రోహిత్ వేముల: ఆఖరి ఉత్తరం ఈ సమాజానికి

షేర్ చెయ్యండి

రోహిత్ వేముల చనిపోయి మూడు సంవత్సరాలు అయినా ఆ తల్లి కడుపు కోతకు ఇంకా న్యాయం జరగలేదు. 


10 రోజులు వెలివాడ లో కూర్చుని మౌన దీక్ష చేసినా, కానరాని న్యాయం తన మరణం తర్వాత అయినా దొరుకుతుందని ఫ్యానుకు ఉరివేసుకుంటే, మూడు సంవత్సరాలు అయినా ఆ తల్లి కడుపు కోతకు నేటికీ న్యాయం జరగకపోవడం బ్రాహ్మణీయ కుల వ్యవస్థకు నిదర్శనం. 


ప్రశ్నించే గొంతు పీకను నొక్కేయడం నియంతల  లక్షణం, రోహిత్ వేముల గొంతు నొక్కింది కూడా ప్రశ్నించడం వలనే. 


అంబేడ్కర్ విద్యార్థి సంఘ నాయకుడిగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో మతోన్మాదానికి, విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తి పొట్ట మీద కొట్టేరు. 


తనకి నెల నెల  రావాల్సిన పి .హెచ్డ్ వేతనం నిలుపుదల జెసి , హాస్టల్ నుండి  వెలివేసి మానసికంగా వేధించిన యూనివర్సిటీ యాజమాన్యం యొక్క దుచ్చర్యకు, సమాజం నుండి రాని స్పందనకు నిరసనగా తాను బలవన్మరణం చెందటం జరిగింది. 

Also read  దళిత రాజకీయం: మా (దళితులకు) కెందుకు రాజకీయం!


రోహిత్ వేముల చనిపోతూ తన స్నేహితులకు, తనతోటి సమాజానికి, అమ్మకు రాసిన ఆఖరి ఉత్తరం 

గుడ్ మార్నింగ్..
మీరీ ఉత్తరం చదివేసరికి నేనుండను. కోపం తెచ్చుకోవద్దు. మీలో కొందరు నన్ను నిజంగా ప్రేమించారు, ఆప్యాయంగా చూసుకున్నారు, నాకు తెలుసు. నాకెవరిమీదా కంప్లైంట్ లేదు.

నాకెప్పుడూ సమస్యలున్నాయ్ అవెప్పుడూ నాతోనే ఉన్నాయ్.నాశరీరానికీ అత్మకూ దూరం పెరుగుతుండడం నేను గమనించాను.నేనో మొండివాడిలా తయారయ్యాను.నేనెప్పుడూ రచయితను కావాలనుకున్నాను.కార్ల సాగన్ లాగా.చివరికి ఈ ఒక్క ఉత్తరం మాత్రమే రాయగలుగుతున్నాను.

నేను సైన్సునీ నక్షత్రాలనీ ప్రేమించాను.మనుషుల్నీ అంతే ప్రేమించాను కానీ వాళ్ళందరూ ప్రకృతినుండి ఏనాడో విడిపోయారని తెలుసుకోలేకపోయాను.

మన అనుభూతులు వాడిపారేసినవి.మన ప్రేమ సహజమైంది కాదు.కొన్ని పరిస్థితుల చేత నిర్మితమైంది.మన నమ్మకాలు కృత్రిమమైనవి.రంగులద్దినవి.మన సహజమైన భావనల్నికృత్రిమ కళలు నిర్దేశిస్తాయి.

బాధపడకుండా ప్రేమించడం అసాధ్యమని అర్ధమైంది.మనిషి విలువ. అతని తక్షణ గుర్తింపుకూ తన సమీప అవకాశానికీ( అవసరానికీ) కుదింపబడింది.

ఒక వస్తువుగా,ఒక అంకెగా తప్పా! ఆలోచించగల ఒక మెదడుగా మనిషి గుర్తింపబడట్లేదు.నక్షత్ర ధూళితో నిర్మింపబడ్డ ఒక మహిమాన్వితమైన విషయంగా గుర్తింపబడట్లేదు.

Also read  ఎన్నికల ఆరాటంలో వ్యవస్తీకృత మోసానికి పాల్పడుతున్న పార్టీలు!

అది చదువులోనూ వీధుల్లోనూ రాజకీయాల్లోనూ జీవించడంలో మరణించడంలో ప్రతీచోటా ఇలాంటి లేఖ నేను మొదటిసారి రాస్తున్నాను.

మొదటిసారి రాస్తున్న ఆఖరులేఖ.నేను చెప్పాలనుకున్నది చెప్పలేకపోతే, నా వ్యక్తీకరణ సరిగ్గాలేకపోతే క్షమించండి.


బహుషా నాదే తప్పేమో ఎప్పుడూ ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడంలో నేను పొరబడ్డానేమో, ప్రేమనీ, బాధనీ,జీవితాన్నీ, మరియూ చావునీ.నిజానికి తొందరేం లేదుకూడా అర్ధంచేసుకోవడానికి కానీ నేనెప్పుడూ తొందరపడుతూ ఉన్నాను.

జీవితాన్ని మొదలుపెట్టేందుకు పరిగెడుతూ ఉన్నాను. కొంతమందికి జీవితమొక శాపం.నా పుట్టుక ఒక దురదృష్టకర ప్రమాదం.


నా చిన్ననాటి ఒంటరితనం నుండి నేనెప్పటికీ కోలుకోలేను.ఒక చిన్న ప్రశంసక్కూడా నోచుకోని నా గతంలోని ఆ పసివాడిని మర్చిపోలేను.

ఈ క్షణం నాలో ఏ బాధాలేదు.విచారమూలేదు, ఖాళీతనం, మనసంతా శూన్యం.నాగురించేమీ పట్టని ఒక నిర్వికార,నిరామయ స్థితిలో ఉన్నాను.

ఇదిచాలా బాధాకరమైన పరిస్థితి.ఈ స్థితి రాకూడనిది.అందుకే వెళ్ళిపోతున్నాను.
అందరూ నన్నో పిరికివాడిగా తెల్చేస్తారేమో? స్వార్ధపరుణ్ణనీ మూర్ఖుణ్ణనీ పిలుస్తారేమో?

ఏమనుకున్నాసరే, నాకే పట్టింపూలేదు.చావుతర్వాత కధలమీద నాకు నమ్మకం లేదు.దెయ్యాల్నీ అత్మల్నీ నమ్మను.నేను నమ్మేదేమైనా ఉంటే “నేను నక్షత్రాల్లోకి ప్రయాణిస్తాననీ,ఇతరలోకాలగురించి తెలుసుకుంటాననీ అనుకుంటాను.

Also read  జస్టిస్ రంజన్ గొగోయ్: స్వతంత్ర న్యాయవస్థ మీద లైంగిక ఆరోపణలు

ఈ ఉత్తరం చదువుతున్న వారు నాకేదైనా చేయగలిగితే. లక్షా డెబ్భయ్యైదు వేల రూపాయల ఫెలోషిప్ రావాలి నాకు. నాకుటుంబానికి అది దక్కేలా చూడండి.ఒక నలభై వేలు నేను రాంజీకి ఇవ్వాలి.తనెప్పుడూ అడగనేలేదు. అది తనకి ఇచ్చేయండి.


నా అంతిమయాత్ర మౌనంగా ప్రశాంతంగా జరిగేలా చూడండి.నేను, అలా కనిపించి మాయమైనట్టుగా ప్రవర్తించండి. నాకోసం కన్నీళ్ళు కార్చకండి.

నా సంతోషం, జీవించడంకన్నా మరణించడంలోనే ఉందని అర్ధంచేసుకోండి.
“నీడల్లోంచి తారల్లోకి”


ఉమా అన్నా ! ఈ పనికోసం నీ గదిని వాడుకుంటున్నందుకు మన్నించు.
ASA కుటుంబానికి. మిమ్ముల్ని నిరాశ పరుస్తున్నందుకు క్షమించండి.

మీరు నన్నెంతో ప్రేమించారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.
కడసారిగా…!
జైభీం.


(Visited 36 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!