మేరీకోమ్ 6 బంగారు పతకాలతో చరిత్ర సృష్టించిన బాక్సర్!

షేర్ చెయ్యండి
  • 19
    Shares

మేరీకోమ్ శనివారం ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఉక్రెయిన్ బాక్సర్ హొన్నా ఒఖాటో పై 5-0 తేడాతో ఏకగ్రీవంగా విజయం సాధించింది. ప్రపంచకప్ లో 6 వ స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం ద్వారా మహిళల బాక్సింగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బాక్సర్ గా చరిత్ర సృష్టించింది.

35 ఏళ్ళ మేరీకోమ్ 48 కిలోల విభాగంలో తన ప్రత్యర్థికి ఒక్క పాయింట్ ఇవ్వకుండా విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మేరీకోమ్ ఇప్పటి వరకూ 6 బంగారు పతకాలు, ఒక వెండి పతకం గెలుచుకుని రికార్డులో నిలిచింది.

ఈ బంగారు పతకంతో ప్రపంచ ఛాంపియన్స్ చరిత్రలో అటు మహిళలు , పురుషుల విభాగాలలో అత్యధిక పతకాలు గెలిచిన క్యూబా బాక్సర్ ఫెలిక్స్ సావన్ తో కలిసి Puligist గా రికార్డులలో నిలిచింది. చివరిసారి ఆమె 2010 లో బ్రిడ్జ్ టౌన్ , బార్బడోస్ లో బంగారు పతకం గెలుచుకుంది.

Also read  క్రికెటర్ ఏం.ఎస్ ధోని : దుమారం లేపిన కోహ్లీ ట్వీట్!

ఈ ఫైనల్ పోటీ ముందు క్వార్ట్రర్ ఫైనల్ లో గెలిచి, మేరీకోమ్ ఐర్లాండ్ కు చెందిన బాక్సర్ కేట్ టేలర్ అత్యధిక పతకాలు గెలుచుకున్న బాక్సర్ సరసన చేరింది. కేట్ టేలర్ ఐదు బంగారు పతకాలు , ఒక కాంస్య పతకం గెలుచుకుంది.

ముగ్గురు పిల్లల తల్లి అయిన ఈ మణిపూరి బాక్సర్ ప్రపంచ మహిళ ల ఛాంపియన్స్ ప్రారంభ పోటీలు 2001 లో తొలిసారిగా బంగార పతకం గెలిచారు. ఆ తర్వాత వరసగా 2002, 2005, 2006,2008 మరియు 2010 లో బంగారు పతకాలు సాధించారు.

1983 మార్చి 1 న జన్మించిన ఈ బాక్సర్, 2005 లో వివాహం చేసుకున్నారు. 2012 ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించారు. క్రీడల్లో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న తో పాటు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డు లు సొంతం చేసుకున్నారు.

2016 లో ప్రెసిడెంట్ ఈమెను రాజ్యసభ సభ్యురాలు గా నామినేట్ చేశారు.2017 లో కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ మేరీకోమ్ ను బారత బాక్సింగ్ పర్యవేక్షకురాలు గా నియమించింది.

Also read  Annihilation of caste - A visionary document to build modern India!

నార్త్ ఈస్ట్ రాష్ట్రం లో ఒక పేద ఇంటిలో పుట్టిన మేరీకోమ్  బాక్సింగ్ మీద మక్కువ చూపించి , కఠోర దీక్షతో ఈ స్థాయికి ఎదిగేరు. తల్లితండ్రలతో పొలం పనులకు వెళ్తూ చదువుకుంటూ  తనకి ఇష్టమైన ఆటల్లో పాల్గొనేది. మొదట అథెల్టిక్స్  ఆడేవారు. ఆ తర్వాత బాక్సింగ్ వైపు ద్రుష్టి మలచి బాక్సింగ్ లో మెళుకువలు నేర్చుకుంది. స్కూల్ లో కోమ్ వాలీబాల్ ఫుట్ బాల్ లో కూడా పాల్గొనేది. డింకో సింగ్ బాక్సింగ్ ఛాంపియన్ (2000) అయిన తర్వాత కోమ్  బాక్సింగ్ ఆడటం ప్రారంభించారు. 

 

(Visited 20 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!