లోక్ సభ ఎన్నికలు భారత దేశంలో ఎన్నికల చరిత్ర -3

షేర్ చెయ్యండి

పదిహేడొవ లోక్ సభ ఎన్నికలు-2019 నేటితో ముగియనున్నాయి. ఏదో దశ పోలింగ్ మొత్తం 59 నియోజకవర్గాలలో జరుగుతుంది. మొత్తం ఎనిమిది రాష్ట్రాలలో 918 అభర్ధులు పోటీ చేస్తున్నారు. లోక్ సభకు ఏడు ధపాలు గా ఎన్నికలు జరగడం ఇదే ప్రధమం. 


భారతదేశంలో ఎన్నికలు ఒకొక్కసారి సర్వసాధారణంగా జరిగితే ఒక్కొక్కసారి అనుకోని రాజకీయ కారణాలు వలన ఎన్నికలు జరిగినట్లు ఎన్నికల చరిత్ర చూస్తే అర్ధం అవుతుంది.

 
ప్రజాస్వామ్యం మనుగడనే కొన్ని సందర్భాలలో ప్రజలు ప్రశ్నిస్తున్న దాఖలాలు ఉన్నాయి. అయితే ఎలాంటి పరిస్తితులైన తట్టుకుని నిలబడగల సత్తా భారత రాజ్యాంగానికి కల్పించారు రాజ్యాంగ నిర్మాత డా.అంబేడ్కర్. 


ఎన్నికల నిర్వహణ లో ఎన్నికల కమీషన్ బంధుప్రీతి, అవినీతికి లేదా రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తే ఎన్నికల కమీషన్ మీద కోర్టులకు కూడా రాజకీయ పార్టీలు వెళ్లే స్వేచ్ఛ / హక్కును కల్పించారు.

రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలు ముగిసిన నెల రోజుల తర్వాత రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు అంటే ఎన్నికల కమీషన్ కి భారత రాజ్యాంగం కల్పించిన విస్తృత అధికారాలు మరియు ఓటు హక్కు యొక్క విలువకు నిదర్శనం.


ఎన్నికల చరిత్ర  రెండు భాగాలుగా ఇప్పటివరకు భారతదేశంలో వివిధ సందర్భాలలో లోక్ సభ కు జరిగిన ఎన్నికల చరిత్ర తెలుసుకున్నాం. చివరిది, మూడో భాగంలో ఈరోజు తో ముగిసే 17 వ లోక్ సభ ఎన్నికల చరిత్ర వరకు తెలుసుకుందాం. 

   
పన్నెండోవ లోక్ సభ ఎన్నికలు – 1998

పదకొండవ లోక్ సభ చాలా తక్కువకాలం లోనే ముగిసింది. కేవలం ఒకటిన్నర సంవత్సరంలో ఇంద్రకుమార్ గుజ్రాల్ (IK Gujral) ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళింది.

యునైటెడ్ ఫ్రంట్ లోని చీలిక వర్గానికి కాంగ్రెస్ పార్టి మద్దతు వుహరించుకోవడం వలన నవంబర్ 27, 1997 న కూలిపోయింది. 


కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి నాయకత్వంలో రాజీవ్ గాంధి హత్యకు సంబంధించిన వివాదం సాకుగా చూపి IK gujral ప్రభుత్వాన్ని పడగొట్టారు 
12 వ లోక్ సభ మార్చి 10, 1998 న అటల్ బిహారీ నేతృత్వంలో బిజెపి పార్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 12 వ లోక్ సభ జీవిత కాలం కేవలం 413 రోజులు మాత్రమే. 

13 నెలల బిజెపి ప్రభుత్వం ఏప్రిల్ 17, 1997 న జరిగిన లోక్ సభ విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో మెజారిటీ కోల్పోయి లోక్ సభ ను రద్దు చేసేవరకు వెళ్ళింది.  లోక్ సభ పూర్తి కాలం పనిచేయకుండా మధ్యలోనే రద్దు కావడం ఐదవ సారి. 

Also read  లోక్ సభఎన్నికలు: భారత దేశంలో ఎన్నికల చరిత్ర -2

డిసెంబర్ 4, 1997 న లోక్ సభ ఎన్నికలు అన్ని స్థానాలకు జరిగాయి. అంతకు ముందు ఏప్రిల్ / మే 1996 వ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించారు.

నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ గా ఏర్పడి బిజెపి మరియు ఇతర ప్రాంతీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలబడి 265 స్థానాలలో విజయం సాధించాయి. మార్చి 19 న వాజపాయ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని రాష్ట్రపతి కె ఆర్ నారాయణన్ గారు ఏర్పాటు చేసారు. 

పదమూడోవ లోక్ సభ ఎన్నికలు – 1999


పన్నెండోవ లోక్ సభ సంకీర్ణ కూటమిలోని AIDMK నాయకురాలు జయలలిత వాజపాయ్ ప్రభుత్వానికి మద్దత్తు ఉపసంహరించుకోవడంతో లోక్ సభ విశ్వాసం కోల్పోయి రద్దు అయ్యింది. 


మొత్తం 24 పార్టీల కూటమి గా ఏర్పడిన NDA ప్రభుత్వం జయలలిత తన డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి పదే పదే మద్దతు ఉపహరించుకుంటానని చివరకు ఏప్రిల్ 17, 1999 లో లోక్ సభ లో జరిగిన విశ్వాస పరీక్ష లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. 


జయలలిత మీద వున్న ఆదాయానికి మించిన ఆస్తులు కేసు కు సంబంధించి జరుగుతున్న విచారణ నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరడం అందుకు NDA ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో జయలలిత మద్దతు ఉపసంహరించుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన మే 4 వరకు BJP ప్రభుత్వం అధికారాన్ని నిర్వహించింది.


ఈ ఎమ్మికలతో కలుపుకొని 40 నెలల సమయంలో  మూడుసార్లు లోక్ సభ కు ఎన్నికలు జరిగాయి. 1996, 1998 మరియు 1999 లలో రాజకీయ అనిచ్చితి కారణంగా లోక్ సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహింహచాల్సి వచ్చింది. 


ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టి మాజీ ప్రధాని రాజీవ్ గాంధి భార్య సోనియా గాంధి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలుగా ఆ పార్టి ని ముందు ఉండి నడిపించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు గా సోనియా గాంధి ని ఎన్నుకోవడం మహారాష్ట్ర కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శరద్ పవర్ అభ్యంతరం వ్యక్తం చేసాడు. 


శరద్ పవర్ సోనియా గాంధి ఇటలీ జాతీయురాలుగా అభ్యంతరం చెప్పి కాంగ్రెస్ నుండి విడిపడి క్రొత్త పార్టి పెట్టుకున్నాడు. సోనియా జాతీయత బీజేపీ కి కలిసివచ్చే అంశంగా ఏర్పడింది. అలాగే కార్గిల్ యుద్ధం బిజెపి కి కలసి వచ్చే అంశం. 


వాజపాయ్ నేతృత్వంలోని బిజెపి -ఎన్డీయే సంకీర్ణ కూటమి 298 స్థానాల్లో విజయం సాధించి కేంద్రములో అధికారాన్ని చేపట్టారు.  కాంగ్రెస్ పార్టి కేవలం 130 స్థానాలకే పరిమితం అయ్యింది.  

Also read  అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: భారత క్రీడాకారిణి ద్యుతీ చంద్


పద్నాలుగో లోక్ సభ ఎన్నికలు – 2004


వాజపాయ్ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం లోక్ సభ పూర్తికాలం పదవిలో కొనసాగింది.ఒక విధంగా సంకీర్ణ ప్రభుత్వాలకు ఈ ఐదేళ్ల లోక్ సభ కాలం పురుడు పోసింది. 


పద్నాలుగో లోక్ సభకు ఎబి వాజపాయ్ ఎన్డీయే కూటమి చాలా జోష్ గా ఎన్నికల బరిలో దిగింది. సెఫాలజిస్ట్ లు, సర్వే లు ఎన్డీయే కి అనుకూలంగా జోస్యాలు చెప్పారు. దేశం వెలిగి పోతుందంటూ ఎన్డీయే పెద్దలు కాన్ఫిడెంట్ గా ఎన్నికలను ఎదుర్కుంటున్నారు. 


అదే విధంగా కాంగ్రెస్ పార్టి సోనియా గాంధి నాయకత్వం లో ఒక ఆర్డర్ లోకి వచ్చినట్లు గా గట్టి మెసేజ్ పంపించారు. ఎంతమంది పార్టి వీడినా సోనియా గాంధి భయపడలేదు
ఈ ఎన్నికలు సోనియా గాంధి – ఎబి వాజపాయ్ లు హెడ్ – హెడ్  పోటీ పడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ కూటమి – బిజెపి కూటమి గా ప్రాతీయ   పార్టిలు జట్టుకట్టాయి. 


ఉభయ కమ్యూనిస్ట్ పార్టిలు ఏ కూటమిలో లేకుండా ఎన్నికల్లో పోటీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన సమాజవాద్ పార్టి, బహుజన సమాజ్ పార్టి ఏ కూటమి లో చేరకుండా స్వతంత్రంగా పోటీ చేసారు. 


ఎన్నికలు దగ్గర పడే సమయానికి బిజెపి స్వరం మారింది. మొదట ఇండియా షైనింగ్ – భారతదేశం వెలిగిపొతుందటూ ప్రచారం చేసి ఆ తర్వాత స్టేబుల్ ప్రభుత్వాన్ని అందిస్తామని ప్రచారం చేసింది.


మే 13 న వచ్చిన ఫలితాల్లో ఎన్డీయే కూటమి అనూహ్యంగా విఫలం అయ్యింది. కాంగ్రెస్ పార్టి సోనియా గాంధి నాయకత్వంలో కూటమి 336 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈ యునైటెడ్ ప్రోగ్రెస్సివ్ అలియెన్స్ UPA పేరిట ఏర్పడిన కూటమిలో BSP, SP లు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కూటమిలో చేరారు. 


UPA కూటమికి ముఖ్యమంత్రిగా డా.మన్మోహన్ సింగ్ ని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నారు. ఈయన పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్ధికమంత్రి గా పనిచేసి ఆర్ధిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి. 


పదిహేనవ లోక్ సభ – 2009

 
పదిహేనవ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి UPA కి గత ఎన్నికలు కంటే అదనంగా 44 లోక్ సభ స్థానాలు గెలుచుకుంది.సోనియా గాంధి నేతృత్వంలో ప్రధానిగా తిరిగి రెండవసారి డా. మన్మోహన్ సింగ్ ని ఎన్నుకున్నారు.

Also read  ఎన్నికలు 2019: దళిత రాజకీయం - ఎన్నికలు

 
బిజిపి నేతృత్వంలో ఎన్డీయే కూటమి పక్షాలు ఆయారాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోవడం వలన ఎన్డీయే కి నష్టం జరిగింది. బిజెపి కి నాయకత్వ లోపం ప్రధానంగా ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

 
పదహారోవ లోక్ సభ ఎన్నికలు – 2014

 
15 వ లోక్ సభ పూర్తి కాలం నడిచింది. డా మన్మోహన్ సింగ్ నేతృత్వం లో కేంద్ర ప్రభుత్వం ఒడిదుడుకులు ఎదుర్కొంది. సంకీర్ణ కూటమి భాగస్వామ్య పార్టిల నాయకులు కేంద్రంలో అవినీతికి పాల్పడిన ఆరోపణలు పాలన మీద తీవ్ర ప్రభావం చూపెట్టింది.

 
 నిర్భయ రేప్ కేసు మరియు సివిల్ సొసైటీ పేరుతొ అరవింద్ కేజ్రీవాల్ , అన్నా హజారే తదితరులు కాంగ్రెస్ పార్టి మీద చేసిన వ్యతిరేక ప్రచారం ఆ పార్టి మీద తీవ్ర ప్రభావం చూపెట్టింది. 


బిజెపి ప్రభుత్వం గుజరాత్ మోడల్ అంటూ అనూహ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ని తేర మీదకు తెచ్చి సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టి మీద వ్యతిరేక ప్రచారం చేసారు. 


జాతీయ మీడియా మొత్తం కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడం. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి గా కాంగ్రెస్ ప్రాజెక్ట్ చెయ్యడం ఆ పార్టి మీద ప్రజలు వ్యతిరేకత చూపించారు.

 
ఆంధ్రప్రదేశ్ ని విభజన చేసిన తీరు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద ప్రజలకు నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది. తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ లో బలంగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా  పాతాళం లోకి కూరుకు పోయింది. అన్నివైపుల నుండి కాంగ్రెస్ కి ఎదురు దెబ్బలు తగలడంతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటి ని ప్రజలు అందించారు. 


పదిహేడోవ లోక్ సభ ఎన్నికలు – 2019 ఎన్నికలు ముగిసి ఫలితాలకోసం చూస్తుంది. 

(Visited 19 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!