రివర్స్ డేమోక్రసీ…!

షేర్ చెయ్యండి

బారత దేశంలో అందరికంటే సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారు, యెస్ సి లు, యెస్ టి లు. సభ్య సమాజంలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కులం అనే అసాంఘిక , అమానుష వ్యవస్థ ద్వార , మతం అనే భూతం పేరు చెప్పి శ్రమ దోపిడీకి గురి అవుతున్న ప్రజలు ఈ యెస్ సి లు, యెస్ టి లు.

మనం ఇప్పుడు 2017 వ సంవత్సరం లో ఉన్నాం. 5 కోట్ల ప్రజల సంవత్సరం బడ్జెట్ అక్షరాల రూ 1 లక్ష 50 వేల కోట్లు. కానీ ప్రబుత్వ లెక్కల ప్రకారం

1. ఇప్పటికీ అందరికంటే పేదవారు యెస్.సి, యెస్ .టి లే

2. ప్రభుత్వం గీసిన దారిద్ర రేఖ కు దిగువ ఉన్నది యెస్ సి లు, యెస్ టి లు

3. అంత్యోదయ పథకం పెట్టినా ఎక్కువ శాతం మంది ఎస్. సి, ఏ టి లే

4. ఉచిత బోజనం, బియ్యం పంపిణీ , పండుగలకు చంద్రన్న, రాజన్న కానుకల పేరుతో దరిద్రుల కు ఇచ్చేది ఏస్ సి. ఎస్ టి లకే

5. పుట్టిన పిల్లలో ఏడాది తిరగ కుండా చనిపోయేది యెస్ సి లు, యెస్ టి ల పిల్లలు.

6. ఏ సౌకర్యం లేకుండా జీవించేది ఎక్కువ శాతం ఎస్ సి, ఎస్ టి లు.

7. దౌర్జన్యలకు, అక్రమాలకు, మాన బంగాలకు ఎక్కువగా గురి అయ్యేది ఏస్ సి లు, ఎస్ టి లు.

ఇంకా చెప్పుకుంటూ పోతే చాంతాడు అంత లిస్ట్ వస్తుంది.

ఈ మధ్య కొందరు మేము పెదలం అంటున్నారు. మాకు రిజర్వేషన్లు కావాలి అంటున్నారు. బారత ప్రభుత్వం కానీ లేదా మేము పెదలం అని ప్రకటించుకునే ప్రజలు అత్యంత ఇష్ట పడే ప్రపంచ బ్యాంకు లాంటి తదితర సంస్ఠ లు ఇచ్చిన రిపోర్ట్ లో లేదా పైన చెప్పిన ఎ దైనా ఒక్క కారణాలు అనుభవిస్తున్నట్టు గా ఏ ప్రభుత్వం ఆయినా లెక్కలు చెప్పిందా.?

Also read  యోగి 'రాంజీ' అంబేడ్కర్ ఒక కుట్ర!

బారత దేశంలో సంపదను ఎవరు సృష్టించేరు, ఎవరు దోచుకున్నారు, మీ పేదరికానికి కారణాలు ఏమైనా తెలుసుకున్నారా? ఉదాహరణకు మోడీ ప్రభుత్వం 2016 లో రూ 1.14 లక్షల కోట్లు బడా పారిశ్రామిక వేత్తల రుణం రద్దు చేశారు. అవి 2013 నుండి 2015 సంవత్సరం లకి సంబంధించినవి. వీరిలో ఏ ఒక్క ఎస్ సి, ఎస్ టి లకు సంబంధించిన వారు ఉన్నారా? GVK అనే తెలుగు వ్యక్తి కి సంబంధించిన రుణం దాదాపు గా 33 వేల కోట్లు. అలాగే ల్యాంకో, జి యం ర్ సంస్థ ల ఋణం మొత్తం కలిపి మేము పెదలం అనే గుప్పెడు మంది జనాలకు ఒక్కొక్కరికి రూ కోటి బ్యాంకు ఖాతా లో వేయవచ్చు. ఇక మోడీ తెస్తాను అన్నా నల్లధనం లో యెస్ సి, యెస్ టి ప్రజలు ఉన్నారా?

రిజర్వేషన్లు

విజయమాల్యా వేల కోట్లు బ్యాంక్ ఋణం ఎగగొట్టానికి, సహారా సుబ్రతో రాయ్ ప్రజల సొమ్ము దోచుకోవటానికి రిజర్వేషన్లు కారణమా? భారత దేశ సంపద అంతా ఎవరు దోచుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్లు కు ఇచ్చే నిధులు ఆ వర్గాలకు ఇచ్చేరా లేక దొడ్డిదారిన తమ సొంత అవసరాలకు వాదుకున్నారా? మేము పెదలం అని బోర్డు మెడలో వేసుకు తిరిగే ప్రజలు చెప్పాలి. ఉదాహరణకు డా. వై యెస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం కోసం ఖర్చు చేసిన రూ 8 వేల కోట్లు ఎవరి డబ్బో ఈ నయా పేదలకు తెలుసా? రిజర్వేషన్లు మీద పడి ఏడ్చే ప్రతి ఒక్కరూ సమాదానం చెప్పాలి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు లో భూమి కోల్పోతుంది ఎవరు? రిజర్వేషన్లు ద్వారా మేము ఉద్యోగాలు కోల్పోయి పేదవారు గా మారిపోతున్న ప్రజలారా మాకు ఉద్యోగాలు కావాలి అని రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేసేరా, గత 10 ఏండ్ల లో మీ ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తే ఎన్ని యెస్ సి లు దోచుకున్నారు. కోట్ల రూపాయల తో ఒక డాక్టర్ సీట్ కొంటున్న మీ ప్రజలను ఎప్పుడైనా ప్రశ్నించారా? మీకు సీటు రాక పోవటానికి కారణం మీ వర్గాలలే కదా. ప్రైవేట్ కాలేజీ లలో , సంస్థ లలో రిజర్వేషన్లు లేవు అక్కడ ఎందుకు చూపించ లేదు మీ ప్రతిభ. ల్యాంకో అనే సంస్థ మూత బడటానికి కారణం రిజర్వేషన్లు కారణం కాదు కదా? ప్రమోషన్స్ లో రిజర్వేషన్లు ద్వారా నష్టం జరుగుతుంది అనే వారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సుప్రీం కోర్టులో ఆంద్ర సి యం కులాని కి సంబంధించిన జడ్జిలు అంత మంది ఎలా ఉన్నారు. ఆంధ్ర నుండి మిగతా కులాలు ఎందుకు లేరు.? సరే రిజర్వేషన్లు వలన మీరు పేదలు అవుతున్నారు అనే భ్రమలో ఉన్న మీకు ఒక బంపర్ ఆఫర్ ” మేము రిజర్వేషన్లు వదిలేస్తాం, మా వాటా మాకు ఇవ్వండి” మోసం చేసి అడ్డుకున్న మా “కమ్యునల్ అవార్డ్” మాకిచ్చేయండి.

Also read  స్టేట్ సోషలిజం - బారత ఆర్ధిక, సామజిక, రాజకీయ ప్రజాస్వామ్యం: డా.అంబేడ్కర్ ప్రతిపాదనలు!

….ఎస్, కమ్యూనల్ అవార్డు ఇచ్చేయండి. మీరు ఏడ్చే ముష్టి రిజర్వేషన్లు వదిలేసుకుంటాం. ఈ 40 ఏళ్లలో దారిమళ్లించి బొక్కేసిన 25 లక్షల కోట్లు దళితుల నిధులు కక్కమనండి. భూమిమీదా, ఖనిజ, అటవీ సంపదల్లో ఇన్నేళ్లు యథేచ్ఛగా చేసిన లూటీ లో జనాభా దామాషాలో మా లెక్కలు తేల్చి పంచేయండి. సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఈ దేశంలో పౌరులైన ప్రతి దళితుడి న్యాయమైన హక్కులు బదిలీ చేయండి. రిజర్వేషన్లు మేమే ఒదులుకుంటాం.

ఒకేలా పుట్టిన బారత ప్రజల మధ్య జన్మతః వైరుధ్యాన్ని సరిచేసి, అప్పుడు మాట్లాడు కుందాం. కమ్యునల్ అవార్డును కాదని, పూనా ఒప్పందం తెచ్చినప్పుడే కుట్ర అర్ధం అయింది. మమ్మల్ని మీ దయా దక్షిణ్యాల పై ఆధారపడే పూ నా ఒప్పందం రద్దు చేసి కమ్యునల్ అవార్డ్ ప్రకటిస్తే రిజర్వేషన్లు పోతాయి. మాకు రావాల్సిన మా వాటా అడుగుతున్నాం.

ఆంద్ర, తెలంగాణా లో 2017 – 18 బడ్జెట్ లో యెస్ సి, యెస్ టి సబ్ ప్లాన్ నిధులు ఆ వర్గాల కోసం ఖచ్చితంగా ఖర్చు చేసే ధైర్యం ఉందా?

Also read  పెదపూడి విజయ్ కుమార్: వెలివాడ నుండి రాజ్యాధికారం వైపు!

పోనీ జనాభా ప్రతిపాదికన ఎవరి వాటా వారు తీసుకుందాం. భూమి ని జాతీయం చేద్దాం. మతం అనే మహమ్మారి ద్వారా జరుగుతున్న కులాన్ని కూల్చేయ్యటానికి మీరు సిద్దమేనా అని సంవత్సరాల నుండి అడుగుతున్నాం. దానికి మీరు సిద్దమేనా?

ఒక్కరు లక్ష కోట్లు, ఇంకొకరు 2 లక్షల కోట్లు. ప్రశ్నించేరా మీసంపదను దోచుకుంటున్న వాళ్ళను. ఇటీవల సి యం యెస్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంద్ర ప్రదేశ్ అవినీతి లో 2 వ స్థానంలో ఉంది. ఈ అవినీతి పరులు ఎవరో అదే సి యం యెస్ సంస్థ తో కమీషన్ వేద్దామా?

మీ పేదరికానికి కారణం ఎవరు? డేమోక్రసీ పేరుతో రాజ్యాధికారం సంపాదించుకుని ఒకే కుటుంబాలు పదవి అనుభవిస్తున్నా నోరు మెదపలేని మీకు జోహార్లు.

(Visited 23 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!