ముందే హెచ్చరించిన డా.అంబేడ్కర్!

షేర్ చెయ్యండి

“No one can doubt that there was a time when Hindus, both Brahmins and non-Brahmins, ate not only flesh but also beef.” Babasaheb Dr. B R Ambedkar

ప్రపంచ మేధావుల్లో ఒకరైన డా. బాబాసాహెబ్ పుస్తకాలు చదవడం, రాయటం మాత్రమే ఆయనను మేధావి గా కీర్తించటం లేదు. సమాజములో జరిగే మార్పులు ముందే ఊహించి వాటికి పరిష్కారాలు చూచిన వ్యక్తి. అలాంటి మార్గ దర్శకుడు మనలోఒక్కడి గా పుట్టడం, బారత దేశంలో పుట్టడం ఈ దేశం చేసుకున్న బాగ్యం.

ప్రపంచం అయినను అనుసరిస్తుంటే అయిన వారసులుగా చెప్పుకునే వారు సొంత ఆలోచనలు, లేదా ఇతర సంఘ సంస్కర్తల ఆలోచనలు అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఏ సమాజంలో అయినా కొందరు మహానుభావులు పుడతారు అందుచేత వారే గొప్ప ఆదర్శం అనుకుని కొండను ఢీ కొనే ప్రయత్నం చెయ్యకూడదు.

ఆంద్ర రాష్ట్ర అవతరణ సదర్బంగా బాబాసాహెబ్ డా.బి ర్ అంబెడ్కర్ మాట్లాడుతూ రాజ్యాంగం వచ్చి మూడేళ్ళ కావస్తున్నా అల్ప సంఖ్యాకుల పరిస్థితి నానాటికీ దిగజారి పోతుంది అని, వారిలొ అసంతృప్తి అవధులు దాటినట్లయితే దేశంలో ఎంతటి తీవ్రపరిణామాలు ఉత్పన్నమవుతాయో ఇకనైనా గుర్తించటం మంచిది అన్నారు. అదృష్ట వశాత్తు నిమ్నజాతీయులు బాబాసాహెబ్ అంత పౌరషం కలిగిన వారు కాకపోవడం వలన బాబాసాహెబ్ ఈ దేశ పాలకులను హెచ్చరించి 65 సంవత్సరాలు అయినా ఇంకా పాలకులకు వినతిపత్రం సమర్పిస్తూనే ఉన్నారు.

Also read  మనువాద ఫాసిజం: దేశ విచ్ఛిన్నానికి కారణం అవుతుందా!

1954, సెప్టెంబర్ 6 న నిమ్నజాతుల, వర్గాల కమీషనర్ తయారు చేసిన వార్షిక నివేదిక చర్చ లో డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ మాట్లాడుతూ, నిమ్నజాతుల మొహన ప్రభుత్వం చన్నీళ్లు చల్లుతుంది, రిఫ్రజరేటర్ లోని మంచినీళ్ళను నిమ్నజాతీయుల పై ప్రభుత్వం జల్లుతున్నది. బారత సరిహద్దుల్లో అగ్ని జ్వాలలు లేచాయి. ఏ క్షణానైనా ఆ అగ్ని జ్వాలలు మన దేశంలో ప్రవేశించ వచ్చు, నిమ్నజాతుల విషయంలో ప్రభుత్వం సరైన సరైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనట్లైతే నిమ్నజాతుల లో అసహనం పెరిగి ఆ కంచు కాగడాలను చేపట్టినా చేపట్టవచ్చు, అలాంటి పరిస్థితే సంభవిస్తే పార్లమెంటు, ఈ రాజ్యాంగం కాలగర్భంలో కలసిపోవటం ఖాయం.

బారత దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ప్రభుత్వాలు, ఆధిపత్య కులాలు నిమ్నజాతుల పట్ల చాలా దుర్మార్గమైన చర్యలకు దిగుతున్నారు. ప్రభుత్వం ఎస్సిల సబ్ ప్లాన్ నిధులు దారిమల్లిస్తూ వారి అభివృద్ధిని హరించి వేస్తున్నారు. ఆధునిక యుగంలో కుల వ్యవస్థ రోజు రోజుకూ విజృబిస్తుంది, పట్టణాలకు వలస వచ్చే ఉద్యోగ, విద్యార్థులకు ఇల్లు అద్దెకు ఇచ్చే సంఘటన నుండి ప్రవేట్ ఉద్యోగుల లో వివక్ష చూపుతున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు ఎస్సి వ్యాపారస్తులకు ఋణ సౌకర్యం కల్పించడంలో చిన్న చూపు చూస్తున్నారు. ఉద్యోగుల ప్రమోషన్ మరియు స్థానంలో వివక్ష చూపెడుతున్నారు. రాజకీయంగా ఎస్సి ఓట్లతో అధికారం చేపడుతూ ఎస్సి నాయకులకు నామ మాత్రపు పదవులు మాత్రమే ఇస్తూ వారిని మోసం చేస్తున్నారు.

Also read  దళితులపై దాడుల్లో ముద్దాయిలు ఎవరు?

గత రెండు మూడు సంవత్సరాలనుండి హిందూత్వమ్ పేరుతో ఎస్సిల మీద సాంస్కృతిక దాడులు చేస్తున్నారు. రోహిత్ వేముల సంఘటన నుండి నిరంతరం విశ్వ విద్యాలయల లో అంబెడ్కర్ మరియు ప్రగతిశీల ఎస్సి విద్యార్థును భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

ఎస్సిల మీద సామజిక దాడితో పాటు సాంస్కృతిక దాడి, సిద్ధాంత పరమైన దాడి చేస్తున్నారు. ఇది నిమ్నజాతుల అస్తిత్వానికి ప్రమాదం. ఇవే సంఘటనలు జరుగుతూ ఉంటే బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ హెచ్చరించినట్టు ఐర్లాండ్ లో జరిగిన ప్రజా తిరుగుబాటు బారత దేశం లో కూడా జరుగుతుంది.

(Visited 67 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!