మహిళా అబ్యుదయవాది బాబాసాహెబ్ డా. అంబేడ్కర్!

షేర్ చెయ్యండి
  • 3
    Shares

నేడు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ స్వేఛ్చ, సౌబ్రాతత్వం కోరుకున్న వ్యక్తీ బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ని  గుర్తు చేసుకోవడం సమయోచితం. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ అంటే మెజారిటీ  ప్రజలు నిమ్నజాతుల నాయకుడు గానే చూస్తారు.  బ్రిటీష్ కాలం నుండే స్త్రీ ల పట్ల సానుబూతితో పాటుపడిన మహత్మా జ్యోతీరావు పులే యొక్క స్పూర్తి తో బాబాసాహెబ్ స్త్రీల కు బారత రాజ్యంగం లో, హక్కులను, గౌరవాన్ని కల్పించేరు. 

ఒకానొక సందర్భంలో ఆనాటి ప్రధాని శ్రీమతి  ఇందిరా గాంధీని కేరళా రాష్ట్రం లో  దేవాలయంలో ప్రవేశించడం నిరాకరిస్తే ఆమె చేసిన కామెంట్ బాబాసాహెబ్ యొక్క ముందు చూపు మహిళ ల పట్ల ఆయినకు ఉన్న ద్రుక్పధం అర్ధం అవుతుంది. హిందూ మతం మహిళలను దేవుడు దర్శనానికి కుడా నిరాకరిస్తే బాబాసాహెబ్ ఏకంగా దేశ ప్రదానిని చేయ్యగలిగేడు. అదీ బాబాసాహెబ్ డా అంబేడ్కర్ రాజ్యాంగం యొక్క గొప్పతనం అంటూ ఇందిరా గాందీ ప్రసంసించేరు.   

 

బొంబాయి లోని శనీస్వర్ దేవాలయం కానీ , శబరిమల లోని అయ్యప్ప దేవాలయం లోకి చట్టపరంగా మహిళ లను అనుమతి ఇస్తున్నారు అంటే అది బాబాసాహెబ్ డా అంబేడ్కర్ మహిళ లకు రాజ్యంగం లో పొందుపరిచిన సమాన హక్కుల వలెనే అనే గుర్తించాలి. 

Never mind, if your dress if full of patches, but see that it is clean. None can restrict your freedom in the choice of your garments. Attend more to the cultivation of the mind and spirit of self-Help. – Babasaheb Dr. B. R. Ambedkar, while addressing women of depressed classes on 18th July 1927.

అణగారిన మహిళల యొక్క దృక్పధం ఏవిధంగా ఉండాలో బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ 1927, జులై 18 న వేలమంది అణగారిన కులాల మహిళల సభలో మాట్లాడుతూ చెప్పేరు. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కి మహిళల సాధికారత పట్ల ఒక విశాలమైన ఆలోచనా విధానం ఉంది. తను చదువుకునే రోజుల్లో న్యూయార్క్ నుండి తన తండ్రి స్నేహితుడికి ఉత్తరం రాస్తూ మహిళలకు విద్య యొక్క అవసరం అది దేశ ప్రగతికి ఉపయోగంగా ఉంటుది అని పేర్కొన్నారు. పురుషులతో పాటు మహిళలకు విద్యను అందించగలిగితే గొప్ప అభివృద్దిని మనం చూస్తాము అని రాసేరు. I measure the progress of community by the degree of progress which women had achieved.

Also read  దళిత మహిళా ఉపాధ్యాయురాలిపై వేధింపులు!

బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ తను ప్రారంభించిన వార్త పత్రికలు మూక్ నాయక్, బహిష్కృత బారత్ లో మహిళలకు సంభందించిన వార్తలు, వారి సమస్యలు గురించి ప్రచురించేవారు.

చదవడం, రాయడం వస్తే చాలు మహిళల లో చాల అభివృద్దిని చూడగలం, కాబట్టి మీ అమ్మాయిలను స్కూల్ కి పంపండి అని అణగారిన మహిళల సభలో వారికి ఉపదేశం ఇస్తారు. మహిళలు గొప్పగా జీవించాలి అని బాబాసాహెబ్ కోరిక అందుకే వారికి చెబుతూ , మహిళలు పుట్టిందే గొప్ప కార్యాలు సాధించడానికి, అని బాలికలకు చెప్పాలి, వారిలో ఆత్మనూన్యత పోగొట్టాలి అని, విద్య ద్వారా వారి మానసిక స్తితిని ఏ పరిస్తితులు అయినా దైర్యంగా ఎదుర్కునే విధంగా నేర్పించాలి అని చెప్పేరు. వివాహితులకు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఇచ్చినంత స్పూర్తి మరొకరు ఇచ్చి ఉండరు అనటంలో అతియోశక్తి కాదు. పెళ్లి అయిన స్త్రీ తన బర్తకు స్నేహితురాలుగా ఉండాలి , సమాన హోదా తీసుకోవాలి అంతేకానీ  బర్తకు బానిసగా ఉండకూడదు, బర్తకు బానిసగా ఉండే స్తితి ఎట్టి పరిస్తితుల్లో ఉండకూడదు అంటారు. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ 1938 నవంబర్ 10 న బొంబాయి అసెంబ్లీ కౌన్సిల్ లో మాట్లాడుతూ మహిళలు ఎక్కువ మంది పిల్లలను కనడంలో వచ్చే ఆరోగ్య సమస్యలు గురించి చెబుతూ ప్రతి మహిళా కుటుంబ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని తన ఉపన్యాసంలో పేర్కొన్నారు.

Also read  స్టేట్ సోషలిజం - బారత ఆర్ధిక, సామజిక, రాజకీయ ప్రజాస్వామ్యం: డా.అంబేడ్కర్ ప్రతిపాదనలు!

బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ 1942లో  వైస్రాయ్ కౌన్సిల్ లో కార్మిక శాక  మంత్రిగా ఉన్నప్పుడు మెటర్నటీ సెలవులు ఉండాలి అని బిల్లును ప్రవేశ పెట్టి సాధించేరు. అంటే బొంబాయి అసెంబ్లీ కౌన్సిల్ లో తను మాట్లాడిన ఉపన్యాసానికి అనుగుణంగా తనకి అధికారం వచ్చే సరికి చేసి చూపించేరు.ఇలాంటి విజనరీ నాయకుడిని మనం ప్రపంచంలో అతికొద్ది మందిని మాత్రమె చూడగలుగుతాము. మాట్లల్లో చెప్పడమే కాదు చెపింది చెయ్యడం కుడా బాబాసాహెబ్ అంబేడ్కర్ యొక్క కార్యదీక్షకు అద్దంపడుతుంది.

దేశానికి స్వాతంత్ర్యం రాకముందు హిందూ సమాజంలో ఆడవాళ్ళను బానిసలుగా అమ్ముకునే పరిస్తితి ఉంది. నవబారత నిర్మాత గా, రాజ్యంగం రచన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా బాబాసాహెబ్ డా అంబేడ్కర్ బారత రాజ్యాంగంలో  ఆర్టికల్ 14 మరియు 16లో మహిళలకు సమాన హక్కులు కల్పించిన ఘనత బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ది.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ మహిళల అబ్యుధయం కోసం పార్లమెంట్ లో హిందు కోడ్ బిల్లును ప్రవేశపెట్టేరు. బహుబార్య విధానాన్ని మరియు పెళ్లి అయిన స్త్రీలకు ఆస్తిలో హక్కు, బాలికల దత్తతు నియంత్రణ, విడాకులు తీసుకున్న మహిళలకు హక్కులు, నష్ట పరిహారము తదితర అంశాలతో కూడిన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశ పెట్టేరు. ఆ (హిందు కోడ్) బిల్లు ను అడ్డుకున్న సవర్ణ హిందూ సబ్యులకు నిరసనగా తన పదవికి రాజీనామా చెసరు. బారత దేశ చరిత్రలో ఇప్పటివరకూ మహిళా హక్కుల కోసం రాజీనామా చేసిన ఏకైక వ్యక్తీ బాబాసాహెబ్ డా అంబేడ్కర్ మాత్రమె.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ పెద మహిళల్లో మరియు నిరక్షరాస్య మహిళల్లో మహిళ హక్కుల కోసం వారిని బాగా ప్రబావితం చేసేరు. ముక్యంగా బాలికల వివాహం, అన్యాయలను ఎదుర్కోవడం, దేవదాసీ పద్దతి ని నిర్మూలించడం తదితర అంశాలలో స్పూర్తిగా ఉన్నారు.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ బార్య మాత రమాబాయి 1928 జనవరిలో బొంబాయి లో ఒక మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘానికి అధ్యక్షురాలుగా ఉన్నారు.

సామాజిక ఉద్యమాలలో మహిళలకు తగిన ప్రాదాన్యత ఉండాలని బాబాసాహెబ్ అభిలాష. నాసికే లోని కాలారాం దేవాలయం సత్యాగ్రహ ఉద్యమంలో 500 మంది మహిలలు బాబాసాహెబ్ పిలుపు మేరకు పాల్గొన్నారు. అంతేకాదు వారు అరెస్ట్ అయి జైలుకు కుడా వెళ్ళేరు. అలాగే mahad చెరువు పోరాటం లో 300 మంది మహిళలు పాల్గొన్నారు.

Also read  డా బి ర్ అంబేడ్కర్- దళిత సాంస్కృతిక చైతన్యం జ్యోతి నిషా దృశ్య కావ్యం!

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ చాల గట్టిగా నమ్మేవారు, సామజిక ఉద్యమాలలో లేదా ఏ ఉద్యమం అయినా మహిళలు పాల్గొని నాయకత్వం వహిస్తే ఆ ఉద్యమం సత్పలితాలు ఇస్తుంది అలాగే సాంఘిక పరిస్తితుల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి.

బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఇలా అంటారు “Unity is meaningless without the accompaniment of women. Education is fruitless without educated women, and agitation is incomplete without the strength of women”.

1942 జులై 20వ తేదీన దాదాపుగా 25 వేల మంది ఎస్సి మహిళ లతో బొంబాయి లో ఒక పెద్ద సమావేశం నిర్వహించేరు.

అణగారిన వర్గాల జీవితాల్లోనే కాదు సవర్ణ హిందూ మహిళ ల్లో కుడా బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ వెలుగులు నింపిన వ్యక్తి. స్త్రీ స్వేచ్ఛను, సౌభ్రతత్వాన్ని కాంక్షించి హిందూ కోడ్ బిల్లు ను ప్రవేశ పెడితే ఆ బిల్లును నేటి వరకూ ఆమోదించలేక పోయేరు అంటే మతం యొక్క ప్రబావం బారతీయ మహిళల మీద ఎంత తీవ్రంగా ప్రబావం చూపించిందో అర్ధం అవుతుంది.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ అంటే ఒక సాంఘిక విప్లవం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరికీ జై భీమ్ లు , శుభాకాంక్షలు

 

 

 

(Visited 147 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!