మమతా బెనర్జీ: సిబిఐ ఆఫీసర్లను నిర్బంధించిన బెంగాల్ ప్రభుత్వం

షేర్ చెయ్యండి
  • 152
    Shares

భారత రాజ్యాంగం ఎంత సరళంగా కనిపిస్తుందో, అవసరమైనప్పుడు దుర్బేథ్యం గా ఉంటుంది.

రాజ్యాంగ చట్ట సభలో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగం.

ఈ సాయంత్రం కొలకొత్త లో జరిగిన పరిణామాలు గమనిస్తే, మన రాజ్యాంగం యొక్క విశిష్టత అర్ధం అవుతుంది.

ఈ సాయంకాలం కోల్ కొత్త లో జరిగిన అనూహ్య పరిణామాలు మొత్తం వివాదానికి దారితీసింది. చిట్ ఫండ్ కేసులో సిపిఐ ని విచారించటానికి వచ్చిన సిబిఐ ని బెంగాల్ పోలీసులు నిర్బంధించారు. 


కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తమని బెదిరించాలని చూస్తుందని, అందుకు మేము బెదిరిపోవమని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. 


సిబిఐ యొక్క చర్యలకు నిరసనగా హరారే స్ట్రీట్ మెట్రో పోస్ట్ కంట్రోల్ పోలీస్ స్టేషన్ ముందు మమతా బెనర్జీ ధర్నా కి కూర్చున్నారు. 


సిబిఐ యొక్క చర్యలకు నిరసనగా హరారే స్ట్రీట్ మెట్రో పోస్ట్ కంట్రోల్ పోలీస్ స్టేషన్ ముందు మమతా బెనర్జీ ధర్నా Image: The Hindu


శారదా చిట్ ఫండ్ కేసులో కోల్ కొత్త  పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ ని ప్రశ్నించటానికి వచ్చిన సిబిఐ. 


రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సిబిఐ రావడం మమతా ఆగ్రహానికి కారణం. మమతా ధర్నా లో “సేవ్ డెమాక్రసీ – సేవ్ కంట్రీ” అంటూ నినాదాలు ఇస్తూ ధర్నా కి దిగేరు. 

Also read  జస్టిస్ రంజన్ గొగోయ్: స్వతంత్ర న్యాయవస్థ మీద లైంగిక ఆరోపణలు


ఈ ధర్నా కి దిగటానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరియు జాతీయ సెక్యూరిటీ సలహాదారుడు అజిత్ దావోల్ లే కారణం అంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. 


సిబిఐ మా రాష్ట్రంలోకి అనుమతి లేకుండా ఎలాంటి విచారణ చేపట్ట కూడదంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఇచ్చిన కొన్ని గంటల్లోనే బెంగాల్ ప్రభుత్వం కూడా అలాంటి జిఓ నే ఇచ్చింది. 


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంభందాలు లేకుండా ఉంటే ఇలాంటి సంక్షిబాలే వస్తాయి. కేంద్రంలోని ప్రభుత్వాలు తమ రాష్ట్రాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి కానీ వారిమీద అధికారం చేపట్టకూడదు. 


సమైక్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచెయ్యాలి కానీ కేంద్రం రాష్ట్రల మీద పెత్తనం చెలాయించ కూడదు.

సిబిఐ తమ పర్మిషన్ లేకుండా రాష్ట్రంలో ఎలాంటి విచారణ చేపట్టకూడదు అని ఆర్డర్ చేసినా, కేంద్రం రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి 72 సంవత్సరాల స్వాతంత్ర్య దేశంలో మొదటిసారిగా నవ్వుల పాలైంది.

Also read  సంత్ రవిదాస్ మందిరం కూల్చివేత: బెదిరింపు ధోరణిలో సుప్రీం కోర్టు తీర్పు!

అధికారంలో లేనప్పుడు జన సంఘ్ నుండి బిజెపి వరకూ కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేసి నేడు అదే సిబిఐ తో రాష్ట్రాలను బయపెట్టాలని చూడటం బిజెపి యొక్క ద్వంద నీతికి నిదర్శనం.

మోడీ భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. లేదంటే దేశం ముక్కలు అవుతుంది.

దేశం కేంద్ర ప్రభుత్వం సొత్తు కాదు, తమకి నచ్చిన వారిని బయపెట్టటానికి.

ప్రజలు కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలను ఖండించాలి.

ఈరోజు బెంగాల్ లో జరిగిన పరిణామాలు చిన్నవి కాదు. రాజ్యాంగం సంక్షోభంలో కి నెట్టేవిధంగా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి. బెంగాల్ గవర్నర్ ఈ సంక్షోభం మీద రాజ్యాంగపరంగా అనుసరించాలి.

రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ దుందుడుకు చర్యలు మీద బెంగాల్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళవచ్చు. న్యాయం కొరవచ్చు.

భారత ప్రజలు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం ఎంటటే రాజ్యాంగం బలహీనంగా ఉండే దేశాలలో అయితే బెంగాల్ లాంటి ఘటనలు జరిగినప్పుడు అంతర్ యుద్దాలు జరిగేవి. మిలటరీ జోక్యం చేసుకునేది.

Also read  దళిత నాయకులు: ఆంధ్రా మార్క్సిజం చరిత్రలో కానరాని దళిత నాయకులు!

కానీ భారత రాజ్యాంగం ఏ ఒక్క వ్యవస్థకి ఈ దేశం మీద సర్వాధికారాలు ఇవ్వలేదు.

హిట్లర్ వారసులు వచ్చినా ఇంకెవరు వచ్చినా పప్పులు ఉడకవు.

మోడీ నియంతలా పాలించాలనుకుంటే ఈ దేశం ఒప్పుకోదు, ఈ దేశ రాజ్యాంగం ఒప్పుకోదు.

సో మోడీ అయినా చాయ్ వాలా అయినా రాజ్యాంగ సేవకులే కానీ రాజులు కాలేరు.

(Visited 250 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!