‘యువక’ కలేకూరి ప్రసాద్!

షేర్ చెయ్యండి

గుండెల్లో ధిక్కార పతాకాన్ని నాటి దిగాంతాల్లోకి వెళ్లిపోయిన కంచకచర్ల ముద్దు బిడ్డ కలేకూరి ప్రసాద్.

సత్యాలను తెలిసిన వాడు జ్ఞానవంతుడు అవుతాడు అంటాడు కలేకూరి. బహుసా సత్యం తెలుసుకున్నాడు కాబట్టే మావో ను వదిలి బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ ఒక్క దళితులకే కాదు దేశం మొత్తానికి నేడు అవసరం ఆన్నాడు.

“ఉరికంభం మీద నిలిచి ఊహగానం చెసేద, నా ఊహల ఊయలలో, మరో జగత్ వికసించు”

అంటూ ఈ దేశ సమస్త ప్రగతికి ప్రణభూత మైన దళితు ల శ్రమను, తాత్వికతను తన గేయాల ద్వారా , రచనల ద్వారా ప్రపంచనికి తెలియజేసిన అసాధారణ రచియిత కలేకూరి ప్రసాద్. తన సృజనాత్మక ‘ భూమికి పచ్చని రంగేసినట్టు గా వుందే ‘అని ఈ దేశాన్ని ఆచ్చర్య పరచిన దార్శనికుడు.

“పుడుతూనే తల్లి పేగును మెడకు తగిలించుకున్నవాణ్ణి
ఇప్పుడు నేనొక ప్రకటన చేస్తాను
అందరూ వినయంగా వినండి.
మీ పదగ్గదుల్లోనో పూజా మందిరాల్లోనో
మొకరిల్లునట్టుకాదు 
ఈ దేశపు దళితుడి ముందు
నిలబడాల్సినట్టు నిలబడివినండి
మీరంతా చెప్తున్నట్లు 
నాకు ఈ ఉరితాటి మీదనుండి చూస్తుంటే
సుందర స్వప్నాలు ఏవీ కనిపించటం లేదు
ఆమాటకోస్తే నాకు
కులం తప్పా ఇంకేమి కనిపించటం లేదు.”

నిజమే కదా, ఈ దేశం న్యాయం, చట్టం కూడా కులం కోణం లో ఆలోచిస్తుంటే నరసింహరెడ్డి లాంటి కుల న్యాయమూర్తులు చుండూరు తీర్పులో అందరూ నిర్దోషులే అని తీర్పులు చదువుతారు. దళితులే ఎపుడూ ఎంకౌన్టర్ చెయ్యబడతారో రామకృష్ణ లే ఎందుకు తృటిలో తప్పించుకుంటారో అర్ధం కాని తుపాకీ ఇనప గొట్టానికి కులం నే టార్గెట్ చెయ్యబడింది అని తెలియదు. ఆదిలోనే కులం అనే కత్తిర తో కోరికలను కత్తిరిస్తుంటే, ఇంకా ఉరికంభం ఎక్కిన తర్వాత చివరి కోరికగా సుందర స్వప్నాలు ఎలా కనిపిస్తాయి.

Also read  దళిత మిలినియర్స్: స్ఫూర్తిదాయకమైన దళిత మిలియనీయర్స్

రెండు ఉద్యమాలు, రెండు కేసులు. కారంచేడు, చుండూరు మారణకాండ తదనంతరం ప్రభుత్వం ఎలా కేసులను మిర్వీర్యం చేసిందో, తిరిగి ఉద్యమకారుల మీద నే ఎలా కేసు పెట్టిందో విశేషణాత్మకంగా వివరించెరు.

ఉన్న ఒక్కడూ పట్టుబడ్డడూ అంటూ ప్రపంచంలో ఎవరూ చెయ్యని సాహసం, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సెన్ పట్టుబడినప్పుడు అయిన గురించి కీర్తించెడు.’ కాలం వీరులకే సలాం చేస్తుంది ‘ అంటూ సద్దాం హుసేన్ ని ఉరితీసినపుడు శ్లాఘించేడు. ప్రపంచంలో అహకరించిన జాతులు, దుర్మార్గానికి పాల్పడిన జాతులు మానవత్వానికే వెతిరకేమైన జాతులు తమ పూర్వికులు చేసిన ఘోరమైన అకృత్యాలకు
క్షమాపణ చెబుతుంటే మన పరిస్థితి ఏంటంటూ ఇకనైనా పచ్చతాప ప్రకటన చేస్తారా అంటూ ఈ దేశాన్ని మూడు వేల సంవత్సరాల నుండి అణిచి వేయబడుతున్న దళితుల తరుపున ప్రశ్నించేడు.

ఇప్పుడింక నువ్వు నాకు స్వంతం
నా కలలో నీ స్వప్నాలతో సహా
విశ్రమించు
యుప్పుడింక
ప్రేమ, బాధ, పనీ
అన్నీ నిద్ర పోవాల్సిందే…,
ప్రపంచం గెండెల్ని కొల్లగొట్టిన కవి ‘పాబ్లో నెరుడా ‘ ని తెలుగు ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తీ కలేకూరి.

‘ పంజరంలో పాలపపిట్ట పాట పాడేదెందుకో! అమెరికా Statue of Liberty వెనక అక్కడ దేవదూతల్లాంటి తెల్లటి మనుషుల ఉంటారు , మల్లె పువ్వుల్లా నవ్వూతూ ఉంటారు. కానీ దాని వెనక నల్లజాతి దుర్భర దారిద్ర్యాన్ననుభవిస్తూ అతి పెద్ద స్వేచ్ఛా స్వర్గంలో మధ్య యుగాల బానిసత్వపు నల్ల జాతి వారి ఎన్ని జీవితాలు ఉన్నాయో ‘మాయ అంగేలో కి తెలుసు అంటాడు కలేకూరి.

“పుట్టడం యెంత కష్టతరమో 
మరణించడం యెంత దారుణమో
మంత్రసానులకి, పొత్తి గుడ్డలకి తెలుసు.
జనన మరణాల మధ్య ప్రయాణమే కదా జీవితం
నక్షత్రాల మధ్య పోసుకోలు కబుర్లలా
మన ప్రయాణం ఎందుకు?
బహుమానం ఏదో కోల్పోయాం
బహుసా దాని పేరు ప్రేమ”

పిడికెడు ఆత్మ గౌరవం కోసం ఉద్యమిస్తూనే మనుషుల మధ్య ప్రేమ, సౌభ్రాతృత్వాన్నీ ఆశించిన వ్యక్రి కలేకూరి.

Also read  ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వారో కి జన్మదిన శుభాకాంక్షలు!

లం వీరులకే సలాం చేస్తుంది.

(Visited 99 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!