మహిళా సాధికారత – సమాజం!

షేర్ చెయ్యండి

స్త్రీ సాధికారత ఒక్క పెద్ద ప్రశ్న ? ఇండియా లాంటి దేశం లో స్త్రీ సాధికారత ఒక్క పెద్ద ప్రశ్న. కులం , మతం , వర్గాల గా సమాజం ఏర్పడినప్పుడు , వివక్ష తో కూడిన సమాజం లో స్త్రీ కి స్వేచ్చా , సమానత్వం ,గౌరవం దక్కటం చాల అరుదుగా ఉంటుంది.

కొన్ని గంటల క్రితమే ప్రపంచం తో పాటు మనము అంతర్జాతీయ మహిళా దినోస్తావం జరుపుకున్నాం. మహిళా సాధికారత గురించి రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైన శ్రద్దను తీసుకుంటాం , మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్ లాంటివి వర్తింప చేస్తాం అని చెబుతున్నారు . మహిళా సాధికారత అంటే ఉద్యోగం , డబ్బు , ఆస్తి హక్కు మాత్రమేనా ? స్వేచ్చా , సమానత్వం , గౌరవం దక్కకుండా సాధికారత ఎలా సాధిస్తాం అనేది పెద్ద ప్రశ్న గా మిగిలిపోతుంది.

ముక్యంగా ఇండియా లాంటి దేశాలలో కులం , మతం  సమాజానికి లక్ష్మణ రేఖలు గీస్తున్న తరుణం లో సామాజికంగా ,ఆర్ధికంగా వివక్షను అనుభవిస్తున్న బారతీయ మహిళ సాధికారత సాధించ గలదా? ప్రపంచీకరణ కి ముందు , ఆ తరువాత పూర్వాపరాలు పరిశీలిస్తే ముక్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా  లాంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలలో ఆది నుండి ఎక్కువ శాతం మంది స్త్రీలు పురుషులతో సమానంగా చూడబడింది వెనకబడిన,ఎస్సి  కులాల లోనే అని చెప్పుకోవచ్చు. నేపద్యం ఏమీ అయితేనేమి మహిళ గౌరవించబడింది అంటే మనం ఆయా వర్గాలలోనే చూడవచ్చు. ఉత్పత్తి కులాలలో స్త్రీకి ఉన్నంత స్వేచ్చ ఆధునిక , అగ్రవర్ణ నేపద్యం గల వర్గాలలో లేదు అని చెప్పక తప్పదు . అయితే అందరిని ఇదే గాడిన కట్టలేము. భూస్వామ్య వ్యవస్తలో మహిళను అబల గా మాత్రమె చూసేరు తక్కువ శాతం మంది మాత్రమే గౌరవించ బడ్డారు అని చెప్పక తప్పదు. అయితే స్త్రీ కి స్వేచ్చ  స్వాతంత్రాలు కావలి అని చదువుకున్న , కమ్యునిస్ట్ బావజాలం ఉన్న అగ్రవర్ణ కుటుంబాలలో నుండి వచ్చిన మహిళల ల పోరాటం మనం గుర్తించు కోవాలి.

Also read  మూగబోతున్న సంఘం రేడియో- దేశంలోనే మొదటి కమ్యూనిటీ రేడియో!

బారతీయ మహిళ రెండు విధాలుగా నేటికి వివక్షను ఎదురుకుంటుంది ఒక్కటి కుల పరంగా అయితే రెండోది సామజికంగా లింగ బేధం తో. నేటికి మన దేశం లో మహిళ అంటే ‘ పరువు ‘ గానే చూస్తున్నారు. ఎంతో ఉన్నత విద్యలు , ఉద్యోగం చేస్తున్నా కుటుంబానికి మహిళ ఒక ” పరువు ” ఈ పరువు కోసం హత్యలు చేస్తున్నారు , పురిటిలోనే చంపేస్తున్నారు. ఈ పరువు అనే విషయానికి వచ్చేసరికి అన్ని కులాలో ఆలోచన విధానం ఒక్కటే , కాస్త హెచ్చు తగ్గుల్లో తేడా ఉంటుంది . ఆడపిల్ల , ఆ -డపిల్ల గానే చూస్తున్నారు . పెళ్లి చేసిపంపితే చాలు కష్టం అయిన , సుఖం అయినా చివరికి చస్తున్నా అక్కడే ! ఆ ఇల్లు గడప దాటి రాకూడదు. ముక్యంగా తల్లి తండ్రి లేని మహిళ ల పరిస్తితి అయితే దారుణం అనే చెప్పాలి. ఒంటరి మహిళ విషయం లో సమాజం దృష్టి మారాలి. గడప దాటి బయటకు వస్తే సమాజం చూసే చులకన బావన స్త్రీ ఆత్మ స్తైర్యాన్ని చంపేస్తుంది .

స్త్రీ సాధికారత విషయం లో కులాల ప్రస్తావన , మతాల ప్రస్తావన తీసుకు రావలిసిన పరిస్తితి వస్తుంది. నిన్న మొన్నటి వరకు ఎస్సి, బి సి  కులాలలో మహిళ చదువు బ్రంహాండం లాంటిది. బాల్య వివాహాలు, చిన్నతనం లోనే కుటుంబ భారం మోయాల్సి రావటం ,మతం కట్టుబాట్లు ఇవి అన్ని స్త్రీ అభివృద్దికి అడ్డుగోడలు. గ్రామీణ ప్రాంతాలలో ఎంతో మంది తల్లులు తమ కొడుకునో , కూతురునో చదివిస్తుంది తమ రెక్కల కష్టం తోనే అనేది మనం విస్మరించ కూడదు. నేటికి అట్టడుగు వర్గాలలో వ్యవసాయ కూలిగా ఉన్న స్త్రీ ఆ డబ్బులతోనే పిల్లలను చదివిస్తుంది అంటే అతిశయోక్తి కాదు . పితృస్వామ్య వ్యవస్తలో మగవాళ్లది కండ బలం మాత్రమే ,బుద్ది బలం స్త్రీలది ,కుటుంబాన్ని నడిపేది స్త్రీ . అయితే మనువాదులు సమాజం మీద ,ముక్యంగా మహిళ ల మీద ఎక్కువ గా దాడి ( సామాజికంగా , సాంస్కృతికంగా ) చెయ్యటం వలన స్త్రీని చదువుకు , ఉద్యోగానికి దూరం పెట్టేరు.మనువాదులు స్త్రీని పురుషుడికి సేవకురాలుగా మాత్రమె గుర్తించేరు. మిగతా అన్ని విషయాలలో స్త్రీ పురుషుడి మీద ఆదారపడ వలసిందే ! కార్యేషు దాసీ , సయనెశు రంభ అంటూ …, మతం ముసుగులో, కులం ముసుగులో బందీ చేసేరు

Also read  'యువక' కలేకూరి ప్రసాద్!

చరిత్ర లో స్త్రీ సాధికారత ఏమీ లేదు , ఒక్క ఎస్సి  ,బి సి లలో   కుటుంబ పోషణ లో కలసి పనిచెయ్యటం మాత్రమె , మిగత వర్గాలలో పరదా చాటున మాత్రమే ఉండేవారు , నేడు ,ప్రపంచీకరణ తరువాత ఆ పరిస్తి చాల మెరుగు అయింది అని చెప్పవచ్చు . అన్ని కులాలో , మతాలలోని స్త్రీ లు బయటకు వస్తున్నారు ,గొప్ప ,గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు పురుషుడు తో సమాన వేతనం కావలి అన్న అంతర్జాతీయ మహిళా పోరాటం నేడు మగవాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు , అన్ని రంగాలలో నాయకత్వం వహిస్తున్నారు . కుమారి మాయావతి లాంటి ఎస్సి  స్త్రీలు రాష్ట్రాలకు ముక్యమంత్రిగా , రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నరు. కుల వివక్ష మెజారిటి ప్రజలను చదువుకు దూరం చేస్తే ,అందులో స్త్రీలు నేటికి పుర్తిస్తాయిలో చదువు కోలేక పోవటం దేశం ఆర్ధికంగా అభివృద్ధి సాధించ లేక పోతుంది . సెల్ఫ్ హెల్ప్ గ్రూపు లతో ,పావలా వడ్డీలతో మహిళలకు సహాయ పడటం స్త్రీ సాధికారత లో బాగమే ,దేశ ఆర్ధిక అభివృద్ధి లో బాగమే .

వంద సంవస్తరాల ప్రపంచ మహిళా దినోస్తావం లో నేటి మహిళ సాధికారత సాధించే సందర్భం లో కొత్తరకం వివక్ష ఎదురుకుంటుంది . పనిచేసే ఆఫీసు లలో సాటి పురుష ఉద్యోగుల లేదా యజమాని నుండి సెక్సువల్ వివక్షను ఎదురుకుంటుంది. ముక్యంగా రక్షణ విషయం లో చాల ప్రమాదకర స్తితిలో ఉంది. గృహ హింస , వరకట్న హత్యలలో నేటికీ సరి అయిన న్యాయం జరగటం లేదు అని చెప్పాలి . సంవస్తరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగటం ,గృహ హత్యలను ప్రమాదకరంగా చిత్రీకరించటం జరుగుతూనే ఉంది . రాజకీయ రిజర్వేషన్ కొరకు 70 సంవస్తరాల నుండి పోరాడుతూనే ఉంది.

మహిళా సాధికారత కోసం , హక్కుల కోసం కమ్యునిస్ట్ బావజాలం , ఎస్సి  బహుజన మహిళలు మాత్రమె పోరాడుతున్నారు అని చెప్పక తప్పదు. చదువుకున్న మహిళలు అన్ని వర్గాలలో నుండి పోరాడితే స్వేచ్చ , సమానత్వం ,గౌరవం సాధించు కోవటం పెద్ద కష్టం కాకపోవచ్చు . ఒక వైపు స్త్రీ హక్కుల కోసం పోరాడుతుంటే ,మరోవైపు ఇదే స్త్రీలు మతం ముసుగులో , ధర్మం ముసుగులో , సాంప్రదాయం ముసుగులో పోరాడే మహిళల ముందల కాళ్ళకు బందీలు వేస్తున్నారు. స్త్రీ కి స్త్రీ నే మొదటి శత్రువు అనే సిద్దాంతానికి బలం చేకూరుస్తున్నారు.

Also read  దామోదర సంజీవయ్య!

ఎందరో దీరవనితలు పుట్టిన ఈ పుణ్య భూమిలో ” మహిళా సాధికారత ” కుటుంబం , సమాజం , దేశం అభివృద్దికి ముందు అడుగు అని గుర్తుంచుదాం.

(Visited 66 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!