రిజర్వేషన్లు కావవి, రిప్రజెంటేషన్స్; మీ పేదరికానికి, మీ నిస్సహాయతకు రాష్ట్రాన్ని పాలిస్తున్న మీ కులం అని ఎందుకు గుర్తించరు?

షేర్ చెయ్యండి
  • 40
    Shares
 
సామజిక రిజర్వేషన్లు మీద భూస్వామ్య / పీడిక  కులం ప్రజలకు ఒక దురభిప్రాయం ఉంది. ఈ దురభిప్రాయం, వ్యతిరేకత ఈనాటిది కాదు. రాజ్యాంగ పరిషత్ లో రాజ్యాంగ నిర్మాత డా. బి ర్ అంబేడ్కర్ గారు రిజర్వేషన్లు ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం, డా. అంబేడ్కర్ ఇచ్చిన వివరణతో సభ ఆమోదం తెలిపింది. 
 
బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ నిమ్న కులాలకు / జాతులకు అంటే సామాజికంగా కుల వివక్ష వలన విద్య, ఉద్యోగాల కు దూరం ఉంచిన కులాల సామాజిక  సమానత్వం కొరకు రిజర్వేషన్లు దోహదపడతాయని బావించేరు. 
 
బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ రిజర్వేషన్లు అనేవి ఆయా కులాల రిప్రెజెంటేషన్ అన్నారు. జనాభా ప్రాతిపదికన ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. అది ప్రభుత్వ బాద్యత.  
 
రిజర్వేషన్లు ఎవరు  అడ్డుకుంటున్నారు?
కమ్యూనల్ రిప్రెజెంటేషన్ రాజ్యాంగ పరంగా అమలు చేయడం ప్రారంభించడం మొదలు పెట్టిన క్షణం నుండి రిజర్వేషన్ వ్యతిరేక వర్గం ఒకటి వివిధ రూపాలలో  అడ్డంకులు సృష్టించడం మొదలు పెట్టేరు. కారణం బ్రాహ్మణ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ సమాన అవకాశాలు, అదికారం క్రింది కులాలకు రాకుండా అడ్డుకోవడం లో భాగమే రిజర్వేషన్లు అనే రిప్రజెంటేషన్ ని అడ్డుకుంటున్నారు. 
 
బారత రాజ్యాంగ అసెంబ్లీ లో జరిగిన చర్చ లో  ప్రాధమిక హక్కుల పై ఏర్పడిన సబ్ కమిటీ ఇలా చూచించింది. మతం, జాతి, కులం , లింగం, పుట్టిన ప్రాంతం వంటి అంశాల ప్రాతిపదికన ఏ ఒక్క పౌరుడి పట్ల ప్రభుత్వం వివక్ష చూపకూడదు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి.
 
రాజ్యాంగ స్ఫూర్తిని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ మొదట నుండీ విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తూ వస్తుంది. రిజర్వేషన్లు పై నాయస్థానాలలో కేసులు వేయడం, కుల సంక్షేమ సంఘం పేరుతొ ప్రతి కులం మాకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చెయ్యడం, సాంఘిక సంక్షేమ సంఘాల పేరుతొ లేదా పౌర సమాజం పేరుతొ రిజర్వేషన్ల ను అడ్డుకుంటున్నారు. 
స్వాతంత్రానికి ముందు రిజర్వేషన్ల పరిస్థితి!
రిజర్వేషన్లు అనేవి స్వతంత్రం రాక ముందు నుండి ఉన్నాయని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి తెలియక పోవచ్చు. ఇక హిందూ మతం యొక్క నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ పూర్వ కాలం నుండే వర్ణ వ్యవస్థ పేరుతొ సమాజాన్ని వర్గీకరించేరు. వేల సంవత్సరాల నుండి బ్రాహ్మణుడే విద్యాధికుడు , గురువు లేదా  పూజారి. ఇది ఏక పక్ష రిజర్వేషన్ కాదా?  వైశ్యు లే వ్యాపారం చెయ్యాలనేది రిజర్వేషన్ కాదా? 
 
“గాంధీ వర్ణ వ్యవస్థను సమర్థిస్తాడు. అంటే శూద్రులు, నిమ్నజాతులు రాజకీయ, విద్యా , ఉద్యోగాలు చెయ్యకూడదు”
 
ఇలాంటి కాలంలో కొల్హాపూర్ మహారాజ్, మైసూర్ మహారాజ్ వారి ఆస్తానాలలో  కుల వ్యవస్థ వలన తొక్కివేయబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించేరు. మద్రాసు ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ ల లో 1921 సంవత్సరం అప్పటి వరకూ  బ్రాహ్మణు లే ఉద్యోగాలు చెయ్యాలి అనే రిజర్వేషన్ నుండి మిగతా వెనకబడిన కులాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేరు. 
 
రిజర్వేషన్లు అంటే రిప్రజెంటేషన్ అని చెప్పిన బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని, ప్రజలందరికీ సమాన హక్కులు (ఉద్యోగాలు ) కల్పించాలని ఆనాటి పాలకులే నిర్ణయం తీసుకోగా బాగా అభివృద్ధి చెందిన నేటి సమాజంలో సాటి పౌరుల సమానత్వ అవకాశాలు, వారి యొక్క రిప్రెజెంటేషన్ ని నిలువరించే పనిలో ఉన్నారు. 
ఎస్సి / ఎస్టీ లకు రిజర్వేషన్లకు కారణం ఏమిటి?
ఆగస్టు 23 న  విశాఖపట్నం జ్ఞానభేరి కార్యక్రమంలో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో తులసి అనే విద్యార్థిని  రిజర్వేషన్లు గురించి మాట్లాడుతూ అన్ని చట్టాలను , సిద్ధాంతాలను సమీక్ష చేస్తూ కొత్తవి తీసుకు వస్తున్నాం మరి ఎస్సిలకు ఇచ్చే రిజర్వేషన్లు ఎందుకు సమీక్ష చెయ్యడం లేదు. రిజర్వేషన్లు సమీక్షించి పేదవారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరింది.  
 
తులసి లాంటి విద్యార్థులు మన సమాజం లో అనేకం. నిత్యం. అయితే రిజర్వేషన్లకు  వ్యతిరేకంగా మాట్లాడే వారు మొదటి రిజర్వేషన్ల అవసరం, అవి ఎందుకు కల్పించారో వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవాలి. 
 
రిజర్వేషన్లు వ్యతిరేకించేవారు వారి తాత, తండ్రుల దాస్టీకాల ను తెలుసుకోవాలి. వారు ప్రజలను ఎలా పీడనకు గురిచేసేవారో తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకోకుండా రిజర్వేషన్స్ అని వినపడగానే ఒంటికాలి మీద లేస్తే పడిపోగలరు. మీ కుల అనైతిక ఆచార వ్యవహారాలకు వేలాది సంవత్సరాల నుండి ఈ దేశం కోసం శ్రమించిన నిమ్న కులాల సామాజిక అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి అనే సత్యం తెలియాలి. 
ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు పరుస్తున్నారా? 
ఓట్ల కోసం కాపులకు రిజర్వేషన్స్  ఇస్తాను అని ప్రకటించిన ముఖ్యమంత్రి, కాపు కులానికి చెందిన విద్యాశాఖ మంత్రి గారి సమక్షంలో ఆ విద్యార్థిని అడిగిన ప్రశ్న కు  కాపుల రిజర్వేషన్లు ఇచ్చే ముఖ్యమంత్రిగా రిజర్వేషన్లు యొక్క ఆవశ్యకత చెప్పకుండా , సమాజంలో ఎస్సి కులాల మీద పెంచుకుంటున్న ద్వేషాన్ని మరింత పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం రిజర్వేషన్లు మీద నిజాయితీ లేదు అని చెప్పాలి. 
 
తులసి లాంటి విద్యార్థులు గత 10సంవత్సరాల లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ ఉద్యోగాలు మరియు కాలేజీ లలో ప్రవేశాలకు జరిగిన పరీక్షల్లో నష్టపోయిన ఒక్క సందర్భం ఉందా? 
 
గత నాలుగు సంవత్సరాలలో తెలంగాణ, ఆంధ్ర లో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు నియామకం జరిగింది. దానివలన రిజర్వేషన్ల వెతిరేకులు ఎంత నష్టపోయేరో ఏమైనా లెక్కలు ఉన్నాయా? 
 
సామాజిక బాధ్యత కలిగిన ప్రభుత్వాలు రిజర్వేషన్ల వ్యతిరేకులను ప్రోత్సహించడం ఎంతవరకు సబబు. రిజర్వేషన్లు మీద జరుగుతున్న దుష్పచారంను తిప్పికొట్టే బాధ్యత ప్రభుత్వానికి లేదా? 
కులం నీడలో అభివృద్ధి రాజకీయాలు!
స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడింది కదా ఇంకా కుల రిజర్వేషన్ల, రాజ్యాంగం పది సంవత్సరాలే కదా రిజర్వేషన్లు ప్రకటించిందని అమాయకంగా మాట్లాడే, ప్రశ్నించే పీడక కులాల ప్రజలు మీ కుల పాలకుల అభివృద్ధి వాస్తవాలను పరిశీలన చెయ్యండి  రిజర్వేషన్లు పేరుతొ దళితులకు ఇస్తున్న వాటా, మీ పీడక కులాలకు ఇస్తున్న వాటా ఎంతో మీరు సహృదయం తో తెలుసుకుంటే రిజర్వేషన్లు గురించి మాట్లాడారు. 
 
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏర్పడిన ప్రభుత్వాలు భూస్వామ్య కులాల చేతుల్లోకి వెళ్ళింది.  అభివృద్ధి చెందుతున్న సమాజంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు వారి కులాల అభివృద్ధి కొరకే ప్రణాళికలు రచించేరు. ప్రభుత్వ పధకాలు, బడ్జెట్ కేటాయింపులు పాలక కులాలను దృష్టిలోపెట్టుకుని చేసేరు. 
 
1950 దశకంలో వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి చెయ్యడమే ప్రభుత్వాల ప్రధమ కర్తవ్యం. భూస్వామ్య పాలక కులాలు వ్యవసాయం ఆధునీకరణ పేరిట అంది వచ్చిన అవకాశాలను , ప్రభుత్వ పెట్టుబడులను వారే అందిపుచ్చుకున్నారు. ఆంధ్ర తెలంగాణా లో కొత్తగా ఏర్పడిన నాగార్జున సాగర్ ఆయకట్టు, శ్రీశైలం ప్రాజెక్ట్ ల క్రింద వ్యవసాయం చేసి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ ఆధునీకరణ, బ్యాంకు ఋణాలు , యాంత్రీకరణ తో వారి యొక్క ఆర్ధిక స్థితిని మెరుగు పరుచుకున్నారు. 
 
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ శాఖలలో అభివృద్ధి చెందిన బ్రాహ్మణ, భూస్వామ్య కులాలే అందిపుచ్చుకున్నాయి. భూమి ద్వారా ఏర్పడిన సంపద తో రాజకీయాన్ని మరియు సివిల్ కాంట్రాక్టు లు , మద్యం కాంట్రాక్టు లు, పరిశ్రమ లు , వ్యాపారం మొత్తం భూస్వామ్య కులాలు దక్కించుకున్నాయి. 
 
పరిశ్రమలు పేరిట రాయతీలు, వ్యవసాయం పేరిట సబ్సిడీ లు, గిట్టుబాటు ధరలు, ఉచిత విద్యుత్ , సులభతరమైన పన్ను విధానం, భూమి దానం , ఋణ మాఫీ లు మొత్తం ప్రభుత్వ ఖజానా దోచి పెట్టి వారి కులాలను అభివృద్ధి చేసుకుంటూ అదే రాష్ట్ర ప్రజల అభివృద్ధిగా చూపెడుతూ వచ్చేరు. 
 
1980 వ దశకంలో రాజకీయ అధికార మార్పిడి రెడ్డి సామాజిక వర్గం నుండి కమ్మ సామాజిక వర్గం చేతులోకి మారడం తో ఒక్కసారిగా కమ్మ సామాజిక వర్గం వెలుగులోకి వచ్చింది. తాలూకాలను మండలాలుగా విభిజించి గ్రామాల్లో వారి కుల ఆధిపత్యం కొనసాగేందుకు, అధికారం వారి చేతుల్లో ఉండేవిధంగా సొసైటీ లు ఏర్పాటు చేసేరు.1990 లో ప్రపంచీకరణ నేపథ్యంలో ఆనాటి చంద్రబాబు కమ్మ కుల ప్రభుత్వం విజన్ 2020 పేరిట 35 లక్షల కోట్ల ప్రణాళికతో రాష్ట్రాన్ని అమెరికా, సింగపూర్ చేస్తాను అంటూ ప్రభుత్వ భూమిని అభివృద్ధి పేరిట దారాదత్తం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపేరు. ఒక వైపు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని అంటే వారి కుల అభివృద్ధిని ప్రోత్సహించేరు. 
 
ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం పేరిట రూ 1,30,0000/- కోట్లు రెడ్డి కులానికి అప్పనంగా దోచి పెట్టింది. ఇందులో రిజర్వేషన్ల వర్గాల వాటా 1 శాతం కూడా లేకపోగా  ఇందిరా గాంధీ హయం నుండి పెండిలో ఉన్న ఎస్సి ప్లాన్ నిధులు జల యజ్ఞానికి మళ్లించేరు. 
 
స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరిట బడుగు బలహీన వర్గాల భూములు లాక్కొని రెడ్డి , కమ్మ సామజిక వర్గానికి పంచేరు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీడియా రంగంలో , సినిమా రంగంలో కి వచ్చేరు. రైతు ఋణ మాఫీ, ఫీజు రీయంబర్స్మెంట్ , ఆరోగ్య శ్రీ పేరిట కమ్మ – రెడ్డి కులాల విద్య , వైద్య సంస్థలకు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టేరు. 
 
ఇక మలివిడత చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని పేరిట జరిగిన భూకుంభకోణాలు, అభివృద్ధి వాటాలు అన్నీ కమ్మ కుల ప్రయోజనాలకోసమే అని మీడియా కోడైకూస్తుంది. నీరు – చెట్టు పధకం గ్రామాల్లో నివసించే వారి కుల కాంట్రాక్టర్ ల కోసం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 
అవినీతి – అక్రమాలు పీడిక కులాలు సమర్ధిస్తున్నాయా? 
రిజర్వేషన్స్  వలన దేశం నష్టపోతుందని అంటున్నారు. రిజర్వేషన్లు వలన సమాజంలో అసమానతలు పెరుగుతున్నాయి అంటున్నారు, రిజర్వేషన్లు వలన కులతత్వం పెరుగుతుందని అంటున్నారు? 
 
రిజర్వేషన్స్  వలన ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా దివాళా తీసిందా? ఎస్సి / ఎస్టీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే భారతీయ రైల్వే కానీ లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేదా మహా నవరత్న కంపెనీలు కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ , ONGC,BSNL లాంటి ప్రముఖ సంస్థ లకు నష్టం జరిగిందా ?
 
రిజర్వేషన్లు వలన కులతత్వం పెరుగుతుంది అంటున్నారు, ఇది అర్ధం పర్ధం లేని వాదన. కులం ఉండబట్టే, ఆ కులం వలన అణిచివేతకు గురి కాబట్టే రిజర్వేషన్లు అనే ఉతకర్ర ఇచ్చేరు తప్పా రిజర్వేషన్లు వలన కులం పుట్ట లేదు. 
 
1990 నుండి నేటి వరకూ దేశం మొత్తం ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ  వైపు చూస్తుంది. కారణం 2 ఎకరాల చంద్ర బాబు , లక్ష కోట్ల అవినీతి కేసులో ఉన్న జగన మోహన్ రెడ్డి , కుటుంబ పాలనలో కేసీర్ 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజన్ 20 – 20 పేరుతొ 35 వేల కోట్లు చంద్ర బాబు ఎవరి జేబులు నింపేడు. జలయజ్ఞం పేరిట జగన్ జైలు కి ఎందుకు వెళ్ళేడు, ఓటు కు నోటు మరియు అవినీతి కేసుల్లో చంద్రబాబు అతని కుమారుడు లోకేష్ , అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కేసీర్ కుటుంబం. వీరి అవినీతి, వీరు వారి సొంత కులానికి దోచిపెట్టిన డబ్బుతో నిరుద్యోగం లేకుండా చెయ్యవచ్చు. 
 
ప్రభుత్వ ఉద్యోగాలు లేక , ప్రైవేట్ ఉద్యోగాలు చెయ్యలేక చేసినా అక్కడి జీతాలు తక్కువతో జీవించలేక ఫస్ట్రేషన్ తో రిజర్వేషన్లు కారణం అంటూ నిందలు వేస్తున్నారు. 
 
ప్రభుత్వ విద్య, వైద్యాన్ని నిర్వీర్యం చేసిన చంద్ర బాబు , రాజశేఖర్ రెడ్డి లు ప్రైవేట్ ఫీజులు కట్టలేక ప్రజలు వారి కుల ప్రభుత్వాలను నిందించలేక రిజర్వేషన్లు వారి నిస్సహాయతకు కారణం గా చూపెడుతున్నారు. 
 
రాజకీయ నాయకులు, వారి బినామీల అవినీతి. విజయ్ మాల్యా , నీరవ్ మోడీ , లగడపాటి రాజా గోపాల్ లాంటి డిఫాల్టర్ లు వేలాది కోట్లు బ్యాంకుల ను మోసం చేసి ఎగగొట్టిన డబ్బు గురించి మాట్లాడలేక రిజర్వేషన్లు వారి దరిద్రానికి కారణం అంటున్నారు. 
 
“అవినీతిని ప్రశ్నించలేని సమాజం సామజిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ల ను వ్యతిరేకించడం సిగ్గు చేటు.” 
ఫస్ట్రేషన్ లో బారత దేశం:
ఈ మాట ఎందుకు అనవలసి వచ్చిందంటే గత 15 సంవత్సరాలు గా బారత దేశం లో శరవేగంగా జరుగుతున్న మార్పులకు గురైన బారతీయ యువత, వారి కుటుంబాలు ఆర్ధిక శక్తి క్షీణించి చెల్లాచెదరువుతుంటే పాలకులను ఏమీ అనలేక నిస్సహాయత తో ఆకోపాన్ని బలహీనుల మీదకు నెడుతున్నారు. 
 
ప్రపంచీకరణ, గ్లోబలీకరణ సంపద సృష్టించక పోగా , ఉన్నది కాస్త లాక్కుంది. డబ్బు ఉన్నవాడు రాత్రికి రాత్రే వేల కోట్లకు అధిపతి అవుతుందటే మధ్య తరగతి సగటు భారతీయుడి ఆస్తి పాదరసంలా జారిపోతూ వస్తుంది. 
 
రాజకీయ అవినీతిని ప్రశ్నించకుండా తమ కులం , మతం, ప్రాంతం అని సమర్ధిస్తూ అగ్ర వర్ణాల్లో పేదలు ఉన్నారు దానికి కారణం రిజర్వేషన్లు అంటూ కుంటి సాకులు, మొసలి కన్నీరు కారుస్తున్నారు. 
 
మీ పేదరికానికి, మీ నిస్సహాయతకు మీ కులం లో పుట్టిన ఒక అవినీతి పరుడు(లు) అని ఎందుకు గుర్తించలేక పోతున్నారు. 
 
మీ పేదరికానికి, మీ నిస్సహాయతకు కారణం మీ కులంలో పుట్టిన పెట్టుబడిదారుడు అని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు. 
 
మీ పేదరికానికి, మీ నిస్సహాయతకు 72 సంవత్సరాల నుండి ఈ దేశాన్ని , రాష్ట్రాన్ని పాలిస్తున్న మీ కులం అని ఎందుకు గుర్తించరు. 
 
రిజర్వేషన్స్  కావవి, రిప్రజెంటేషన్స్! జనాభా దామాషా ప్రకారం మా వాటా. 5 % ఉన్న రెడ్లు 60% అసెంబ్లీ లో ఎలా అడుగుపెట్టేరు. 50 % ఉన్న బలహీన వర్గాలు 5 % మందే ఎందుకున్నారు? 
ఆలోచించండి , ఆత్మవిమర్శ చేసుకోండి. 
 
(Visited 276 times, 1 visits today)
Also read  దళిత రాజ్యాధికారం-బిఎస్పీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!