రమాబాయి అంబేడ్కర్!

షేర్ చెయ్యండి

అంబెడ్కర్ గురించి చెప్పుకుంటున్నప్పుడు అయన సహధర్మచారిణి మాత రమాబాయి ని గుర్తు తెచ్చుకోవటం మన కనీస ధర్మం. ఒక మహా ఉద్యమానికి, ఒక మహా ఉద్యమానికి మొట్ట మొదట సాక్షి, అభిమాని, మద్దతు తెలిపిన వ్యక్తి శ్రీమతి. రమాబాయి అంబేడ్కర్

శ్రీమతి రమాబాయి 1898 ఫిబ్రవరి 7 వ తారీకున మహారాష్ట్ర లోని ‘ధబోల్’ గ్రామంలో జన్మించేరు. 

1906 లో శ్రీ భికు వాలగ్కార్ కుమార్తె అయిన రమాబాయి అంబెడ్కర్ ని వివాహం చేసుకున్నారు. రమాబాయి చిన్నతనం లొనే తల్లిదండ్రులు మరణించటం తో బంధువులు తో బొంబాయి వచ్చేరు. అంబెడ్కర్ చదువు, ఉద్యమాలతో బిజీ గా ఉండటంతో కుటుంబ బారమంతా రమాబాయి చూసుకోవాల్సి వచ్చింది. అంబేద్కర్ తండ్రి, మరియు సోదరుడు ఆనంద రావు మరణం కుటుంబ జీవితంలో ఆమెకు విషాదాన్ని నింపేయి.

అంబెడ్కర్ ఉన్నత చదువులు చదవాలి అని ఆమెకు ఆశగా ఉండేది. అంబెడ్కర్ చదువులు కోసం లండన్ వెళ్ళేటప్పుడు తన పూర్తి సహకారం అందించేరు. కుటుంబ జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు జరిగిన ఆమె ఏరోజు చలించిపోలేదు, సమస్యలకు లొంగిపోలేదు. అంబెడ్కర్ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నారు.

రమాబాయి జీవితం ఎన్నో విషాదాలు చూసింది. నలుగురు పిల్లలు మరణం,భర్త ఎప్పుడూ ఇంటి పట్టున ఉండక పోవటం, సమాజం లో రాజకీయ ఉద్రిక్తలు ఆమెను ఆందోళనకు గురిచేసేయి. భర్త ఆరోగ్యం కోసం ప్రార్ధించేది. అంబెడ్కర్ కి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆమెకు తెలియనిచ్చేవారు కాదు. ఆమె మరింత ఆందోళన చెందటం అంబెడ్కర్ కి ఇష్టముండేది కాదు. ఆమెకు దైవ భక్తి ఎక్కువ, ఎప్పుడూ ఉపవాస దీక్షలు చేసేవారు. అంబెడ్కర్ ఎన్నిసార్లు చెప్పినా వినేవారు కాదు. పండరీనాధుడిని దర్శించాలి అనేది ఆమే చిరకాల కోరిక.

రమాబాయి అనారోగ్యం తో ఉన్నప్పుడు అంబెడ్కర్ సానిత్యం కోరుకునేది. ఊపిరిసలపని పనులతో అంబెడ్కర్ ఆరోగ్యం క్షీణిస్తున్న దళిత జాతుల కోసాం అహిర్నిశలు శ్రామిస్తుంటే ఆమెకు చిరాకు కల్గించేది. అంబెడ్కర్ తనకు దూరం అవుతున్నాడు అని ఆందోళన చెందేది. ఒక్కొక్కసారి అంబెడ్కర్ ని వెంటనే చూడాలి అని అంబెడ్కర్ సభ ఎక్కడ ఉందొ అక్కడకి వెళ్ళేవారు.

Also read  మదర్స్ డే:దళిత మాతృమూర్తులు

పరిసరాలు మారితే మానసిక స్థితిలో మార్పు వస్తుంది ఏమో అని అంబెడ్కర్ అప్పుడు అప్పుడు పక్క ఊర్లకి పంపేవాడు. పూనా ఒప్పందం మీద తీవ్రమైన చర్చలు జరుగుతున్నా అంబెడ్కర్ గాలి మార్పు కోసం ఆమెను ధార్వార్ తీసుకు వెళ్ళేరు. అయినా ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు.

రమాబాయి కి ఉన్నా చిరకాల మానసిక వేదన ఆమెను కొలుకోలేకుండా చేసింది. ఆమె చివరగడియాలలో ఉన్నప్పుడు అంబెడ్కర్ ఆమె చెంతనే ఉన్నాడు. మే 26, 1935 అంబెడ్కర్ సన్నిధిలో ఆమె కన్ను మూసింది.అప్పటికి వారు దాదార్ హిందూ కాలనీలో ఉండేవారు. అంత్యక్రియలకు దాదాపుగా 10వేల మంది హాజరు అయ్యేరు.

కుటుంబం లో ఏ కస్టము రాకుండా నడిపిన భార్య అంటే అమితమైన గౌరవం, ప్రేమ అంబెడ్కర్ కి. అందుకే అయిన రాసిన The thoughts of Pakistan అనే పుస్తకాన్ని ఆమె కు అంకితం చేసేరు అంబెడ్కర్.

బారత దేశంలో స్త్రీల యొక్క సామజిక స్తితి ఒక ఎత్తు అయితే అందులో అణగారిన వర్గాల స్త్రీలది ఇంకా కటినంగా ఉంటుంది. కడు పేదరికంలో పుట్టిన అతి సామన్య స్త్రీ బర్త ను అర్ధం చేసుకుని అయినకు సహకరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. శ్రీమతి రమాబాయి గారి ప్రోత్సాహం బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ అనే వజ్రాన్ని ఈ దేశానికి ఇచ్చిరు . అంతేకాకుండా నిమ్నజాతుల స్త్రీలకు ఒక మర్గానిర్దేశ్యం చేసేరు శ్రీమతి రమాబాయి అంబేడ్కర్. 

కుటుంబ ఆర్ధిక అవసరాలు, సంపాదన ఎరిగి జాగ్రత్త గా తన భర్త సంపాదన ఖర్చు చేసే ఉత్తమ ఇల్లాలుగా శ్రీమతి రమాబాయి అంబేడ్కర్ జీవితం మనకి తెలియజేస్తుంది. బాబాసాహెబ్ మొదట ఉద్యోగంలో చేరినప్పుడు వచ్చిన మొట్ట మొదటి జీతంతో వారి బందువులకు కొత్త బట్టలు, స్వీట్స్ పంచిపెట్టేరు. అప్పుడు ఆమెకి ఎక్కడలేని సంతోషం కలిగింది. అయితే బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గారు ఆమె సంతోషం మీద నీళ్ళు చల్లేరు. తనకు వచ్చే జీతం విందులకు ఖర్చు చెయ్యవద్దు, నేను కొన్నిరోజుల్లోనే ఉద్యోగం మాని పై చదువులకు లండన్ వెళ్ళాలి అని తన కోరిక చెప్పినప్పుడు ఆమె సహజ స్త్రీ మనస్తత్వం కలిగిన వ్యక్తిగా కాస్త నిరసపడినా భర్త యొక్క కోరికను , ఆశయాన్ని మన్నించి తనకు సహకరించిన గుణవంతురాలు. బాబాసాహెబ్ జీతం డబ్బులు రూ 1.50 పైసలు గా ఒక్కొక బాగం చేసి రోజు వారి ఖర్చులు చేసి మిగతావి పొదుపు చేసేవారు. దీనితో బాబాసాహెబ్ డా . అంబేడ్కర్ గారు లండన్ వెళ్ళటానికి మానసిక స్తైర్యం ఇచ్చేరు రామాభాయి. 

Also read  చట్టం దృష్టిలో నాది నేరం - నా దృష్టిలో అదే న్యాయం" పూలన్ దేవి

కుటుంబంలో బార్య స్తానం ఎంత గొప్పదో రమభాయి లాంటి వారి జీవితం ఒక ఉదాహరణ. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గారు లండన్ వెళ్ళినప్పుడు రమా భాయి నే కుటుంబ అవసరాలు తీర్చేరు. పిడకలు అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలు తీర్చి , బాబాసాహెబ్ కి కూడా మనీ ఆర్డర్ చేసేవారు.

ఒక దశలో బాబాసాహెబ్ కి రమాబాయి యొక్క కష్టాన్ని చూసి చలించినా నిమ్న జాతులకు తన అవసరం గుర్తు వచ్చి రమాబాయి కి సర్ది చెప్పేవారు.   

డా. అంబేడ్కర్ గారు పై చదువులకు లండన్ వెళ్ళాలి అన్నప్పుడు ఈ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే ఉండవచ్చుగా అని ఆమె డా అంబేడ్కర్ గారి ని ప్రాదేయపడ్డారు. అయినా డా అంబేడ్కర్ గారు తన లక్ష్యాన్ని చెప్పటంతో కుటుంబ బారం తన మీద వేసుకుని డా. అంబేడ్కర్ ని సంతోషంగా పై చదువులకు పంపి ప్రపంచ మేధావుల్లో ఒకరిని మనకి అందించిన త్యాగశీలి శ్రీమతి రమాబాయి. 

బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ గారికి ఎప్పుడూ చదవడం, రాసుకోవడం చేస్తూ ఉంటే అయిన కాళ్ళ వద్ద కూర్చొని కాళ్ళు నొక్కుతూ అక్కడే నిద్ర పోయేవారు. 

Also read  స్వేచ్చ, సౌభ్రాతత్వం ఎస్సి మహిళల ఆభరణం!

శ్రీమతి. రమాబాయి అంబేడ్కర్ గారికి తన బర్తతో ఉద్యమాల్లో పాల్గొనాలి అని ఆశ ఉండేది. తనని కూడా తీసుకు వెళ్ళమని డా అంబేడ్కర్ గారిని అడిగేవారు. డా. అంబేడ్కర్ ఆమెను ప్రతిసారి తీసుకువెళ్తాను అని మరచిపోయేవారు. ఒక్కసారి దగ్గరలో ఒక మీటింగ్ జరుగుతున్న సభా స్తలంకి శ్రీమతి రమాబాయి భోజనం తీసుకు వెల్లేరు. డా. అంబేడ్కర్ గారి కోసం ఇంటికి వచ్చే నాయకులకు, ప్రజలకు ఆమె ఏనాడు విసుగు ప్రదర్శించకుండా వచ్చిన వారికీ మర్యాదలు చేసేవారు. వారి కోసం ఆమె బోజనం కుడా తాయారు చేసేవారు. 

బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ గారు ఆమెను ఎప్పుడూ చదువుకోమని ప్రోత్సహించే వారు. అప్పుడు అప్పుడు ఆమెకు చదువు చెప్పేవారు. 

శ్రీమతి రమాబాయి కి పండరీపురం లోని పాండురంగ స్వామి దేవాలయాన్ని దర్శించాలి అని కోరిక. ఆమె ఎప్పుడూ పాండురంగ స్వామి పూజలో ఉండేవారు. అంటారని కులం వారు పాండురంగ స్వామి గుడికి వెళ్తే ఏమి జరుగతుందో తెలిసి డా అంబేడ్కర్ గారు ఆమె కోరికను వాయిదా వేస్తూ వచ్చేవారు. జీవితంలో ఒకే ఒక కోరిక అడిగిన తన సహా ధర్మచారి కోరిక తీర్చాలి అని డా అంబేడ్కర్ ఆమెను పండరీపురం తీసుకువేల్లేరు. అక్కడ డా. అంబేడ్కర్ దంపతులను లోనికి అనుమతించలేదు. దూరానే ఉండి పాండురంగ స్వామి కి మొక్కి ఇంకెప్పుడు తను ఈ అవమానం భరించకూడదు అనుకున్నారు. 

పిల్లల ఆరోగ్యం బాగా లేకపోయినా ఒక్కొకసారి డా అంబేడ్కర్ ఇంటికి వచ్చేవారు కాదు. అన్నీ తానై శ్రీమతి రమాబాయి డా. అంబేడ్కర్ ని ఏ నాడు ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నారు. 

శ్రీమతి రమాబాయి అంబేడ్కర్ ఒక సామాన్య గృహిణి నుండి అనితర సాధ్యమైన ఒక గొప్ప నాయకుడి బార్యగా అయిన ఉద్యమంలో పరోక్ష బాద్యత వహించేరు. 

మాతా రామాబాయి అంబెడ్కర్ కి జై భీమ్

 

 
(Visited 179 times, 1 visits today)

One thought on “రమాబాయి అంబేడ్కర్!

  • 07/02/2018 at 1:42 PM
    Permalink

    Vyasam baga undi

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!