మూగబోతున్న సంఘం రేడియో- దేశంలోనే మొదటి కమ్యూనిటీ రేడియో!

షేర్ చెయ్యండి
  • 16
    Shares
 
బారత దేశంలో మొట్ట మొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ ” సంఘం రేడియో”  మూగబోయే స్థితిలో ఉంది. దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతం లో ఒకటి అయిన సంఘారెడ్డి జిల్లా మాచవరం లో 5000 మంది నిరుపేద దళిత మహిళలు దీనిని 1998 నుండి నిర్వహిస్తున్నారు. 
 
సంఘం రేడియో స్టేషన్ కి ప్రేరణ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (DSS ) వీరి ప్రోద్భలము మరియు చేయుత తో మాచవరం గ్రామ డ్వాక్రా మహిళలు 1998 నుండి రేడియో స్టేషన్ ని నిర్మించే పనిలో ఉన్నారు. 2008 లో ఈ దళిత మహిళల కమ్యూనిటీ రేడియో స్టేషన్ కి ప్రసార అనుమతులు లభించేయి. కమ్యూనిటీ రేడియో ప్రసారాలకు వార్త సేకరణ, రికార్డింగ్ , ఎడిటింగ్ మరియు ఇతర సాకేంతిక  అంశాలను నిర్వహించేది దళిత మహిళలే. వీరు ఏమైనా గొప్ప చదువులు చదువుకున్నారా అంటే అదీలేదు. సాధారణ విద్య చదివిన మహిళలు  మరియు వ్యవసాయ కూలీలు ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
 
గత 20 సంవత్సరాల క్రితం దేశంలోనే మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో సంఘం రేడియో ను  ప్రారంభింస్తే కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ 10 సంవత్సరాల క్రితం అనుమతులు మంజూరు చేసింది. 
 
sangam Radio
Having launched Sangham Radio station: Pic credits AP Pic
 
ఇటీవల కాలంలో  నిరుపేద దళిత మహిళలు, వివక్షకు గురైన దళిత మహిళలు నిర్వహిస్తున్న ఈ కమ్యూనిటీ రేడియో నిర్వాహకులు సంఘం రేడియో ని మూగబోకుండా బ్రతికించటానికి దాతలు సహాయం చెయ్యవసిందిగా విజ్ఞాపన చేసింది. https://milaap.org/fundraisers/dds-sangham-radio.
 
దేశంలోనే మొట్ట మొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ సంఘం రేడియో కి ఇప్పుడు రెండు సమస్యలు ముందు ఉన్నాయి 1. ఆర్ధిక సమస్య, 2. సాంకేతిక సమస్య 
 
దళిత మహిళలు నిర్వహిస్తున్న సంఘం రేడియో కి ప్రభుత్వం నుండి నేటికీ రూ 3. 25 లక్షలు ప్రకటనల తాలూకా డబ్బు రావాలి. 
 
రెండో సమస్య సాంకేతిక సమస్య అంటే ట్రాన్సమీటర్ పరిధికి సంబంధించినది. మొదటిలో ఈ కమ్యూనిటీ రేడియో 30 కి. మీ వ్యాసంలో ప్రసారాలు చేసేవారు. నేడు 3 కిమీ కె పరిమితం చేసేరు. మహిళా రేడియో స్టేషన్ సభ్యులు అంచనా ప్రకారం రూ. 10 లక్షలు ఉంటే తిరిగి 30 కిమీ దూరం సంఘం రేడియో యొక్క ప్రసారం అవుతుంది. లేదంటే భవిషత్ లో శాస్వితంగా మూగ బోయే ప్రమాదంలో పడుతుంది. 
 
దళిత మహిళ ల చే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కమ్యూనిటీ రేడియో నిర్వాకులలో ఒకరైన నరసమ్మ గారు మాటాడుతూ ‘మేము విదేశాల నుండి ఎలాంటి ధన సహాయం అడగటం లేదు. ఈ రేడియో ని నిర్వహించడం ఆత్మగౌరవం కి సంబంధించిన అంశం కాబట్టి మేము దేశీయ దాతల సహాయం కోరుతున్నాము అని చెప్పేరు. 
 
కమ్యూనిటీ రేడియో శ్రోత ఒకరు మమ్మల్ని మీ ప్రసారాలు ఎందుకు మాకు వినిపించడం లేదు అని అడిగినప్పుడు మేము ఒక్కో ట్రాన్సమీటర్ ఖరీదు రూ 3 లక్షలు అవుతుంది, దాతల సహాయం కోసం చూస్తున్నాము అని చెప్పేము   
 
నిరాక్ష్య రాసులు అదీ కూడా దళిత మహిళలు తెలంగాణ ప్రాంతం లోని మారుమూల గ్రామం నుండి నిర్వహిస్తున్న సంఘం రేడియో దళిత మహిళల సాధికారతకు చిహ్నం, వారి సాధికారిత నిలబెట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిమీద ఉంది. ముక్యంగా ప్రభుత్వం మీద ఉంది.  
 
దళిత మహిళా సాధికారత గురించి మాట్లాడే డిక్కీ లాంటి సంస్థలు కమ్యూనిటీ రేడియో కి సహాయ సహకారం అందించాలి. దళిత సంఘాలు మరియు ఉన్నతాధికారులు ఈ రేడియో స్టేషన్ ను పరిశీలన చేసి గ్రూప్ సబ్యులకు ఆర్ధిక సహాయం చేసి కమ్యూనిటీ రేడియో ని నిలబెట్టాల్సిన ఆవశ్యక్త చాలా అవసరం. 
 
వీడియో రికార్డింగ్ , సౌండ్ రికార్డింగ్ మరియు రేడియో జాకీ తదితర పనులలో ఇప్పటికే అనుభవం ఉన్న మహిళ లకు కొత్త సాఫ్ట్వేర్ అందించాలి. అవసరం అయితే వారికి సాటిలైట్  టివి రంగంలో కి వచ్చే విధంగా ప్రోత్సహించాలి. 
 
  
 
 
 
 
 
 
(Visited 87 times, 1 visits today)
Also read  దళిత మహిళా ఉపాధ్యాయురాలిపై వేధింపులు!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!