మనుస్మృతి దహనం!

షేర్ చెయ్యండి

బాబాసాహెబ్ డా బి ర్ అంబెడ్కర్ గారు ఏ సమస్య అయినా దాని మూలాలలోకి వెళ్లి పరిశోధించి తగు నిర్ణయం తీసుకుంటారు. హిందువు లకు మనుధర్మ శాస్త్రం ఒక Constitution లాంటిది. ఇందులో కుల విభజన ఉంది. ఇదే వర్ణ విభేదాలకు కారణం. ప్రజల మధ్య అసమానతలకు కారణమైంది. అంటరాని కులాలకి ప్రధమ శత్రువు ఈ హిందూ ధర్మ శాస్త్రం. అది అంటరాని కులాలకు అధర్మ శాస్త్రం అయ్యింది అని గ్రహించిన బాబాసాహెబ్ డా అంబెడ్కర్ , డిసెంబర్ 25 జరిగిన సభలో చేసిన నాలుగు తీర్మనాలలో మనుధర్మ శాస్త్రం దహనం చెయ్యడం కూడా ఒకటి.

మహాద్ లో దళిత జాతులతో డా అంబెడ్కర్ గారు సమావేశం అయ్యేరు. దాదాపుగా 6 వేల మంది హాజరు అయ్యేరు.
మహాద్ సత్యాగ్ర పోరాటం మొదలైంది. ప్రజలు ఊరేగింపుగా వచ్చేరు.

హిందూ సమాజం లో అసమానతకు దారితీసిన ఈ వర్ణ వ్యవస్థ పోవాలనీ, అంతరాణితనాన్నీ నిర్మిలించాలనీ, ఇవి ఉన్నంత కాలం హిందూ సమాజం బాగుపడదు అని చెప్పేరు బాబాసాహెబ్ డా అంబెడ్కర్.

Also read  స్టేట్ సోషలిజం - బారత ఆర్ధిక, సామజిక, రాజకీయ ప్రజాస్వామ్యం: డా.అంబేడ్కర్ ప్రతిపాదనలు!

బారత సమాజం లో అణగారిన వర్గాల పట్ల మిగతా కులాలు అంత కాఠిన్యం వహించటానికి, వారిపై దౌర్జన్యాలు,దురాగతాలు జరగటానికి మనుధర్మ శాస్త్రం కారణం. దీనిని తగల బడితే తప్పా సమాజం బాగుపడదు అని ఆక్రోశం తో, ఆవేదనతో డిసెంబర్ 25 వ తేది రాత్రి తొమ్మిది గంటల కు బహిరంగంగా దహనం చేసేరు.

ఈ సంఘటన తో హిందు సమాజంలో అలజడి మొదలైంది. వారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తేయి. ఈ సంఘటన సువర్ణ హిందువులకు , హిందూ మతానికి మొదటి హెచ్చరికలాంటిది అని చెప్పవచ్చు.

 

 
(Visited 21 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!