మద్దూరి నగేష్ బాబు

షేర్ చెయ్యండి

ఇది నేను మిమ్మల్ని అడుగుతుంది కాదు, మద్దూరి నగేష్ బాబు అడిగింది కాదు. మనందరం అడిగిందే, ఒకానొక రోజుల్లో మనిషి కనబడగానే , పలకరించగానే ఈ సమాజం అడిగే మొదటి ప్రశ్న

“మీరేవుట్లూ”

“ఒకటి – రెండు – మూడు – నాలుగు
ఇదారేడేంది తొమ్మిది పది పదకొండు
మూడువేల సంవత్సరాలు
అయినా తెల్లారలేదు”

మీరేవుట్లూ మీద ఎక్కు పెట్టిన మద్దూరి గ (పె) న్. తన చుట్టూ ఉన్న సమాజం లో కుచ్చిత మనస్తత్వాలను, సాంఘిక దురాచారాలను నిశితంగా పరిశీలించిన మద్దూరి అదే తన కవితకు సబ్జేట్ గా సంఘీభావ కవులు కాదు మా రోదన మేమే రాస్తాం అంటూ మొట్ట మొదటి దళిత సాహితీ ధిక్కార పతాకాన్ని ఎగిరేసినవాడు.

“నా దరిద్రం నాకీ సిగ్గుమాలిన తనాన్ని అలవారిస్తే , మీ కలిగినతనం నాకీ ఆశ్లీలాన్ని అంటగట్టింది”

గిరే పళ్ళేలు..,
అంటూ నరసరావు పేట ప్రాంతంలో రికార్డింగ్ డాన్స్ వృత్తిని అశ్లీలమని నిషేధింపజేసిన అభ్యుదయవాదులు – అరసం రాష్ట్ర సభల్లో ఆ డాన్సర్లు తమ గోడుని తెలుపుతూ కరపత్రాలు పంచుతుంటే వారిని కొట్టి గెంటేసిన అభ్యుదయ రచియితల మేడిపండు అభ్యుదయాన్ని ఎద్దేవా చేస్తూ,

“ఆడదానితొడలో సంకలో చూపించందే
కనీసం బ్లేడు ముక్కయినా కొనుక్కోలేని మీ జనం , ఇప్పుడు పుణ్యాత్ములైపోయారా?”

Also read  గాడ్సే:గాంధిని చంపడానికి కారణాలు ఏమిటి!

కుహనా అభ్యుదయ (కుల) సంఘాల ను ఎలాంటి మోహమాటం లేకుండా ఆ అరసం తీరును విమర్శించిన తీరు, విమర్శకుల నోరు మూయించింది.

ఇక్కడే అంటాడు,
“అయినా వెండి తెరకోక న్యాయమూ
ఎడ్లబండి స్టేజీకొక న్యాయమా నాయనా?

బొడ్డు సుట్టూ పదారురీళ్ళు తిప్పీ తిప్పీ మొకానకోడితే బంగారు పందుల పురస్కారాలిచ్చే దేశంలో నేను బొడ్డు చూపించేసరికి ఆశ్లీలమై కూకుందా,
70 MM తెరల మీద మీ 70 MM కులాలోళ్ళు ఏం చేసినా కళా ఖండా లై పోయి అదే పని నేను చేస్తే మీ సంస్కృతి నాశనం అయిపోతుందా “

అభ్యుదయ, ప్రజా సంఘాలు పేరిట , సంస్కృతి పేరిట పెద్ద మనుషులు గా చెలామణీ ఆయ్యే కుల జెండా, అజెండా బ్యాక్ డ్రాప్ కలిగిన సంఘాల ను ఎద్దేవ చేసిన తీరు ఆద్బుతం. అదే సమయంలో డాన్సర్ కి ఇచ్జిన మనోధైర్యం వెలకట్టలేనిది. ఒక రచియిత గా ఇంతకంటే ఏమి చేయగలడు సమాజానికి.!

మద్దూరి నగేష్ బాబు గురించి మాట్లాడుకోవాలి అంటే కాస్త కష్టంగా అనిపిస్తుంది ఇతరులకు. మద్దూరి బాష, భావం ఆ పరిస్థితిని అనుభవించినోళ్లకే అర్ధం అవుతుంది. మనిషికి అర్ధం అవుతుంది. కవిత / సాహిత్యం ఇలాగే, ఈ భాషే వాడాలి అని రులు ఏమీ లేదు గా! మద్దూరి మాట్లాడింది, వ్యక్తపరిచిన భావం అతని పేటలోని బాష , పల్లె లోని బాష, ఆ పల్లె అమ్మలు, అక్కలు, చెల్లెలు పడిన వ్యధ, మానసిక సంఘర్షణ. అది బూతు అని కొందరు అనుకోవచ్చు,

Also read  దామోదర సంజీవయ్య!

“ఒక ఋక్కు దాడి చేస్తుంది
ఒక సూక్తి దానిని ధర్మమేనంటూంది
వేదికల నలంకరించి పండితోత్తములంతా
దేవతల అంగ సౌందర్యాల మీద అవధానాలు చేస్తున్నారు..,”

మనకి తెలియని భాషలో సాహిత్యం అంతా దేవతల సౌందర్యాన్ని , రాజుల కీర్తి ప్రతిష్టలు పొగడటానికేగా !

మద్దూరి మనకి బాగా అర్ధమైన భాషలో రాసేడు, అతని సొంత బాష.

నిన్న మొన్న “భీమా కోరేగాంవ్ ” మహార్ల పోరాటం, అందులో పాల్గొన్న కొందరు యువ నాయకులను జాతీయ ‘ఎల్లో మీడియా’ తుకడ -తుకడా బ్యాచ్ అని వర్ణిస్తూ వారి జాతికోసం చేస్తున్న పోరాటాన్ని చిన్న చూపు చుసిన మీడియాను చూస్తుంటే మద్దూరి నగేష్ బాబు అన్న ఒక్క వాక్యం జాతీయ మీడియా అనే కుల హౌస్ లకు ఒక్క మాట గుర్తు చెయ్యాలి

“ఫర్యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ వెపనాలజీ
మీ ఖర్మాగారాలకి మా జనాలకి సరిపడా
మందుగుండును ప్రసవించే శక్తింకా పుట్టలేదు”

మీడియాని పోలీసులను అడ్డంపెట్టుకుని ఉద్యమాలను అణిచివెయ్యాలి అంటే మద్దూరి లాంటివారు ఇలానే మాట్లాడతారు.

Also read  ఆమె యుద్ధం మొదలెట్టేరు...!

సమాజంలో ‘గజల్ గలీజ్ గాళ్ళు’ వ్యక్తుల బలహీనత లు , అవసరాలు అడ్డంపెట్టుకుని చేసే మోసాలు అన్నీ ఇన్నీ కావు, శరీర వాంఛ తీసుకున్నపుడు కులం , మతం అడ్డురావు, అందుకే ‘అయామ్ సారీ సునీతా .., అంటూ మోసపోయిన ఒక విద్యార్థిని గురించి రాస్తూ

“నువ్వు చెప్పేది నిజమేనమ్మా
జీవితమంటే సిద్ధాంత వాక్యాల పొడిసాయిక మాత్రమే కాదు
వొక గిలిగింత ఒక నవ్వు తెర
కూసిన్ని వెక్కిళ్ళూ పిడికెడు నిట్టూర్పులు కూడా
కానీ వేదనని వెక్కిరించే వెకిలిగాళ్ళ రాజ్యంలో
ప్రేమని బలహీనతనుకునే బేవకూప్ల వ్యవస్థలో
పాది దీసి నువ్వెంత కన్నీటితడి కట్టినా
కొండ చిగురిస్తుందా సునీతా ?”

ఇలా చెప్పుకుంటూ పొతే ఏ సందర్భం గురించి మద్దూరి రాయలేదు. వేరే ఏ పాండిత్య అవధానులు పొరపాటున కూడా ఒక్క అక్షరం రాయలేని ఈ సమాజపు “వెకిలి చేష్టలను” తూర్పారబట్టిన ఈ కాలం మహా కవి మద్దూరి నగేష్ బాబు

బహుశా ఇంకొన్ని రోజులు బ్రతికి ఉంటే ఏమైనా చేసేవాడు ఏమో!!

జనవరి 10 మద్దూరి నగేష్ బాబు వర్ధంతి సందర్భంగా రోజూ కొన్ని మాటలు.

(Visited 81 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!