రౌండ్ టేబుల్ సమావేశాలు – అంబేడ్కర్

షేర్ చెయ్యండి

నిమ్నజాతుల  లో రౌండ్ టేబుల్ సమావేశం ఒక ముఖ్య ఘట్టము. దేశ చరిత్ర లో ఒక అంటరాని వ్యక్తి సవర్ణ హిందువులతో సమానంగా కూర్చోవటం అంటే అది ఒక చరిత్రనే. 

1930 లో భారత ప్రజలకు నచ్చేరీతిలో ఒక రాజ్యాంగ ప్రణాళిక కోసం బ్రిటన్ ప్రబుత్వం దేశం లోని వివిధ రాజకీయ పార్టీల నాయకులను, వర్గాల ప్రతినిధులను చర్చల కోసం లండన్ ఆహ్వానించింది. అంటరాని వర్గాల ప్రతినిధిగా బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ గారి ని ఆహ్వానించటం జరిగింది. కాంగ్రెస్ నాయకత్వానికి ఈ విషయం మింగుడు పడలేదు. శతవిధాల బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ని సమావేశానికి హాజరు కాకుండా ప్రయత్నించింది. బొంబాయి లో నిమ్నజాతీయ ప్రజలు పెద్ద ఎత్తున వీడ్కోలు పలికెరు. పారేల్ లోని దామోదర్ డాక్స్ రే సమావేశ మందిరం లో కాంగ్రెస్ తరుపున పి జి సోలాంకి అభినందన సభ ఏర్పాటు చేసేరు. కొందరికి నచ్చక సభ లో అల్లరి చేసేరు.బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ఆ సమావేశ మందిరం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ లోని ఒక వర్గం బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ అనుచరుల మీద దాడి చేసి ఒక వ్యక్తి మరణానికి కారకులు అయ్యేరు.

అయితే కాంగ్రెస్ లోని నిమ్న జాతీయులు  సమావేశం జరిపి బాబాసాహెబ్  డా.అంబేడ్కర్ కి దేశభక్తి లేదు అని, ఆయిన బ్రిటిష్ ఏజెంట్ అంటూ విమర్శించే ప్రయత్నం చేసేరు.

Also read  అంటరాని కులాల మొదటి విజయం!

నవంబర్12, 1930 తేదీన మొదటి రౌండ్ టేబుల్ సమావేశం బ్రిటిష్ చక్రవర్తి ఉపన్యాసంతో ప్రారంభం అయ్యింది. ఈ సమావేశం లో తొమ్మిది ఉపసఘాలు ఏర్పడ్డాయి.బాబాసాహెబ్ డా . అంబేడ్కర్ గారిని నిమ్నజాతుల ప్రతినిధులుగా నియమించబడ్డారు.బాబాసాహెబ్ డా . అంబెడ్కర్ నిమ్నజాతుల సంక్షేమానికి, అభివృద్ధి కి కొన్ని చూచనలు చేసేరు.

బాబాసాహెబ్ డా.అంబెడ్కర్ ఒక్క నిమ్నజాతుల గురించి మాత్రమె కాదు, మైనారిటీల హక్కుల గురించి కూడా మాట్లాడేరు.

బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ప్రతిపాదనలు.
1. నిమ్నజాతుల జనాభాకి తగ్గట్టు గా వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేటాయింపులు కావాలి. 
2. ప్రాధమిక హక్కు, సమాన పౌరసత్వం, సమాన గౌరవం.
3. అసెంబ్లీ లో తగినంత ప్రాతినిధ్యం
5. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాతినిధ్యం

మరియు ఇన్నిరోజులు నిమ్నజాతుల మీద చూపిన వివక్షకు ప్రతిగా కొన్ని ప్రత్యెక సదుపాయాలు, మంత్రి వర్గం లో ప్రాతినిధ్యం, రక్షణ ఏర్పాట్లు మరియు ప్రత్యేక గుర్తింపు కావాలి అని ప్రతిపాదించేరు.

బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఈ ప్రతిపాదనలు చేసిన తరవాత కాంగ్రెస్ కలవరపడింది.రాజ్యాంగరీత్యా అణగారిన వర్గాల రాజకీయ, ఆర్ధిక స్వయంప్రతిపత్తి కోరుతున్నారు అని అర్ధం అయింది.

Also read  నాయకుడు లేని ఎస్సి సామాజిక వర్గం!

బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వ తొత్తు అని ప్రచారం చేసిన వారు స్వరాజ్యం కోసం అయిన చేసిన ఉపన్యాసం విని ఆచ్చర్య పోయేరు. నాగపూర్ సభలో ఆయినను వెతిరేకించిన వారు అభిభనందిచక తప్పలేదు. బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ కు ఉన్న దేశభక్తి శంకించజాలం అనుకున్నారు. 

నిమ్న జాతుల స్థితిగతుల గురించి తమ ప్రారంభ ఉపన్యాసంలొనే బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ బ్రిటిష్ వారి మీద దాడితో మొదలు పెట్టేరు. బ్రిటీష్ వారు రాక ముందు నిమ్నజాతి  ప్రజలు ఎంత నీచంగా చూడబడ్డారో 150 సంవత్సరాల తర్వాత కూడా అంతే దామనీయంగా ఉన్నారు అని విమర్శించేరు. 

నిమ్నజాతుల సమస్యలు బ్రిటిష్ ప్రభుత్వనికి ఎన్ని మార్గాలద్వారా తెలియచెయ్యగలరో అన్నీ మార్గాలు ద్వార తమ ప్రయత్నం చేసేరు.

పత్రికలో వ్యాసాలు రాయడం, కరపత్రాలు పంపిణీ, సమావేశాలు ఇలా అన్ని మార్గాల ద్వారా తమ జాతి స్థితిని ప్రభుత్వానికి తెలియచేసేరు. లండన్ పత్రికలు అయిన కృషిని అభినందించాయి.

Also read  గాంధీ గ్రామ స్వరాజ్యం ఒక కుట్ర!
(Visited 48 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!