రాజ్యాంగం: భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ డా. అంబేడ్కర్!

షేర్ చెయ్యండి
  • 333
    Shares

విశ్వ రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.భారత దేశానికి స్వతంత్రం సిద్దించాక స్వపరిపాలన కొనసాగాలి అలా కొనసాగాలంటే భారత దేశానికి ఒక రాజ్యాంగం అవసరమైనది.

ఈ రాజ్యాంగం ఎవరు రూపొందించాలి? ఎవరు అంతటి సమర్ధులు? ఎవరు అంతటి మేధావులు?


ఈ విషయంలో అంతటి వ్యక్తీ కోసం పరిశోదన మొదలైంది. ఆ పరిశోదన లో భారత దేశంలో అంతటి సమర్ధులు ఎవరు కనిపించలేదు. గాంధీ నెహ్రులకు.

గాంధీ మరియు పండిట్ నెహ్రు ఆంగ్లేయుల దగ్గరికి వెళ్లి స్వతంత్ర భారత దేశానికి రాజ్యాంగం రాయాల్సిందిగా కోరారు.

భారత దేశానికి మేమెలా రాజ్యాంగం రాయగలం, వివిధ మతాలూ, కులాలు, భాషలు, ఆచారాలు, బౌగోళిక వ్యత్యాసాలు, సంప్రదాయాలు ఉన్న భారత దేశానికి రాజ్యాంగం రాయాలంటే మాటలు కాదు.

అది మాకు అసంభవం. కాని మీ భారత దేశంలోనే ఒక వజ్రం ఉంది సకల శాస్త్రాల ప్రవీన్యుడు ఉన్నాడు. ఆయనే బాబా సాహెబ్ అంబేద్కర్. భారత దేశానికి రాజ్యాంగం రాయడానికి ఆయనే సమర్ధులు మీరు వెళ్లి ఆయనను సంప్రదించండి అని చెప్పారు.

ఆనాటి బ్రాహ్మణ అగ్రవర్ణ పాలకుల దగ్గర వేరే మార్గం లేదు . రాజ్యాంగం లేక పొతే పరిపాలన అస్సలు సాధ్యం కాదు. ఇటువంటి పరిస్తితులలో రాజ్యాంగ రచనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ సభ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్ష్యుని గా తీసుకోవడం జరిగింది. అలా రాజ్యాంగ రచన మొదలైంది.

రాజ్యాంగ రచన సంఘం:

1947 ఆగస్ట్ 29 న డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ గారి అధ్యక్షతన 7 గురు సభ్యులతో (ఆయనతో కలిపి) రాజ్యాంగ రచన సంఘం ఏర్పాటు అయ్యింది.మొదటి సమావేశం ఆగస్ట్ 30 ,1947 న జరిగింది.

Also read  యోగి 'రాంజీ' అంబేడ్కర్ ఒక కుట్ర!

మిగితా 6గురు:
1.N.గోపాల స్వామి అయ్యర్
2.అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్
3.సయ్యద్ మహమ్మద్ సదుల్లా
4.K.M. మున్షీ
5.B.L.మిట్టల్ ( మిట్టల్ గారి అనారోగ్యం కారణంతో రాజీనామా తరువాత N.M.రావ్ గారిని ,5-12-1947న నియమించారు)
6.టి.టి.కృష్ణమాచారి.(డి.పి ఖైతాన్ గారి మరణంతో టి.టి కృష్ణమాచారి నియామకం జరిగింది)

ఈ కమిటీ మొత్తము బాబాసాహెబ్ అధ్యక్షతన రాజ్యాంగం వ్రాయాలి కానీ అలా వ్రాయబడలేదు.డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ గారు ఒక్కరే రాజ్యాంగం వ్రాసారు.

డాక్టర్ అంబెడ్కర్ గారు ఒక్కరే రాజ్యాంగం వ్రాసారు:

న్యాయశాఖామంత్రిగా ,రాజ్యాంగ రచన బాధ్యతలు తీసుకొన్న బాబాసాహెబ్ ఒక్కరే రాజ్యాంగం వ్రాసారు అంటూ భారతదేశ అత్యున్నత అసెంబ్లీ లో టి.టి కృష్ణమాచారి గారు నవంబర్ 5 ,1948 నాడు ప్రకటించారు.

ఆయన మాటల్లో, ఈ కమిటీలో ఏడుగురు ఉన్నమాట వాస్తవం కానీ 
ఒక్కరు అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు. ఆ స్థానం లో ఇంకొకరిని నియమించాల్సి వచ్చింది.


డి.పి ఖైతాన్ గారు మరణించారు.ఆయన స్థానంలో టి.టి.కృష్ణమాచారి వచ్చాడు ఆయనకు న్యాయశాస్త్రంలో కూడా అవగాహన లేదు పట్టభద్రుడు కాదు.


ఒకరు అమెరికాలో ఉన్నారు ఆయన స్దానo ఖాళీగా ఉంది.మరొక సభ్యుడు రాష్ట్ర రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు.రాజ్యాంగ రచనలో రావడానికి సమయం చిక్కలేదు.


మిగితా ఇద్దరు ఢిల్లీ కి బాగా దూరంలో ఉండటం వలన వాళ్లకు వీలు పడలేదు అంటూ మాట్లాడారు.

ఇలా అందరు దూరంగా ఉండటం వలన రాజ్యాంగ రచన బాధ్యత అంత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీదనే పడింది.

బాబాసాహెబ్ అంబేద్కర్ రోజుకు 20-22 గంటలు శ్రమించి తన ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి 11 నెలలో రాజ్యాంగాన్ని రూపొందించారు.

Also read  మోడీల అవినీతిపై చర్చను అడ్డుకున్నహోదా!

చివరికి రాజ్యాంగ రచన విజయవంతంగా పూర్తయింది. రాజ్యాంగ సభ ఆమోదం తర్వాత దాని చిత్తూ ప్రతిని చర్చకోసం పార్లమెంట్లో పెట్టె కార్యక్రమం మొదలైంది.

అందుకు పార్లమెంట్ సమావేశమైంది. దీనిపైన బాబాసాహెబ్, ప్రశ్న – జవాబులు, సవరణలు వివరణలు మొదలైనవి సభ్యుల నుంచి ఆశించారు.

అయితే ఇక్కడ ఉత్పన్న మైన ప్రశ్న ఏమంటే. రాజ్యాంగాన్ని ఎలా రంభించాలి? 
అంటే రాజ్యాంగంలో మొట్టమొదటి వాక్యం లేదా తోలి పలుకు ఎలా ఉండాలి? 
ఎం ఉండాలి? అని దీనిమీద చర్చ మొదలైంది.

అందులో భాగంగా సభ్యులను చర్చకు ప్రోత్సహించారు. మొదట మౌలానా హజ్రత్ మొహలి లేచి నిలబడ్డారు. రాజ్యాంగం అల్లా పేరు మీద అల్లాహ్ అంటూ ప్రారంభించాల అని అన్నారు.

పండిట్ మదన్ మోహన్ మాలవ్యా నిలబడ్డారు. భారత రాజ్యాంగాన్ని “ఓం నమశివాయ” అన్న మాటతో ప్రారంభించాలి అని చెప్పారు.

హెచ్. పీ కమాట్ నిలబడ్డారు అల్లా శివుడు అని కాకుండా దేవుడి పేరుమీద ప్రారంభించాలి అన్నారు. ఇలా ఎవరికీ నచ్చిన కొటేషన్ వారు చెప్పడం జరిగింది. 
ఆఖరున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిలబడ్డారు.

భారత రాజ్యాంగాన్ని ప్రజల పేరు మీద భారత ప్రజల మైన మేము (వుయ్! ద పీపుల్ అఫ్ ఇండియా) ప్రారంభిస్తున్నాను అని తన ఉపన్యాసాన్ని ప్రారంబించారు.

అయన ఉపన్యాసం ముగిసేసరికి అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి, అందరి ప్రశ్నలకు జవాబు దొరికింది చప్పట్లతో పార్లమెంట్ మారుమోగింది. అలా భారత రాజ్యాంగాన్ని దేవుడు మతాలకు అతీతంగా రూపొందించడం జరిగింది.

రెండవ అంశం ఈ దేశానికి ఏ పేరు నిర్ణయించాలి అని. అందరు తమకు తోచిన విధంగా సమాదానం చెప్పారు

Also read  అంబేడ్కర్ ఆలోచనా విధానం:మే 17 కామ్రేడ్స్ సామాజిక విప్లవం!

కొందరు హిందూస్తాన్ అని పెట్టాలన్నారు కొందరు సిన్దుస్తాన్ అని పెట్టాలన్నారు.
కొందరు ఆర్య వార్త అన్నారు. కొందరు భారత దేశం అన్నారు. ఇలా ఎవరికి తోచినది వారు చెప్పడం ప్రారంభించారు.

అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత దేశానికి ఇండియా దట్ఈజ్ ‘భారత్’ అనే పేరును నిర్ణయించానని అందుకు రాజ్యాంగంలోని మొదటి పేజి లో రాశానని దానికి సంభందించిన చారిత్రక ఘట్టాలతో సహా వివరించారు ఇందుకు సంబంధించి రాజ్యాంగంలో ని కాలం 395 (ఏ) గా నామకరణం చేశారు. ఈ అంశం కూడా సంతృప్తి కరంగా అందరికీ ఆమోదయోగ్యం అయింది.


బౌద్ధం – భారత దేశం:

బౌద్ధ ధమ్మాన్నిపూర్తిగా చదివిన బోధిసత్వ బాబాసాహెబ్ బౌద్ధ మార్కును రాజ్యాంగం లో పొందు పరిచారు.రాజ్యాంగ పీఠిక బౌద్ధ ధమ్మా పీఠక అనే చెప్పవచ్చు.

రాజ్యాంగ చిహ్నం అయినా ఏనుగు బౌద్ధo లో ప్రాముఖ్యత ను కలిగి ఉంది.బుద్ధుని తల్లి కి కలలో కనబడింది ఏనుగునే అని బుద్దుస్ట్ గ్రంథాలలో లిఖించబడింది.

భారత దేశ సార్వత్రిక సార్వభౌమానికి చిహ్నమైన నాలుగు సింహాలు బౌద్ధ చక్రవర్తి సామ్రాట్ అశోకుని సార్వభౌమత్వానికి చిహ్నం .

భారత దేశ జెండాలో ఉన్న 8 ఆకుల అశోక చక్రం ,బౌద్ధం లో ని అష్టాంగ మార్గానికి చిహ్నం . 24 ఆకులున్న అశోక చక్రం 12 సూత్రాల “ప్రతిత్యసముత్పాద “కి గుర్తు.ఇలా బాబా సాహెబ్ భారత దేశ చిహ్నాల గుర్తింపు లో బౌద్ధాన్ని మేళవించారు.

క్రెడిట్స్: ఉప్పుసారథి లక్ష్మి నారాయణ 

(Visited 394 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!