మతం బారతీయ సమాజాన్ని విడిదీస్తుందా లేక ఏకీకృతం చేస్తుందా? C/o కంచరపాలెం సినిమా ఏమిచెబుతుంది?

షేర్ చెయ్యండి
  • 28
    Shares
మతం మనచుట్టూ అనేక సంఘటనలకు మూల కారణం అవుతుంది. ఇటీవల విడుదల అయిన సినిమా C/o కంచరపాలెం సినిమాని చూస్తే ఇదే అర్ధం అవుతుంది. మతం మనుషలను విడదీస్తుందికానీ ఎన్నటికీ కలపదు. మతాలకీ, కులాలకీ అతీతంగా ఉన్నప్పుడే సమాజం వికసిస్తుంది.ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడి సంతోషంగా ఉండగలుగుతారు. 
 
అబ్బాయి సుందరం – అమ్మాయి సునీత, మిలటరీ లో పనిచేసే తండ్రి. చిన్నతనంలోనే పిల్లలు ఏమి వినాలి, ఏమి మాట్లాడాలి, ఎవరితో స్నేహం చెయ్యాలి, ఏ దుస్తులు ధరించాలి, ఎలా నడవాలి, ఎలా నిలబడాలి అనే సాంప్రదాయం, సంస్కృతి అని గిరిగీసి కూర్చున్న తండ్రి కూతరు సునీత. తన రెక్కల కష్టంతో మట్టి బొమ్మలు చేసుకుని బ్రతికే పూర్తిగా మాట్లాడలేని కొడుకు సుందరం. 
 
c/o kancharapalem
Image: C/o Kancharapalem movie poster
 
జోషఫ్, అమ్మోరన్న అనే  ఒక చోట లీడర్ అనుచరుడు, ఇంకొక చోట గ్యాంగ్ కి నాయకుడు. అమ్మోరన్న ఏమి చేబోతే అది క్షణాల్లో చేస్తాడు, ఎదురు తిరిగే మనిషికాదు. తల్లి, తండ్రి చిన్నతనంలోనే పోయిన  టీనేజర్. గాయత్రి బ్రాహ్మణ యువతి, తల్లిలేని పిల్ల. కాలేజీ చదువుతుంది, కాస్త ధైర్యం ఉన్న అమ్మాయి. సాంప్రదాయ నృత్యం నేర్చుకుంటుంది. 
 
సలీమా పవిత్రమైన ముస్లిం కుటుంబంలో పుట్టిన అమ్మాయి. తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎయిడ్స్ తో చనిపోయింది. తల్లి వృత్తినే తాను చేస్తుంది. రోజూ వైన్ షాప్ కి వెళ్లి ఒక క్యార్థర్ బాటిల్ తీసుకుంటుంది- గడ్డం, వైన్ షాప్ లో పనిచేసే వ్యక్తి. సలీమా కి ఇతనే రోజూ మందు సీసా ఇస్తాడు. 
 
సుందరం ఒక మధ్యతరగతి కాలనీలో ఉంటాడు. 49 సంవత్సరాల వచ్చినా పెళ్ళికాలేదు. ఒక్కడే ఉంటాడు. ఒక ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తుంటాడు.  ఆ ఊరివాళ్ల తలలో నాలుకలా ఉంటాడు. పెళ్ళికాలేదు అని అందరూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి శృతి మించిపోయి నట్టు గాడు అని కూడా అంటారు. 
 
మేడం ఒరిస్సా నుండి ట్రాన్సఫర్ అయి వస్తుంది. భర్త ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చనిపోయేడు. ఒకే ఒక కూతురు తన తమ్ముడు వద్ద పెంచుతుంది. సుందరం ఆఫీస్ లోనే పనిచేస్తుంది. 
మతం లో మానవత్వం ఉంటుందా!
అబ్బాయి సుందరం ఎనిమిదో క్లాసు – అమ్మాయి సునీత అంటే ఇష్ట పడుతూ ఉంటాడు. అబ్బాయి సుందరం తండ్రి తన ఇల్లు , బంగారం తనకా పెట్టి ఊరిలో పెద్ద వినాయకుడి బొమ్మ తయారీకి ఒప్పుకుంటాడు. ఆ విగ్రహన్ని కోరిన కొరిక వలెనే అమ్మాయి సునీత తనతో మాట్లాడింది అని అబ్బాయి సుందరం కి గట్టి నమ్మకం.
 
ఏదైనా ఆ విగ్రహం ముందు నుంచుని ప్రార్ధించి వెళ్తాడు. అమ్మాయి సునీత పాటలు పాడుతుంది కానీ అమ్మాయి నాన్నకి ఆ పాటలు అంటే ఇష్టం ఉండదు. ఆగస్టు 15 న స్కూల్లో జరిగే కార్యక్రమం కోసం అబ్బాయి సుందరం సాహసం చేస్తాడు. స్కూల్ మధ్యలో గోడ దూకి  బయటకు వచ్చి అమ్మాయి సునీత కి పాటల పుస్తకం కొని తెచ్చి తనే ధైర్యం చెప్పి అమ్మాయి సునీత చేత పాడిస్తాడు. ఆ పాట విన్న అమ్మాయి సునీత మిలటరీ తండ్రి కార్యక్రమం జరుగుతుండగానే అమ్మయిని తన్ని లాక్కెళ్లి , స్కూల్ మానిపిస్తాడు. అంతే కాదు తను ఉద్యోగం చేసే  ఢిల్లీ లో ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న అబ్బాయి సుందరం కోపం, కసి తన స్నేహితురాలు తనకి దూరం అయ్యింది అనే ఆక్రోశం తో తాను నమ్మకం పెట్టుకున్న వాళ్ళ నాన్న తల తాకట్టు పెట్టి చేస్తున్న వినాయకుడి ముందు నిలబడి ‘ఎందుకు ఇలా చేసేవు అని అడుగుతాడు అడిగి ఆ వినాయకుడిని రాళ్లతో కొడతాడు. 
 
జోసఫ్ తాను ప్రేమించిన అమ్మాయి గాయత్రి కోసం జులాయి గా తిరగడం మానేసి అమ్మోరన్న చూపించిన ఉద్యోగంలో చేరి నెల సంపాదనతో గాయత్రిని కలవాలని వస్తాడు. ఈ లోపల గాయత్రి తండ్రికి వీరి ప్రేమ విషయం తెలిసి ఉరేసుకుని చస్తాను అని బెదిరించి గాయత్రికి వేరే పెళ్లి చేస్తాడు. ఈ విషయం తెలిసిన జోసఫ్ చర్చికి వెళ్లి తన మెడలో ఉన్న తాను ఎన్ని పనులు వున్నా ఆదివారం చర్చికి వెళ్లడం మానని జోసఫ్ ప్రభువు ముందు నిలబడి తన మెడలో వేలాడుతున్న సిలువ దండను  ను తెంచి పడేస్తాడు. 
 
నేను పెట్టిన ముహూర్తం చుట్టుపక్కల ఏడు గ్రామాల్లో ఎవరూ పెట్టలేరు. తన శాస్త్రం పవర్ అలాంటిది. ఆ ముహుర్తం సమయంలో ఏ పని చేసినా అద్భుతంగా ఏ అడ్డు లేకుండా జరుగుతుందని మేడం కి చెబుతాడు పంతులు. పంతులు మాట విని తమ్ముడి కి తన కొలీగ్ సుందరం తో పెళ్లి విషయం చెబుతుంది మేడం. తమ్ముడు అడ్డం తిరిగి అక్కా అని చూడకుండా కొట్టి బంధిస్తాడు. 
 
సలీమా రోజూ అడ్డా దగ్గర కస్టమర్స్ కోసం నిలబడుతుంది. తన శరీరాన్ని అమ్ముకుని జీవిస్తుంది. వైన్ షాప్ లో పనిచేసే కుర్రోడు గడ్డం సలీమా ని ఇష్టపడతాడు. సలీమా వేశ్య అని తెలిసీ పెళ్లి చేసుకుంటాను అంటాడు. సలీమా అతని నిజాయితీని అర్ధం చేసుకుని పెళ్లి కి ఒప్పుకుంటుంది. రిజిస్టార్ ఆఫీస్ లో పెళ్ళికి సమయం తీసుకుని ఇద్దరూ పెళ్ళికి బట్టలు, ఇతర సామగ్రి కొంటారు. సలీమా ఇంటికి వచ్చేదారిలో ముస్లిం యువకులు అడ్డగించి పవిత్ర మతం లో జన్మించి వ్యభిచారం చెయ్యడం తప్పూ అంటూ సలీమా ని కొడతారు. తెల్లారితే పెళ్లి – కానీ సలీమా రాలేదు . ఇంటిలో నిర్జీవంగా పడివుంది. 
 
ఎన్ని కస్టాలు వచ్చినా తానూ నమ్మిన సాటి మనుషులు అండగా నిలబడి అటెండర్ సుందరం – మేడం వివాహం జరిపిస్తారు. ఇది కేరాఫ్ కంచరపాలెం సినిమా. 
 

 

Also read  పెరియార్ రామస్వామి బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఫై వెల్లూరు మునిసిపల్ కౌన్సిల్ లో చేసిన ప్రసంగం

ambedkar-quote
Image: Babasaheb Dr.Ambedkar’s quote
మతం సమాజాన్ని విడదీస్తుందా! 
నిత్యం మన చుట్టూ చర్చ జరుగుతున్న కులం – మతం, సంప్రదాయం పేరిట మనుషులను విడదీస్తున్న

వాటి యొక్క తీవ్ర రూపాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేడు దర్శకుడు. తను నమ్ముకున్న మతం సందర్భం లోనూ తనకు అండగా నిలబడలేదు. తను నమ్మనుకున్న దేవుడు తనకి కావాల్సింది ఇవ్వకుండా దూరం చేసేడు. తను ఇష్టపడే మతం తన ప్రేమను దూరం చేసింది. మరి నిత్యం మతం, మతం అని కొట్లాడే మనం మతం నుంచి నేర్చుకున్నది ఏంటి.? 
 
బాబాసాహెబ్ డా అంబేడ్కర్ అంటారు “మతం అనేది మానవ వికాసానికే గానీ, అభివృద్ధి నిరోధానికి కాదు” 
 
ఏ మతం అయినా ఒక్కటే స్వేచ్ఛ లేనప్పుడు. అబ్బాయి  సుదరం అయినా , సలీమా అయినా లేదా గాయిత్రీ అయినా మతం – కులం – సాంప్రదాయం బాధితులే. 
 
మన చుట్టూ రోజూ అనేక సంఘటనలు ఈ కులం – మతం వలన జరుగుతున్నాయి. మత ఉగ్రవాదం ప్రపంచాన్నే భయపెడుతుంది. మతోన్మాదం సిరియా, పాకిస్తాన్, లాంటి దేశాల్లో ప్రజల జీవన విధాన్నాన్ని అల్లకల్లోలం చేసింది. భారత దేశంలో కాశ్మిర్ లాంటి సుందర భూభాగంలో మతం నిత్యం నెత్తుటి మరకలతో తన సౌందర్యాన్ని కోల్పోతుంది. 
 
ఏ మతం అయినా స్వేచ్ఛ – సమానత్వం మరియు సోదర భావం వున్న మతాన్ని తాను ఇష్టపడతాను అంటారు నవభారత నిర్మాత బాబాసాహెబ్ డా అంబేడ్కర్. 
 
ఈ కులాల  వల్లనే ఒకప్పుడు మన దేశం స్వాతంత్య్రం కోల్పోయింది అని చెప్పాలి. ఇప్పుడు ఆ కులానికి మతం జోడైతే మళ్ళీ బారత దేశం స్వాతంత్య్రం కోల్పోవాల్సి ఉంటుంది.  ఒక దేశం – ఒకే జాతి గా జాతీయ బావం కులాల తో మత విభేదాలతో ఎన్నటికీ ఏర్పడదు. 
 
కులం – మతం పునాదులపై ఒక జాతిని గానీ, దేశాన్ని గానీ నిర్మించలేరు అని బాబాసాహెబ్ డా అంబెడ్కర్  1932 లో తన కుల నిర్ములనా అనే ప్రసంగ పాఠం లో జాత్ – పాట్ – తొడక్ మండల్ అనే హిందూ సంఘం యొక్క వార్షిక సభను ఉద్దేశించి అధ్యక్ష ఉపన్యాసం కోసం రాసేరు. 
 
కేరాఫ్ కంచరపాలెం కాదు, కేరాఫ్ భారత దేశం మతం – కులం బారిన పడి ఎన్నో ఏళ్లు విదేశీయుల పాలన లో మగ్గి పోయింది. దేశ విభజనకు మతమే కారణం. నేడు మనచుట్టూ జరుగుతున్న అనేక, అనేక సంఘటనలకు మతం కారణం అనే నగ్న సత్యం మనం కాదు అనలేని సత్యం. 
 
ఏ మతాన్ని నమ్ముకొని, మానవత్వమే మతం గా జీవించిన అటెండర్ సుందరం – నట్టు గాడు అని అవమానంగా పిలిపించుకునే సుందరం పెళ్లి మతాలకతీతంగా ఊరు అంతా వచ్చి నిలబడి చేసింది. 
 
మతానికి , మానవత్వానికీ మధ్య తేడా ని బారతీయులు గమనిస్తే దేశం శుభిక్షంగా వర్ధిల్లుతుంది. అగ్ర రాజ్యంగా ప్రపంచాన్ని ఏలుతుంది. 
(Visited 51 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!