అంబేడ్కర్.

 
ప్రాథమిక హక్కుల పరిపూర్ణ తత్వానికి  ఆదేశిక  సూత్రాలు జీవనాధారంగా  ఉన్నపుడే  సంక్షేమ రాజ్యం సాధ్యం అవుతుంది
.


ఐక్యరాజ్య  సమితి (UNO) పౌరుల  ఎదుగుదల వారి వికాసము  అవిభాజ్యము అనుఉల్లంఘనీయమైన  ” మానవ హక్కులు ”  అని ప్రకటించడానికంటే ముందే ఈ ఆదేశిక  సూత్రాలును  రూపొందించిన  ఘనత బాబాసాహెబ్ డా అంబేడ్కర్ చెల్లుతుంది.


భారత రాజ్యాంగమ 26 వ జనవరి 1950 లో భారతదేశ రాజ్యంగము  అమలులోకి వచ్చింది.ఈ రోజు భారత రాజ్యాంగము అమలులోకి వచ్చి 69 సంవత్సరాలు పూర్తికావస్తున్న భారతదేశ సామాజిక వ్యవస్థను మనం గమనించినట్లయితే రాజ్యంగము చెప్పినదానికి పూర్తిగా భిన్నముగా కనపడుతుంది. 


రాజ్యంగము అమలులోకి వచ్చేనాటికి భారతదేశ  అక్షరాస్యత కేవలం 8 నుండి 10 % వరకు మాత్రమే ఉంటుంది.కావున నిరక్షరాస్యులైన భారత సమాజం రాజ్యంగం , చట్టాలు తెలియక వాటిపై గౌరవములేక అజ్ఞానం, అంధవిశ్వాసముతో మతాలను , కులాలను విశ్వసించడముతో అంటరానితనాన్ని పాటించింది.

అసమానత్వంలో విశ్వసించింది అని మనము అనుకున్నా, ఈ రోజు 80% అక్షరాస్యతను సాదించిన భారత సమాజము  రాజ్యంగ శాసనాలను చట్టాలను  దుర్వినియోగపరచడం, వక్రీకరించడము వాటి పై గౌరవం లేకపోవడము. 

ఫలితంగా ఎర్పడిన లంచగొండి సమాజము, అవీనితి సమాజము , నేరప్రవృత్తి గల సమాజము , మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలు, దోపిడీలు,  అత్యాచారాలు, మతకల్లోలాలు , మతం పేరిట జరుగుతున్న మారణహోమాలు , కులాల కుళ్ళు కంపూ , ఆకలిచావులు , భృణహత్యలు , వరకట్న వేధింపులు, గృహ హింసలు.

Also read  కశ్మీర్: కశ్మీర్ ఏర్పాటు వాదానికి కారణం మతమా? రాజకీయమా?

ఇటువంటి ధారుణమైన సమాజం ఎర్పడడానికి గల కారణాలను మనం ప్రజల నుండి తెలుసుకున్నట్లయితే కొంతమంది రాజ్యంగం విఫలత అనే కారణం చెబితే , కొంత మంది పాలకుల తప్పు అని చెప్పడం జరుగుతుంది.

అది ఏ కారణమైన ఒకరి జరిగే నష్టం కాదు , మొత్తం భారతజాతికి జరుగుతున్న నష్టం అని ప్రతి పౌరుడు  మతానికి , జాతికి , కులానికి అతితంగా ఎందుకు ఆలోచించలేక పోతున్నాడు.


భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ఈ క్రింది సౌలభ్యాలు కలిగించటం లక్ష్యంగా కలిగి ఉంటుంది.

● సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. ● ఆలోచన స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, నమ్మకాన్ని , విశ్వాసాన్ని కలిగి ఉండే ఆరాధన స్వేచ్ఛ. 

● అంతస్తులోను , అవకాశములోను సమానత్వము. ● ప్రజలందరిలో దేశీయసమైక్యతను , అఖండతాభావాన్ని , వ్యక్తి గౌరవాన్ని పెంపొందించటం.

రాజ్యంగము పీఠికలోనే ఇంత గొప్ప లక్ష్యాలను నిర్దేశించినప్పటికి, భారత దేశాన్ని ఏ చీడపురుగు పట్టింది? 

పీఠికలోనే స్వేచ్ఛ, సమానత్వము, సౌబ్రాతృత్వము చెప్పిన వీటిని అమలు కానివ్వకుండా అడ్డుకుంటున్న దుర్మార్గులు ఎవరు? 

భారత రాజ్యాంగము సమానత్వమును సాదించడానికి అధికరణం 14 – చట్టంముందు అందరు సమానులే అధికరణం15 -కుల , మత, లింగ వివక్షకు తావులేదు.

అధికరణం16 ప్రభుత్వ  ఉద్యోగాలలో అందరికి సమాన అవకాశాలు.అధికరణం 17 అంటరానితనం నిషేదం.

అధికరణం 18 బిరుదుల నిషేదం భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వమును సాదించడానికి ఈ అధికరణలు ప్రాథమిక హక్కులలో ఉన్నప్పటికీ సమానత్వము సాదించడానికి అడ్డుకుంటున్న తివ్రవాదులు ఎవరు?     

భారత రాజ్యాంగము స్వేచ్ఛను సాదించడానికి అధికరణం19 భావ ప్రకటన స్వేచ్ఛ అధికరణం 20 ఒక నేరానికి ఒకేసారి శిక్ష విధించాలి. అధికరణం 21 వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు అధికరణం 21 A విద్యా హక్కు అధికరణం 22 నిర్భంధములు , పరిమితులు . భారత రాజ్యాంగము దోపిడినుండి రక్షణ పొందడానికి అధికరణం 23 శ్రమ శక్తిని దోపిడి చేయరాదు అధికరణం 24 బాల కార్మికుల నిషేదము.

26 నవంబర్ 1949 లో సంవిధాన సభకు రాజ్యంగము సమర్పిస్తు తన
 ఉపన్యాసము లో రాజ్యంగ నిర్మాత అంటారు ” రాజ్యంగము ఎంత గొప్పదైన దానిని అమలు పరచేవాడు దుర్మార్గుడైతే ఆ రాజ్యంగము తన లక్ష్యము చేరదు ” అని ఈ రోజు మన దేశంలో అదే జరుగుతుంది. 

చట్టం ముందర అందరు సమానులే అన్న రాజ్యంగము యొక్క అధికరణం 14  పాలకవర్గాల చేతిలో కీలుబొమ్మ  అయింది. కుల , మత, లింగ వివక్షను చూవించరాదు అన్న రాజ్యంగము అది రాతకే పరిమితమై ఈ దేశంలో కులవివక్ష కొనసాగుతునే ఉంది , మత వివక్షను పాలకవర్గాలు చూవిస్తునే ఉన్నారు , లింగ వివక్ష ద్వారా భారతదేశ స్త్రీలు అనేక అవమానాలను , అనేక సమస్యలను ఎదుర్కుంటునే ఉన్నారు.

లింగ వివక్షతలో భారత దేశము ప్రపంచములోని 142 దేశాల్లో 114 వ స్థానంలో ఉంది. • ప్రభుత్వ  ఉద్యోగాలలో అందరికి సమాన అవకాశాలు అన్న రాజ్యంగమును పాలక వర్గాలు తమ పాలనలో తమ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తు రాజ్యంగమునకు ద్రోహం చేస్తున్నారు.

అంటరానితనం నిషేదం అని రాజ్యంగం చెప్పినప్పటికి ఇది రాజ్యాంగము అమలుపర్చే వారి కంటికి ఇప్పటివరకు కనబడలేదు. మొన్న NCAER వారు జర్పిన సర్వేలో 50% బ్రహ్మణులు, 24 % అగ్రకులాలవారు , 33% వెనకబడిన కులాలవారు మేము అంటరానితనాన్ని పాటిస్తాం అని బహిరంగంగా ఒప్పుకున్నారు 

Also read  దళిత నాయకులు: ఆంధ్రా మార్క్సిజం చరిత్రలో కానరాని దళిత నాయకులు!

ఒక వారంలో అంటరాని కులాల వారిపై జరిగే నేరాలను చూస్తే … 13 మందిని కులం పేరిట చంపుతున్నారు 5 ఇండ్లను కులం పేరిట దహనం చేస్తున్నారు .6 గురిని కులం పేరిట దూషిస్తున్నారు.21 మంది మహిళల పై కులం పేరిట అత్యాచారాలు చేస్తున్నారు.బాల కార్మికుల నిషేదం అన్న రాజ్యంగము గల భారత దేశంలో ఈ రోజు 7 కోట్ల బాల కార్మీకులు  ఉన్నారు…

ఉచితనిర్భంధ విద్యను భారత రాజ్యాంగము చెప్పిన భారత దేశ పాలక వర్గాలు విద్యను ప్రైవేటికరణ చేసి తమ వర్గ ప్రజలు విధ్యాసంస్థలను స్థాపించే విధంగా జాగ్రత్త పడ్డారు.

ఫలితంగా శ్రామిక వర్గాల ప్రజలు విద్య నుండి దూరమవుతున్నారు.మరియు బాల కార్మికులుగా మారుతున్నారు.

ప్రపంచ జనాభాలో 35 % నిరక్షరాస్యత ఈ రోజు భారత దేశంలో  ఉన్నది. ఏ చట్టాలైతే రాజ్యంగము యొక్క ప్రాథమిక హక్కులలో  ఉండి వాటికి కోర్టు రక్షణగా ఉందో ఆ చట్టాల పరిస్థితి  ఈ విధంగా ఉంటే రాజ్యంగము లోని ఎతర ఏ చట్టాల గురించి మాట్లడం వ్యర్థమే.

ఇంత గొప్ప రాజ్యంగము  ఉన్న మన దేశంలో ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులకు గల కారణం హిందుమతం.

హిందూ మతం భారత సమాజాన్ని కులాల పేరుతో ముక్కలు ముక్కలు చేసింది.సమైక్య భావాన్ని  అడ్డుకున్నది.

సాంఘిక హోదాలో సమానత్వం అనే నీతిని హిందూమతం నిషేదించింది. ప్రజలను కులాల గా విడదీసి అసమానతలు సృష్టించింది. సాంఘిక హోదాకి సంబందించిన వివిధ కులాల మధ్య శత్రు భావం కలుగజేసింది.

కులాల మధ్య విధ్వేష పూరితమైన అరోహణ క్రమాన్ని, అవమానకరమైన అవరోహణ క్రమాన్ని కలిగించటం, అసమానత్వం అన్నది హిందూమతానికి ఆత్మసిద్ధాంగా దైవత్తమైంది.

హిందుమతం సౌబ్రాతృత్వము ను నిరాకరించి కులాంతర భోజనాలను , కులాంతర వివాహలను వద్దనిచెప్పింది. అభిష్టానికి , సామర్థ్యానికి సంబందం లేకుండానే వ్యక్తి  అతడు పుట్టకముంలే అతని వృత్తిని నిర్ణయించింది.

హిందుమతం సామాన్యుడి పట్ల  ఏ విధమైన ఆసక్తిని ప్రదర్శించలేదు.అది బ్రహ్మణుల విశేష హక్కులకు అండగా నిలచి వాటిని కాపాడడానికి కంకణం కట్టుకుంది హిందుమతం భక్తిముసుగులో బానిసత్వమును బోదించింది.

రాజ్యంగ శాసనాలను ,చట్టాలను దుర్వినియోగపరచడం , వక్రీకరించి నిర్వీరియ పరచడం అతిక్రమించడములో మనవారిని మించినవారు మరోకరు లేరు.

కారణం కుల వ్యవస్థ. కుల వ్యవస్థ పట్ల మనకు ఉన్న విశ్వాసము. రాజ్యంగమునకు పునాది సమానత్వం. కుల వ్యవస్థకు పునాది అసమానత్వం.రాజ్యాంగము ప్రజాస్వామ్యాబద్దమైనది.

కుల వ్యవస్థ నియంతృత్వ పూరితమైనది . రాజ్యంగ శాసనాలు కుల శాసనాలకు అనుగుణంగా కాక భిన్నంగా వ్యతిరేకముగా ఉండడముతో వలన రాజ్యంగ శాసనాల పట్ల గౌరవం ప్రకటించడము లేదు  కులపిశాచులు ఫలితంగా రాజ్యంగము , చట్టాలను దుర్వినియోగపరచడం జరుగుతుంది.

Samrat Chandra Shekhar. Tagaram

samratshekhar7777@gmail.com

(Visited 188 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!