రెండో రౌండ్ టేబుల్ సమావేశం!

షేర్ చెయ్యండి

కుటిల నీతి ఎల్లకాలం మనుగడ సాగించలేదు. రెండో రౌండ్ టేబుల్ సమావేశం లో గాంధీ – కాంగ్రెస్ కుట్రలను బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ పటాపంచలు చేసేరు. మకూటంలేని మహారాజులా ఉన్న గాంధీ స్వదేశం లో నల్ల జెండాలతో నిరసన వ్యక్తపరిచే స్థాయికి తెచ్చేరు.

ఆగస్ట్ 15, 1931 న బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనటానికి బయలుదేరి వెళ్ళేరు. సుమారు 2000 మంది బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ కి వీడ్కోలు ఇవ్వటానికి ఓదారేవుకి వచ్చేరు. అదే ఓడలో సరోజినీ నాయుడు, గాంధీ కూడా ప్రయాణించాలి. కాని గాంధీకి బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ తో కలసి ప్రయాణించటం ఇష్టం లేదు. అందుకే చివరిలో సరోజినీ నాయుడు, గాంధీ తమ ప్రయాణం రద్దు చేసుకున్నారు. చిన్న చిన్న విషయాల గురించి పెద్ద సమస్యలు వదిలేసు కోవటం ఏమంతా సబాబుకాదు అంటారు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ గాంధీ ని ఉద్దేశించి. ఆగస్ట్ 29 న గాంధీ హడావిడి గా లండన్ చేరుకున్నాడు. 

సెప్టెంబర్ 7 న రెండో రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం అయింది. అప్పుడు బ్రిటన్ లో లేబర్ పార్టీ ప్రభుత్వం పోయి జాతీయ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ సమావేశంలో గాంధీ మైనారిటీల ప్రతినిధిగా వున్నారు.బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ఫెడరల్ స్ట్రేక్చర్ లో ఉన్నారు. సెప్టెంబర్ 15 న గాంధీ మొదటిసారి రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడేరు. కాంగ్రెస్ దేశం లో అన్ని పార్టీ లకు, సంస్థానదీసులకు ముస్లింలకు ,అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి, నేను కాంగ్రెస్ ప్రతినిధిగా ఇక్కడ నా అభిప్రాయాలే అంతిమంగా పేర్కొన్నారు.నా మాటే భారత దేశం మాట అని చెప్పారు.

గాంధీ యొక్క స్వభావం అంతకు ముందే గ్రహించిన బాబాసాహెబ్ డా. అంబెడ్కర్. గాంధీ ని నిశితంగా గమనిస్తున్నారు. గాంధీ మాట్లాడిన ప్రతి మాట, ప్రతి అక్షరం ఏ నిగూడ అర్ధం దాగి ఉందొ పరిశీలిస్తున్నారు. గాంధీ మీద ఎదురుదాడికి సిద్ధం అవుతున్నారు. ఒక్క విషయం బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ గమనించేరు. తను ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా తన జాతి అంధకారం లోకి నెట్టవేయబడుతుంది అని వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని నిచ్చాయనికి వచ్చేరు. అదేరోజు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ఫెడరల్ స్ట్రక్చర్ కమిటీ లో మాట్లాడేరు.సంస్థానాధీశులు విలీనం కావలి అంటే దానికి కొన్ని పద్దతులు ఉంటాయి అని వాటికి సంబంధించిన రాజ్యాంగ పద్దతులను వివరించారు. ఈ నియమాలు వారికి కొత్తగా వున్నాయి. అంతకు ముందే గాంధి సంస్థానాధీశులతో ఒక ఒప్పందం చేసుకుని వచ్చేరు. ఇప్పుడు వారు పాటించవలిసిన నియమాలు వింటుంటే మతిపోయింది. ఇవి ఏమీ తెలియని , అర్ధంకాని సంస్థానాధీశులు అంబెడ్కర్ మీద ఆధారపడ్డారు. సంస్థానాధీశులను నామినేషన్ పద్దతి ద్వార కాకుండా ఎన్నిక ద్వార గెలిచి సభకి రావాలి అని, సంస్థానం లో ప్రజల బాధ్యత ఫెడరల్ ప్రబుత్వానిదే అని బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ చూచించేరు.

రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉన్న సమయంలొనే భారత దేశంలో దళితులు కాంగ్రెసు , గాంధీ అనుచరులు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ కి వెతిరేకంగా ఉద్యమాలు , అలజడి లేపేరు. లండన్ కి ఉత్తరాలు పంపేరు.బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ దళితుల ప్రతినిధి కాదు అని. గాంధీ నే మాకు నాయకడు అని బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాసేరు.

ఇది అంతా ఒక కుట్రపూరితంగా జరిగింది. మరుసటి రోజు గాంధీ ప్రసంగిస్తూ దళితులు రాసిన లేఖల లోని విషయాలు ప్రస్తావిస్తాడు. గాంధి మనసులోని అసలు మాట చెప్పారు. ఆసలు ఈ సమావేశానికి ఇంత మంది రావటం అనవసరమని బారత దేశానికి నేనే ఏకైక ప్రతినిధి అని చెప్పేరు. గాంధీ కి తన అహం దెబ్బతింది. భారత ప్రతినిధులుగా ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు చెప్పటం జీర్ణించుకోలేక పోయేరు. ఈ సమావేశంలో వచ్చిన వారంతా ప్రజలు ఎన్నుకుంటే రాలేదు అని బ్రిటిష్ ప్రభుత్వం పిలిస్తే వచ్చెరు అన్నారు. గాందీ కూడా బ్రిటీష్ ప్రభుత్వ ఆహ్వానం మేరకే వచ్చిన సగంతి మరిచేరు గురివింద లాగ.

Also read  స్టేట్ సోషలిజం - బారత ఆర్ధిక, సామజిక, రాజకీయ ప్రజాస్వామ్యం: డా.అంబేడ్కర్ ప్రతిపాదనలు!

సంస్థానాల విషయంలో బాబాసాహెబ్ డా. అంబెడ్కని సమర్ధించవలసి వచ్చింది. కాని కుంటిసాకులు చెబూతు ప్రసంగించారు. సిక్కులు, ముస్లిం ల సంగతి సరే నిమ్నజాతులకు ప్రత్యెక రాజకీయ హక్కులు ఎందుకు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ కోరుతున్నారో నాకర్ధం కావటం లేదు అన్నారు. నిమ్నజాతులు హిందువులలో అంతర్భాగమే అన్నారు.

ఫెడరల్ కమిటీలో సెప్టెంబర్ 18 న బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ తమ ఉపన్యాసం మొదలు పెట్టేరు. ప్రారంభంలొనే ఫెడరల్ శాసన మండలి మీద గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయలు అయిన సొంతవా లేక యావత్ దేశ ప్రజల అభిప్రాయంనా అని అడిగేరు. దివాన్ బహుదూర్ రామస్వామి మోదిలియర్ లేచి ప్రజా ప్రతినిధుల భావాలు ప్రజల భావాలకు వెతిరేకంగా ఉండవు అన్నారు. మరి బాధ్యతయుత ప్రభుత్వం కోసం ఇంత గొడవ దేనికి అని చురక వేసేడు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్.

స్వరాజ్యం వస్తే నిమ్నజాతులు త్వరతిగతిన అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. విద్యా అవకాశాలు అభివృద్ధి చెందితే అసలు సమస్య ఉండదు అంటున్నారు మరి నా పరిస్థితి ఏంటి? అత్యంత ప్రజ్ఞా పావటాలు ఉన్న బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ఎలా వివక్షను ఎదురుకున్నాడో గుర్తు చేసేరు.

నిమ్నజాతులు  విషయం లో గాంధీ పిలుపు మేరకు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ఒక్కసారి కలుసుకున్నారు. బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ తమ అభిప్రాయాలను నిస్సంకోచం గా చెప్పేరు. గాంధీ మాత్రం అందరి అభిప్రాయాలే నా అభిప్రాయం అని చెప్పేరు. అయితే , అందరి చేత కాదు అనటానికి గాందీ విశ్వప్రయత్నం చేసినట్టు గా బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ కి తెలిసింది. మైనారిటీల విషయం లో వారు అడిగినవి అన్నీ ఒప్పుకున్నారు. అయినా చర్చలు విఫలం అవుతున్నాయి. గాంధీ తన వైఫల్యానికి కారణం భారత ప్రతినిధులే , వీరు అసలు నిజమైన ప్రతినిధులు కాదు నేనే అందరి ప్రతినిధి అంటూ అక్కసు వెళ్ళగక్కేడు.

Also read  బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ఆలోచనా విధానం-ఒక వర్తమాన విశ్లేషణ 

బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ గాంధీ ని ఇక ఉపేక్షించదలుచు కోలేదు. గాంధీ మేము బ్రిటన్ ప్రభుత్వ ఆహ్వానం మీద నే వచ్చెము అన్నది వాస్తవం. కాని మేము మా వర్గాల ప్రతిందులమే. మీ ప్రతినిధిని ఎన్నుకోమంటే భారత్ లో నా ప్రజలు ఖచ్చితంగా నన్నే ఎన్నుకుంటారు అనే గట్టి నమ్మకం,దైర్యం నాకు ఉంది. నా ప్రజలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇందులో ఎవ్వరికీ అభ్యంతరం ఉండవలిసిన పనిలేదు. కాంగ్రెస్ ఎప్పటికీ నిమ్నజాతులకు ప్రాతినిధ్యం వహించే సంస్థ కాదు, కాబోదు. కాంగ్రెస్ నిమ్నజాతులకు ప్రతినిధి అని గాందీ చెప్పటం అసత్యం.

అధికారం ఎవరి చేతల్లో ఉండాలనే విషయం మీద నిమ్నజాతుల కు ఏమాత్రం ఆసక్తి లేదు. ఒకవేళ అధికారం భారతీయుల హస్తగతం చేస్తే మాత్రం అది ఏ ఒక్క వర్గానికి కాకుండా హిందువులు కు కాని, ముస్లిం కు కాని అన్ని వర్గాలకు సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలి అన్నదే మా కొరిక అని చెప్పేరు.

గాంధీకి ముస్లిం ప్రతినిధులకు మధ్య కుదిరిన 14 ఒప్పందాల్లో నిమ్నజాతులప్రతినిధ్యాన్ని వ్యతిరేకించటం కూడా ఒకటని బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ కి తర్వాత తెలిసింది. ఈ చర్చల్లో గాంధీ ఎపుడు ఖురాన్ చేతిలో పట్టుకుని కనిపించేవారట.

గాంధీ మనసులో నిమ్నజాతుల మీద కుట్ర చేస్తూ పైకి నిమ్నజాతుల ప్రతినిధి , నిమ్నజాతుల హిందు సమాజం లో బాగం అని చెప్పటం అంతా అసత్యం అని తేలిపోయింది. గాంధీ దళిత జాతుల నిజమైన శత్రువు కాలేక పోయాడని విచారించాడు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్. ముస్లిం ప్రతినిధులు నిమ్నజాతులకు వ్యతిరేకంగా కుట్ర లో పాలు పంచుకోవటానికి ఒప్పుకోలేదు. అందుకు వారిని అభినందించాలి అన్నాడు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్.

బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ దృష్టిలో రౌండ్ టేబుల్ సమావేశం విఫలం కావటానికి గాంధీ నే కారణం అని అంబెడ్కర్ అభిప్రాయం. భారత దేశ ప్రతినిధిగా గాంధి ని ఎన్నుకోవటం దురదృష్టకరం , గాంధీ కంటే అసమర్ధుడు ఎవరూ ఉండరు అని గాంధీ సన్నిహితులే అభిప్రాయ పడ్డారు.

రౌండ్ టేబుల్ సమావేశం వివరాలు తెలుసుకుంటున్న భారత దేశంలోని నిమ్నజాతుల ఆందోళన చేయటం ప్రారంభించారు. నిమ్నజాతులను మైనారిటీలలో కలపకపోవడం, ప్రత్యెక నియోజకవర్గం లేకుండా రాజ్యాంగాన్ని నిర్మిస్తే అందుకు నిమ్నజాతుల ఏ మాత్రం ఒప్పుకోవు అని లండన్ కి స్పష్టంచేసేరు. ఇదే సమయంలో నాసిక్, గురువాయూరు లో దేవాలయ ప్రవేశానికి ఉద్యమాలు జరిగెయి. హిందువులు నిమ్నజాతులను , బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ అనుచరులను అడ్డుకోవటం ,పోలీసులు అరెస్ట్ చేయడం లాంటి పరిణామాలు బ్రిటన్ ప్రభుత్వానికి తెలియజేస్తూ , గాంధీ చెప్పింది అసత్యం అని, నిమ్నజాతుల హిందూ సమాజం లో బాగం కాదు అని ఉత్తరాలు పంపెరు.

Also read  కీలు బొమ్మల కాలం-ఎస్సీల రాజకీయం!

మైనారిటీల కమిటీలో ఒక నిర్ణయనికి రాలేక బ్రిటిష్ ప్రధానికి వదిలిపెట్టేరు. ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్న మాకు అబ్యంతరం లేదు అని సంతకాలు చేసేరు.బాబాసాహెబ్ డా   అంబెడ్కర్ ఒక్కరే అందులో సంతకం చెయ్యలేదు. నిమ్నజాతులకు ప్రత్యెక నియోజకవర్గాలు లేకపోతే ఒప్పుకునేది లేదు అని ఒక నివేదిక ఇచ్చెరు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్.

1931 నవంబర్ 5 బ్రిటిష్ చక్రవర్తి ఒక విందు సమావేశం ఏర్పాటు చేసేరు. భారత ప్రతినిధులు కొందరు చక్రవర్తి తో మాట్లాడేరు. చక్రవర్తి స్వయంగా బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ని పిలిచి భారత దేశంలో దళిత జాతుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

అధికారం ఎవరి చేతుల్లో వున్నా ఒక్కటే మాకు తొందర లేదు అని బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ప్రకటించటం భారత దేశం లో కాంగ్రెస్ ఆగ్రహానికి గురిఅయ్యేడు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్. గాంధీ ని విభేదించటం కాంగ్రెస్ తట్టుకోలేక పోయింది. బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ని దెయ్యం లాగ ప్రచారం చేసేరు. గాంధీకి ఎదురు చెప్పటం ఒక నేరంగా భావించింది.

ముస్లిం లు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ఉపన్యాసాలను , విమర్శలను హిందువులకు వెతిరేకంగా వాడుకోవడం గమనించిన బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ భిన్న అభిప్రాయలకు తావులేకుండా స్వతంత్ర భారత దేశంలో దళిత జాతుల అభ్యున్నతిని సాధించగలరు అని తన అభిప్రాయం ను బ్రిటిష్ ప్రభుత్వానికి తీలియపరిచేరు.

1931 డిసెంబర్ 28 న రౌండ్ టేబుల్ సమావేశం ముగించుకుని భారత దేశానికి తిరిగి వచ్చిన గాంధీ కి  నిమ్నజాతులు  నల్ల జెండాలతో నిరసన తెలిపేరు.

బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ లండన్ నుండి అమెరికా వెళ్లి అక్కడ నుండి తిరిగి లండన్ వచ్చి భారత దేశానికి తిరిగి వచ్చేరు.బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ తో పాటు మౌలాన షౌకత్ ఆలీ కూడా వచ్చేరు. ఇద్దరు అనుచరులు భారీఎత్తున స్వాగత ఏర్పాట్లు. చేసేరు. బల్లర్డ్ పియర్ ఓడరేవు అధికారులు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ కు ప్రత్యెక స్వాగత ఏర్పాటు చేసేరు. గాంధీ వచ్చినప్పుడు ఎలాంటి ఏర్పాటు చేసేరో అంతకు తగ్గకుండా బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ కి స్వాగత ఏర్పాట్లు చేసేరు.

అదేరోజు సాయంత్రం పరేల్ లో సోలాంకి అధ్యక్షతన జరిగిన సభకు 1500 మంది హాజరు అయ్యేరు. 114 సంస్థల ప్రతినిధులు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ని ఘనంగా సత్కకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

 

 
(Visited 41 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!