మహారాష్ట్ర ఎన్నికలు 2019: 17 లక్షల దళితుల, 10 లక్షల ముస్లింల ఓట్లు మిస్సింగ్!

షేర్ చెయ్యండి
  • 111
    Shares

మహారాష్ట్ర ఎన్నికలు 2019 , త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల లో  17 లక్షల దళితుల, 10 లక్షల ముస్లిం ఓట్లు తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. 


జనతాదళ్ ( యునైటెడ్ ) జనరల్ సెక్రటరీ జస్టిస్ ( రిటైర్డ్ ) బి. జి  కోల్స్ పాటిల్ గత శుక్రవారం నాడు ముంబయి లో ఈ విషయం మీడియాకు తెలియజేశాడు. 


మహారాష్ట్రలో 40 లక్షల ఓటర్లు ఉండగా అందులో 27 లక్షల మంది ఓటర్ల ను తొలగించడం అంటే బిజెపి ప్రభుత్వం గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతుందో అర్ధం అవుతుంది. 


హైదరాబాద్ కి చెందిన సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం దాదాపుగా 39,27,882 ఓటర్లు లేదా 4.6 శాతం ఓట్లు మిస్ అయినట్లు ఆ సంస్థ తెలియజేసింది. 


తొలగించిన ఓట్లు 39,27,882 పేర్ల లలో 17 లక్షల మంది దళిత మరియు 10 లక్షల మంది ముస్లిం ఓటర్లు కావడం గమనార్హం. 


లోక్ సభ ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యం గా ఈ కుట్రకు తెరదీశారు. ముంబయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి జి కోల్స్ -పాటిల్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. 

Also read  లోక్ సభఎన్నికలు: భారత దేశంలో ఎన్నికల చరిత్ర -2


దళిత ముస్లిం లో ఓట్లు తొలగించినట్లు గా తన నెట్వర్క్ తో చేసిన సర్వే ద్వారా బయట పడింది. 


హైదరాబాద్ కి చెందిన ఐటి ఇంజనీరు  ఖలిద్ సైఫుల్లా,  ఫౌండర్  మిస్సింగ్ ఓటర్ యాప్” ఈ సమాచారాన్ని బయట పెట్టారు. 


సైఫుల్లా లెక్కలు ప్రకారం 12.7 కోట్ల ఓటర్ల పేర్లు దేశవ్యాప్తంగా తొలగించబడ్డాయని అని చెబుతున్నాడు. అందులో 3 కోట్ల ముస్లిం ఓటర్లు ఉండటం గమనార్హం.

వీళ్లంతా ఏప్రిల్ 11 వ తేదీ నుండి మొదలయ్యే ఎన్నికల్లో తమ ఓటు హక్కును కోల్పోతారు. 


సైఫుల్లా మరియు అతని టీమ్ మహారాష్ట్ర లో  మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గంలో 69 స్థానాలలో సర్వే చేసినట్లు చెప్పారు.


జెడి ( యునైటెడ్ ) నేత పాటిల్  మీడియా తో మాట్లాడుతూ ఎన్నికలకు ఇంకా సమయం వుంది కాబట్టి, ఎన్నికల కమీషన్ తొలగించబడిన ఓటర్ల పేర్లు ఓటర్ల లిస్ట్ లో చేర్చడానికి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


తమకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లు తొలగించి ఎన్నికలకు వెళ్లడం రాజ్యాంగ వ్యతిరేక చర్యగా భావించాలి. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న పార్టీలను ఎన్నికల కమీషన్ ఎందుకు రద్దు చెయ్యకూడదని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. 

Also read  ఎన్నికల మ్యానిఫెస్టో: సామాజిక అభివృద్ధికి అడుగులు వేయలేని ప్రాతీయ పార్టీలు!


ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పార్టీ అయినా వైస్సార్ కాంగ్రెస్ పార్టి అభిమానుల ఓట్లు తొలగించినట్లే ఇప్పటికే పెద్ద దుమారం రేగింది. 


ప్రజల డేటా ని ప్రభుత్వాలు ఎదేచ్చగా అక్రమాలకు వాడుకుంటున్నారు. ఆధార్ కార్డు లోని ఇంటిగ్రేటెడ్ డేటా ను కూడా దొంగలించి ప్రభుత్వాలు తమ పార్టి సౌలభ్యం కోసం ఉపయోగించుకుంటున్నాయి. 


గత నాలుగు నెలల క్రితం తెలంగాణ అసెంబ్లి కి జరిగిన ఎన్నికల్లో 25 లక్షల ఓటర్ల పేర్లు లేక ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. 


ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల కమీషన్ నింపాదిగా ప్రజలకు క్షమాపణ చెప్పింది. 


పాలక పార్టీలు తమ పాలన ద్వారా ఓటర్ల మనుసు గెలుచుకోలేక ఇలా అడ్డదారులు తొక్కడం కొత్త ట్రెండ్ గా మారింది. 


ఒకప్పుడు ఎన్నికల్లో గెలవడానికి ధనం , మద్యం మరియు రిగ్గింగ్ చేసి గెలిచేవారు. నేడు ఏకంగా వ్యవస్థ కె కన్నాలు వేశారు రాజకీయ పార్టీలు. 

Also read  దళితుల ఐక్యత రాజ్యాధికారం ఎండమావేనా!


ప్రజలు ఈ చర్యను ఎలా తీసుకుంటారో ముందు ముందు వేసిచూడాలి. ప్రజలు తమ హక్కులు కోల్పోతే నియంతృత్వం మనల్ని పాలిస్తుంది. 


భారత దేశంలో సామాజికంగా ఒక పెద్ద ఉద్యమం రాకపోతే ధన బలం, కండ బలం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫ్యూడల్ శక్తులు, ఫాసిస్ట్ లు దేశాన్ని ఆక్రమించు కుంటారు. 


బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గారు రాజ్యాంగ చట్ట సభలో ప్రసంగిస్తూ చేసిన హెచ్చరికలు నిజం అయ్యే అవకాశం ఉంది. 

(Visited 66 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!