భీమా కోరేగాంవ్: మహార్ల విజయాన్ని ఆరగించుకోలేకపోతున్న నయా మనువాదం!

షేర్ చెయ్యండి
  • 156
    Shares

భీమా కోరేగాంవ్, 200 ఏండ్ల సజీవ చరిత్ర. బ్రాహ్మణ కుల సంస్కృతి కి అంటరానివారిగా ఊరికి దూరంగా వెలివేయబడిన వారి విజయ చరిత్ర. మా తాతలు నెయ్యి తిన్నారు, మా మూతులు వాసన చుడండి అన్న బ్రాహ్మణిజం, మా తాతలు వీరులు మా ” విజయ్ స్తూపం ” చూడండి అని ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీన లక్షలాది ప్రజలు విజయ ఢంకా మోగిస్తూ చెబుతున్న మహార్ల చరిత్ర. 

బ్రాహ్మణిజం ఎప్పుడు కూడా తనకు వ్యతిరేకమైన చరిత్ర, గుర్తులు ఏవి కూడా ప్రజల మెదళ్ళల్లో ఉండకూడదని తీవ్రంగా ప్రయత్నిస్తుంటాది. అలాంటి చిహ్నాలు గాని, గుర్తులు గాని ఉంటే తక్షణమే కూల్చివేయాలని బలంగా కోరుకుంటాది.

మన భారత దేశ చరిత్ర మొత్తం పరిశీలించిన బ్రాహ్మణ పండితులు తమకు వ్యతిరేకమైన చరిత్రల అనవాల్లను లారీల కొద్ది తగలబెట్టినట్లు వర్తమాన చరిత్రకారులు చాలా మంది చెపుతున్నారు.పైగా ఈ తరం ప్రజలు, యువకులు కూడా చూస్తున్నారు.

బౌద్ధాన్ని నాశనం చేసి, దాని చరిత్రను, జాతక కథలను సర్వ నాశనం చేసి, బౌద్ధులను కిరాతకంగా చంపి, బౌద్ధాన్ని ఈ దేశం నుండి తరిమేయటమే కాకుండా, చివరికి దాని అనవాలు కూడా లేకుండా చేసిన నీచమైన  చరిత్రను హిందూమతం మూటగట్టుకుంది.

కారణం బౌద్ధం కేవలం ప్రాజాస్వామిక విలువలను కోరుకుంది.  హిందూమతంలో ఉన్నా అప్రాజాస్వామిక, అనైతిక విలువులను తీవ్రంగా ఖండిస్తూ, అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడాలని తన బోధనలను పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

ప్రజాస్వామిక విలువలను పాటించటానికి ఇష్టపడని హిందూ మతం, బౌద్ధంలోనే కోవర్ట్ ఆపరేషన్ చేసి బౌద్ధాన్ని నాశనం చేసింది.

హిందూ మతానికి సవాల్ గా నిలుస్తున్న ఇస్లాం మతాన్ని కూడా ఈ దేశం నుండి తరిమి కొట్టటానిక అనేక ప్రయత్నాలుచేసి పాకిస్థాన్ అనే మరో కొత్త దేశాన్ని కూడా ఏర్పాటు చేసింది.

ఈ దేశం నుండి ముస్లిం లను తరిమి కొట్టటానికి చెయ్యని ప్రయత్నం లేదు చివరికి విఫలం చెందింది.ముస్లింలకు సింబల్ గా ఉన్న అనేక కట్టడాలను కూల్చి వారి మనోభావాలు దెబ్బకొట్టి, వారిని రెండవ తరగతి పౌరులుగా చూడాలని ప్రత్నాలు చేస్తుంది.

అందులో భాగంగానే ముస్లింలకు సంబంధించి ప్రతి కట్టడాన్ని వివాదం చేసి కూర్చుంది నేడు మతోన్మాద హిందూ బ్రాహ్మణ పాలక వర్గం. వాళ్ళ విషప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ లోని బాబ్రీ మసీదు లో రాముడు పుట్టాడాని, కనుక ఆ కట్టడం హిందువులకు సంబంధించినదని, దాన్ని హిందువులకు అప్పగించాలని దాదాపు ఏడు దశాబ్దాలుగా హిందూ మతోన్మాదులు అన్ని ప్రభుత్వాలను భేదిరిస్తూనే వస్తున్నారు.

Also read  ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్: వివాదాస్పదం అవుతున్న సినిమా!
భీమా కోరేగాంవ్: మహార్ల ఆత్మగౌరవ చిహ్నం!

భీమా కోరేగాంవ్ విజయ్ స్తూపం పీష్వా బ్రాహ్మణుల ఓటమికి, అంటరాని జాతుల విజయానికి దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత గల స్తూపం. ఈ స్తూపం నయా  మనువాదులకు 1818 లో వారి పూర్వికుల నీచ సంస్కృతిని తెలియజేస్తుంది. 

ఈ స్తూపం 500 మంది మహార్లు, 25 వేల మంది పీష్వా బ్రాహ్మణు ల రక్తాన్ని భీమా నదిలో ఏరులై పారించిన చరిత్రను గుర్తుజేస్తుంది. 

ప్రతి ఏటా లక్షలాది మంది మహార్లు, ఇతర దళిత, బహుజనులు దర్శించుకుని బ్రాహ్మణిజం యొక్క చీకటి చరిత్రను ప్రపంచానికి తెలియపరుస్తుంటే ఓర్చుకోలేక పోతున్నారు నేటి వారి వారసులు. 

గత సంవత్సరం జనవరి 1, 2018 న లక్షలాది వీరులను చూసిన పూణే బ్రాహ్మణ వర్గం వెన్నులో చలి పుట్టి, కుట్రలు చేసి దాడి చేసారు. 

1922, జనవరి 1 వ తేదీ నుండి బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఈ విజయ్ స్తూపాన్ని సందర్శించి మహర్ వీరులతో కలిసి ఆనాటి యుద్ధంలో గెలిచిన వారికి నివాళ్లు అర్పిస్తూ వచ్చేరు. 

ఆనాటి నుండి 2018 వరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కుట్ర దారులకు మనువాద పాలకులు అండగా జేరి లక్షాలది మంది దళితుల మీద దాడి చేశారు. 

దళితుల మీద దాడి చేసి అర్బన్ నక్షలైట్ లు అంటూ చరిత్రను వక్రీకరించి కోరేగాంవ్ వీరుల విజయ స్తూపాన్ని నిర్ములించాలనే కుట్రలకు పీష్వాల వారసులు ప్రయత్నిస్తున్నారు!  

కుట్రలకు తెరలేపుతున్న బ్రాహ్మణిజం!

అర్బన్ నక్షలైట్ లు అంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులు మిలింద్ ఏక్బోడె, శంభాజీ బిడే  భీమా కోరేగాంవ్ విజయ్ దినోత్సవం మీద కుట్రలు చేసి గతేడాది అల్లర్లు సృష్టించిన సంఘటన తెలిసిందే. 

ప్రధాన మంత్రికి అత్యంత సన్నితంగా ఉండే నాయకులే  ఈ కుట్రలకు పాల్పడటం అంటే దళితుల విజయ గాధను కూడా ఈ మనువాదులు చూడలేక పోవడం కుల వ్యవస్థ యొక్క అధమ సంస్కృతి. 

దళితులు తమ పూర్వీకుల చరిత్ర తెలుసుకుని ఎక్కడ ఈ మనువాద పాలనకు అంతం పలుకుతారో అని నిరంతరం బ్రాహ్మణ వ్యవస్థ వాస్తవ చరిత్ర మీద కుట్ర చేస్తూనే ఉంది.  కుట్రలో భాగంగానే దళితుల మీద  అర్బన్ నక్షలైట్ల నాటకానికి తెరలేపారు. 

Also read  ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్: వివాదాస్పదం అవుతున్న సినిమా!

సోషల్ మీడియా లో బహిరంగంగా ఆర్యుల వారసులం అంటూ నాజీ నియంతల దగ్గర నుండి నేటి వారి వారసులు అయిన సంఘ్ పరివార్ నాయకులను పొగుడుతూ మూల వాసులైన దళితుల మీద కుట్రలు చేస్తున్నారు. 

జనవరి 1, 2018 నాడు జరిగిన అల్లర్ల కుట్రదారుడికి (శంభాజీ బిడే ) దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ ఇవ్వాలనుకోవడం నేటి పాలకుల బరితెగింపుకి ఉదాహరణ.   

భీమా కోరేగాంవ్: చరిత్ర 

పీశ్వా బ్రాహ్మణులు నేడు కోరేగామ్ స్థూపాన్ని ఎందుకు కుట్ర చేస్తున్నారు? . ఆనాటి మహార్లు బ్రిటిష్ సైనికులతో కలిసి పిశ్వాల పాలనకు చరమగీతం పాడాలనుకున్నారు. 

దళితులకు మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టింది ఈ పీష్వా బ్రాహ్మణుల పాలనలోనే. ఆనాడు అంటరాని కులాలకు స్వేచ్ఛగా బజారులో తిరిగే హక్కు కూడా లేదు.

నడిబజారులో నడిచే హక్కు కూడా లేదు. చదువు, జ్ఞానం, ఉద్యోగం పొందే హక్కులతో పాటు మనిషితనాన్ని కూడా దళితులకు నిషేధించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనుస్మృతి వందకు వంద శాతం ఈ పీష్వా పాలనలోనే అమలు జరిగింది. 

వాళ్ళ పాలనలో ఆనాటి మహార్లు అనేక మైన అవమానాలు , ఆకలి, పేదరికం, అనారోగ్యం వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నారు.ఇన్ని బాధలు అనుభవించి బ్రతకడం కంటే చావటమే మేలనుకున్నారు.

మహార్లు శారీరకంగా దృడంగా ఉండేవాళ్ళు కావటంతో కొద్ది కొద్ది గా బ్రిటిష్ సైన్యంలోకీ ప్రవేశం పొందుతున్నారు. అప్పటికి పూన సంస్థానం బ్రిటిష్ సామ్రాజ్య వాదపెత్తనాన్ని అంగీకరించలేదు. కప్పం విషయంతో పాటు అనేక విషయాల్లో పూనా సంస్థానం,బ్రిటిష్ రాజ్యం మధ్య వైరుధ్యాలు పొడచూపి 1818లో యుద్ధం సంభవించింది.

అప్పటికే పిశ్వాల పాలనతో సర్వం కోల్పోయిన మహార్ ప్రజల తరుపున నిలబడి బ్రిటిష్ సైన్యంతో కలిసి పీష్వా లకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యాలని ఆనాటి మహార్ సైనికులు నిర్ణయించుకున్నారు.

అప్పటికి బ్రిటిష్ సైన్యం ఐదు వందల మంది, పీష్వాల సైన్యం చూస్తే 25 వేలు ఉంది. మహార్ సైనికులు పిశ్వాలతో యుద్ధం చేసే అవకాశం మాకు కల్పించమని బ్రిటిష్ అధికారులను వేడుకున్నారు.

పీశ్వాలు దగ్గర పెద్ద మొత్తంలో సైన్యం ఉంది, వారితో మనం యుద్ధం చేయలేము, సంధి చేసుకుందామని మహార్ సైనికులను నచ్చ చెప్పటానికి ఎంతో ప్రత్నించారు.

అయిన మహార్ సైన్యం బ్రిటీష్ అధికారుల విన్నపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించలేదు. పీష్వా ల పాలనలో ఎలాగూ మా జాతి ప్రజలు మనుషులుగా చచ్చిపోయా ఉత్తగా వాళ్ళ పరిపాలనలో చచ్చిపోయే కంటే పీష్వా లతో యుద్ధం చేసి చావటం మేలని, దయచేసి పీష్వా లతో యుద్ధం చేసే అవకాశం ఇవ్వమని అధికారులను వేడుకున్నారు.

Also read  ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్: వివాదాస్పదం అవుతున్న సినిమా!

మహార్ సైన్యాల విన్నపాన్ని అంగీకరించిన బ్రిటిష్ పాలకులు మొత్తంమీదా పీష్వా లతో యుద్ధం ప్రకటించారు. తమ కోరిక నెరవేరినందుకు మహార్ సైనికులు మరింత ఉత్సాహాంతో యుద్ధతంత్రాన్ని రచించుకొని 25 వేలమంది పీష్వా బ్రాహ్మణ సైనికులను ఐదు వందల మంది మహార్ సైనికులు ఊచకోత కోసి పీష్వా ల సైనికులను పూనా నగర సరిహద్దుల వరకు తరికొట్టి, పీష్వా చక్రవర్తి తలను పూనా నగర వీధులల్లో ఉరేగించి పీష్వా పాలనకు చరమగీతం పాడారు.

ఆనాటి విజయానికి గుర్తుగా భీమా కోరేగాం ఒడ్డున పెద్ద స్థూపాన్నినిర్మించి, ఆ స్తూపం పైన ఆనాటి యుద్ధంలో పాల్గొన్న మహార్ సైనికుల పేర్లు చెక్కించారు బ్రిటిష్ పాలకులు.

అంతటి వీరోచిత చరిత్ర కలిగిన ఆ స్థూపం దగ్గర ఉత్సవాన్ని ఆపటానీకె పని గట్టుకుని rss అల్లర్లు సృష్టిస్తుంది. తమ ఆధిపత్యాన్ని కూల్చిన ఆ స్థూపాన్ని ఈ బ్రాహ్మణ పాలకులు ఉంచుతారా? అసలకే ఇప్పటి మహారాష్ట్ర పాలకుడు ఫడ్నవిస్ పీష్వా బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడు. చరిత్రలో వాళ్ళ ఆధిపత్యం కూల్చి,రాజరికానికి దూరం చేసిన ఆ స్తూపం మీద పేర్లు కనిపించినప్పుడల్లా ఫడ్నవిస్ కు వెన్నులో చలి పుట్టుకొస్తాది.

పైగా భీమా కోరేగాం స్తూపాన్ని సందర్శించటానికి దేశం నలుమూలల నుండి లక్షలసంఖ్యలో దళితులు వస్తున్నారు. మహార్ వీరులను, పూలే, కబీర్, కాన్షిరామ్ బాబాసాహెబ్ డా అంబేడ్కర్ వంటి నాయకులను స్మరించుకుంటు పాటలు పాడుకుంటూ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. పైగా బ్రాహ్మణుల చేతిలో ఉన్న రాజ్యాధికారాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు నిర్వహిస్తున్నారు.

పీష్వా ల గుండెలపై మాయని మచ్చలా, మహార్ ల విరోచితానికి గుర్తుగా ఉన్న ఈ స్థూప నిర్మాణాన్ని నేటి హిందుపాలకులు ఉంచుతారా.? ఇప్పటికే స్థూపం సందర్శనకు వస్తున్నవారిపై Urban Naxals అని ముద్ర వేసి దళితులను అణిచివేసే కుట్రలకు మోడీ ప్రభుత్వం తెర లేపింది.

ఇప్పుడు దేశంలో నడుస్తుంది పక్క మతోన్మాదపు పాలన. గతంలో వీళ్లుకూల్చిన బాబ్రీ మసీదు. హుస్నాబాద్ అమర వీరుల స్థూపాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, భీమా కోరేగాం స్థూపాన్ని రక్షించుకోవటానికి దళితులు మెలకువ తో ఉండాలని మనవి చేసుకుంటున్నాను.

________________కసుకుర్తి. రామలింగం

 

(Visited 148 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!