మనువాద ఫాసిజం: దేశ విచ్ఛిన్నానికి కారణం అవుతుందా!

షేర్ చెయ్యండి
 
ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనువాద ఫాసిజం ఎదుర్కుంటానికి  అంబేడ్కరిస్టు లు సన్నద్ధం కావలి. మరో స్వతంత్ర పోరాటానికి దళితులు మేల్కోవాలి 
 
భారతదేశానికి స్వాతంత్య్రం రాకమునుపు జరిగిన రెండో రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొన్న గాంధి అస్పృస్యులు హిందువు లే కనుక వారికి ప్రత్యేక హక్కులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సమావేశం కి అధ్యక్షత వహించిన రామ్సే మేగ్నల్డ్ ముందు వధించాడు. 
 
నేటి మనువాదులు కూడా ఎస్సి , ఎస్టి లు హిందూ మతం లో భాగం అంటూ క్రైస్తవ , ఇస్లాం మతం మారిన వారి మీద దాడులు చేస్తున్నారు. 
 
ఘర్ వాపసీ పేరిట షెడ్యూల్ కులాల మరియు  బహుజనులను శాశ్వతంగా బానిసలు గా ఉంచడానికి ప్రయత్నం మరొకసారి చేస్తున్నారు. అవసరం అయితే మత మార్పిడి చట్టం తీసుకు వస్తాం అంటున్నారు. 
 
బాబాసాహెబ్ డా అంబేడ్కర్ నిమ్న కులాలు రెండు రకాల బానిస వ్యవస్త మీద పోరాటం చెయ్యాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఒకటి బ్రిటీష్ బానిస వ్యవస్థ అయితే రెండోవది బ్రాహ్మణ కుల వ్యవస్థ యొక్క బానిసత్వం. 
 
వర్ణ వ్యవస్థ యొక్క ప్రతినిధి అయిన గాంధి అస్పృశ్యులు గా ఉన్న ఎస్సి కులాలకు ప్రత్యేక రాజకీయ హక్కులు లేకుండా చేయ్యాలనే విశ్వప్రయతనం చేసాడు. 
 
అటు నుండి కాకపోతే ఇటు నుండి నరుక్కు రమ్మన్నాడు చాణిక్యుడు. గాంధి అపర చాణిక్యుడు గా పేరుగావించాడు కాబట్టి దళితులను అడ్డుకోవడానికి ముస్లింల డోరు కొట్టాడు గాంధి. 
 
ఆగాఖాన్ తో మంతనాలు జరిపి అస్పృశ్యత కు బయట ఉన్న ముస్లిం ల రాజకీయ హక్కులకు మద్దత్తు పలుకుతూ దళితుల హక్కులను నిరాకరించే ప్రయత్నం చేసాడు. 
 
గాంధి చేసిన కుట్రలే అతని వారసులు, నేడు మనువాద ఫాసిజం యొక్క ప్రతినిధులు  బహుజనుల మీద చేస్తున్నారు. వీరి కుట్రలను కుతంత్రాలను దళిత బహుజనులు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. 
 

మనువాద ఫాసిజం – సమాజం:

 
 
బ్రిటిష్ పాలకుల నుండి  అధికార మార్పిడి ఆర్య – బ్రాహ్మణుల చేతిలోకి మారి ప్రజాస్వామ్యం బ్రాహ్మణ స్వామ్యంగా మారిందంటానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. 
 
మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి తన అభర్ధులను 60 శాతం వరకు బ్రాహ్మణులకే టికెట్లు కేటాయించింది. ఒబిసి వల్లభాయ్ పటేల్ ను కాదని ఒక బ్రాహ్మణుడు ని ప్రధానిగా ఎన్నుకుంది. 
 
బ్రాహణులు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎక్కువ శాతం ఉద్యోగాలు బ్రాహ్మణులకే కట్టబెట్టారు. రాజ్యాంగం రాసే అవకాశం రావడం చేత బాబాసాహెబ్ డా అంబేడ్కర్ నిమ్న కులాలకు కొన్ని ప్రత్యేకమైన రక్షణ హక్కులు కల్పించారు. 
 
ఆర్ ఎస్ యెస్ కి చెందిన చిత్పవన్ బ్రాహ్మణుల నాయకత్వలో అధికారం పీఠం లో ఉన్న భారతీయ జనతా పార్టి బనియా – బ్రాహ్మణ కలయిక తో బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపరిచిన రక్షణ చట్టాలను అవహేళన చేస్తూ, వాటి రూపు మాపుతూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నాయి. 
 
భారత న్యాయ వ్యవస్థ ఇప్పుడు బ్రాహ్మణుల చేతిలో ఉంది. వారికి అనుగుణంగానే న్యాయస్థానాలు కీలకమైన రాజ్యాంగ చట్టాల మార్పుల మీద తీర్పులు ఇస్తున్నారు. 
 
సామాజిక అసమానతలు ఉన్నంతకాలం రాజకీయ స్థిరత్వం సాధ్యపడదని బాబాసాహెబ్ అభిప్రాయపడ్డారు. సామాజిక అసమానతలు తొలగించడానికి రాజ్యాంగ పరంగా కల్పించిన అవకాశాలను బూచి గా చూపించి ఇతర వర్గాలను రెచ్చగొట్టడం మనువాదుల కు వెన్నతో పెట్టిన విద్య. 
 
 రిజర్వేషన్లు, ఎస్సి , ఎస్టి చట్టం తదితర అంశాలు సమాజంలో అసమానతలు, అనుమానాలకు తావిస్తున్నాయని రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి కూడా బ్రాహ్మణస్వామ్యం వెనకడుగు వేయదు. 
 
 
స్వాతంత్య్రం వచ్చి 50 సంవత్సరాలు నిండి న సందర్బంగా అప్పటి లోక్ సభ స్పీకర్ పి ఏ సంగ్మా గారు లోక్ సభ లో ఒక ప్రత్యేక చర్చను తీసుకు వచ్చారు. 
 
దేశంలో అణగారిన వర్గాల మీద జరుగుతున్న దాడులు, అణిచివేత మీద ఒక నివేదిక ను సంగ్మా గారు స్వయంగా లోక్ సభ సబ్యులకు పంపిణీ చేసి చర్చను జరిపారు. 
 
ఆ చర్చ లో దేశంలో 85 % మంది ఉన్న అణగారిన వర్గాల మీద దాడులు, అవమానాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని తీర్మానించారు. 
 
స్వతంత్ర దేశంలో ఆ దేశ పౌరుల మీద సామాజిక దాడి తగ్గాలి గాని, పెరగడం చూస్తుంటే బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గారు చేసిన హెచ్చరిక నిజమని తేట తెల్లమైంది. 
 

మనువాద ఫాసిజం అంబేద్కరిస్టు ల కర్తవ్యం:

 
బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఏమంటారు అంటే ” బానిసలకు వారి యొక్క బానిసత్వం గురించి వివరిస్తే వారు బానిసత్వం మీద తిరగబడతారు” 
 
అంబేద్కరిజం యొక్క మొదటి లక్షణం ప్రజలను ఎడ్యుకేట్ చెయ్యడం, దానినే మనం తెలుగులో బోధించడం అంటున్నాము. 
 
మనువాద ఫాసిజం యొక్క లక్షణాలు, వారి ఎత్తుగడలు, ప్రణాళికలు మరియు ప్రస్తుతం వారు చేస్తున్న దమనకాండ నిమ్న వర్గాలకు చెప్పాల్సిన బాధ్యత అంబేద్కరిస్టు ( అంబేడ్కర్ – పూలే – పెరియార్ )  లదే.
 
 “నీ స్వకార్యాన్ని సాధించదలుచుకొన్నప్పుడు కలమైన, కత్తియినా ఒక్కటే” అన్నాడు మహమ్మద్ పైగంబర్ 
 
ఎస్సి లు హిందూ సమాజం నుండి విడిపోకుండా ఎలాగైనా అరికట్టి, కుల వ్యవస్థ లో వారి చేత మరలా నీచమైన వృత్తులు చేయించాలని మనువాదుల ప్రయత్నం. 
 
అంబేద్కరిస్టు లు మనువాదుల కుట్రలను బహుజన సమాజం ముందు ఉంచి ప్రజలను ఎడ్యుకేట్ చేయ్యాల్సిన బాధ్యత వారిది.
 
త్రిమూర్తులను సైతం ముప్పతిప్పలు బెట్టి, అష్టదిక్పాలకుల చేత ఊడిగం చేయించుకుంటూ ఆంధ్ర, ద్రావిడ, కన్నడ, కేరళ , సింహళ రాజ్యాలను ఏకఛత్రాది పత్యంగా  పరిపాలించిన రావణుడు పతనమైంది తన సోదరుడైన విభీషణుడు వలెనే కదా   
 
బహుజన సమాజం లో విభీషుణులకు కొదవలేదు. ఆనాడు యం సి రాజా, జగ్జీవన్ లాంటి విభీషణులు ఎందరో బాబాసాహెబ్ ను నిమ్న జాతుల హక్కుల కోసం పోరాడుతుంటే శత్రువు తో చేతులు కలిపి అడ్డుకునే ప్రయత్నం చేశారు. 
 
నేడు ఎందరో రాజకీయ నేతలు మనువాద ఫాసిజం తో చేతులు కలిపి కలియుగ విభీషుణులు లాగా తయారవుతున్నారు. వీరి నుండి కూడా దళిత సమాజాన్ని కాపాడిల్సిన అవశ్యకత ఉంది. 
 
డెబ్భై ఒక్క సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో సామాజిక అసమానతలు, ఆర్ధిక అసమానతలు ఇంకా తొలగక పోగా మనువాద ఫాసిజం వలన ఇంకా ఎక్కువ అవుతున్నాయి. 
 
మతం – పెట్టుబడిదారుడు ఫాసిజానికి పెద్ద అస్సెట్ అయితే, భారతదేశంలో బ్రాహ్మణిజం – పెట్టుబడిదారుడు మనువాద ఫాసిజం కు మూలకారణం. 
 
సంఘ్ పరివార్ శక్తులు బిజెపి ద్వారా మత రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యాలని తీవ్ర ప్రయత్నం చేస్తుంది. మత రాజ్యం అంటే కుల రాజ్యమే, బ్రాహ్మణ కుల రాజ్యం. ఈ కుల రాజ్యంలో శూద్రులైన బిసి లు, కమ్మ, రెడ్డి , వెలమ తదితర వర్గాల రాజ్యాదికారం కోల్పోవాల్సి వస్తుంది. 
 
దీనికి వ్యతిరేకంగా స్వేచ్ఛను కోరే అందరు హిందువులు, క్రైస్తవులు, ముస్లిం లు , సిక్కులు మనువాద ఫాసిజం కు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి. 
 
శతాబ్దాలుగా దుర్భర దరిద్రంలోకి, అజ్ఞానంలోకి మనల్ని నెట్టివేసిన, మన పూర్వీకుల సంస్కృతిని దోపిడీ చేసినా, రాజకీయంగా ఈనాటి అన్యాయాలను అణిచివేతను కావాలని మరిచిపోతున్నాం. 
 
తరం తర్వాత తరం దేవుడు పేరుతొ , మతం పేరుతొ, కులం పేరుతొ తర్వాత తరానికి వారసత్వంగా కొంత మంది వున్నత శ్రేణి గా మనలను దోచుకుంటూ ఉంటే మనం అది మన విధి అని ఊరుకుంటున్నాం. 
 
పెట్టుబడిదారుల  ఆర్ధిక దోపిడి ని మాత్రమే ప్రమాదకారి అనుకుంటున్నాం. బాబాసాహెబ్ డా  అంబేడ్కర్ ప్రసాదించిన ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం’ లాంటి వి తొలగించి మనువు రాసిన వర్ణాశ్రమ అధర్మ సూత్రాలను మనమీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు 
 
చరిత్ర ఏమి చెబుతుంది, భారతదేశాన్ని ఆక్రమించిన ఆర్య రాజులు,  స్థానికులను రాక్షసులని, వానరులని, అభివర్ణించి స్థానిక జాతులను అంతమొందించాలని దేవతలను ప్రార్థిచేవారు. 
 
నేటి మనువాద ఫాసిజం హేతువాదులు, అంబేద్కరిస్టు లు, దళిత వర్గాలను , క్రైస్తవ, ముస్లిం వర్గాలను ఇతర హిందువులకు శత్రువు గా చూపించి వారి మీద కు దాడులకు పాల్పడుతున్నారు. 
 
మనువాద ఫాసిస్ట్ లు తమని కాపాడుకోవడానికి ప్రభుత్వాలను, ఆర్ధిక సంపదను, సంపదను, సాహిత్యాన్ని ,న్యాయ వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 
 

చరిత్ర పునరావృతం అవుతుందా ?

 
మగధ రాజ్యం చిన్నాభిన్నం అయినప్పుడు ఈ అవకాశం కోసమే చూస్తున్న బ్రాహ్మణులు తమకి అనుకూలంగా ఉండేవారిని సింహాసనం మీద కూర్చోడానికి ప్రోత్సహించారు. ఉదాహరణ గుప్త వంశం. 
 
కాంగ్రెస్ మరియు ఇతర బహుజన  పార్టి లు  జాతీయ స్థాయిలో తన ప్రాభల్యం కోల్పోయినప్పుడు RSS లోని బ్రాహ్మణులు తమ విధేయులైన  నరేంద్ర మోడి ని ప్రధానిగా చేసారు. 
 
నిజానికి మోడి అనే కులం బనియా కులానికి సంభందించినది, బిజెపి జాతీయ అధ్యక్షుడు , హోం మంత్రి అమిత్ షా కూడా వ్యాపార వర్గానికి చెందిన కులస్తుడు. 
 
తమకి అనుకూలంగా ఉన్న శూద్ర కులస్తులైన కెసిర్, జగన్మోహన్ రెడ్డి ల చేత హోమాలను ,యాగాలు చేయిస్తూ పరోక్షంగా హిందు మతాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించే పని చేయిస్తున్నారు. 
 
బనియాల పాలనలో  బ్రాహ్మణ పూజారి వర్గాలు, పీఠాధి పతులు సమాజంలో తమ యొక్క ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 
 
దేశభక్తి, సంస్కృతి, జాతీయత అంటూ కొన్ని వర్గాల మీద దాడి చేస్తున్నారు. సంప్రదాయాలను ఉల్లంగిస్తూ యథేచ్ఛగా దోపిడి చేస్తున్న వర్గాలను అడ్డుకోకుండా దళిత , మైనారిటీల మీద దాడి చేస్తున్నారు. 
 
కేవలం బడుగు, బలహీన వర్గాలే టార్గెట్ గా చేస్తూ మనువాద ఫాసిజం ఒకవైపు ఈ దేశాన్ని తగలబెడుతూ వస్తుంది. 
 
హిందువు ఒక తత్వవేత్త కావొచ్చు, ప్రభుత్వ అధికారి కావొచ్చు, న్యాయాధిపతి కావొచ్చు , రాజకీయ నాయకుడు అవ్వొచ్చు, కానీ మొదట అతను ఒక కులస్తుడు. ఒక కులానికి చెందిన వ్యక్తిని హిందువు గానో , భారతీయుడి గానో భావించే వీలు లేదు. 
 
అందుచేత డా బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు చెప్పినట్లు “మతం, కులం, పునాదుల మీద ఒక జాతిని గాని, దేశాన్ని గాని నిర్మించలేము” 
 
RSS – BJP కట్టాలనుకునే హిందూ రాజ్య కోటను బద్దలు కొట్టాల్సిన బాధ్యత మనదే! అందుకు “బోధించు, పోరాడు, సమీకరించు” 
(Visited 34 times, 1 visits today)
Also read  హిందీ బాష ను మనం ఎందుకు స్వీకరించాలి? #StopHindiImposition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!