మతత్వం: రాజకీయ ప్రేరేపిత మతత్వం మత ఉగ్రవాదానికి కారణమా !

షేర్ చెయ్యండి

మతత్వం నేడు ప్రపంచం ముందు ఉన్న అతి పెద్ద సవాల్. శ్రీలంక లో  ఈస్టర్ పర్వదినం సందర్బంగా ప్రత్యేక ప్రార్ధనలో ఉన్న వారిని మతత్వం లేదా మత ఉగ్రవాదం పొట్టనపెట్టుకుంది. 


శ్రీలంక లాంటి దేశంలో మతత్వం ఒకేసారి 290 మందికి పైగా ప్రాణాలు తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నెవ్వరపోయారు. అన్ని దేశాల ప్రజలు ఈ దుచ్చర్యలను ఖండిస్తున్నారు. 


క్రిస్టియన్ మత ఉగ్రవాదమా, ఇస్లామిక్ మత ఉగ్రవాదమా లేక హిందూ మత ఉగ్రవాదమా? అని ప్రశ్నించుకుంటే ఏ (మతత్వం) రాయి అయితేనేమి తలపగలగొట్టు కోవడానికి అని సమాధానంతో సర్దుకు పోతాము. 


7 వ శతాబ్దపు అరేబియాలో ఇస్లాం ఆవిర్భావం ఆనాటి ప్రపంచం మీద ప్రగతిశీలమైన ప్రభావం వేసింది. మహ్మద్ ఏక దైవం సిద్ధాంతాన్ని ప్రబోధించాడు.

ఒక దేవుడు తప్పా మరే దేవుళ్ళు లేరని చెప్పడం ద్వారా మహ్మద్ గొప్ప సామాజిక మార్పును సూచించాడు అంటారు ప్రముఖ చరిత్రకారులు రొమిల్లా థాపర్.


కానీ ఈ ఏక – దైవం భావనను ముస్లిం పండితులు , అతివాద ముస్లిం పండితులు తమ సొంత ఆలోచనా విధాన ద్వారా ప్రపంచం లో ఇస్లాం మతం మాత్రమే ఉండాలని దానికి జిహాద్ పేరిట ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారు. 


ఇస్లాం మతం యొక్క పునాది అయిన సోదరభావం పక్కన పెట్టి ఇస్లాం ఉగ్రవాదానికి ప్రణాళికలు చేసి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. 

Also read  ఫైల్యూర్ ఆఫ్ ఇండియన్ మెరిట్!


ప్రపంచ వ్యాప్తంగా 1980 నుండి మతత్వం మత ఉగ్రవాదం అనే మాట బాగా వినిపిస్తుంది. ప్రపంచ వ్యాపతంగా ఇస్లాం మతమే సర్వశక్తివంతమైనది, ఇస్లాం యొక్క సుప్రిమసీ కోసం ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారు. 


పచ్చిమ దేశాల రాజ్యకాంక్ష, మతత్వం, క్రైస్తవ మత వ్యాప్తి కోసం ఎన్నో హింసాత్మక సంఘటనలు జరిగేయి. 


మత హింస కు కారణం మతోన్మాదం ఒక్కటే కారణం కాదని పెక్కు మంది ఆధునిక సామజిక శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు చెబుతున్నారు. 


జాతీయ వాదం, రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలకు మతం అనేది ఆయుధంగా ఉపయోగపడుతుంది. మతం, మతత్వం అనే మత్తు ద్వారా  సామాజికంగా , ఆర్ధికంగా వెనకబడిన వర్గాలను టార్గెట్ చేసుకుని మత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. 


నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అస్తిత్వ ఉద్యమాలలో జాతుల మధ్య వైరం కాకుండా మతాల మధ్య వైరం గా తీర్చి దిద్దేరు. 


అనంతమైన ఈ విశ్వంలో మనకు తెలిసినంతవరకూ జీవులకు ఆవాసం కల్పిస్తుంది భూమి ఒక్కటే. పనిముట్లతో ప్రకృతిని  లోబరుచుకోవడానికి మనిషి చేసిన ప్రయత్నం నుండి సైన్స్ ఆవిర్భవించింది. 


ఆనాటి నుండి  నేటి వరకు సమాజంతో బాటే సైన్స్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. అదే సమయంలో మత వ్యాప్తి సమాజంలో చాప క్రింద నీరులో ప్రవేశించింది. 

Also read  అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: భారత క్రీడాకారిణి ద్యుతీ చంద్


మతత్వం, సాంప్రదాయ మతస్తులకు విదేశీ మతస్తుల ప్రభావం, వారి చేయూత పొందినప్పుడు విద్వేషాలకు కారణం అవుతున్నాయి. 


శ్రీలంక లో సాంప్రదాయ సూఫీ మతస్తుల ఉన్నంత వరకూ అక్కడ మత హింస లేదు. అరబ్బు దేశాల ప్రభావం, వేరే ఇతర తెగలు స్థానిక మతస్తుల మీద పైచెయ్యి సాధించడం లాంటివి జరిగినప్పుడు మత ఘర్షణలకు కేంద్ర బిందువు అవుతుంది.

 
భారత దేశం మీదకు దండ యాత్ర కు వచ్చిన అరబ్బులు, తుష్కురు లు , యవనాలు కాలంలో మత హింస లేదు. వారిది రాజ్య కాంక్ష మాత్రమే. 


భారత దేశం నుండి ముస్లిం లు పాకిస్తాన్ గా విడిపోయిన నాటి నుండే దేశంలో మత హింస జరుగుతుంది. 


శ్రీలంక లాంటి దేశంలో జాతుల మధ్య యుద్ధం / హింస  జరిగింది కానీ, ఇలా మత హింస జరగలేదు. ఇతర మతాల మీద దాడి జరగలేదు


అలాగే హైదరాబాద్ లాంటి ప్రదేశాలలో మత హింస లేదా ఉగ్రవాదులు పట్టుబడినప్పుడు వారి లింక్ అరబ్బు దేశాలతో, అక్కడి ఉగ్రవాదులతో సంబంధాలు కల్గి ఉంటుంది.


మతత్వం, లేదా మత విశ్వాసాలను పెంపొందించడానికి, వివిధ దేశాల నుండి వచ్చే ప్రతినిధులు వలన అయితేనేమి లేదా, ఆర్ధిక తోడ్పాటు వలన గానీ అతివాద నాయకుల , సంఘాల ప్రభావం స్థానికుల మీద పడుతుంది. 

Also read  బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ఆలోచనా విధానం-ఒక వర్తమాన విశ్లేషణ 


దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న మతత్వం, జాతీయవాదం గా రూపాంతరం చెంది హిందూ యేతరల మీద దాడికి ప్రేరేపిస్తుంది. 


మతత్వం, హిందూ జాతీయ వాదం భారత దేశంలో కూడా మత ఉగ్రవాదానికి ప్రేరణ అవుతుంది. ఇతర మతస్తుల పట్ల ద్వేషం పెంచడం ద్వారా ఈ పని సులువుగా జరుగుతుంది. 


మతం, మతత్వం పట్ల ప్రజలు ఆకర్షించబడటానికి కారణం వారిలోని అజ్ఞానం కాగా, పేదరికం, సామజిక స్థితి గతులు కూడా ప్రత్యేక కారణాలు అవుతున్నాయి. 


రాజకీయ ప్రేరేపిత మత ఉగ్రవాదం రాను, రాను అన్నీ దేశాల సమాజం మీద ప్రభావం చూపెడుతుంది. ఇది ప్రమాదకారిగా మారక ముందే అణిచివేయటానికి UNO లాంటి సంస్థలు చొరవ తీసుకోవాలి. 

(Visited 147 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!