భీం ఆర్మీ చరిత్ర!

షేర్ చెయ్యండి

భీం ఆర్మీ లేదా భీమ్ ఆర్మీ భారత్ ఏక్తా మిషన్, న్యాయవాది చంద్రశేఖర్ ఆజాద్ మరియు దాని జాతీయ అధ్యక్షుడైన వినయ్ రతన్ సింగ్ ప్రారంభించిన సంస్థ. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలో ఇది ప్రారంభమైంది. దళిత  సమాజానికి చెందిన పిల్లలకు ఉచిత పాఠశాలలు ప్రారంభించాలని ఆజాద్ మరియు సింగ్ నిర్ణయించినప్పుడు, దాని మొదటి సమావేశం జులై 21, 2015 న జరిగింది. అటువంటి మొట్టమొదటి స్కూల్ ని  ఫతేపూర్ భడో గ్రామం సేహరన్ పూర్ జిల్లా లో  ఏర్పాటు చేశారు. ప్రస్తుతం, భీం సైన్యం సహారాన్ పూర్, మీరట్, షామిలీ మరియు ముజఫర్ నగర్ పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 350 కంటే ఎక్కువ పాఠశాలలను నడుపుతోంది.

దళితుల మీద ఫ్యూడల్ కులం ఠాకూర్ లు చేసే దురాగతాల అడ్డుకోవడానికి భీం ఆర్మీ ని ప్రారంబినట్లు వ్యవస్తాపకుల్లో ఒకరైన రతన్ సింగ్ 2017 లో ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో చెప్పేరు.  “సహరాన్పూర్లోని చ్యుత్మల్పుర్ ప్రాంతంలోని AHP కళాశాల సమీపంలో, ఒక దళిత విద్యార్ధి ని  ఠాకూర్ కులస్తులు కొట్టరు. దళిత విద్యార్ధి చేసిన తప్పు ఏంటంటే కాలేజీ సమీపంలో ఉన్న బావి నుండి నీటి ని తోడ్కుని తాగడమే. భీం ఆర్మీ ఈ సంఘటన ను సీరియస్ గా తీసుకుని జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి ధర్నా కూడా నిర్వహించేరు. భీం ఆర్మీ మీద ఒత్తిడిలు తీసుకు వచ్చిన, గ్రామస్తుల మీద ఒత్తిడి తీసుకు వచ్చిన వెనక్కి తగ్గకుండా అట్రాసిటీ కేసు రిజిస్టర్ చెసరు.

భీం అర్మీని అడ్డుకోవడానికి మావోయిస్టు లు గా ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. దళిత గ్రామాల్లో పోలీసులు దాడులు చేసి అమాయకులైన దళిత యువతను పోలీసులు తీసుకు వెళ్లడాన్ని భీం ఆర్మీ అడ్డుకుంటుంది. భీం ఆర్మీ రాజ్యాంగాన్ని నమ్ముతుంది. వివిధరకాల బెదిరింపులను భీం ఆర్మీ ఎదుర్కుంది. దళిత యువత కి భీం ఆర్మీ భరోసా ఇస్తుంది. పోలీసుల దాడులకు, ఫ్యూడల్ కులాల దాడులకు బెదిరి ఎక్కడకి వెళ్తారు. ఈ దేశం మనది, ఈ ప్రబుత్వం మనది, ఈ దేశ రాజ్యాంగం మనకి ధైర్యన్నిస్తుంది. అని యువత లో చైతన్యం కలిగిస్తున్నారు. ప్రబుత్వాల ఏర్పాటులో మన ఓటు కుడా ఉంది.

2017 మే లో ఠాకూర్ లు రాజపుత్ర రాజు మహారాణా ప్రతాప్ ని ఊరేగింపు గా తీసుకు వెళ్తున్న క్రమంలో సహరాన్పూర్ దళితులు మైక్ సౌండ్ ని తగ్గించాలి అని చెప్పినందుకు ఠాకూర్ లు దళితుల మీద దాడి చేసేరు. ఈ ఘర్షణ దళితులు మరియు ఠాకూర్ ల మధ్య గొడవలు తీవ్రంగా జరగటానికి దారితీసేయి. ఒక ఠాకూర్ యువకుడు మరణించగా, 24 దళితుల ఇల్లు ఠాకూర్ లు తగల బెట్టేరు .ఈ గొడవలకు ప్రేరణ చంద్ర శేఖర్ ఆజాద్ అని అతని మీద వివధ సెక్షన్లు క్రింద  24 కేసులు పెట్టేరు.

Also read  Dalit movements in India!

ఆజాద్ కి మద్దత్తు గా మే,2017 నెల చివరి వారంలో న్యూడిల్లీ జంతర్ మంతర్ వద్ద దాదాపుగా 10 వేల మంది భీం ఆర్మీ మదత్తు దారులు చంద్ర శేఖర్ ఆజాద్ చిత్రం ముసుగులు ధరించి పెద్ద ఎత్తున నిరసన  చెపట్టేరు. బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్ర పటం మరియు నీలి జెండా తో ఆ మైదానం జై భీమ్ నినాదాలతో దద్దరిల్లింది. ఉత్తర ప్రదేశ్ లో ఆజాద్ పారిపోయినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో ధర్నా చివరిలో ఆజాద్ ప్రత్యక్షం అయ్యేసరికి ఆక్కడ వాతావరణం పెద్ద భూకంపం వచ్చినట్లు మారిపోయింది. ఆతర్వాత ఆజాద్ పోలిస్ లకు లోన్గిపోతునట్లు ప్రకటించేరు.

ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆజాద్ ని పట్టించిన వారికి 12 వేల రూపాయిల బహుమానం కుడా ప్రకటించేరు. 2017 జూన్ లో హిమాచల్ ప్రదేశ్ లోని డల్హౌసీ ప్రాంతంలో చంద్ర శేఖర్ ఆజాద్ పోలీసు లకు లొంగిపోయేరు.

RSS-BJP గుజరాత్ లో చేసిన రాజకీయ, సామాజిక ప్రయోగం తర్వాత దేశంలో అతి పెద్ద రాష్ట్రం, దళిత రాజకీయాలకు కేంద్ర బిందువు అయిన ఉత్తర ప్రదేశ్ ని ఎంచుకుంది. RSS-BJP కి ప్రదాన అడ్దంకి దళితులు, ముస్లిం లు. అందుకే ఈ రెండు వర్గాలను ఒకరిమీదకు ఒకరిని ఉసు గొల్పి తమ పబ్బం గడుపుకోవాలని చూసేరు. అలాగే హిందుత్వ శక్తులు ఇంకొక వైపు దళితుల మీద, ముస్లిం ల మీద దాడి చేస్తున్నారు.

Also read  నెల్లూరు జిల్లాలో మరోసారి దళితుల మీద దాడి!

ది గ్రేట్ చమర్ విలేజ్ కి

స్వాగతం – సుస్వాగతం

ఈ ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది. ఘర్క్లోలి గ్రామం, సహరాన్పూర్ లో భీం ఆర్మీ చేసిన మొదట పని ఇదే. రాజపుట్ లు ది గ్రేట్ రాజపుట్ అని ఎలా సంబోదిస్తారో ది గ్రేట్ చమర్ అని ఆత్మగౌరవం నిలబెట్టటానికి ఏర్పాటు చెసరు.

భీం ఆర్మీ తమ సామాజిక బాద్యతను నిర్వహిస్తుంది. బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ భోధించు, పోరాడు, సమీకరించు నే మాకు మార్గదర్శకం అంటాడు ఆజాద్. గ్రామాల్లో పిల్లలకు ఉచితంగా ట్యూషన్ లు చెబుతున్నారు. ప్రతి దళిత ఇంటిని సందర్శించి భీం ఆర్మీ కార్యకర్తలు బాబాసాహెబ్ నే మనకి మార్గం అంటూ బాబాసాహెబ్ యొక్క ఆశయాలు తెలియజేస్తున్నారు.  

పచ్చిమ ఉత్తర ప్రదేశ్లో భూస్వామ్యులు అధికంగా ఉన్న ప్రాంతంలో దళితుల పై కనికరంలేని వేధింపులు, బయపెట్టడం,బెదిరింపులు మరియు దాడులన్నీ సర్వసాదారణం. అందుకే భీం ఆర్మీ ని స్తాపించేరు. దళితులు ఉన్నత కులాల నుండి తమను తాము రక్షించు కోవడానికి తమని తాము కాపాడుకోవడానికి ఏర్పాటు చేసేరు.

Also read  యోగి 'రాంజీ' అంబేడ్కర్ ఒక కుట్ర!

ఆజాద్ తండ్రి ఒక స్కూల్ ప్రదానోపద్యుడు. తన ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్ లో ఆజాద్ కి కులం వలన ఎంత అవమానిచబడింది వివరించేరు. స్కూల్ ప్రదానోపాద్యుడు అయిన తన నీళ్ళ గ్లాస్ తనే తీసుకు వెళ్ళాలి. అలాగే ఉత్తరాఖండ్ లో ఒక స్కూల్ విద్యార్ధి  ని స్కూల్ టీచర్ తన గోధుమ పిండి తాకి మైల చేసేడ ని కొట్టి చంపేసిన ఘటన ఆజాద్ కి భీం ఆర్మీ పెట్టాడని ప్రేరణ ఇచ్చింది .

వ్యవస్థ మీద నమ్మకం ఉన్న చంద్ర శేఖర్ ఆజాద్ పోలీసులకు లొంగిపోయి ఏడాది కావోస్తున్నా ఇప్పటి వరకూ చంద్ర శేఖర్ కి బెయిల్ లభించక పోవడం విడ్డూరం. 

 

(Visited 191 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!