రిజర్వేషన్లు: ఆర్థికపరమైన రిజర్వేషన్లు మరక పోగొట్టుకోవడం కోసమేనా!

షేర్ చెయ్యండి
  • 80
    Shares

రిజర్వేషన్లు అంశం భారత దేశాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసే అవకాశం కల్పించింది ఈ దేశ కుల వ్యవస్థ. రిజర్వేషన్లు అనగానే కులం యొక్క దుర్మార్గం 70 ఎమ్ ఎమ్ తెరమీద కనిపిస్తుంది. 


మోడీ ప్రభుత్వం రిజర్వేషన్ల అర్ధం మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లు అంటూ కుల సంస్కృతికి మసి పూసి మారేడుకాయ చేసేపనిలో ఉంది. 


భారత దేశంలో కులాధారిత  రిజర్వేషన్ల పుట్టుపూర్వత్తరాలు అందరికీ తెలిసినవే. గ్లోబల్ సంస్కృతి లో ఇంకా కుల రిజర్వేషన్లా? అని ఆచ్చర్యంగా మాట్లాడే చైనా స్కూల్ నుండి పట్టభధ్రులు అయ్యే యువత కూడా ఉన్నారు. 


భారత రాజ్యాంగంలో నిమ్న కులాలకు , జాతుల ( ఎస్సి / ఎస్టీ ) కు కల్పించబడిన ప్రత్యేకమైన రక్షణ చట్టాలు , అవకాశాలమీద విమర్శలు చేశారు ఆనాటి కాంగ్రెస్ సభ్యులు సర్ధార్ వల్లభాయ్ పటేల్, ఎన్ జి రంగా తదితరులు.

 భారత రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గారు ఉపన్యసిస్తూ  అగ్రవర్ణాల వారు పీడిత కులాల వారిని, అధిక సంఖ్యాకులు, అల్ప సంఖ్యాకుల్ని దౌర్జన్యానికి, దోపిడీ కి ఏరేయకుండా, అదేవిధంగా పీడిత కులాల వారు అగ్రవర్ణాల మీద , అల్ప సంఖ్యాకుల మీద తిరుగుబాటు జేయకుండా దేశంలోని అన్ని కులాల వారు, వర్గాల వారంతా ఒకానొకనాటికి ఒకే కులం, లేదా వర్గం గా మారిపోగల అవకాశాలను గుర్తిస్తూ అందుకు అవసరమైన విధంగా మాత్రమే ప్రత్యేక రక్షణ లు కల్పించడం జరిగిందని చెప్పారు. 

కానీ భారతదేశంలో అగ్ర వర్ణాల వారు, అధిక సంఖ్యాకులు చేసిన పని ఎస్సి / ఎస్టీల మీద ద్వేషం కల్గించడం. 


రిజర్వేషన్ల ను ద్వేషించడమే అగ్రవర్ణాల విధి!


భారత రాజ్యాంగ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుండి రిజర్వేషన్లు మీద అగ్రవర్ణం తప్పుడు ప్రచారం కల్పిస్తూనే ఉంది. రిజర్వేషన్లు మీద కోర్టు లకు వెళ్లడం, పాలకులు ఉద్దేశ్య పూర్వకంగా రిజర్వేషన్లను విస్మరించడం, పక్కదారి పట్టించడం జరిగింది. 


రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన సంవత్సరం కాలం లోనే 1951 లో మద్రాస్ హైకోర్టు లో శ్రీమతి చంపకం దొరైరాజన్ రిజర్వేషన్ల కు వ్యతిరేకంగా కేసువేయడం జరిగింది. 

Also read  మమతా బెనర్జీ: సిబిఐ ఆఫీసర్లను నిర్బంధించిన బెంగాల్ ప్రభుత్వం


ఆనాటి నుండి ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ ఎస్సి / ఎస్టీ మరియు బి సి కులాలకు విద్య , ఉద్యోగాల లో అవకాశాలు పొందేందుకు ఉతకర్ర మాదిరిగా ఉపయోగపడింది. 


అశ్వద్ధామ అధః , కుంజరః  అని నిత్యం పారాయణ చేసే భారత హైందవ సమాజం వారి వారసత్వానికి రిజర్వేషన్లు మీద అలాంటి అబద్దాలే నూరిపోశారు. 


ప్రతిభకు అడ్డంకి రిజర్వేషన్లు అంటూ కడుపులో ఉండగానే తమ పిల్లలకు నూరిపోశారు. కుల ఆధారిత రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో బహుసా ఏ ఒక్క తల్లితండ్రి వారి పిల్లలకు చెప్పి ఉండరు. 


రిజర్వేషన్ల వలన మెరిట్ విద్యార్థులకు, నిరుద్యోగులకు నష్టం కలుగుతుందనే  అశ్వద్దామ అధః , కుంజరః అనే ధర్మరాజు నీతిని ప్రచారం చేశారు. 


కులం అంటే తెలియని స్కూల్ పిల్లలకు సైతం ప్లే కార్డు లు ఇచ్చి ” మా భవిషత్ రిజర్వేషన్ల మీద ఆధారపడి ఉందని ” తక్కువ మార్కులు వచ్చిన వారు ఉద్యోగాలు చేస్తే దేశ భవిషత్ ఏమవుతుందని ప్రదర్శనలు చేసేవారు. 


మండల్ కమీషన్ కి వ్యతిరేకంగా ఆత్మాహుతి లే జరిగేయంటే ఒక వర్గం ఇంకొక వర్గాన్ని పైకి రానీయకుండా కులం అనే ఆయుధంతో ఎలా అణిచివేసారో చరిత్ర పుటల్లో కి వెళ్తే అర్ధం అవుతుంది. 


పేదలకు రిజర్వేషన్లు – బిజెపి!  


అగ్రవర్ణం లోనూ పేదలు ఉన్నారంటూ కులాధారిత రిజర్వేషన్లు కు ఎసరు పెట్టె ఒక ( కుట్ర  ) ఆలోచన హిందూ వర్గాలు సమాజం లో చాప క్రింద నీరులా వ్యాప్తి చేసారు.

 
ఆర్ ఎస్ ఎస్ నేతృత్వంలో కేంద్రం లో అధికారం చేపట్టిన బిజెపి ప్రభుత్వం ఇంకా కొన్ని నెలల్లో పార్లమెంట్ కాలం ముగుస్తుందనగా ఎలాంటి చర్చ లేకుండా ఆచ్చర్యకరంగా అగ్రవర్ణ పేదలకు రిజరేషన్ల బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. 


భారత దేశ కుల చరిత్రను, హిందూ మతం లోని వివక్షను వక్రీకరిచే పనిలో భాగంగా అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్ల ను మోడీ ప్రభుత్వం కల్పించింది. 


హిందూ మతం మీద ఉన్న మరకలను రూపుమాపే క్రమంలో అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లు అంటూ ఆర్ ఎస్ ఎస్ – బిజెపి ప్రభుత్వం రిజరేషన్లు అనే సబ్బుతో మరకలను పోగొట్టే ప్రయత్నం చేస్తుంది. 

Also read  సావిత్రి భాయి పూలే: బేటీ బచావ్ ఐకాన్


ఒక వైపు దేశం వెలిగిపోతుందంటూ , పేదరికం మీద యుద్దాలు చేస్తున్నామంటూ గొప్ప గొప్ప ప్రకటనలు జారీ చేస్తూ మళ్ళీ పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు అంటే ప్రపంచ దేశాల ముందు భారత దేశం పరువు తీసినట్లే. 


మోడీ 2014 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను కలుపుకుని ఆర్ధిక అభివృద్ధి సాధిస్తామని ప్రచారం చేశారు. ‘ఇంక్లూజివ్ గ్రోత్ ‘ అంటూ కొత్త కొత్త పదాల ప్రచారంతో అధికారం చేపట్టారు.

 
రిజర్వేషన్లు ఆర్ధిక ఆర్ధిక అభివృద్ధి కోసంకాదని తెలిసీ మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసే కుట్రలకు పాల్పడింది. 


గత ఏడాది ఆగస్టు 28 న వారణాసి లోని బిజెపి కార్యార్థల సమావేశంలో మాట్లాడుతూ గత నాలుగేళ్ళ కాలంలో ఐదు కోట్ల మంది ని పేదరికం నుండి విముక్తి కల్పించేము అని మోడీ చెప్పుకొచ్చారు. 


ఉడాన్ ( UDAAN ) పధకం ద్వారా ఇక పేదలు అనేవారు ఉండరని, సామాన్య ప్రజలు ఈ పధకం ద్వారా ఆర్ధిక అభివృద్ధి సాధిస్తారని కార్ర్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 


అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లు అంటూ  ఆరు నెలలు లోనే మోడీ తన ప్రసంగం అబద్దమని తేల్చి చెప్పినట్లు అయ్యింది.


భారత దేశంలో పేదరికం నిర్ములిద్దాం , కులాన్ని నిర్ములిద్దాం , టెర్రరిజం నిర్ములిద్దాం అంటూ ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించిన మోడీ పేదరిక నిర్ములన కొరకు అగ్ర వర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం హాస్యాస్పదంగా ఉంది. 


ఫోర్ బ్స్  అనే ఆంగ్ల పత్రిక కధనం ప్రకారం భారత దేశంలో ప్రజల జీవన పరిస్థితులు రోజు రోజుకూ దిగజారి పోతున్నట్లు  మోడీ ప్రభుత్వం ఆర్ధిక స్థితి మీద ఒక కధనం ప్రచురించింది. 


బిజెపి ప్రభుత్వానికి దక్షణాది న హిందుత్వం పెద్దగా కలిసి వచ్చే అవకాశం లేదు, శబరిమల అయ్యప్ప కూడా మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం లభ్ది చేకూర్చ లేదు. 
ఈ పరిస్థితుల్లో మోడీ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అనే కొత్త పాచికను వేసాడు. 


అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు దళితుల మీద కుట్ర!

 
నవభారత నిర్మాత బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ గారు సమాజంలో అసమానతలకు కారణం కులం, ఆ కులాన్ని నిర్ములిస్తే చాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. 

Also read  రోహిత్ వేముల: ఆఖరి ఉత్తరం ఈ సమాజానికి


పాలకులు కుల నిర్ములన మీద దృష్టి పెట్టకుండా కులాల మధ్య చిచ్చు పెడుతూ ఎస్సి , ఎస్టీ వర్గాలను అణిచివేసే కార్యక్రం కు ప్రారంభించారు. 

 
పేదలకు రిజర్వేషన్లు అంటూ మోడీ ప్రభుత్వం వేసిన పాచిక దళిత వర్గాలకు ఒక హెచ్చరికలాంటిది. చాలామంది బిసి కులాలు దీని మీద స్పదించడం లేదని వాపోతున్నారు. 


బిసి లు హిందూ మతం లో భాగం అవడానికి తల్లక్రిందులు పడి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు తక్కువ కులం అనే మానసిక స్థితినుండి అగ్రవర్ణం / కులం అనే నిచ్చన మెట్ల మీద ఎగబాకుతున్నారు. 


కాబట్టి మోడీ వేసిన పాచిక కు బలయ్యేది దళిత వర్గాలు మాత్రమే. బిజెపి ప్రభుత్వం హిందూ మతాన్ని సజీవంగా కాపాడుతూనే దళితులకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక చట్టాలు , హక్కులు హరిస్తుంది. 


దళితులకు కల్పించబడిన ప్రత్యేక హక్కులు , చట్టాలు హరించడం వలన సమానత్వం సాధించేము అనుకునే భ్రమల్లో మోడీ , హిందూ కుల వ్యవస్థను అభిమానించేవారు అనుకుంటారు. 


దళితులకు రిజర్వేషన్లు, ప్రత్యేక చట్టాలు హరించడం వలన మోడీ / బిజెపి కి దళితేతర వర్గాల్లో పాపులారిటీ పెరుగుతుంది. 


ఒక విధంగా చెప్పాలంటే ఇది దళితుల్లో అసహనానికి కేద్రబిందువు అవుతుంది. ఐర్లాండ్ ప్రజలు తిరగబడిన విధంగా భారత దేశంలో దళిత ప్రజలు కూడా తిరగబడే అవకాశం ఉంది. 


రాజ్యాంగ చట్ట సభలో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గారు గత చారిత్రిక సత్యాలను, అనుభవాలను గుర్తుజేస్తూ  చేసిన హెచ్చరిక కూడా ఇదే , స్వాతంత్రం, సమానత్వం , సౌభ్రాతత్వం ఈ మూడు టి లో ఏ ఒక్కటి లేకపోయినా దేశం మళ్ళీ తన స్వాతంత్య్రాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. 


సాంఘిక సమానత్వం లేకపోతె దళితుల మీద అగ్రవర్ణాల దాడులు , అణిచివేత , నిర్బంధం పెరుగుతుంది. అప్పుడు దళితుల తిరుబాటు దేశం చీలికలకు అవకాశం కల్పిస్తుంది. 


కాబట్టి ఆర్ ఎస్ ఎస్ – బిజెపి దళిత వర్గాల మీద చేస్తున్న కుట్రలకు తెరదించకపోతే దేశంలో అంతర్యుద్ధం కి బాటలు వేసినట్లే!

(Visited 146 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!