మీరు చదవాల్సిన ఐదు ముక్యమైన పుస్తకాలు!

షేర్ చెయ్యండి
 • 2
  Shares

చరిత్ర తెలియనివారు చరిత్ర నిర్మించలేరు అంటారు డాక్టర్. బాబాసాహెబ్ అంబేడ్కర్. ఎవరి చరిత్ర తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి? ఈ దేశంలో అన్ని కులాలకు గొప్ప చరిత్రను రాసుకున్నారు కానీ దళితుల సాంఘిక చరిత్రను, దళిత విజేతల చరిత్రను, మహా పోరాట విజయం మహర్ల భీమ కోరేగాంవ్ విజేతల చరిత్ర, పల్నాడు మాల కన్నమనీయుడు చరిత్ర, భూమి కి పచ్చని రంగేసిన చరిత్ర, మగ్గం నేసిన చరిత్ర వీరనారి ఝాల్కారి భాయి చరిత్ర, అమరావతి పూర్ణకుంభం చరిత్ర, డప్పు చరిత్ర, చెప్పు చరిత్ర ఒక్కటేమిటి ఈ దేశ శ్రామికుల చరిత్ర, ఉద్దేశ్య పూర్వకంగా నిర్లక్ష్యం చేసిన దళితుల చరిత్ర తెలుసుకోవాలి.

బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ ఏమంటారు అంటే  బ్రాహ్మణిజం ఎరుపానా ఉన్నా ప్రమాదకరం అంటారు. బ్రాహ్మణిజం కులంలో ఉంది, వర్గం లో ఉంది.  అది ఇప్పుడు రూపాంతరం చెందింది, అది తెలుసుకోవాలి అంటే బ్రాహ్మణిజం యొక్క తీరు తెన్నులు తెలుసుకోవాలి.

దళితులకు రాజకీయ హక్కులు కల్పించి ఎనిమిది దశాబ్దాలు అయ్యింది నేటికీ దళితులు రాజ్యాధికారం కలలు కంటూనే ఉన్నారు. దళితుల రాజ్యాధికారం సాకారం కాకపోవడానికి కారణం దళితులే, ఆ దళితులు ఎవరు? వారిని ఏమంటారు. హిందూ సామ్రాజ్యవాద దోపిడీ ఎలా ఉంటుంది. దళితుల మీద ఎలాంటి ప్రబావం చూపెట్టింది. దేశం పరాయి పాలనకు కారణం ఎవరు? హిందుఇజం లో బ్రాహ్మణుల పాత్ర ఏంటి ఇత్యాది చరిత్ర తెలుసుకుని దళితులు విముక్తి కావలని బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ కోరుకున్నారు.

సొంత చరిత్ర తెలుసుకోకుండా, ఎవరు ఏ రూపాన దోపిడీ చేస్తున్నారో తెలుసుకోకుండా దళితులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అభివృద్ధి సాధించలేరు.

తెలుగులో ఉన్న ఈ క్రింది ఐదు పుస్తకాలు చదవండి. ఏ ఇజంతో అయినా మీరు పోరాడగలరు, విజేతలౌతారు.

 1. డాక్టర్. అంబేడ్కర్ జీవిత చరిత్ర-కళాప్రపూర్ణ డాక్టర్. ఎండ్లూరి.
Also read  దళితులు అల్టర్నెట్ కల్చర్ని ఏర్పాటు చేసుకోవడం లో విఫం అయ్యేరా!

Dr.Ambedkar life history

మానవతా మనుగడకు సమత చాల అవసరం. సమత లోపించిన సమాజంలో సంక్షోభం అనివార్యమవుతుంది. సమతా సిద్దాంతాన్ని సశాస్త్రీయంగా ప్రబోధించిన మహత్తర మానవతా మూర్తి మనందరం ఎంతో ఇష్టంగా పిలుచుకునే బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్. దురదృష్టవశాత్తు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ రచనలు, ప్రసంగాల పుస్తకాలు మనకి లభ్యం కావడం లేదు. కానీ బాబాసాహెబ్ గురించి కనీస అవగాహన డా. యెండ్లూరి రాసిన “డాక్టర్. అంబేడ్కర్ జీవిత చరిత్ర” మనకి తెలియజేస్తుంది. ప్రతి కుటుంబం లో ఉండవలసిన అతి ముక్యమైన గ్రంధం ఈ పుస్తకం. 1973 లో రాసిన ఈ పుస్తకం సరళమైన బాషలో ఉంటుంది. శ్రీమతి. బి  విజయబారతి గారు రాసిన అంబేడ్కర్ చరిత్ర కుడా అయిన జీవితంలోని ముక్యమైన ఘట్టాలను క్లుప్తంగా వివరించేరు. కాబట్టి ప్రతి దళితుడు తన వద్ద ఉంచుకోవాల్సిన పుస్తకం డా. అంబేడ్కర్ జీవిత చరిత్ర. ఇందులో బాబాసాహెబ్ జీవిత చరిత్రకు సంభదించిన ముక్యమైన పోటో లు కుడా ప్రచురించేరు.  ప్రచురణ: పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ- హైదరాబాద్. ధర రూ.200/-

 1. హిందూ సామ్రాజ్యవాద చరిత్ర- స్వామీ ధర్మతీర్ధ. 

కలేకూరి ప్రసాద్ గురించి తెలిసిన వారు ఆయినకు బాష మీద ఉన్న పట్టుకుడా తెలుస్తుంది. అయిన ఉపయోగించే పద ప్రయోగం కుడా తెలుస్తుంది. హిందూ సామ్రాజ్యవాదం గురించి అద్బుతమైన పుస్తకం. స్వామీ ధర్మతీర్ధ కేరళా నాయర్ కుటుంబం లో జన్మించిన వ్యక్తి. రాజమండ్రి లోని ఒక ఆశ్రమంలో జీవించేరు కొన్ని రోజులు 1893లో జన్మించిన వ్యక్తి. హిందూ మతం అనేది బ్రాహ్మణ పురోహితులు కొనసాగించే సామాజిక, ఆర్ధిక, రాజకీయ మతపరమైన నైతిక, మేధోపరమైన సామ్రాజ్యవాదం గా అయిన ఈ గ్రంధం లో రాసేరు. బాబాసాహెబ్ ఈ పుస్తకం గురించి రాసిన మాట “ఈ పుస్తకాన్ని నాకిష్టమైన ద్రుక్పోణం నుండి రాసేరు.నేనుకూడా ఈ అంశం మీద పుస్తకం రాస్తున్నాను. నేననుకున్న విషయాలెన్నో  ఈ పుస్తకంలో చర్చించేరు. అందుకని ఈ పుస్తకం ఆహ్వానించదగినది.

Also read  కుల వ్యవస్థ - కమ్యూనిజం

1941 లో మొదటి ప్రచురణ “హిందూ సామ్రాజ్యవాద ప్రమాదం” అన్నపేరుతో ప్రచురితమైంది. ప్రచురణ:హైదరాబాదు బుక్ ట్రస్ట్ . ధర రూ. 80/-   

౩. కుల నిర్మూలన-రచన: బాబాసాహెబ్ డా. అంబేడ్కర్

బాబాసాహెబ్ అంటేనే మొదట గుర్తికు రావలసినది “కుల నిర్మూలన” ఈ కుల నిర్మూలన మీద ఎన్ని పరిశోధనా పత్రాలు రాసినా చాలదు. ప్రతి దళితుడి  అంతిమ లక్ష్యం ‘కుల నిర్మూలనే కావాలి’ అప్పుడే బాబాసాహెబ్ కి దళితులు ఇచ్చిన ఘనమైన నివాళి. కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. ఆ మత విశ్వాసాలకు శాస్త్రాల మద్దత్తు ఉంది. కులం అంటే “దడికట్టుకున్న ఒక సమూహం అంటారు బాబాసాహెబ్. అంటే దడి కట్టుకున్న మంద లో నుండి లోపల వారు బయటకు రాలేరు, బయట వారు లోనికి వెళ్ళలేరు. దళితులు ఎంతటి విద్యా బుద్దులు నేర్చినా దళితులు గానే చూడబడుతున్నారు. మతం మారినా దళితులు గానే చూడబడుతున్నారు. బాబాసాహెబ్ రచనలు, ప్రసంగాలు అందుబాటులో లేని వారు పద్మ భూషణ్  బోయి భీమన్న తెలుగు అనువాదం   హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ముద్రించిన “కుల నిర్మూలణ” చదవండి. ధర. రూ. 60 /-   

4 . చెంచాయుగం-రచన మాన్యశ్రీ కాన్షీరామ్

చెంచాయుగం అనే మాట కొత్తగా ఉంది కదూ! అసలు ఏంటి ఈ చెంచాయుగం? అందులో మనుషులు ఉంటారా? ఉంటే ఎలాంటి మనుషులు ఉంటారు. కీలు బొమ్మలా లేక నిజమైన మనుషులా? చెంచాయుగం యొక్క పూర్వాపరాలు ఏంటి? అసలు ఆపేరు ఎలా వచ్చింది? దళిత రాజకీయ నాయకులనే చెంచాలని ఎందుకు అంటున్నారు? నేటి దళిత చెంచాల గురించి, వారి వ్యవహార సైలి గురించి బాబాసాహెబ్ వారసుడు మాన్యశ్రీ కాన్షిరామ్ రాసిన చెంచాయుగం పుస్తకం ఒక చారిత్రాత్మకమైనది అని పేర్కొనవచ్చు. డా ఏ. సుబ్రహ్మణ్యం తెలుగు లో అనువదించిన ఈ పుస్తకాన్ని ప్రచురణ. సమాంతర పబ్లికేషన్స్. ధర. రూ 60/-

Also read  దళితుల అభివృద్ది బాద్యత ఎవరిది?

 

 

5.కులం-వర్గం-బొజ్జా తారకం.

ప్రయత్నిస్తే ప్రపంచంలోని ఇతర చోట్ల ఒక వర్గంలోని ప్రజలు మరొక వర్గంలోకి చేరటానికి అవకాశం ఉంటుంది. కానీ బారత దేశంలోని ప్రజలు ఒక కులంలో నుంచి మరొక కులం లోకి మారటానికి వీలు లేదు. బారతీయ కమునిస్టులు చెప్పినట్లు  వర్గ నిర్మూలన ద్వారా కుల నిర్మూలన జరుగుతుందా? బాబాసాహెబ్ డా అంబేడ్కర్ చెప్పినట్లు కుల నిర్మూలన ద్వారా వర్గ నిర్మూలన జరుగుతుందా? బారతదేశం లో దళితుల ప్రదాన శత్రువు వర్గమా ? లేక కులమా? వర్గం కులం విడి విడి గా ఎప్పుడూ లేవు. విడి విడి గా ఎప్పుడూ లేవు కాబట్టి విడి విడి గా ఎప్పుడూ నిర్మూలన కావు.

కమ్యునిస్ట్ ల సంకుచిత  దృక్పదాన్ని నిశితంగా విమర్శించిన ఈ పుస్తకం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారిచే ప్రచురణ. ధర. రూ.60/-

ఈ ఐదు పుస్తకాలను సమగ్రంగా చదివి అర్ధం చేసుకోగలితే ఏ దళితుడు ఫ్యూడల్ కులాల పల్లకి మోసే బోయకాడు. అమ్బెకరిస్ట్ గా గర్వంగా సమాజంలో నిలబడగలడు.    

 

 

(Visited 609 times, 1 visits today)

2 thoughts on “మీరు చదవాల్సిన ఐదు ముక్యమైన పుస్తకాలు!

 • 19/09/2018 at 11:58 PM
  Permalink

  sir, books kaavaali. ekkada dorukuthayi. address/contact details emaina share chestaraa.??

  Reply
  • 20/09/2018 at 1:36 PM
   Permalink

   Go to Vishalandra Book house or Prajashakti Bookhouse.
   or Go to any of our meetings where you will get these books

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!