భోధించు – పోరాడు – సమీకరించు!

షేర్ చెయ్యండి

చరిత్ర తెలియని వారు చరిత్రను నిర్మించలేరు:బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ 

అన్యాయం మనిషిలో ” విప్లవం ” పుట్టిస్తుందా !? అణిచివేత వ్యవస్థ మీద తిరుగుబాటు నేర్పిస్తుందా ? విప్లవం, తిరుగుబాటుకు అన్యాయం , అణిచివేత , దోపిడీనే మూల కారణం. అది అంతా పాచత్య చరిత్ర.

బారత దేశం లో అణిచివేత ,దోపిడీ ,అన్యాయం పుట్టినప్పుడు విప్లవం పుట్టలేదు – బాబాసాహెబ్ Dr. బి ర్ అంబేద్కర్ పుట్టెరు. ఉన్నత విద్య చదువుకున్నాడు ,ప్రపంచ విప్లవకారులను చదివేడు కాని విప్లవం తను నినాదం గా తీసుకోలేదు , ఆ వైపు తొంగి చూడలేదు. అణిచివేత , దోపిడీకి గురిఅవుతున్న ప్రజలలో సామాజిక ప్రజాస్వామ్య  విప్లవం పుట్టించేడు. ప్రజల హక్కులను దిక్కరించటం  అంటే మానవత్వాన్ని దిక్కరించటమే అన్నాడు. తన ప్రజల హక్కుల కోసం సామజిక విప్లవ కారుడు అయ్యేరు సాటి ప్రజలను “భోధించేడు -పోరాడేడు,సమీకరించేడు “

బాబాసాహెబ్ భోధించిన ప్రజలనుండి వచ్చిన కొత్త తరం తమ పోరాట పంధాను మార్చుకున్నారు కొంత మంది విప్లవ మార్గం పట్టేరు ” తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం ” సాదిద్దాం అని తమ పోరాటం మార్చుకున్నారు. అరచేతిని అడ్డం పెట్టుకుని సూర్యుడిని ఆపలేం అనేది ఎంత నగ్న సత్యమో బారత దేశం లో ఏ ఉద్యమం లో ఉన్నా కుల ఫ్యూడల్ వ్యవస్తను మార్చలేం అని తెలుసుకుని ఆ మార్గం నుండి బయట పడుతున్నారు. అయితే ప్రజాస్వామ్య బద్దంగా దశాబ్దం పైగా పోరాడి ,చుండూరు లాంటి కేసులో విజయం సాధిస్తే కోర్టులు చుట్టూ తిప్పి సరైన సాక్ష్యం లేదు అంటూ ముద్దాయిలను శిక్ష పడకుండా తప్పించినప్పుడు తుపాకీ గొట్టమే సరైనది అనిపిస్తుంది.!

Also read  సాంఘిక విప్లవం లేకుండా రాజ్యాధికారం సాద్యమా!

నిజమైన స్వేఛ్చ , సమానత్వం మనకి ప్రజాస్వామ్య పోరాటాల ద్వారానే వస్తుంది. అందుకే బాబాసాహెబ్ సమీకరించమన్నారు , బోధించమన్నాడు , నీ హక్కుల కోసం పోరాడమన్నాడు. చదువుకున్న ఏస్ సి , ఎస్ టి, బి సి ప్రజలు తమ విద్యను సామాజిక విప్లవం కోసం, తన ప్రజలను జ్ఞానవంతులు చెయ్యటానికి , విముక్తి కలిగించటానికి పాటుపడాలే కాని, మేధావులు , విజ్ఞానవంతులు తుపాకీ వైపు చూస్తే ప్రజలకు శాశ్విత ఉపయోగం ఉండదు. అందుకే డా. బాబాసాహెబ్ త్రికరణ సూత్రాలు భోధించు, పోరాడు,సమీకరించు నా చివరి మాటలు అన్నారు. డెబ్బై ఒక్క సంవత్సరాల బారత స్వతంత్ర దేశంలో పాలకులు నేటి వరకూ సామజిక న్యాయంకోసం మేము ముందు ఉన్నాం అన్నారే కానీ ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ అణగారిన వర్గాల ప్రజల సామాజిక స్తితిని మారుస్తాం అని అనలేదు. ఏ వర్గ ప్రజల సామాజిక స్తితిలో మార్పు రావాలి అన్నా ముందు ఆ వర్గ ప్రజల చరిత్ర, అస్తిత్వం తెలుసుకోవాలి బాబాసాహెబ్ డా అంబేడ్కర్ తన త్రికరణ సూత్రాలలో మొదటది ‘భోధించు’ అని చూచింది అందుకే. ప్రజలు తమ సమస్యల మీద లేదా జరుగుతున్న సామాజిక, రాజకీయ మార్పుల పైన సరైన అవగాన లేకుండా చైతన్యవంతులు కాలేరు . అణిచివేత, దోపిడీ  ఫై తిరుగుబాటు చెయ్యాలి అంటే ఆ అణిచివేత మీద , దోపిడీ మీద అవగాహన కలగాలి అందుకే సామాజికంగా దోపిడీకి గురి అవుతున్న ప్రజల మేదావులు, విద్యావంతులు ఆ వర్గ ప్రజలకు అవగాహన కల్పించాలి , ప్రజల మధ్య ఆ సమస్యల పై నిరంతరం చర్చ జరగాలి, అలా పోరాడిన ప్రజలను , చైతన్యం కలిగిన ప్రజలను కేంద్రీకరించి (సమీకరించి ) ఉద్యమించాలి. 

సామాజిక న్యాయం కాదు, సామాజిక స్తితిలో మార్పు కావాలి: మాన్యశ్రీ కాన్షీరాం

మాన్యశ్రీ కాన్షీరాం బహుజన సమాజ్ పార్టీ పేరుతొ బాబాసాహెబ్ త్రిఅక్రణ సూత్రాలను రాజకీయంగా అమలు పరచి ఉత్తర ప్రదేశ్ లో మొట్టమొదటిసారి ఎలాంటి రాజకీయ నేపధ్యంలేని కుమారి మాయావతిని ముఖ్యమంత్రి ని చేయగలిగేరు. 1990 దశకంలో దేశవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ తో బహుజనులలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చేరు. మాన్యశ్రీ కన్షిరాం తర్వాత అయిన వారసత్వం ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకువేల్లలేక పోవడంతో బహుజనుల రాజకీయ చైతన్యం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. ప్రస్తుతం బారత దేశం అత్యంత తొందరగా తమ సామాజిక స్తితిని మర్చుకోబోతుంది. దేశంలో నిత్యం జరుగుతున్న జాత్యహంకార దాడులు అయితేనేమి, హిందూ జాతీయ వాదంతో జరుగుతున్న దాడులు అయితేనేమి మొదట వాటికి గురి అయ్యేది ఎస్సిలు . అలాగే సరళీకృత ఆర్ధిక విధానలకు బాదితుడు పేద వర్గాల ప్రజలే! ఈ పరిణామాలు గమనించి ఎస్సి సమాజం ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు రచించాలి. తమ వర్గాల అభివృద్దికి నిరంతరం శ్రమించాలి అప్పుడే ఆ వర్గాల సామాజిక స్తితి లో మార్పు వస్తుంది. 

 

Also read  ఉత్తరప్రదేశ్ బా జ పా దళిత ఎం.పి లు తిరుగుబాటు!

 

(Visited 78 times, 1 visits today)

2 thoughts on “భోధించు – పోరాడు – సమీకరించు!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!